Ranga Reddy District News
-
బియ్యం లేవ్!
అసాంఘిక అడ్డాగా..వీకెండ్ సరదా కోసం నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోuరేషన్ షాపుల్లో నిండుకున్న నిల్వలు ● పూర్తిస్థాయిలో దుకాణాలకు చేరని కోటా ● తొలి విడతలో వచ్చినవి వచ్చినట్లే పంపిణీ ● దుకాణాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు ● ఏం చేయలేక చేతులెత్తేస్తున్న డీలర్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: గండిపేట మండలం మణికొండలోని షాప్ నంబర్ 23లో బియ్యం స్టాక్ లేక గురువారం మూతపడింది. నార్సింగి –1 రేషన్ షాపులోనూ ఇదే పరిస్థితి. మంచిరేవుల రేషన్‌షాపు నంబర్ 15100020లో పాతదొడ్డు బియ్యం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సన్న బియ్యం ఇప్పటికీ సరఫరా కాలేదు. ఖానాపూర్, నార్సింగి, బండ్లగూడ, మణికొండ, కోకాపేట్, మంచిరేవుల, కిస్మత్పూర్, గంధంగూడ, హిమాయత్‌సాగర్, వట్టినా గులపల్లి, బండ్లగూడ జాగీర్, నెక్నాంపూర్, పుప్పాల్‌గూడ రేషన్‌షాపుల్లో బియ్యం నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. లబ్ధిదారుల నిష్పత్తి మేరకు సన్న బియ్యం సరఫరా కాకపోవడంతో డీలర్లు ఆయా దుకాణాలను మూసివేశారు. ఇలా ఒక్క మణికొండ మండలంలోనే కాదు.. జిల్లాలో మెజార్టీ మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకం అమలు తీరుపై గురువారం ‘సాక్షి’ బృందం గ్రౌండ్ రిపోర్ట్ నిర్వహించింది. స్టాక్ లేక.. వచ్చిన వాళ్లకు సమాధానం చెప్పలేక.. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీకి ముందే ఎంపిక చేసిన గోదాముల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు చేరుకుంటాయి. ఆయా షాపుల డీలర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో షాపులు తెరిచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. సన్న బియ్యం పంపిణీ ప్రకటన, లబ్ధిదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో మెజార్టీ షాపులు తెరుచుకోవడం లేదు. సన్న బియ్యం సంగతేమో కానీ, కనీసం దొడ్డు బియ్యం కూడా దక్కకుండా పోతున్నాయి. ఫలితంగా ఇంట్లో బియ్యం లేక పేదలు పస్తులుండాల్సి వస్తోంది. జిల్లాలో 936 రేషన్‌షాపులు ఉండగా, వీటి పరిధిలో 5,71,696 రేషన్‌కార్డులు, 18,71,696 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం 1,17,54,063 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దొడ్డు బియ్యం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు తొలి విడతగా కొంత మొత్తాన్ని సరఫరా చేసింది. లబ్ధిదారుల నిష్పత్తి మేరకు సరఫరా కాకపోవడం.. ఇప్పటికే వచ్చిన బియ్యం పంపిణీ చేయడంతో రేషన్‌షాపులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం స్టాక్ లేకపోవడం.. లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో వచ్చిన వాళ్లకు సమాధానం చెప్పలేక డీలర్లు తలపట్టుకుంటున్నారు. కొంత మంది ఏకంగా షాపులు మూసేసి పత్తా లేకుండా పోతున్నారు. మరోవైపు మహేశ్వరం, కిస్మత్పూర్, శంషాబాద్, హయత్‌నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, యాచారం, షాద్‌నగర్, శంకర్పల్లి గోదాముల నుంచి రేషన్‌షాపులకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాలో రెండు నుంచి మూడు కిలోలు తరుగు ఉండటం గమనార్హం. వెలవెలబోయిన దుకాణాలు జిల్లా వ్యాప్తంగా వందకుపైగా దుకాణాల్లో బియ్యం నిల్వలు నిండుకున్నట్లు తేలింది. శంకర్పల్లి సహా జన్వాడ, సందేపల్లి రేషన్‌షాపులు ఖాళీగా ఉన్నాయి. మొయినాబాద్ మండలం చిలుకూరు–2 రేషన్ దుకాణాల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. కనకమామిడి, అప్పారెడ్డిగూడలోనూ ఇదే పరిస్థితి. చేవెళ్ల మండలం చేవెళ్ల–1,2 దుకాణాలతో పాటు కిష్టాపూర్, ఇబ్రహీంపల్లి, ఊరెళ్ల, ఆలూరు–2 రేషన్‌షాపుల ముందు నో స్టాక్ బోర్డులు వెలిశాయి. శంషాబాద్ మండలం ఉట్పల్లి–1,2 షాపులు సహా పెద్దతూప్రా, చిన్నగోల్కొండ, చౌదరిగూడలోనూ స్టాక్ లేదు. మహేశ్వరం మండలం కేకే బస్తీ, మహేశ్వరం–1, తుక్కుగూడ, దిల్వర్గూడ, హబీబుల్లాగూడ దుకాణాల్లోనూ నిల్వలు అయిపోయా యి. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ సహా మంచాల మండలం ఆరుట్ల–2లోనూ నిల్వలు నిండుకున్నాయి. యాచారం మండలం గండ్లగూడ, మొగుళ్లవంపు, నక్కర్త రేషన్ షాపులు ఖాళీ అయ్యాయి. కందుకూరు మండలం జైత్వారం, రాచలూరు, కందుకూరు ఎక్స్‌రోడ్ సహా షాద్‌నగర్‌లోని ఏ ఒక్క షాపులోనూ నిల్వలు లేవు. ఫరూఖ్‌నగర్ మండలంలోని చటాన్‌పల్లి, పీర్లగూడ సహా కేశంపేటలోని వార్డు నంబర్ 1లోని షాపు, ఎస్సీ కాలనీలోని షాపులోనూ ఇదే పరిస్థితి. సరూర్‌నగర్‌లోని వనస్థలిపురం కాంప్లెక్స్, సీబీఐ కాలనీ, ఎస్‌బీహెచ్‌కాలనీ, లింగోజిగూడ, ఎల్బీనగర్, జీజేనగర్, ఎర్రకుంట, హయత్‌నగర్ ఓల్డ్ విలేజ్, లెక్చరర్స్ కాలనీ, రాజిరెడ్డినగర్, వాంబేకాలనీ, నందనవనం, సరస్వతినగర్, వినాయకనగర్, బీఎన్‌రెడ్డినగర్, ఆమనగల్, గిరికొత్తపల్లి, కలకొండ, తట్టిఅన్నారం, మరిపల్లి, అబ్దుల్లాపూర్, తుర్కయంజాల్, రాగన్నగూడ, ఇంజాపూర్, కమ్మగూడ, మునగనుర్, బ్రాహ్మణపల్లి, లస్కర్గూడ, కొత్తగూడెం, కుంట్లూరు రాజీవ్‌గృహకల్ప దుకాణాలు సైతం నిల్వలు లేక వెలవెలబోయాయి. ఇప్పటికే పంపిణీ చేసిన బియ్యంలోనూ నూకల శాతం ఎక్కువగా ఉన్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. న్యూస్‌రీల్ -
సార్.. న్యాయం చేయండి
యాచారం: ‘సార్ మాకు న్యాయం చేయండి.. ఏళ్లుగా ఆ భూములనే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాం.. సర్కార్ నుంచి పైసా పరిహారానికి నోచుకోలేదు.. అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు.. మీరైనా ఆదుకోండి’ అంటూ కడ్తాల్ మండలం పల్లెచెల్కతండా గిరిజనులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణంలో భాగంగా ఆరోరోజు గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 184లో పనులు కొనసాగాయి. ఈ సందర్భంగా పల్లెచెల్కతండాకు చెందిన రైతులు పనుల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పరిహారం అందే వరకు సర్వే, ఫెన్సింగ్ పనులు నిలిపేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాచారం తహసీల్దార్ అయ్యప్పను అక్కడికి రప్పించి గిరిజనుల గోడు వినిపించారు. కలెక్టర్, టీజీఐఐసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పల్లెచెల్కతండా గిరిజనుల ఆందోళన -
మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం
అబ్దుల్లాపూర్‌మెట్: పండ్ల మార్కెట్‌కు వచ్చే మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ వారి ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీ పనిచేస్తోందని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయవిక్రయాలను గురువారం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. మామిడి మార్కెట్ యార్డు మొత్తం తిరిగి రైతుల సమస్యలు, క్రయవిక్రయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కి వచ్చిన రైతుల సమస్యలు తెలుసుకొని వారి సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉందని, మార్కెట్‌కి వచ్చే రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు మంచి గిట్టుబాటు అందించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. రోజుకు 800 వాహనాలు మార్కెట్‌కి వస్తున్న తరుణంలో ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, మార్కెట్ సెక్రటరీ ఎల్.శ్రీనివాస్, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, అంజయ్య, నవరాజ్, రఘుపతి రెడ్డి, నరసింహ, జైపాల్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, గణేశ్‌నాయక్, వెంకటేశం గుప్తా, ఇబ్రహీం పాల్గొన్నారు. మతోన్మాదం నుంచి ప్రజలను కాపాడుకోవాలి షాబాద్: మతోన్మాదం నుంచి ప్రజలను, బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పేర్కొన్నారు. పార్టీ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామికవాదులు, ప్రశ్నించే నాయకుల మీద దాడులు.. హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ లాంటి రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నక్కల జంగయ్య, నాయకులు శ్రీశైలం, రఘురాం, రుక్కయ్య, రఘు, మధు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 21 నుంచి అరుదైన నాణేలు, కరెన్సీ ప్రదర్శన చార్మినార్: ఈ నెల 21, 22, 23 తేదీల్లో పాతబస్తీలోని ఉర్దూ ఘర్‌లో అరుదైన అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ నోట్లు, పురాతన వస్తువుల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. అరుదైన నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌ల ప్రదర్శన చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ అందరికీ అందుబాటులో ఉంటుందని.. తమకు కావాల్సిన వాటిని ఖరీదు చేయవచ్చని, అలాగే తమ వద్ద ఉన్న పురాతన నాణేలను విక్రయించవచ్చని సొసైటీ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హై ఖాద్రీ తెలిపారు. నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌లతో పాటు ఇతర పురాతన వస్తువుల మిశ్రమ కలయిక వస్తువులను ఎగ్జిబిషన్లో సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
కార్యకర్తల పార్టీ బీజేపీ
సెక్షన్ 164 విధింపు తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు సెక్షన్ 164 అమ లు చేస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. 8లోuశంకర్పల్లి: భారతీయ జనతా పార్టీ లీడర్ల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలోని బీడీఎల్ చౌరస్తా వద్ద గురువారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పార్టీ మండల, మున్సిపల్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుందని, మిగతా పార్టీల్లా మీడియాలో కనిపించేందుకు ఆసక్తి చూపించదని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నో నిధులు కేటాయిస్తున్నప్పటికీ శిలాఫలకాలు వేసుకొని క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోందని విమర్శించారు. కార్యకర్తలు గ్రామస్థాయిలో ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జిలు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్, శంకర్పల్లి మండల అధ్యక్షురాలు లీలావతి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -
రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం
షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల పూర్తయిన సందర్భంగా హనుమకొండలో నిర్వహించే రజతోత్సవ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం షాద్‌నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీళ్లుగా మారిన పంట పొలాలను నాడు కేసీఆర్ సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందని, కాంగ్రెస్ పాలనలో తిరిగి పాత రోజులు వస్తాయేమోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన మాయమాటలకు మోసపోయి, భ్రమపడి ఆ పార్టీకి ఓటు వేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల మాటలకు మోసపోయామని ప్రజలు ఎంతో బాధపడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొందూటి నరేందర్, ఈట గణేశ్, రాజావరప్రసాద్, వంకాయల నారాయణరెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, యుగేంధర్, ఒగ్గు కిషోర్, వెంకట్రాంరెడ్డి, ఎంఎస్ నట్రాజ్, బచ్చలి నర్సింహ పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
శిఖం భూమిలో నిర్మాణాలు
పహాడీషరీఫ్: జల్పల్లి పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. 69 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే ఈ భూమిపై ఎప్పటి నుంచో కన్నేసిన కబ్జాదారులు గతంలో ప్రహరీలు నిర్మించేందుకు యత్నించారు. అప్పట్లో బాలాపూర్ రెవెన్యూ అధికారులు స్పందించి కూల్చివేతలు చేపట్టారు. తాజాగా సెలవులు రావడంతో ఇదే అదునుగా భావించి మూడు భారీ ప్రహరీల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రాత్రికి రాత్రే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. చెరువులో నీరు తగ్గుముఖం పడుతున్నప్పుడు ఇలాంటి నిర్మాణాలు చేపట్టి, చివరకు తటాకం నిండినప్పుడు తమ నిర్మాణాలు మునిగిపోయాయంటూ గగ్గోలు పెట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఉస్మాన్‌నగర్‌లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై, ప్రజావసరాల కోసం ఏదైనా కమ్యూనిటీ హాల్, క్రీడా మైదానం లాంటివి నిర్మించడానికి కూడా స్థలం దొరకని పరిస్థితులు జల్పల్లి మున్సిపాలిటీలో దాపురించాయి. అక్కడక్కడ మిగిలిన కొద్దిపాటి ప్రభుత్వ భూములనైనా కబ్జా బారిన పడకుండా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రిపూట పనులు చేస్తున్న అక్రమార్కులు -
బుల్లెట్ తీసి బతికించారు..
గచ్చిబౌలి: సోమాలియా దేశంలో జరిగిన సివిల్ వార్‌లో ఓ యువకుడికి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కోమాలోకి వెళ్లిన యుకుడికి బుల్లెట్‌ను తీసేందుకు అక్కడి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు నెలల అనంతరం రోగిని ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 12 గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం 3.5 సెంటీ మీటర్ల పొడవు ఉన్న బుల్లెట్‌ను బయటకు తీసింది. దీంతో సదరు యువకుడు గులెమ్ మహముద్ హెర్సీ(27) ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. గురువారు కేర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు వివరాలు వెల్లడించారు. సోమాలియాకు చెందిన గులెమ్ మహమూద్ హెర్సీ అనే యువకుడికి అక్కడ జరిగిన సివిల్ వార్‌లో నుదుటి నుంచి బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిందన్నారు. చిన్న మెదడు దగ్గర చేరడంతో అతడు కోమాలోకి వెళ్లాడని, అక్కడి వైద్యులు తల ముందు పుర్రె ముందు భాగం నుంచి బుల్లెట్‌ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. కోమాలోంచి కొద్దిగా కోలుకున్న తర్వాత అతడిని రెండు నెలల అనంతరం ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారన్నారు. రేడియాలజీ, సిటీస్కాన్, ఎంఆర్ఐలో బుల్లెట్ పొజిషన్, లోకేషన్‌ను గుర్తించామన్నారు. న్యూరో నావిగేషన్, సర్జికల్ మైక్రో స్కోప్ ద్వారా బ్రెయిన్ ఫంక్షన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 12 గంటల పాటు ఆపరేషన్ చేసి బ్లీడింగ్ కాకుండా, వైటల్ స్టక్చర్స్ను కాపాడుకుంటూ బుల్లెట్‌ను తీశామన్నారు. బ్రెయిన్ స్టెంట్ దగ్గర ఉన్న బుల్లెట్‌ను బయకు తీయడం చాలా అరుదుగా జరుగుతుంటుందన్నారు. సర్జరీ జరిగి రెండు వారాలు గడిచిందని, రోగి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ ఉంచామని, మరో నాలుగు వారాలు గడిస్తే మరింత కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ సీఈఓ నీలేష్ మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన కేసులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు , నిపుణులైన వైద్యులు తమ వద్ద ఉన్నారని తెలిపారు. ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చే అందర్జాతీయ రోగులకు గమ్యస్థానంగా కేర్ హాస్పిటల్ ఉందన్నారు. రెండు నెలలకు పైగా తలలో బుల్లెట్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స 3.5 సెంటీ మీటర్ల బుల్లెట్‌ను బయటకు తీసిన కేర్ వైద్యులు సురక్షితంగా బయటపడ్డ సోమాలియా యువకుడు -
ఇంట్లో పేలిన సిలిండర్
పహాడీషరీఫ్: స్టోర్ రూంలో ఉంచిన సిలిండర్ పేలిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రకుంట సాదత్‌నగర్‌కు చెందిన సల్మా భాను కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. బుక్ చేసిన గ్యాస్ రావడంతో ఇంటి బాల్కానీలో ఉన్న విజిటింగ్ రూమ్‌లో ఉంచారు. ఆ సమయంలో పిల్లలు పాఠశాలకు వెళ్లడంతో సల్మా లోపలి ఇంట్లో ఉంది. అప్పటికే లీకవుతున్న గ్యాస్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఇంట్లో ఉన్న సామగ్రి కాలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేని కారణంగా పెను ప్రమాదమే తప్పింది. ఇంటి పైకప్పు కూడా స్వల్పంగా ధ్వంసమయింది. తప్పిన పెను ప్రమాదం -
అసాంఘిక అడ్డాగా.. ఫాంహౌస్‌లు
మొయినాబాద్: వారాంతపు సరదా కోసం నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వాటిల్లో మందు, రేవ్, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు దందాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఎస్ఓటీ పోలీసులు దాడిచేసి గుట్టు రట్టుచేస్తున్నా ఈ దందాలు మాత్రం ఆగడంలేదు. హైదరాబాద్ మహానగర శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్ ప్రాంతాల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్లున్నాయి. ఇక్కడ నిత్యం గలీజు దందాలు జరుగుతున్నా అరికట్టడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిర్వాహకుల అడ్డగోలు దందాలు ఫాంహౌస్‌లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్టూగెదర్, ఫ్యామిలీ, బర్త్‌డేలు అంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. వీటితోపాటు రేవ్, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. ఫాంహౌస్‌లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం కూడా చేయిస్తున్నారు. మొయినాబాద్‌లోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, నజీబ్‌నగర్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. మామూళ్ల మత్తులో స్థానిక పోలీసులు నిత్యం ఫాంహౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా స్థానిక పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటి నుంచి ప్రతి నెలా మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తుంది. ఒక్కో ఫాంహౌస్ నుంచి నెలకు సుమారు రూ.20–30 వేల వరకు ముడుతున్నట్లు సమాచారం. మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసులు ఫాంహౌస్‌లలో జరుగుతున్న గలీజు దందాలకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. వీటిపై అప్పుడప్పుడు ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ముజ్రా, రేవ్ పార్టీలు, వ్యభిచారం, పేకాట, కోడి పందేల వంటి అసాంఘిక కార్యకలాపాలను భగ్నం చేస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసే వరకు స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారంటూ మొయినాబాద్ ఎస్హెచ్ఓపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. మందు, రేవ్, ముజ్రా పార్టీలతో గలీజు దందా అద్దెకు తీసుకుని గుట్టుగా నడుపుతున్న నిర్వాహకులు దాడులు చేసి గుట్టురట్టు చేస్తున్న ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నాం ప్రతి శుక్రవారం, శనివారం ఫాంహౌస్‌లలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించినా, మద్యం వినియోగించినా కేసులు నమోదు చేస్తున్నాం. అప్పుడప్పుడు బర్త్‌డే, గెట్టూగెదర్ పార్టీల పేరుతో అప్పడప్పుడు ఇతర పార్టీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే నిర్వాహకులు, ఫాంహౌస్‌ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పవన్‌కుమార్‌రెడ్డి, ఇన్స్పెక్టర్, మొయినాబాద్ వెలుగుచూసిన ఘటనలు ఏడాదిన్నర క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు నలుగురిని(ఇద్దరు మహిళలు) ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో ఏడాది క్రితం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆరు నెలల క్రితం అజీజ్‌నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం తోలుకట్ట రెవెన్యూలో ఓ ఎమ్మెల్సీకి చెందిన ఫాంహౌస్‌లో కోడిపందేలు నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పందేల నిర్వాహకుడితోపాటు 64 మంది పట్టుకున్నారు. భారీగా మద్యం, నగదు, క్యాసినో కాయిన్స్, కోడికత్తులు, కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఎత్‌బార్‌పల్లిలోని ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, 7 మంది యువతులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, హుక్కా పాట్స్, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
యువతి అదృశ్యంపై ఫిర్యాదు
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన మర్ల కృష్ణ కుమార్తె కళావతి(19) ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 9న మధ్యాహ్నం బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. మన్సూర్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ కృష్ణ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. వివాద భూమిలో సెక్షన్ 164 విధింపు ఆర్డీఓ సూచనతో తహసీల్దార్ ప్రకటన తుర్కయంజాల్: ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కమ్మగూడ, తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో బీఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 164 అమలు చేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కె.అనంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్న్రెడ్డి ప్రకటించారు. గురువారం స్థానిక కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 240, 241, 242లోని 10.09 ఎకరాల భూమి తమదంటే తమదేనని ఇరు వర్గాలు వరుసగా గొడవలకు దిగుతుండటంతో బుధవారం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉండటంతో సెక్షన్ 164 విధించినట్లు ఆయన తెలిపారు. ప్లాట్లు, భూమి యజమానులతో పాటు, కోర్టు నుంచి ఆర్డర్ పొందిన వారు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరించారు. దీన్ని ఉల్లఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎల్మినేడులో వడగళ్ల వాన ఇబ్రహీంపట్నం రూరల్: ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామంలో కురిసింది. భారీ ఉరుములతో వడగళ్లు పడగా.. ఓ ఇంటిపై పిడుగుపడి రేయిలింగ్ కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. గంజాయి విక్రేత అరెస్టు అత్తాపూర్: నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన షేక్ జకీర్(42) మహారాష్ట్రలోని అమరావతి నుంచి నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. ఈ నెల 8న మధ్యాహ్నం హసన్‌నగర్‌లో గంజాయిని తీసుకొచ్చి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకొని అతడి నుంచి 1012 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. -
పోలీసులను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
యాచారం: విధుల్లో ఉన్న పోలీసులను బెదిరించిన వ్యక్తిపై యాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని గునుగల్ గ్రామానికి చెందిన కుంటి శ్రీకాంత్ బుధవారం అర్ధరాత్రి గునుగల్ గేట్ వద్ద సిగరేట్ కాల్చుతూ అనుమానంగా తిరుగుతున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెళ్లి అతడిని విచారిస్తుండగానే తీవ్ర పదజాలంతో దూషిస్తూ బెదిరించాడు. అక్కడి నుంచి తప్పించుకొనిపోయి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ విషయమై యాచారం పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. మతిస్థిమితం లేని యువతి అదృశ్యం ఇబ్రహీంపట్నం రూరల్: మతిస్థిమితం లేని ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాదర్గుల్ ప్రాంతానికి చెందిన బొచ్చల్ల సౌందర్య(24) అనే యువతి ఇంట్లో నుంచి తప్పిపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆదిబట్ల పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర మద్యాన్ని సరఫరా చేసే బెడ్ రోలర్ అరెస్ట్ నాంపల్లి: అంతరాష్ట్ర మద్యాన్ని నగరానికి దిగుమతి చేసే వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా గురువారం హైదరాబాద్ రైల్వేస్టేషన్లో సోదాలు జరిపారు. ప్లాట్ఫారం నెం–6 మీద బ్యాగ్‌తో రైళ్లలో పనిచేసే ఒక బెడ్ రోలర్ వేచి ఉండటాన్ని గమనించారు. అడ్డగించి బ్యాగు తెరి చూడగా అందులో వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం బాటిల్స్ కనిపించాయి. ఈ మద్యాన్ని హరియాణా నుంచి హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లుగా బెడ్ రోలర్ ఒప్పుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అమానిగంజ్ చోయ్, ఫైజాబాద్‌కు చెందిన రామ్ సరన్ కుమారుడు శివ ‘జైపూర్–హైదరాబాద్’నగరాల మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో బెడ్ షీట్లను మార్చే బెడ్ రోలర్‌గా పనిచేస్తున్నారు. అతను ఓ కాంట్రాక్టర్ కింద రైళ్లలో బెడ్ షీట్స్‌ను శుభ్రం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. హరియాణాలో తక్కువ ధరకు లభించే బ్లెండర్స్ ప్రైడ్–18 బాటిల్స్, 8 పీఎం–10 విస్కీ బాటిల్స్‌ను హైదరాబాద్‌కు రైలులో తీసుకువచ్చాడు. వీటి విలువ సుమారు రూ.32,160 గా ఉంటుందని హైదరాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అంతర్రాష్ట్రానికి చెందిన మద్యాన్ని సరఫరా చేసేందుకు అతడి వద్ద ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కత్తిపోట్లకు గురైన గిరిజన మహిళ మృతి నాగోలు: మూడు రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన వర్ధ్య లక్ష్మి అనే గిరిజన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 8న రాత్రి సరూర్‌నగర్ పోస్తాఫీస్కు వెళ్లే దారిలో ఉన్న రిషి కిచెన్ వెను మరి కొందరు మహిళతో కలిసి ఆమె వేచి ఉంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి లక్ష్మిపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిన ఆమెను దిల్‌సుఖ్‌నగర్‌లోని కృతిక హాస్పిటకు తరలించారు. హాస్పిటల్లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత లక్ష్మి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ లింగోజిగూడ: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12 నిర్వహించనున్న ర్యాలీ సన్నాహక సమావేశం గురువారం కర్మన్‌ఘాట్‌లోని లక్ష్మీకన్వెన్షన్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిదిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ... ర్యాలీ రోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఉందని సిబ్బంది అక్కడికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. నిర్వాహకులు ఎలాంటి సంఘటనలు జరగకుండా కొంతమంది వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ర్యాలీ సమయంలో రోడ్డు మొత్తం వెళ్లకుండా ఒకవైపు నుంచి మాత్రమే వెళ్లేలా చూసుకోవాలన్నారు. ర్యాలీలో భారీ శబ్దాలు వచ్చే వాహనాలను వాడకుండా చూడాలని సూచించారు. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు నెలకొన్నా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పల్లెల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
షాద్‌నగర్: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామ పంచాయతీ పిట్టలగడ్డ తండాలో రూ.70లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ, సీసీరోడ్లు, కందివనం గ్రామంలో రూ.9లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, సూర్యప్రకాశ్, శ్రీనివాస్, అనంతం, తుపాకుల శేఖర్, నవీన్, శ్రీధర్‌రెడ్డి, రాజు, యాదయ్య, రఘురాం, సర్ధార్, ప్రసాద్, రాజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పరామర్శ అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ నేత చెంది తిరుపతిరెడ్డిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే నాయకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకొని, ధైర్యం కల్పించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
‘రాష్ట్రీయ బాల్ పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
హుడాకాంప్లెక్స్: రాష్ట్రీయ బాల్ పురస్కార్ చిల్డ్రన్స్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్త్రీ, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి సీహెచ్.సంధ్యారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధైర్యసాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్రసాంకేతిక విషయాలు, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి జూలై 31 వరకు 18 ఏళ్ల నిండిన బాలలు అర్హులు అని చెప్పారు. భారతదేశ పౌరసత్వం ఉన్న బాలబాలికలు నేషనల్ అవార్డ్స్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలకు https://awards.gov.in వైబ్సైట్ణు పరిశీలించాలని సూచించారు. ఆమనగల్లు సీఐ బదిలీ నూతన సీఐగా జానకీరామ్‌రెడ్డి ఆమనగల్లు: ఆమనగల్లు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ప్రమోద్‌కుమార్ బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది సీఐలను బదిలీచేస్తూ కమిషనర్ అవినాష్‌మహంతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆమనగల్లు సీఐగా పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్‌ను రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా బదిలీచేశారు. కాగా ఏసీబీలో పనిచేస్తున్న వి.జానకీరామ్రెడ్డిని ఆమనగల్లు సీఐగా నియమించారు. కడ్తాల సీఐ ఎస్.శివప్రసాద్‌ను సైబర్ క్రైం సీఐగా బదిలీ చేయగా అతనిస్థానంలో షామీర్పేట ఠాణాలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చంద గంగాధర్‌ను కడ్తాల సీఐగా నియమించారు. రేపు భూ సేకరణపై సమావేశం మంచాల: ఈ నెల 11న లోయపల్లి రెవెన్యూ క్లస్టర్ పరిధిలోని శ్రీమంతన్గూడలో భూసేకరణపై సమావేశం నిర్వహించనున్నట్లు రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. వివరాలు.. శివన్నగూడ రిజర్వాయర్ నిర్మాణానికి గాను ప్రభుత్వం భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. శ్రీమంత్గూడలో సర్వే నంబర్ 40 నుంచి 66 వరకు 148.31 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ సర్వే నంబర్లలో భూములు కోల్పోతున్న 267 మంది రైతులతో శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి భూసేకరణ నిర్వహించే ప్రదేశంలో ఉదయం 10గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు సకాలంలో హాజరై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, ఫీల్డ్‌ఆఫీసర్ యాట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీకి డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట ధర్నా ● హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభులింగం ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్రంలోని రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ప్రభులింగం డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కె.మాధవరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభులింగం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుభాన్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి డిమాండ్ చేశారు. 57 ఏళ్లు నిండిన రైతులకు వృద్ధాప్య పెన్షన్, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతు వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ వ్యవసా మార్కెట్ విధానాన్ని ప్రకటించాలన్నారు. కిసాన్ సమృద్ధి నిధిని రూ.6వేలకు పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బక్కని మల్లేశ్, గుండాల శివుడు, బాల్‌రెడ్డి, చల్లా నారాయణరెడ్డి, అంజయ్య, వెంకన్న, నర్సింహ, శ్రీనివాస్‌నాయక్, నర్సింహారెడ్డి, చతుర్నాయక్, హుస్సేన్, బాల్‌రాజ్, రేఖ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఫెన్సింగ్ పనులు నిలిపేయండి
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో వెంటనే సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనులను వెంటనే నిలిపేయాలని సీపీఎం నాయకులు బుధవారం హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ ఆధ్వర్యంలో సీఐని కలిసి వెంటనే సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనులు ఆపాలని కోరారు. అసైన్డ్‌దారులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని అన్నారు. అదే విధంగా ఫార్మా ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చి మూడేళ్లు అవుతున్నా నేటికి కబ్జాలు చూపించి, రిజిస్ట్రేషన్లు చేయలేదని ఆరోపించారు. వెంటనే ఫెన్సింగ్ పనులు నిలిపేయాలని లేని పక్షంలో ఆందోళన నిర్వహించి, పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పెద్దయ్య, లాజర్, జంగయ్య, కుమార్, భూషణ్, పెంటయ్య, యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు. -
కిరాణా షాపులపై దాడులు
కొందుర్గు: విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరాణ దుకాణాలపై దాడులు చేసి నిషేధిత గుట్కా, అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పట్టుకున్నారు. షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొందుర్గులో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించామని, ఇందులో భాగంగా 20 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు సీజ్ చేశామన్నారు. అదేవిధంగా అనుమతి లేకుండా కిరాణ షాపుల్లో విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామని వివరించారు. కార్యక్రమంలో ఎస్సై రవీందర్ నాయక్‌తోపాటు దాదాపు 50 మంది పోలీసులు దాడుల్లో పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి కేశంపేట: ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు నింబధనలు పాటించాలని సీఐ నరహరి అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా మండల పరిధిలోని అల్వాల, కొత్తపేట, కేశంపేట గ్రామాల్లో వాహనాల తనిఖీలు, కిరాణ షాపుల్లో చెక్కింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. గుట్కా, మద్యం బాటిళ్ల్లు స్వాధీనం -
చిప్పలపల్లిలో షార్ట్ సర్క్యూట్
కందుకూరు: షార్ట్ సర్క్యూట్‌తో పలు గృహాల్లో మంటలు చెలరేగి విద్యుత్ పరికరాలు, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన కందుకూరు మండలం చిప్పలపల్లిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. చిప్పలపల్లిలోని ఎస్ఆర్నగర్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్కు సరఫరా అయ్యే 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఇళ్లల్లోకి వచ్చే ఎల్టీ విద్యుత్ లైన్‌పై పడ్డాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పలు ఇళ్లల్లోని విద్యుత్ పరికరాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ఫ్యాన్లు, స్విచ్ఛ్ బోర్డులు, వైరింగ్ దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇళ్లలో ఉన్న వారంతా భయాందోళనలకు గురై బయటికి పరుగెత్తారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం ఏఈ వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలంకు చేరుకుని వివరాలు సేకరించారు. నష్టపరిహారం విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇచ్చారు. విలువైన విద్యుత్ పరికరాలు దగ్ధం -
గోవిందుడికి గోప వాహన సేవ
వైభవంగా కొనసాగుతున్న చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలుమొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీవారు గోప వాహన, హనుమంత వాహన సేవలు అందుకున్నారు. స్వామివారిని మొదటగా గోప వాహనంపై ఆశీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం నిర్వహించిన హనుమంత వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపారాయణం, పూజలు, మంగళహారతి సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, నరసింహన్, కిట్టు, కృష్ణమూర్తి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు కల్యాణం బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి సూర్యప్రభ, గరుడ వాహన సేవలు నిర్వహించనున్నారు. రాత్రి 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. -
గ్రహణం
● ముగ్గు పోసి వదిలేసిన లబ్ధిదారులు ● బిల్లులు రాక నిలిచిన నిర్మాణాలు 20 ఇళ్ల మంజూరుకు ఇద్దరే నిర్మించారు కొత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రజలు అనాసక్తి చూపుతున్నారు. ఇళ్లు లేని పేద ప్రజలకు విడతల వారీగా నగదు ఇచ్చి వారికి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్తూరు మండలంలోని మక్తగూడను పైలట్ గ్రామంగా ఎంపిక చేసి మొదటి దశలో 20 ఇళ్లు మంజూరు చేసింది. ఏడుగురు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపగా నలుగురు నిర్మాణాలను ప్రారంభించారు. మక్తగూడ పంచాయతీ పరిధి పెద్దగుట్టతండాలో హరిపాల్ సింగ్, హుంకి నిర్మిస్తున్న ఇళ్లు బేస్మెంట్ లెవల్ పూర్తయింది. వారు అధికారులను సంప్రదించగా ఫొటోలు, వివరాలు సేకరించి ఉన్నాతాధికారులకు నివేదిక అందజేశారు. నేటికీ మొదటి విడత రూ.లక్షల మంజూరు కాకపోవడంతో ఎదురుచూపడం తప్పడం లేదు. బిల్లులు ఇస్తే పూర్తి ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేస్తుందని చెప్పడంతో పనులు ప్రారంభించా. బేస్మెంట్ లెవల్ వరకు పూర్తయింది. అధికారులు బిల్లుల వివరాలు తీసుకున్నారు. త్వరగా బిల్లులు మంజూరైతే నిర్మాణం పూర్తి చేసుకుంటా – హరిపాల్‌సింగ్, పెద్దగుట్టతండా, మక్తగూడ పంచాయతీ -
ఫాంహౌస్‌లో ముజ్రా పార్టీ
మొయినాబాద్: పుట్టిన రోజు వేడుకల పేరుతో ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. అర్ధనగ్నంగా అశ్లీల నృత్యాలు చేస్తున్న ఏడుగురు యువతులతోపాటు 13 మంది యువకులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎత్బార్పల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన అబ్దుల్ లుక్మాన్ తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఎత్బార్పల్లి రెవెన్యూలోని హాలీడే హోమ్ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని యూసుఫ్‌గూడ, బోరబండ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లింగంపల్లి, బోయిన్పల్లి, గోల్కొండ, టోలిచౌకి, పాతబస్తి, ఆసిఫ్‌నగర్, జీడిమెట్ల ప్రాంతాలకు చెందిన 12 మంది స్నేహితులను బర్త్‌డే పార్టీకి తీసుకొచ్చాడు. వారితోపాటు కొంత కాలంగా నగరంలోని సికింద్రాబాద్, రాజేంద్రనగర్, రాంనగర్, మెహదీపట్నం ప్రాంతాల్లో ఉంటున్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలకు చెందిన ఏడుగురు యువతులను సైతం ఫాంహౌస్‌కు తీసుకొచ్చారు. అందరూ కలిసి మద్యం, గంజాయి సేవిస్తూ మత్తులో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి ఫాంహౌస్‌పై దాడి చేశారు. పట్టుబడిన యువతులను బాబు, రీనా అనే వ్యక్తులు తీసుకొచ్చినట్లు తెలిసింది. వీరిలో ఓ యువతి గతంలో జరిగిన ము జ్రా పార్టీలో సైతం పట్టుబడినట్లు సమాచారం. గంజాయి, మద్యం స్వాధీనం ఘటనా స్థలంలో 62 గ్రాముల గంజాయి, భారీగా మద్యం బాటిళ్లు లభించాయి. నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతీయువకులను మొయినాబాద్ పీఎస్‌కు తరలించి విచారణ చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం వీరిని సీన్రీ కన్స్ట్రక్షన్ యువతీయువకులను ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు. అనంతరం కేసు నమోదు చేసి బుధవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. ఫాంహౌస్ యజమానిపై కేసు చేసినట్లు తెలిపారు. ఎస్హెచ్ఓకు చీవాట్లు..? ఎత్బార్పల్లి ఫాంహౌస్‌లో జరిగిన ముజ్రా పార్టీ విషయంలో మొయినాబాద్ ఎస్హెచ్ఓకు పోలీసులు ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు వచ్చే వరకు మీరేం చేస్తున్నారని, ఇలాంటి ఘటనలపై నిఘా పెట్టకూడదా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. అర్ధనగ్నంగా అశ్లీల నృత్యాలు ఎస్ఓటీ పోలీసుల దాడి 13 మంది యువకులు, ఏడుగురు యువతులకు రిమాండ్ 62 గ్రాముల గంజాయి, భారీగా మద్యం స్వాధీనం నిర్వాహకులతో పాటు ఫాంహౌస్ ఓనర్‌పై కేసు -
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
కొందుర్గు: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవనశాఖ అధికారి హిమబిందు అన్నారు. బుధవారం కొందుర్గు రైతువేదికలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందన్నారు. ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు కూలీల ఖర్చు తక్కువగా ఉంటుందని, చీడపీడల బాధ ఉండదన్నారు. పంట నాటిన మూడు సంవత్సరాల అనంతరం నిరంతర దిగుబడులు పొందవచ్చన్నారు. ఆయిల్‌పామ్ డీజీఎం రామ్మోహన్ మాట్లాడుతూ..సాగుచేసే రైతులకు ఎరువుల వాడకం, పంట యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ పంట దిగుబడులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రాకేష్, ఏఈఓలు వాసవి, రమణ, నిఖిల్, రైతులు పాల్గొన్నారు. ఉద్యానవనశాఖ అధికారి హిమబిందు -
భూ వివాదం.. ఉద్రిక్తం
వంద మంది జేసీబీతో వచ్చి.. సుమారు వంద మంది బుధవారం తెల్లవారుజామున జేసీబీతో వచ్చి ప్లాట్ల కడీలను ధ్వంసం చేయడంతో పాటు, ప్రీకాస్ట్ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద వెళ్తుండగా ప్లాట్లు, ఇళ్ల యజమానులు అక్కడికి చేరుకున్నారు. ఆపాలని ప్రాధేయపడుతున్నా వినకుండా కబ్జాకు వచ్చిన వారి అనుచరులు ఒక్కసారిగా రాళ్లదాడి మొదలు పెట్టారు. దీంతో ప్లాట్లు, ఇళ్ల యజమానులు ఒకరికి ఒకరు సమాచారం చేరవేయడంతో అక్కడికి పదుల సంఖ్యలో చేరుకున్నారు. వీరికి పక్క కాలనీల వాసులు కూడా తోడవ్వడంతో ప్లాట్లను ధ్వంసం చేస్తున్న వారిని తరిమారు. ఈ క్రమంలో జేసీబీ, ఆటో, పలు బైక్‌లను ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బైక్‌కు నిప్పు పెట్టారు. అదే సమయంలో మెహిదీపట్నం నుంచి కూలీ పని ఉందని చెప్పి ఓ బస్సులో మహిళలను తీసుకురావడంతో వారిని సైతం తరిమికొట్టారు. అదే సమయంలో ఆ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో కొందరు ప్లాట్ల యజమానులకు, కూలీకి వచ్చిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. తుర్కయంజాల్: తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 240, 241, 242లోని నెలకొన్న భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం తెల్లవారుజామున కబ్జాదారులు ప్లాట్ల కడీలు, ప్రీకాస్ట్లను తొలగించడంతో పాటు, నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని కూల్చడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కొక్కరుగా చేరుకున్న ప్లాట్లు, ఇళ్ల యజమానులు, పక్క కాలనీవాసులు తిరగబడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు ఇవీ.. గుండ రాజమ్మ అనే మహిళ తన వారసత్వ వాటాగా రావాల్సిన ఆస్తి ఇవ్వలేదని 1984లో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమెకు సెప్టెంబర్ 2024లో అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తుర్కయంజాల్ రెవెన్యూ సర్వే నంబర్ 240లోని 10.09 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగా భూమిని ఆళ్ల రామకృష్ణ, సలాం, రిజ్వాన్ అనే ముగ్గురు వ్యక్తులకు ఆమె జీపీఏ చేసింది. వాళ్లు 2025 మార్చి నెల 26న ఇదే సర్వే నంబర్లోని వ్యవసాయ పొలానికి కంచె వేసే ప్రయత్నం చేయడంతో పాటు, పలు ఇళ్లు, ప్రీకాస్ట్ నిర్మాణాలను కూల్చి వేయించారు. దీంతో ఇక్కడ భూ వివాదం రాజుకుంది. ప్లాట్లు, ఇళ్ల యజమానులతో పాటు, పొలానికి చెందిన రైతులు కూడా కోర్టులను ఆశ్రయించారు. ఇటీవల 1.10 గుంటల పొలానికి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. అప్పటి నుంచి భూమిని కబ్జాలోకి తీసుకోవాలని భావిస్తున్న వారి అనుచరులు కాలనీలో నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. ఆలస్యంగా పోలీసుల రాక ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్న పోలీసులు సుమారు గంటన్నర తరువాత సంఘటనా స్థలానికి చేరుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్లాట్ల యజమానులు 100కు డయల్ చేయడంతో ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అప్పటికే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏసీపీ కాశిరెడ్డి, ఎస్ఓటీ ఏసీపీ షాకీర్ హుస్సేన్, సీఐ శ్రీనివాస్‌లు పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు ఇరువర్గాల మీద కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. తేనేటీగలు లేవడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే రంగారెడ్డి దృష్టికి తీసుకునేందుకు ప్లాట్లు, ఇళ్ల యజమానులు తొర్రూర్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ వీరికి జీఏపీ చేసుకున్న ఆళ్ల రామకృష్ణ తారసపడ్డాడు. దీంతో మాటామాటా పెరిగింది. ఒక్కసారిగా ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడ చెట్టుకున్న తేనే తెట్టును రాయితో కొట్టడంతో ఒక్కసారిగా తేనెటీగలు లేచాయి. దీంతో ఎమ్మెల్యేతో సహా అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. అనుచరులతో వచ్చి ప్లాట్లు, ప్రీకాస్ట్లను ధ్వంసం చేసిన వ్యక్తులు తిరగబడిన బాధితులు పలు వాహనాలు ధ్వంసం -
కొనసాగుతున్న ఫెన్సింగ్ పనులు
యాచారం: మండల పరిధిలో ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల బౌండరీలో బుధవారం టీజీఐఐసీ, సర్వే, రెవెన్యూ సిబ్బంది ఫార్మాసిటీ భూములకు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును నిర్వహించారు. ఫార్మాసిటీ భూముల్లోకి రైతులేవరు రాకుండా ఏర్పాట్లు చేశారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు ఫార్మాసిటీకి భూములు సేకరించిన గ్రామాల్లో రైతుల కదలికలపై నిఘా పెట్టారు. ఐదో రోజు కూడా ఇద్దరి ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, వందకు మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మతోడు.. ఆస్తికోసం కాదు
పహాడీషరీఫ్: జల్పల్లిలోని సినీ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన మంచు టౌన్షిప్ వద్ద మరోసారి వివాదం నెలకొంది. తాను లేని సమయంలో నార్సింగిలోని తన నివాసం వద్ద ఉన్న కార్లను విష్ణు దొంగలించాడని పేర్కొంటూ ఈ నెల 8న మంచు మనోజ్ నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉదయం 8.30 గంటలకు జల్పల్లి శివారులోని మంచు టౌన్షిప్ గేట్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మీడియాను లోనికి రానివ్వకుండా టౌన్షిప్ చుట్టూ కిలోమీటర్ సరిహద్దులో ఆంక్షలు విధించారు. పోలీసుల సూచనతో 11.45 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోతూ మనోజ్ మీడియా ఎదుట తన ఆవేదన వెలిబుచ్చారు. అమ్మపై ప్రమాణం గతేడాది డిసెంబర్ 8వ తేదీ నుంచి మంచుటౌన్‌షిప్‌లో ఆరంభమైన గొడవ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జల్పల్లిలో మొదలైన ఈ గొడవ కాలక్రమేణా తిరుపతిలోని మోహన్‌బాబు వర్సిటీ వరకు తాకింది. జల్పల్లిలో తాజాగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 27న తాను, తన భార్య ఇంట్లో ఉన్న సమయంలో బయటి వ్యక్తులు గుమిగూడుతున్న విషయమై పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి ఫోన్‌తో పాటు, 100 డయల్‌కు కాల్ చేసి రక్షణ కల్పించాలని కోరామన్నారు. అయినప్పటికీ తననే ఇంటి నుంచి బయటికి రావాలని పోలీసులు తెలిపారన్నారు. ఏప్రిల్ 2న తన కుమార్తె మొదటి పుట్టిన రోజు ఇక్కడే పరిమితంగా చేసుకుందామనుకున్నప్పటికీ, స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లామన్నారు. అంతకుముందే నేను అక్కడ లేను, విష్ణును అక్కడ ఏమైనా చేసుకోమని మా అ మ్మకు కూడా తెలిపానన్నారు. అమ్మపై ప్రమాణం.. ఇది ఆస్తి కోసం కాదు అన్నారు. తిరుపతిలోని యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి తంతును ప్రశ్నించినందుకే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. డిసెంబర్ 8 నుంచి ఇప్పటి వరకు పహాడీషరీఫ్ పోలీసులు ఒక్క ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదని, టౌన్షిప్లో తనకు సంబంధించి మూడు పెట్ డాగ్‌లు, పిల్లలకు సంబంధించి వస్తువులున్నాయని తెలిపారు. అవి తీసుకొని వెళ్తానని చెప్పినా లోనికి వెళ్లనీయడం లేదన్నారు. పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యహరించారని ఆరోపించారు. తాను రాజస్థాన్‌కు వెళ్లిన వెంటనే విష్ణు తన కార్లను చోరీ చేశారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంట్లో ఉన్న తన పాత జ్ఞాపకాలను సైతం తొలగించారన్నారు. రౌడీషీటర్ల ఆగడాలపై సీఐకి చెబితే‘అవునా పాపం’ కదా అంటున్నారు తప్పా చర్యలు శూన్యమన్నారు. కోర్టులను తప్పదోవ పట్టిస్తున్న ఘటనలపై తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు ఆదేశాలున్నా ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు. బైండోవర్ విషయం తనకు వర్తించినప్పుడు, విష్ణుకు ఎందుకు వర్తించవని ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం సినిమాలో స్త్రీ వేషధారణలోనూ నటించానని ఆవేదన వ్యక్తం చేశారు. మనోజ్ సంబంధించిన ఎలాంటి విషయాలైనా కావాలంటే.. ఇస్తా బిడ్డ అని నాన్న విష్ణుకు హామీ ఇచ్చారని తెలిపారు. పోలీసులు తన ఫిర్యాదులపై ఎక్కడ కూడా ఛార్జిషీట్లో దాఖలు చేయలేదన్నారు. ఇదిలా ఉండగా మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు యూపీలో కన్నప్ప సినిమా ప్రమోషన్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి సినిమా కథను వివరించారు. విష్ణు నా కార్లు దొంగిలించాడు మంచు మనోజ్ ఆరోపణ మంచు టౌన్ షిప్ వద్ద మరోసారి ఉద్రిక్తత భారీగా మోహరించిన పోలీసులు -
చేప.. వలకు చిక్కదే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణంగా చెరువులో వదిలిన చేపపిల్ల (35–40 ఎంఎం సైజు) కిలో బరువు పెరగాలంటే కనీసం పది నెలలు పడుతుంది. చెరువుల్లో వీటిని వదిలి ఆరు మాసాలు కూడా దాటలేదు. ఇప్పటికే మెజార్టీ చెరువులు/కుంటలు ఎండిపోయాయి. అక్కడక్కడా ఒకటి రెండు చెరువుల్లో కొద్దిపాటి నీరు కన్పిస్తున్నా.. పూర్తిగా కలుషితమై ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగస్‌తో నిండిపోయాయి. సాధారణంగా వేసవిలో చెరువులోని నీరు దగ్గర పడిందని భావించి మత్య్సకారులు వల విసిరితే.. ఒక్క చేప కూడా చిక్కడం లేదు. రూ.లక్షలు వెచ్చించి.. పోసిన చేపపిల్లలు వలకు చిక్కకపోవడం ఏమిటీ? అన్న ప్రశ్న జిల్లాలోని మత్స్యకారుల మదిని తొలిచివేస్తోంది. ఇదిలా ఉంటే ఏటా ఐదు వేల టన్నుల చేపల దిగుబడి వస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ లెక్కలు చెప్పుతుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి కల్పించాలని.. జిల్లాలో 121 మత్స్యకార సొసైటీలు ఉండగా, వీటిలో సుమారు ఏడు వేల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి ఏడాదంతా జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. మొత్తం 2,132 చెరువుల పరిధిలో 70.067 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడేళ్లుగా ప్రభుత్వం ఆయా చెరువులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లల్ని వదులుతున్న విషయం విదితమే. 2022లో 780 చెరువుల్లో రూ.1.30 కోట్ల విలువ చేసే సుమారు 1.80 కోట్ల చేపపిల్లలను వదలగా, 2023లో 794 చెరువుల్లో 1.96 కోట్ల చేపపిల్లలను వదిలారు. 2024 అక్టోబర్/నవంబర్‌లో 700 చెరువుల్లో 1.20 కోట్ల చేపపిల్లలను వదిలారు. తూర్పుగోదావరి, కై కలూరు, సూర్యపేట జిల్లాలకు చెందిన సీడ్ వ్యాపారులు చేపపిల్లలను సరఫరా చేశారు. 80 నుంచి 100 ఎంఎం సైజు బొచ్చ, రవ్వ, మోసు రకం చేపపిల్లలతో పాటు 35 నుంచి 40 ఎంఎం సైజు బొచ్చ, రవ్వ, బంగారు తీగ చేపపిల్లలను సరఫరా చేశారు. వృత్తిదారులకు చేదు అనుభవం ఎంపిక చేసిన 20 పెద్ద చెరువుల్లో 80–100 ఎంఎం సైజు చేపపిల్లలను వదలగా, మిగిలిన వాటిల్లో ఇతర సైజు పిల్లలను వదిలారు. నిర్ధేశించిన చేపపిల్లలు కాకుండా నాసిరకం చేపపిల్లలను సరఫరా చేయడం, ఒక్కో ప్యాకెట్లో 1800 చేప పిల్లలకు 750కి మించి లేకపోవడం, పారిశ్రామిక వ్యర్థాలకు తోడు సమీప పట్టణాల్లోని మురుగునీరు వచ్చి ఆయా చెరువుల్లో చేరడం, చెరువులు/కుంటలు మురికి కూపాలుగా మారడం, ఆయా చెరువుల్లో ప్రమాదకర మైన బ్యాక్టీరియా, ఫంగస్ నిండిపోవడం, ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడం వెరసి వేసిన పిల్ల వేసినట్లే కన్పించకుండా పోయింది. చెరువుల్లో నీరు దగ్గరపడటంతో చేపలు పట్టి జీవనోపాధి పొందాలని భావించిన వృత్తిదారులకు చేదు అనుభవమే ఎదురవుతోంది. వలకు బొచ్చ, బంగారు తీగ, రవ్వకు బదులు బురుకలు(పాంప్లేట్స్) చిక్కుతుండటం, మార్కెట్లో వాటికి పెద్దగా డిమాండ్ కూడా లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. 700 చెరువుల్లో 1.20 కోట్ల చేప పిల్లలను వదిలిన ప్రభుత్వం ఫంగస్, బ్యాక్టీరియా..పరిశ్రమలవ్యర్థాలతో నిండిన చెరువులు ఎదుగుదల లేక కనిపించని చేపలు చేప పిల్లల పంపిణీ ఇలా సంవత్సరం చెరువులు చేపపిల్లలు బడ్జెట్ 2017–18 280 99.74 లక్షలు రూ.62,41,039 2018–19 72 27.69 లక్షలు రూ.21,54,180 2019–20 327 70.50 లక్షలు రూ.41,31,002 2020–21 578 1.29 కోట్లు రూ.70,23,773 2021–22 794 1.60 కోట్లు రూ.1.25 కోటు 2022–23 794 1.80 కోట్లు రూ.1.30 కోట్లు 2023–24 800 1.96 కోట్లు రూ.1.33 కోట్లు 2024–25 700 1.20 కోట్లు రూ.92 లక్షలు -
‘ఫ్యూచర్’తో ఉద్యోగావకాశాలు
యాచారం: కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తుండడంతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. అమెజాన్ సంస్థ గునుగల్ ఆదర్శ కళాశాల, పాఠశాలను దత్తత తీసుకుని రూ.కోటిన్నరకు పైగా నిధులతో కిచెన్, భోజనశాల అలాగే గదులకు పెయింటింగ్ తదితర అభివృద్ధి పనులను చేపట్టింది. బుధవారం వాటిని ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేసి ఫోర్త్‌సిటీ(ఫ్యూచర్)ని నిర్మిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఇక్కడ రూ.లక్ష 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఫ్యూచర్‌సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిర్మిస్తుందని తెలిపారు. అమెజాన్ సంస్థ ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అమెజాన్ సంస్థ ప్రతినిధులు ఓంకార్, ట్రెలర్, పార్ధసారథి, ఆదర్శ కళాశాల, పాఠశాలల అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌చారి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, గునుగల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటుకు కృషి ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తులేకలాన్ గ్రామంలో అమెజాన్ సహకారంతో నూతన గ్రంథాలయం నిర్మాణం కోసం ఎమ్మెల్యే రంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూధన్‌రెడ్డిలు కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న పోటీ ప్రపంచంలో చదువులు విలువై పోయాయన్నారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, మాజీ సర్పంచ్ సమతరాంరెడ్డి, నాయకులు శశాంక్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పాండు, మహేందర్, విజయ్, శివ, ప్రభు, సంజీవ, శ్రీను, చింటురెడ్డి, మల్లేష్, బీరప్ప, దాసు, శంకర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. అమెజాన్ సంస్థ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించండి
షాద్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నిధులను మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్, కో కన్వీనర్ మాదారం నర్సింలు బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2013లో అనుమతి ఇచ్చారని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నార్లాపూర్, ఏదుల, కరివెన, రిజర్వాయర్ పరిధిలో ఉన్న పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను ఇచ్చారని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నిధులను మంజూరు చేయడంతో పాటుగా రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన భూమి సేకరణ పనులను చేపట్టి ఇక్కడి రైతులకు నమ్మకం కలిగించాలని పేర్కొన్నారు. బీసీసేన అసెంబ్లీ యువజన అధ్యక్షుడిగా శ్రీనివాస్ షాద్‌నగర్: పట్టణంలోని బీసీ సేన కార్యాలయంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కత్తిచంద్ర శేఖరప్ప ఆధ్వర్యంలో బుధవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ సమక్షంలో అసెంబ్లీ యువజన అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన పాలాది శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, ఉపాధి రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించకపోవడంతో అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలిచిన నాయకులు అధికారంలో వచ్చాక వారి సమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం బీసీలు ఐకమత్యంతో ఏకతాటిపైకి వచ్చి సంఘటితంగా పోరాటం చేయాలని సూచించారు. అనంతరం నూనతంగా ఎన్నికై న శ్రీనివాస్‌కు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా యువజన కార్యదర్శి శివ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు బొంరాస్‌పేట: వేసవితాపానికి ఉపశమనం కోసం ఇంట్లో పెట్టుకున్న కూలర్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల పరిధిలోని తుంకిమెట్లలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సఫియాబేగం ఇంట్లో మధ్యాహ్నం కూలర్ ఆన్చేసుకొని ఉండగా కొద్దిసేపటికి అందులోంచి మంటలు వ్యాప్తించాయి. చూస్తుండగానే వేగంగా వ్యాప్తి చెందడంతో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు అరవడంతో కాలనీవాసులు మంటలు ఆర్పే ప్రయ త్నం చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనంతో సిబ్బంది మంటలు పూర్తిగా చల్లార్చా రు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వస్తువులు కాలిపోయాయని బాధితురాలు వాపోయింది. రూ.6లక్షల మేర నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. -
ఉత్తమ సేవలకు ప్రశంసలు
బడంగ్పేట్: భద్రత, రక్షణ చర్యల్లో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉత్తమ సేవా అవార్డు వరించింది. బుధవారం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పి.సరస్వతికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరుణ్ బేహాల్ ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తమ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేయడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వి.శ్యామ్‌సుందర్, మేనేజర్ బి.నాగేశ్వర్రావు, ఆర్వో వి.వేణగోపాల్‌రెడ్డి, డీఈ వెంకన్న, ఏఈ వినీల్గౌడ్, అనూష, మమతారెడ్డి, మౌనిక ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న బంగారం రికవరీ
కేశంపేట: శుభకార్యంలో జరిగిన గొడవలో బంగారం పోగుట్టకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి పోగొట్టుకున్న బంగారు ఆభరణాన్ని రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. వివరాలు.. మండల పరిధిలోని సంతాపూర్కు చెందిన గుండేటి నర్సింహ సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్లో నిర్వహిస్తున్న శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ బంధువులతో జరిగిన గొడవలో తన రెండు తులాల బ్రాస్లెట్ పోగొట్టుకున్నాడు. మంగళవారం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కానిస్టేబుల్ అశోక్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరాలను పరిశీలించాడు. బంగారం తీసుకున్న వ్యక్తిని గుర్తించి అతడి వద్ద నుంచి రికవరీ చేశారు. సీఐ నరహరి, ఎస్ఐ రాజ్‌కుమార్ బాధితుడికి రికవరీ చేసిన బ్రాస్లెట్ అప్పగించారు. -
మహిళా ఆరోగ్యంతోనే సంతోషం
ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ వినితాదేవి యాచారం: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాల్లో సంతోషం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ వినితాదేవి అన్నారు. మంగళవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళల ఆరోగ్యం, గర్భిణి, బాలింతలకు అందించే పౌష్టికాహారం, చిన్నపిల్లల సంరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తప్పక తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాచారం ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
షాద్‌నగర్: గ్రామ పంచాయితీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జీపీ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంల ఆవరణలో ఎంపీడీఓ బన్సీలాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ... పంచాయతీ కార్మికులకు రెండు నెలల వేతనాలను మాత్రమే కార్మికుల ఖాతాలలో వేశారని, మరో మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించడంతో పాటుగా పర్మినెంట్ గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ బన్సీలాల్ మాట్లాడుతూ.. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, మా పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య, నా యకులు రాజునాయక్, శంకర్‌నాయక్, జీపీ కార్మికులు తదితరులు ఉన్నారు. జీపీ వర్కర్స్ యూనియన్రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
ముగిసిన ‘ఎల్సీడీసీ’
కేశంపేట: ప్రభుత్వం 2027 వరకు కుష్టు వ్యాధి రహిత సమాజంగా మార్చేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఈ మేరకు మండలంలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మార్చి 17 నుంచి 30 వరకు లెప్రసీ కేస్ డిటెక్టివ్ క్యాంపెయిన్(ఎల్సీడీసీ) చేపట్టింది. ఇంటింటి సర్వే మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎనిమిది సబ్‌సెంటర్లు ఉన్నాయి. 29 పంచాయతీల పరిధిలో సుమారుగా 48 వేల జనాభా ఉంది. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి సర్వే చేపట్టారు. ఈ సర్వేను సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పర్యవేక్షించారు. మండల వ్యాప్తంగా 52 మంది అనుమానితులను గుర్తించి ఉన్నతాధికారులకు వివరాలు అందజేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అనుమానితులను డిప్యూటీ పారామెడికల్ అధికారి (డీపీఎంఓ), మండల వైద్యాధికారి కలిసి పరీక్షిస్తారు. వీరి పరీక్షల్లో కుష్టువ్యాధిని నిర్ధారిస్తే వారికి చికిత్సను అందిస్తారు. లక్షణాలు ● వెంట్రుకలు, గోర్లు మినహాయిస్తే శరీరంలో ఎక్కడైనా మచ్చలు ఏర్పడతాయి. ● మచ్చలు మొద్దుబారుతాయి. ● మచ్చలు ఉన్న చోట వెంట్రుకలు ఊడిపోవడం, చమట పట్టదు. ● కనుబొమ్మల్లో వెంట్రుకలు తక్కువగా ఉంటాయి. ● నరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. ● శరీరం జిడ్డుగా మారుతుంది. ● పాదాలకు గాయాలైతే త్వరగా తగ్గకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే మందులతో తగ్గించవచ్చు. వ్యాధి లక్షణాలు బయటపడేందుకు ఏడేళ్ల సమయం పడుతుంది. వ్యాధిగ్రస్తులను పాసీ బాచిలరీ, మల్టీ బాచిలరీ రకాలుగా చికిత్సను అందిస్తారు. పాసీ బాచీలరీలో ఒక్క మచ్చ, ఒక్క నరం గుర్తిస్తే ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు చికిత్సను అందిస్తారు. మల్టీ బాచిలరీలో రెండు కంటే ఎక్కువ మచ్చలు, నరాలను గుర్తిస్తే ఏడాది నుంచి 18 నెలల వరకు చికిత్స అవసరం ఉంటుంది. చికిత్సకు అవసరమైన మందులను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తోంది. మొదట్లో గుర్తిస్తే చికిత్స సులువు ప్రస్తుతం మండల పరిధిలో ఎవరికీ చికిత్స అందించడం లేదు. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులతో నిర్మూలించవచ్చు. ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. శాశ్వ త వైకల్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. – డాక్టర్ నిఖిత, మండల వైద్యాధికారి, కేశంపేట52 మంది అనుమానితుల గుర్తింపు 2027 వరకు కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యం -
సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఽసిలిండర్ ధరను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర పెంచి పేదలపై ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్ మాట్లాడుతూ.. తమది పేదల ప్రభుత్వం అని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెబుతున్న కేంద్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు విశ్వం, కొంకళ్ల చెన్నయ్య, బస్వం, అందె మోహన్, దిలీప్, సత్తయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆదివాసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు నాయక్ -
‘ఎర్లీ’గా కట్టేయండి..
షాద్‌నగర్: కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూలుపై మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముందస్తుగా ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా రాయితీని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పన్నుదారులకు ఊరట అస్తి పన్ను క్రమం తప్పకుండా చెల్లించే వారికి ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ఊరట కల్పిస్తోంది. ఈనెల 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆస్తి పన్ను మదింపు డిమాండ్ ఇంటి నంబర్ల వారీగా మున్సిపల్ వెబ్సైట్లో వచ్చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి అంటే మార్చి 2026 వరకు పన్ను మొత్తం చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బకాయిలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు బలవంతం చేసే అవకాశం ఉండదు. ఈనెల 30 వరకే అవకాశం పన్ను రాయితీ ఐదు శాతం కేవలం రాబోయే సంవత్సరానికి ముందుగా చెల్లించిన దానికి మాత్రమే వర్తిస్తుంది. ఈనెల 30వ తేదీలోపు చెల్లించే వారికే ఈ అవకాశం ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఎర్లీ బర్డ్ పథకం కింద పన్నులు స్వీకరిస్తున్నారు. ఐదుశాతం రాయితీని సద్వినియోగం చేసుకొని ముందస్తుగా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించే వారిని అధికారులు సత్కరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వీరే అర్హులు 2024– 25 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన వారు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ పథకానికి అర్హులు. రాయితీ పొందాలనుకునే వారు గతేడాది తమ ఆస్తి పన్నును పూర్తిగా చెల్లించి ఈ ఏడాదికి సంబంధించి ముందస్తుగా చెల్లించినా రాయితీ ఇవ్వనున్నారు. నిధుల సమీకరణ కోసం మున్సిపాలిటీలకు సాధారణ నిధి కింద వచ్చే నల్లా పన్నులతో పాటు దుకాణాల అద్దె, వర్తక పన్ను, వాణిజ్య ప్రకటనలపై వచ్చే ఆదాయంతో పోలిస్తే ఆస్తి పన్ను ఎంతో కీలకం. మున్సిపాలిటీల నిర్వహణ ఖర్చుకు అవసరమైన సాధారణ నిధి సమీకరణ కోసం ఈ పథకానికి మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ పథకంపై విసృతంగా ప్రచారం కల్పించి ముందస్తుగా ఆస్తి పన్ను రాబట్టే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 30లోపు ఆస్తిపన్ను చెల్లించండి ఐదు శాతం రాయితీ అందుకోండి మున్సిపాలిటీల్లో ‘ఎర్లీ బర్డ్’ పథకం ముందస్తు పన్ను చెల్లింపుదారులకు సదావకాశం సత్కరిస్తూ.. ప్రోత్సహిస్తున్న అధికారులు సద్వినియోగం చేసుకోవాలి ముందస్తు పన్నులు చెల్లించే వారికి ప్రభుత్వం అందిస్తున్న ఐదు శాతం రిబే టును ఇళ్లు, దుకాణాల యజమానులు సద్విని యోగం చేసుకోవాలి. గడువు దాటితే వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. రాయితీని అందరు సద్వినియోగం చేసుకొని పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి – సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్‌నగర్ -
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగతున్నాయి. రెండో రోజు మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గరుత్మంతుడికి, ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి తిరుమల కిరణాచారి, పరావస్తు రమాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గరుత్మంతుడి పటాన్ని పల్లకిలో ప్రతిష్ఠించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభానికి ఆవిష్కరించారు. నవకలశ స్నాపకం, గరుత్మంతుని ప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. గరుడ పటానికి నాలు గు దిక్కుల గరుత్మంతుని రూపాలు ప్రతిష్ఠించి నైవేద్యాన్ని సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీ నర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, మురళీ, కిట్టు, కృష్ణమూర్తి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తగ్గిన భక్తుల తాకిడి.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమానికి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి నైవేద్యం సమర్పించి సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదాన్ని అందజేసేవారు. గతేడాది లక్షలాది మంది మహిళలు గరుడ ప్రసాదంకోసం రావడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. తోపులాటలు, ట్రాఫిక్ జాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతేడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని ఆలయ అర్చకుడు రంగరాజన్ ముందుగానే ప్రకటించారు. దీంతో ఈసారి భక్తులు తాకిడి భారీగా తగ్గింది. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి గోప వాహన, హనుమంత వాహన సేవలు అందించనున్నారు. గోప వాహనం, హనుమంత వాహనంపై స్వామివారిని ఆసీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు కొనసాగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు -
● ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటాఆక్వజేషన్’తో అనుసంధానం ● విద్యుత్ సరఫరా నిలిచిన వెంటనే సమాచారం ● ఉన్నతాధికారులను అలర్ట్ చేసే అవకాశం ● కూర్చున్న చోటే క్షేత్రస్థాయి పనులనుపరిశీలించే చాన్స్ ● అందుబాటులోకి తెచ్చిన డిస్కం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సబ్స్టేషన్లలో తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలు సహా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ఈదురుగాలితో కూడిన వర్షానికి ఫీడర్ ట్రిప్ అవుతుండటం, షార్ట్‌సర్క్యూట్ కారణంగా అండర్ గ్రౌండ్(యూజీ) కేబుల్స్, ఎయిర్ బంచడ్ (ఏబీ) కేబుల్స్ జాయింట్ల వద్ద తలెత్తే సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరాపై సీఎండీ మొదలు క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అలర్ట్ చేసే ‘ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం’ (ఎఫ్ఓఎంఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్వజేషన్’ (స్కాడా)కు అనుసంధానం చేసింది. దీంతో ఏ సబ్‌స్టేషన్‌లోని ఫీడర్.. ఏ సమయంలో ట్రిప్ అయింది.. ఏ ప్రాంతానికి.. ఎంత సమయం కరెంట్ సరఫరా నిలిచిపోయింది.. సరఫరాను ఎన్ని గంటల్లో పునరుద్ధరించారు.. వంటి సమగ్ర సమాచారం ఉన్నతాధికారులకు చేరవేస్తోంది. ఫలితంగా కరెంట్ కోతలు, సరఫరా పునరుద్ధరణలో చోటు చేసుకుంటున్న జాప్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం ఉండదు. ఆరా తీయాల్సిన అవసరం లేకుండా.. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పెద్ద సంఖ్యలో ఫీడర్లు ట్రిప్పవుతుంటాయి. ఒకేసారి అనేకప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ సమయంలో ఎవరైనా వినియోగదారులు ఫ్యూజ్ ఆఫ్ కాల్‌సెంటర్ (ఎఫ్ఓసీ) సహా 1912/ లేదా క్షేత్రస్థాయి జేఎల్ఎం, ఏఈలకు సమాచారం ఇస్తే కానీ సంబంధిత అధికారులకు విషయం తెలిసేది కాదు. సాంకేతిక సమస్య గుర్తింపు క్షేత్రస్థాయి సిబ్బందికి పెద్ద సమస్యగా మారేది. అర్థరాత్రి జోరున కురిసే వర్షం లోనూ లైన్ టు లైన్ తిరగాల్సి వచ్చేది. సమస్యను గుర్తించి, సరఫరాను పునరుద్ధరించేందుకు రెండు మూడు గంటల సమయం పట్టేది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యా దులు వచ్చేవి. ఈ సమయంలో సీఎండీ సహా ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఫోన్ చేసి ఆరా తీస్తే.. సరైన కారణం చెప్పే వారు కాదు. కొంత మందైతే ఏకంగా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించే వారు. ఇది వారికి తలనొప్పి గా మారేది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టంతో తలెత్తిన సాంకేతిక సమస్యతో పాటు సరఫరా పునరుద్ధరణ వెంటనే తెలిసిపోతుంది. కేంద్ర కార్యాలయాల్లో కూర్చొనే క్షేత్రస్థాయి సిబ్బంది పని తీరును మానిటరింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో కీలకం గ్రేటర్లో 11 కేవీ ఫీడర్లు 3,421 వరకు ఉన్నాయి. వీటిలో 1,353 ఫీడర్లను ఇప్పటికే ఈ ఎఫ్ఓఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే తెలుసుకునే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం భారీ ఈదురుగాలితో కూడిన వర్షానికి గ్రేటర్లో 449 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈ ఎఫ్ఓఎంఎస్ సహకారంతో 410 ఫీడర్ల పరిధిలో అర గంటలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సోమవారం హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో హిందీనగర్, ఆలియాబాద్, బ్యాంక్‌కాలనీ సహా హబ్సీగూడ సర్కిల్ పరిధిలో బోడుప్పల్, సూర్యహిల్స్కాలనీ ఫీడర్ల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని ప్రాగాటూల్స్, రైతుబజార్, మేడిబావి, ఆర్పీనిలయం, ఈఎంఈ ఫీడర్ల పరిధిలోనూ సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లోని గృహాలు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎఫ్ఓఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను పునరుద్ధరించడంతో పాటు తలెత్తిన సాంకేతిక సమస్యలను గుర్తించి, వ్యవస్థను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. -
‘మెగా వెంచర్’
మహిళా ఆరోగ్యంతోనే.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాల్లో సంతోషం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ వినితాదేవి అన్నారు.వడివడిగా 8లోu● ఫార్మాసిటీ లబ్ధిదారులకు పరిహారం ప్లాట్లు ● చివరి దశకు చేరిన నిర్మాణ పనులు ● త్వరలో పంపిణీ చేస్తామని చెబుతున్న అధికారులు కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ(గతంలో ఫార్మాసిటీ) నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారంతో పాటు అదనంగా కేటాయించనున్న ప్లాట్లకు సంబంధించి చేపట్టిన మెగా వెంచర్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేయడమే మిగిలింది. ఎకరాకు 121 గజాలు అప్పటి ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో 19,333 ఎకరాలు సేకరించడానికి నిర్ణయించింది. కందుకూరు, యాచారం మండలాల్లో 14 వేల ఎకరాల వరకు సేకరించింది. అందులో కోర్టు కేసులు, ఇతర సమస్యలు పోను ఎలాంటి వివాదాలు లేని భూములు సుమారు 12 వేల ఎకరాల వరకు ఉంటాయి. అప్పట్లో ఆయా భూములకు పరిహారం చెల్లించడంతో పాటు అదనంగా ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాటు ఇవ్వడానికి నిశ్చయించి సర్టిఫికెట్లు సైతం జారీ చేశారు. కందుకూరు మండలం పంజుగూడ రెవెన్యూలో సేకరించిన భూమికి రైతులకు ఇవ్వాల్సిన 155 ప్లాట్లకు గాను 128 ప్లాట్లకు, మీర్ఖాన్పేట రెవెన్యూలో 702 ప్లాట్లకు గాను 513 ప్లాట్లకు, ముచ్చర్ల రెవెన్యూలో 725 ప్లాట్లకు గాను 597 ప్లాట్లకు సంబంధించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. యాచారం మండలం కుర్మిద్ధ రెవెన్యూలో 1,236 ప్లాట్లకు గాను 514 ప్లాట్లకు, నానక్‌నగర్ రెవెన్యూలో 359 ప్లాట్లకు గాను 158 ప్లాట్లకు, తాడిపర్తి రెవెన్యూలో 543 ప్లాట్లకు గాను 278 ప్లాట్లకు, మేడిపల్లి రెవెన్యూలో 1,600 ప్లాట్లకు గాను 1,182 ప్లాట్లకు సంబంధించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. లబ్ధిదారులకు కేటాయించడానికి మీర్ఖాన్పేట రెవెన్యూలో బేగరికంచె పంచాయతీ సమీపంలో 622 ఎకరాల విస్తీర్ణంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో మెగా వెంచర్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రోడ్లపై తారు వేసే పనులు కొనసాగుతున్నాయి. ప్లాట్లుగా విభజించి హద్దు రాళ్లు సైతం పాతారు. వాటిపై ప్లాట్ల నంబర్లు రాయించారు. ఇక లబ్ధిదారులకు కేటాయించడమే తరువాయి. పాట్లు లేకుండా ప్లాట్లు కేటాయించేలా.. కాగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్లాట్లను కేటాయించడానికి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించి ఎన్ని ప్లాట్లు ఉంటే అన్నీ ఒకే దగ్గర ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి నెల రోజుల క్రితం ఆయా గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల వివరాలను అందుబాటులో ఉంచారు. లబ్ధిదారుల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు సేకరించారు. వాటి ఆధారంగా వారికి ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ‘ఫార్మా’ భూములకు ముమ్మరంగా ఫెన్సింగ్ యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నక్కర్తమేడిపల్లి నుంచి ప్రారంభమైన సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నక్కర్తమేడిపల్లి, పల్లెచల్కతండా, నానక్‌నగర్ గ్రామం నుంచి తాడిపర్తి గ్రామ శివారు వరకు సర్వే పూర్తయింది. ఇప్పటి వరకు 19 కిలోమీటర్ల సర్వే, 9 కిలోమీటర్ల బౌండరీ, 4 కిలోమీటర్ల ఫెన్సింగ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. రాచకొండ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. కాగా, నక్కర్తమేడిపల్లి–నానక్‌నగర్ గ్రామాల మధ్య కొనసాగుతున్న ఫార్మాసిటీ భూముల సర్వేను మంగళవారం టీజీఐఐసీ ఈడీ పవన్‌కుమార్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్‌కుమార్ తదితరులు పరిశీలించారు. సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనుల్లో భాగాస్వామ్యమైన సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు.త్వరలో రిజిస్ట్రేషన్లు రైతులకు కేటాయించిన ప్లాట్లకు సంబంధించి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు పొందిన రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయడానికి చూస్తున్నాం. ఒక కుటుంబానికి ఒకే దగ్గర ప్లాట్లను కేటాయించేలా పరిశీలిస్తున్నాం. వారి నుంచి అభిప్రాయాలు సేకరించి ప్లాట్ల పంపిణీ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తాం. – జగదీశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ, కందుకూరు -
అహ్మదాబాద్ పర్యటనకు ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పర్యటన కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరారు. అహ్మదాబాద్‌లోని సుందరీకరణ పనులను పరిశీలించడానికి రాష్ట్రం నుంచి ఎకై ్సజ్, పర్యాటక శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుల్ల రాజేశ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్‌రెడ్డి తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు లేదా ఆహారభద్రత కార్డు ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. అన్ని మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మండల, మున్సిపాలిటీ కార్యా లయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. పీడీ డీఆర్డీఏ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నోడల్ అధికారులుగా ఉన్నారని, బ్యాంకు మేనేజర్లు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని, ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తుర్కయంజాల్‌లో ఒడిశా బృందం తుర్కయంజాల్: ఒడిశా రాష్ట్రంలోని రైడ జిల్లా నుంచి 15 రైతు సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల బృందం సహకార పర్యటనలో భాగంగా మంగళవారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వారు సంఘం పనితీరును పరిశీలించి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యను అభినందించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు సామ సంజీవ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు ఇబ్రహీంపట్నం: గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ కుల వివక్ష, అంటరానితనం ప్రత్యక్షంగా, పరోక్షంగా కొనసాగుతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో మంగళవారం కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ పలు గ్రామాల్లో దళితులకు ఆలయ ప్రవేశాలు లేవని.. బతుకమ్మ ఆడనీయడంలేదని.. క్షవరం చేయడంలేదని.. దసరా పర్వదినాన జమ్మి ఆకులు తెంపారని దాడులు చేస్తున్నారని.. హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి.. పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వండితే విద్యార్థులు భుజించకపోవడం.. పట్టణాల్లో అద్దెకు ఇళ్లు ఇవ్వకపోవడం తదితర వివక్షత కొనసాగుతోందన్నారు. దీనిపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సామెల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో, నాయకులు చెన్నయ్య, ఆనంద్, వెంకటేశ్, బుచ్చయ్య, భాస్కర్, వీరే ష్, జంగయ్య, అశోక్, నరసింహ, ఆశీర్వాదం, యాదగిరి, శ్రీనివాస్, సాయిలు పాల్గొన్నారు. -
ఆరోగ్యమే.. మహాభాగ్యం
షాద్‌నగర్: ఆరోగ్యమే మాహా భాగ్యమని.. ఆరోగ్య సంరక్షణపై ప్రతీ ఒక్కరు దృష్టి సారించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి నుంచి ఫరూఖ్‌నగర్ పురవీధుల్లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈర సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. సమయానికి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నిత్యం శరీరానికి అవరసమరైన నీటిని సేవించాలన్నారు. వ్యాయామాన్ని నిత్యం అలవాటు చేసుకోవాలని.. ఒత్తిడికి, దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. భోజనంలో మసాలాలు, కారం, పులుపు, వేపుడు పదార్థాలు తగ్గించాలన్నారు. మొలకెత్తిన గింజలు తరుచుగా తీసుకోవాలని, వేడి పదార్థాలను భుజించాలన్నారు. అనారోగ్యానికి గురైన వారు వెంటనే సమీపంలో ఉండే వైద్యులను సంప్రదించి చికిత్సలు చేయించుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ముస్తకిన్ అహ్మద్, జగదీశ్, సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్ వైజర్లు రమ, అమృత, రవికుమార్, లింగం, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి -
యథేచ్ఛగా మట్టి తరలింపు
కొత్తూరు: ఇటుక వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. వీరి చర్యల వల్ల చెరువులు, కుంటలు, వాగులు ఉనికిని కోల్పోయే దుస్థితి నెలకొంది. గతంలో కొన్ని చోట్ల మిషన్ కాకతీయ ముసుగులో చెరువుల్లో నుంచి మట్టిని ఇటుక బట్టీలకు తరలించారు. మరికొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లతో రాత్రి వేళ అక్రమంగా మట్టిని ఎత్తుకెళ్తున్నారు. వీరి ఆగడాలను ప్రశ్నించే నాయకులకు కొంత మొత్తంలో ముట్టజెప్పుతున్నారు. అడ్డుకునే వారిపై దాడులకు సైతం వెనకాడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెరువుల్లో తవ్వకాలపై సమాచారం వచ్చినప్పటికీ స్పందించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖ అధికారులు సకాలంలో స్పందించకపోవడం ఇటుక వ్యాపారులకు కలిసివస్తోందనే చర్చలున్నాయి. తమ దృష్టికి వచ్చిన ఘటనల్లో కొన్ని తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేసినప్పటికీ చెరువుల్లో నుంచి మాత్రం అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. ఉనికిని కోల్పోతున్న చెరువులు, కుంటలు... కొత్తూరు మున్సిపాలిటీతో పాటు మండలంలో రికార్డుల మేరకు 42 చెరువులు, కుంటలు ఉన్నాయి. వర్షాకాలంలో చెరువులు నిండితే సమీపంలోని వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది. తద్వార రైతులు వరితో పాటు అయా రకాల పంటలను సాగు చేస్తున్నారు. కాగా కొందరు అక్రమార్కులు అనుమతులు పొందకుండానే యంత్రాలతో చెరువుల్లో నుండి మట్టి, మొరంను తవ్వి విక్రయిస్తున్నారు. యంత్రాలతో తవ్వడం వలన చెరువుల్లో గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో వర్షాకాలంలో చెరువులోకి నీరు చేరిన కొద్ది రోజుల్లోనే ఇంకిపోతున్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు ● సిద్ధాపూర్ శివారులోని చెరువులో గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని వందలాది టిప్పర్ల మట్టిని తవ్వి మహేశ్వరం మండలంలో వేస్తున్న రోడ్డుకు తరలించారు. ● పెంజర్ల శివారులో ఉన్న మామిడోని చెరువులో గతేడాది అర్ధరాత్రి పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లతో ఇటుక వ్యాపారులు మట్టిని తరలించారు. విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు మట్టి తరలింపును అడ్డుకున్నారు. అప్పటికే వందల ట్రిప్పుల మట్టి బట్టీల వద్దకు తరలిపోయింది. ● గూడూరు శివారులోని నందులకత్వ వాగులో ఇటుక, మట్టి వ్యాపారులు అదను చూసి రాత్రి వేళల్లో మట్టి, మొరం తవ్వుతున్నారు. వాగులో తవ్వకాల కారణంగా వర్షాకాలంలో నీరు పంటపొలాల్లో ప్రవహిస్తోంది. ● మున్సిపాలిటీ పరిధిలోని సాయిరెడ్డి చెరువులో నాలుగేళ్ల క్రితం రియల్ వ్యాపారులు యంత్రాలతో పెద్ద ఎత్తున మొరం తరలించారు. అధికారుల సమన్వయలోపం చెరువులు, కుంటల్లో నుంచి మట్టిని తరలిస్తున్న సమయంలోనే రెవెన్యూ, ఇరిగేషనన్ శాఖల అధికారులకు స్థానికుల నుంచి సమాచారం అందుతుంది. కాగా వారు మట్టి తరలించడం రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని.. రెవెన్యూ శాఖ అధికారులు చెరువు కాబట్టి ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని సమస్యను ఒకరిపై మరొకరు నెట్టుకోవడం పరపాటిగా మారింది. రెండు శాఖలకు చెందిన అధికారుల సమన్వయ లోపం కారణంగానేఇటుక వ్యాపారులు ఇప్పటికీ రాత్రి వేళ చెరువుల్లోంచి మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉనికి కోల్పోతున్న చెరువులు అక్రమ దందాకు తెరలేపిన ఇటుక వ్యాపారులు పట్టించుకోని అధికారులు కేసులు నమోదు చేశాం అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు, పాటుకాల్వలు, చెరువుల్లో నుంచి మట్టిని తవ్వడం, తరలించడం నేరం. ఇప్పటికే అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న పలువురికి జరిమానాలు విధించగా మరికొందరిపై కేసులు నమోదు చేశాం. ఇక మీదట చెరువులు, కుంటల్లో అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం. – రవీందర్‌రెడ్డి, తహసీల్దార్, కొత్తూరు -
వ్యక్తి బలవన్మరణం
షాద్‌నగర్: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన పురుగుల రమేశ్(40) ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికారు. బైపాస్ రోడ్డులోని బుచ్చిగూడ అండర్‌పాస్ సమీపంలో ఉన్న సర్వీస్ రోడ్డులో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నట్లు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు రూ.92వేల నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం రాంగోపాల్‌పేట్: వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ సౌత్‌జోన్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. ఢిల్లీకి చెందిన అడెం బెట్టింగ్ కోసం రాణీగంజ్‌కు చెందిన సందీప్ కుమార్ గోదెల (30), గోషామహాల్‌కు చెందిన సదానంద్ అభిషేక్ (31), మంగళ్‌హాట్‌కు చెందిన పద్మావార్ యశ్వంత్ గుప్తా(32), అదే ప్రాంతానికి చెందిన గంగారాం వినయ్ (32)లను బెట్టింగ్ కోసం నియమించుకున్నాడు. పాన్‌బజార్‌లోని ఓ ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని ఆన్లైన్లో ఐపీఎల్ ఖేలో డాట్ కామ్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో సందీప్ సబ్ బుకీ కాగా సదానంద్ అభిషేక్, పద్మావర్ యశ్వంత్‌లు ఫంటర్లు, గంగారాం వినయ్ సింగ్ కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్–గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు మహేష్, నర్సింహులు, ఆంజనేయులు, నవీన్, మహంకాళి ఎస్సై వెంకటేశ్వర్లు సంయుక్తంగా కలిసి దాడులుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ 92,120తో పాటు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసికున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసిఫ్‌నగర్‌లో లిఫ్ట్ ప్రమాదం విజయనగర్‌కాలనీ: లిఫ్ట్ కుప్పకూలడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ నసీరుద్దీన్(40) వాహనాల పెయింటర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతని భార్య సికినాబేగం (35), మరదలు మైమునాభేగం(34)లు ఈ నెల 6న ఆసిఫ్‌నగర్ ప్రియా కాలనీలోని నాకో శ్యామ్ రెసిడెన్షీ అపార్ట్‌మెంట్‌కు రాత్రి 11.20 గంటలకు వచ్చారు. 5వ అంతస్తులో ఉన్న బంధువుల ఇంటికి లిఫ్ట్‌లో వెళ్తుండగా 4వ అంతస్తు వద్దకు చేరుకోగానే లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతోవారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం అత్తాపూర్‌లోని జర్మన్టైన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఫ్యూచర్ సిటీలో విలీనం చేయండి
మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం నుంచి కలెక్టరేట్ వరకు ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలం నుంచి కేవలం తుమ్మలూరు, మెహబ్బత్నగర్ను విలీనం చేసి మిగిలిన 28 పంచాయతీలను వదిలేశారన్నారు. గతంలో ప్రజా ప్రయోజనాల కోసం మహేశ్వరం మండల రైతులు సుమారు 20 వేల ఎకరాల భూమి కోల్పోయారన్నారు. ఫ్యూచర్ సిటీలో మండలాన్ని విలీనం చేస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఇప్పటికై నా మండలంలోని మిగిలిన 28 పంచాయతీలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ మేరకు మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు బైక్ ర్యాలీగా వచ్చి ప్రజావాణిలో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. త్వరలో సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విలీనం చేయాలని కోరుతామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుఫతి, ప్రధాన కార్యదర్శి యాదగిరిగౌడ్, గౌరవ అధ్యక్షుడు మనోహర్, జేఏసీ నాయకులు జంగయ్య, చంద్రయ్య, నర్సింహ, ఈశ్వర్, మోహన్‌రెడ్డి, యాదయ్య గౌడ్, దత్తు నాయక్, యాదీష్, సుదర్శన్ యాదవ్, రాజు నాయక్, పాండు నాయక్, నర్సింహ యాదవ్, రమేష్, సీతారామ్ నాయక్, విఠల్ నాయక్, లాజర్, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు జేఏసీ నాయకుల బైక్‌ర్యాలీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేత -
వారం రోజుల్లో ‘డబుల్’ ఇళ్లు
మంచాల: లబ్ధిదారులకు వారం రోజుల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేస్తామని ఇబ్రహీపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పంపిణీకి ముందే నివాస యోగ్యానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఉప్పరిగూడ పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, హౌసింగ్ ఏఈ రాంచంద్రయ్య, నాయకులు కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, ఎడ్మా నరేందర్‌రెడ్డి, జెనిగె వెంకటేశ్, మల్లేష్, మూర్తి, ఐలయ్య, కరుణాకర్‌రెడ్డి, భరత్‌రెడ్డి, రవి, రాజేశ్, ఆర్ఐ రమేశ్ పాల్గొన్నారు. ఇబ్రహీపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి -
కాంట్రాక్టు కార్మికుడి మృతి
యాచారం: ఓ కాంట్రాక్టు కార్మికుడు తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని గునుగల్ క్రీడాక్షేత్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. గునుగల్ గ్రామానికి మహ్మద్ జహంగీర్ కొన్నేళ్లుగా స్థానిక క్రీడాక్షేత్రంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులు నిర్వహిస్తుండగా సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కూప్పకూలిపోయాడు, గమనించిన కూలీలు వెంటనే యాచారం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు పి.బ్రహ్మయ్య, చందునాయక్ తదితరులు క్రీడా క్షేత్రం వద్దకు వెళ్లి మృతుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందజేయాలని.. కుటుంబంలో ఒకరికి క్రీడా క్షేత్రంలో పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ మేరకు వారు క్రీడాక్షేత్రం అధికారి శ్రీకాంత్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు ● పుట్ట మన్ను తెచ్చి హోమగుండాల ఏర్పాటు ● విశ్వక్సేనుడి ఆరాధనతో ఉత్సవాలు ప్రారంభించిన అర్చకులు మొయినాబాద్: కలియుగదైవం.. చిలుకూరు బాలా జీ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు.. వేద మంత్రోచ్ఛరణతో దేవాలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పుట్ట బంగారం (పుట్టమన్ను) తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు. అందులో నవధాన్యాలు, పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. తరువాత విశ్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. పూజా కార్యక్రమాలు తిరుమల కిరణాచారి, రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి, కృష్ణమూర్తి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు ధ్వజారోహణం, శేషవాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి గరుడ పఠాన్ని ఆరోహణం చేస్తారు. ఈసారి గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని.. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పష్టం చేశారు. -
బండ భారం రూ.4.50 కోట్లు
నేటి నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు● జిల్లాలో తొమ్మిది లక్షలపైనే గ్యాస్ కనెక్షన్లు ● రోజుకు సగటున 30 వేల బుకింగ్స్ నమోదు ● పేద, మధ్య తరగతి కుటుంబాలనెత్తిన పిడుగుసాక్షి, రంగారెడ్డిజిల్లా: వంటగ్యాస్ ధర మరోసారి భగ్గుమంది. కేంద్రం ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.50 చొప్పున పెంచి షాక్ ఇచ్చింది. ఇప్పటికే బియ్యం, పప్పు, నూనెల వంటి నిత్యావసరాలతో పాటు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు తాజా ధరలు భారంగా మారనున్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.855 ఉండగా, తాజా పెంపుతో రూ.905కు చేరింది. దీంతో జిల్లా వాసులపై నెలకు సగటున రూ.4.50 కోట్ల భారం పడనుంది. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీలు సహా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. రోజుకు అదనంగా రూ.15 లక్షలు జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇండియన్, భారత్, హెచ్‌పీ సహా ఇతర ఆయిల్ కంపెనీల్లో రోజుకు సగటున 30 వేల బుకింగ్స్ నమోదవుతుంటాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపుతో రోజుకు సగటున జిల్లావాసులపై రూ.15 లక్షలు అదనపు భారం కానుంది. ఈ లెక్కన నెలకు రూ.4.50 కోట్ల భారం పడినట్టే. తాజాగా మళ్లీ ధర పెంచడంతో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెంచినప్పటికీ.. భారాన్ని ఆయిల్ కంపెనీలే భరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో వాహనదారులకు ఊరట కల్పించింది. ఐదేళ్లలో గ్యాస్ ధరల పెంపుసంవత్సరం సిలిండర్ ధర 2020 మే రూ.589 2021 అక్టోబర్ రూ.646 2021 మార్చి రూ.871 2022 మార్చి రూ.957 2022 మే రూ.1055 2022 జూన్ రూ.1062 2022 జూలై రూ.1,105 2023 మార్చి రూ.1,155 2023 ఆగస్టు రూ.955 2024 మార్చి రూ.855 2025 ఏప్రిల్ రూ.905 సామాన్యులపై పెనుభారం కేంద్ర ప్రభుత్వం వంటగ్యా స్ సిలిండర్ ధరలను పెంచి పెనుభారం మోపుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి సిలిండర్ల ధరలు పెంచుతూనే ఉంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. – వి.లక్ష్మి, గృహిణి, ఆమనగల్లు వెంటనే తగ్గించాలి వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే మోయలేనంతగా ఉంది. ప్రభుత్వం మరింత ధర పెంచటం సరికాదు. కూలి పనులు చేసుకునే పే దలకు వంటగ్యాస్ ధరలు భరించలేని విధంగా మా రుతున్నాయి.పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి. – సుధ, గృహిణి, అజీజ్‌నగర్, మొయినాబాద్ మండలం -
యువతలో నైపుణ్యాన్ని వెలికితీయాలి
రాయదుర్గం: తెలంగాణలోని యువతలో నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులకు చిరునామాగా రాష్ట్రాన్ని మార్చాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ యువతకు కొదవ లేదని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా తయారవుతారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యా, పరిశోధన, టాస్క్, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఐటీ శాఖా ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, డిప్యూటీ సెక్రెటరీ భవేష్‌మిశ్రా, స్కిల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సుబ్బారావు, ఔస్‌డీ చమాన్ మెహతా తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఫార్మా భూముల సర్వే
యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే సోమవారం ప్రశాంతంగా జరిగింది. యాచారం–కడ్తాల్ మండలాల సరిహద్దులోని నక్కర్తమేడిపల్లి, పల్లెచల్కతండా, నానక్‌నగర్‌లో యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో 20 మందికి పైగా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులు ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్, పట్టా భూములను సర్వే చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పా టు చేశారు. నక్కర్తమేడిపల్లి– పల్లెచల్కతండా రోడ్డుపై రాకపోకలు సాగించే కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. ఏ గ్రామం..ఎక్కడికి వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. నక్కర్తమేడిపల్లి, పల్లెచల్కతండా, నానక్‌నగర్ గ్రామాల్లో ఆందోళనకారులపై నిఘా పెట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి యాచారం: బీఆర్ఎస్ సర్కార్ నాడు ఫార్మాసిటీ పేరుతో భూసేకరణ చేస్తే అధికారంలోకి వస్తే తిరిగి భూములు ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా నేడు రైతులను మోసం చేస్తోందని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు పేర్కొన్నారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నక్కర్తమేడిపల్లిలో నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, కోర్టు ఉత్తర్వులను అధికారులైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూముల్లో సర్వే, ఫెన్సింగ్ పనులు వెంటనే ఆపాలని కోరారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు కవులు సరస్వతి, నారాయణ, గణేశ్, రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సామ నిరంజన్, భగవంత్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారంతోనే అభివృద్ధి సాధ్యం షాద్‌నగర్: బీసీలు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అన్నారు. పట్టణంలోని బీసీసేన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బాసవరలక్ష్మి స్వగృహంలో సోమవారం నియోజకవర్గ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో బీసీసేన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుధాకర్, ఫరూఖ్‌నగర్ మండల మహిళా అధ్యక్షురాలిగా జలజ, పట్టణ అధ్యక్షురాలిగా భాగ్యలక్ష్మిగౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బర్క కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన హక్కు లు, రిజర్వేషన్లను కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప వారి కష్టాలు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. అనంతరం నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శివ, నరేష్, భూషణ్, నరేష్, చందులాల్, వరకుమార్, వెంకటేశ్, రవి, మారుతి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి తాండూరు టౌన్: మున్సిపల్ అధికారులు ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై మున్సిపల్ పరిధిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరిగినా రుసుం చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో ఏళ్ల తరబడిగా మూతపడిన తైబజార్ వసూళ్లకు తిరిగి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే తైబజార్ బహిరంగ వేలం వేయడంతో ఓ కాంట్రాక్టర్ రూ.10,25,100కు వేలం దక్కించుకున్నారు. -
పిల్లలే పెద్దలై..
● ఘనంగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ షురూ ● ఆలోచింపజేసిన చిన్నారుల నాటక ప్రదర్శనలుగన్ఫౌండ్రి: రంగస్థల నాటక రంగాన్ని కాపాడుకునేందుకు చిన్నారులు నడుం బిగించారు. ఈ మేరకు మొట్టమొదటి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ సోమవారం రవీంద్రభారతిలో ప్రారంభించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి పిల్లలకు నాటక పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ వేడుకల్ని మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ రామ్ తెలిపారు. మొదటి రోజు జపాన్‌కు చెందిన రంగస్థల కళాకారులు ‘లూనర్’ అనే అంశంపై ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ‘మార్పు రావాలి’ అనే అంశంపై ప్రదర్శించిన నాటకం ఆహూతులను ఆలోచింపచేసింది. ది జంగిల్‌బుక్, అయ్యో పాపం, కుయ్యోముర్రో నాటకాలు కూడా అలరించాయి. ఈ సందర్భంగా జపాన్ థియేటర్ డైరెక్టర్ ఎరీనా సాజి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రంగస్థల నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నా రు. పాఠశాల స్థాయి నుంచే థియేటర్ ఆర్ట్స్‌ను ఒక పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ నగరంలో మొట్టమొదటి అంతర్జాతీయ బాలల ఉత్సవాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ ఫెస్టివల్ యువతలో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. కాగా రెండవ రోజు నుంచి నేపాల్, భూపాల్, కోల్కత్తా, కేరళ వంటి ప్రాంతాలకు చెందిన కళాకారులు హాజరై తమ ప్రదర్శనలను ఇవ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. -
గ్లోబల్ గ్రీన్ మార్కెట్ ‘కోహెడ’
దేశంలో రెండో అతిపెద్దపండ్ల విపణి ● 199.12 ఎకరాల్లో నిర్మాణం ● ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.2,900 కోట్లు ● 67 శాతం నిధులు నాబార్డ్ రుణం ద్వారానే.. ● విదేశీ ఆహార ఉత్పత్తుల కోసంప్రత్యేకంగా హాల్ ● డీపీఆర్‌ను రెడీ చేసిన తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా: దేశంలోనే విస్తీర్ణంలో రెండో అతిపెద్ద మార్కెట్ తెలంగాణలో నిర్మితమవుతోంది. ప్రస్తుతం 200 ఎకరాల్లో హర్యానాలోని ఐఐహెచ్ఎం గనౌర్ అంతర్జాతీయ ఉద్యానవన మార్కెట్ నిర్మాణంలో ఉంది. రూ.2 వేల కోట్ల వ్యయంతో పబ్లిక్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇంచుమించు ఇదే స్థాయిలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో 199.12 ఎకరాల విస్తీర్ణంలో ‘కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్’ను నిర్మిస్తున్నారు. మొత్తం రూ.2,900.43 కోట్ల అంచనా వ్యయంతో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం నిధులను వెచ్చిస్తుండగా..మిగిలిన 67 శాతం నాబార్డ్ నుంచి టర్మ్ లోన్ రూపంలో సమీకరించనుంది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ విభాగం కోహెడ హోల్‌సేల్ మార్కెట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను రూపొందించి న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డుకు అందజేసింది. ● ప్రతిపాదిత కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్లో పండ్లు, పూలు, పాలు, మాంసం, కోళ్ల వ్యాపారంతో పాటు సమద్ర ఉత్పత్తులను విక్రయిస్తారు. దీన్ని ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్రూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్), పీపీపీ రెండు విధానాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈపీసీ విధానానికి 167.85 ఎకరాలు, పీపీపీ విధానంలో 31.27 ఎకరాలను కేటాయించారు. ఈపీసీలో వేలం హాళ్లు, షెడ్లు, విదేశీ ఫ్లాగ్షిప్ పెవిలియన్, రిటైల్ జోన్లు, మినీ డేటా సెంటర్, కార్మికుల విశ్రాంతి గదులు, పాలీక్లినిక్, పోలీసు ఔట్‌పోస్టు, పార్కింగ్, ఎస్టీపీలు, రహదారులు వంటివి నిర్మిస్తారు. పీపీపీ విధానంలో పెట్రోల్ పంపులు, టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఛార్జింగ్ స్టేషన్, శీతల గిడ్డంగులు, షాపులు, ప్రాసెసింగ్ సెంటర్ల వంటివి ఉంటాయి. ఈపీసీ అభివృద్ధి పనులకు రూ.2,044 కోట్లు, పీపీపీ విధానంలో రూ.856.43 కోట్ల అభివృద్ధి పనుల వ్యయాన్ని అంచనా వేశారు. ● ఫ్రాన్స్‌లోని రుంగిస్ మార్కెట్, లండన్‌లోని న్యూ కోవెంట్ గార్డెన్ మార్కెట్, బర్మింగ్‌హామ్‌లోని బర్మింగ్‌హామ్ హోల్‌సేల్ మార్కెట్, ఆమ్స్టర్డ్యామ్లోని ఫుడ్ సెంటర్, అమెరికాలోని యూనియన్ స్క్వేర్ గ్రీన్ మార్కెట్, ఫెర్రీ ప్లాజా ఫార్మర్ బజార్, దుబాయ్‌లోని వాటర్ ఫ్రంట్ మార్కెట్, కువైట్‌లోని ఆల్ఫోర్డ్ మార్కెట్లను అధ్యయనం చేసిన వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు కోహెడ మార్కెట్‌ను డిజైన్ చేశారు. మొత్తం స్థలంలో 71.58 ఎకరాలను రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ సబ్ స్టేషన్ వంటి మౌలిక సదుపాయాల కోసమే కేటాయించారు. విదేశీ ఉత్పత్తుల కోసం ప్రత్యేకం.. 2047 నాటికి మార్కెట్ సామర్థ్యం సుమారు 13.6 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనా. కోహెడ మార్కెట్ యార్డ్‌లో 8 షెడ్లు ఉంటాయి. రెండు సోలార్ రూఫ్ టాప్‌లతో కూడిన మెజనైన్ హాళ్లు, మరో రెండు సోలార్ రూఫ్ టాప్ హాళ్లు ఉంటాయి. అంతర్జాతీయ వ్యాపారస్తులకు ప్రత్యేకంగా ఫ్లాగ్షిప్ పెవిలియన్ ఉంటుంది. ఇందులో విదేశీ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు చేసుకోవచ్చు. మార్కెట్లో దేనికి ఎంత ఖర్చంటే? (రూ.కోట్లలో) స్మార్ట్ మండి..కోహెడ మార్కెట్‌ను ఆధునిక స్మార్ట్ మండిగా అభివృద్ధి చేయనున్నారు. స్మార్ట్ వీధి దీపాలు, ఎలక్ట్రానిక్ సైన్‌బోర్డ్‌లు, ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, వీడియో మేనేజ్మెంట్, అనలిటిక్స్‌తో కూడిన నిఘా వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్, మినీ డేటా సెంటర్ ఉంటుంది. ఇక్కడ మౌలిక సేవలన్నీ సాంకేతికతతో అనుసంధానమై ఉంటాయి. రోజుకు 3 లక్షల లీటర్ల నీటి సరఫరా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కోహెడ మార్కెట్ వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించారు. 3.61 ఎకరాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల కోసంకేటాయించారు. మిషన్ భగీరథ నుంచి రోజుకు 3 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. రూ.5.2 కోట్ల వ్యయంతో ప్రత్యేక పైప్‌లైన్ వేయనున్నారు. మార్కెట్లో ప్రైవేట్ శీతల గిడ్డంగులు, రిటైల్ షాప్‌లతో పాటు ఆఫీసులు, అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, వాటర్ అండ్ వేపర్ హీట్ ట్రీట్మెంట్లు ప్లాంట్ల వంటివన్నీ ఉంటాయి. సిబ్బంది, కార్మికులకు గృహాలను సైతం నిర్మించనున్నారు. -
బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టు
రాజేంద్రనగర్: బెల్టు షాపుపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి మద్యంతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల సమాచారం మేరకు... బండ్లగూడ మల్లికార్జున్‌నగర్ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్ కిరణాషాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా షాపులోనే మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. ఆదివారం డ్రైడే కావడంతో మద్యాన్ని విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దుకాణంపై దాడి చేసి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బియ్యం పంపిణీ మన్సూరాబాద్: దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నా పేదల ఆకలిని తీర్చలేకపోవడం అత్యంత బాధాకరమని రైస్ ఎటీఎం నిర్వాహకుడు, సామాజిక కార్యకర్త దోసపాటి రాము ఆవేదన వ్యక్తం చేశారు. నాగోలు డివిజన్ పరిధి రాక్‌హిల్స్‌కాలనీలోని రైస్ ఎటీఎం వద్ద ఆదివారం ఆయన పేదలకు ఉచితంగా బియ్యం పంపీణీ చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు గుర్తించి కొత్త రేషన్ కార్డులు అందజేసి బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించి అర్హులైన పేదలను గుర్తించడంలో పాలకులు అశ్రద్ధ వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చేవెళ్ల: వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే గోవిందగారి పురుషోత్తంరెడ్డికి రెండేళ్ల కిత్రం హైదరాబాద్‌లోని కాళీమందిర్‌కు చెందిన తరుణి అలియాస్ యమున(30)తో వివాహ జరిగింది. కొన్నేళ్ల పాటు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అనుకోకుండా శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంత పిలిచినా బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
నారాయణ సంస్థాన్ సేవలు అభినందనీయం
సైదాబాద్: నిరుపేద దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థాన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మినర్వా ఫంక్షన్హాల్లో నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్ల కోసం ఎంపిక, దివ్యాంగులకు అందజేసే ఆర్టిఫిషియల్ ఉపకరణాల కోసం కొలతల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ.. పుట్టుకతో దివ్యాంగులు, అనారోగ్య కారణాలు, ప్రమాదాలతో దివ్యాంగులుగా మారిన వారిని ఈ శిబిరంలో చూస్తుంటే తన మనసు ఎంతగానో కలచివేసిందన్నారు. ఈ శిబిరంలో 1200 మంది దివ్యాంగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని, వారికి రెండు నెలల్లో నాణ్యతతో కూడిన మాడ్యులర్ కృత్రిమ అవయవాలను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ డైరెక్టర్ వందన అగర్వాల్, దేవేంద్ర చౌబీసా, ట్రస్టీ ప్రభాకర్, భగవాన్ ప్రసాద్‌గౌడ్, హరిప్రసాద్ పాల్గొన్నారు. -
వేసవి దుక్కులు.. రైతుకు లాభాలు
షాబాద్: తొలకరి ప్రారంభానికి ముందే రైతులు పొలం పనులకు సమాయత్తం కావాలి. అందుకు వేసవిని అనుకూలంగా మలుచుకోవాలి. ఎండాకాలం చేపట్టాల్సిన దుక్కుల పనులను షాబాద్ మండల వ్యవసాయ అధికారి వెంకటేశం వివరించారు. గతంలో ప్రతి రైతు ఎద్దులు, ఆవులు, గేదెలను రాత్రుళ్లు పొలంలో కట్టేసేవారు. వాటి మలమూత్రాలు పొలానికి చేరి పంటలకు ఉపయోగపడేవి. ఇందువల్ల ఎరువులు ఖర్చు తగ్గేది. ఇప్పుడు పశుపోషణ తగ్గిపోయింది. సేంద్రియ ఎరువు అందించడంతో ఉత్పత్తులను లాభాసాటిగా సాధించవచ్చు. ప్రస్తుతం తుంగ, గరిక వంటి మొండిజాతి కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటలకు నష్టం కలుగజేస్తుంటాయి. తెగుళ్లు రాకుండా.. ఇటీవల మండలంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్లతో లోతుగా దుక్కులు దున్నాలి. ఇవి సుమారుగా 9 అంగుళాలకు తగ్గకుండా ఉండాలి. అలా లోతు దుక్కులు వేసవిలో చేసినప్పుడు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. నెలలో ఉండే పురుగులు తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంది. అందువల్ల వేసవిలో పంట కోతలు పూర్తయిన వెంటనే పొలాలను ఎద్దులతో లాగే పరికరాలతో లోతు దుక్కి చేసుకుంటే తొలకరిలో ఉపయోగకరంగా ఉంటుంది. వేర్లు విస్తరించేందుకు అవకాశం వేసవిలో లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు గొర్రు తిప్పి సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనూకులంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటుక, దతెల వంటి పరికరాలు నెల లోపలికి 3–4 అంగుళాల లోతు వరకు చోచ్చుకుపోతాయి. ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయడంతో నేల లోపల సుమారుగా 3–5 అంగుళాల లోతులో ఒకగట్టి పొర ఏర్పడుతుంది. దీంతో నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. సేంద్రియ పదార్థం కలుస్తుంది పంటకోత తర్వాత నేలపై మిగిలే పంట మొదళ్లు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకుల వంటి లోతు దుక్కి దున్నినప్పుడు కుళ్లిపోతాయి. దీంతో సేంద్రియ పదార్థాలు పెరగడానికి అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా నిలువ చేసిన పశువుల ఎరువులను ఎండా కాలంలోనే పొలాల్లోకి తోలాలి. వర్షాలు పడిన తర్వాత నేలపై చల్లి లోతు దుక్కి దున్నితే మట్టిలో బాగా కలుస్తుంది. పొలంలో చీడపీడల నివారణకు ఉపయోగం లోతు దుక్కులతో పెరగనున్న భూసారం -
దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అవసరం
అత్తాపూర్: వేసవిలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పాదచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్లోని ఎన్ఎంగూడ చౌరస్తాలో బోయ రమేష్, టి.గురుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ... మండుతున్న ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. స్థానిక నేతలు సర్దార్ హర్మిందర్‌సింగ్, నాగరాజు, రవీందర్‌గౌడ్, రమాదేవి, యాదయ్య, ఫరూఖ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మణికొండ: వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని విరివిగా ఏర్పాటు చేయాలని భారత్ వికాస్ పరిషత్ మణికొండ శాఖ అధ్యక్షుడు, ఎంప్లాయీస్ కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.పెంటారెడ్డి అన్నారు. నవ సేవా సంకల్ప ట్రస్ట్ వారు భాగ్యలక్ష్మి కాలనీ దుర్గామాత దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నీటి దానంతో ఎంతో పుణ్యం వస్తుందన్నారు. మానవసేవే మాదవ సేవగా గుర్తించి తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. -
భూమి దక్కదనే కక్షతోనే..
సుపారీ ఇచ్చి హత్య చేయించిన దాయాదులు ● కారు ఢీకొట్టి మృతి చెందిన కేసును ఛేదించిన పోలీసులు ● వివరాలు వెల్లడించిన సీఐ వెంకటేశ్వర్లు మహేశ్వరం: భూమిపై అత్యాశే ప్రాణాలు తీసింది. ఐదెకరాల పొలం తమకు దక్కదనే కక్షతో దాయాదిని సుపారీ ఇచ్చి కారుతో ఢీకొట్టి హత్య చేయించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్య(60)కు తన దాయాదులైన గూడెపు నర్సింగ్‌రావు, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్‌లతో తండ్రుల కాలం నుంచి భూ తగాదాలున్నాయి. ప్రస్తుతం అవి కోర్టులో నలుగుతున్నాయి. ఇటీవల శంకరయ్యకు అనుకూలంగా ఐదు ఎకరాల భూమిపై ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. దీంతో వివాదాస్పదమైన భూమిలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఇది రుచించని దాయాదులు ఎలాగైన ఆయన్ని మట్టుబెట్టాలని పథక రచన చేశారు. ఇందుకు అదే గ్రామానికి చెందిన కొండని ప్రశాంత్‌ను ఎంపిక చేసుకున్నారు. తనకున్న రూ.12 లక్షల అప్పు తీర్చడంతో పాటు ఇల్లు నిర్మిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 2న మధ్యాహ్నం బైక్‌పై శంకరయ్య వెళుతుండగా ప్రశాంత్ కారులో వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్, కాల్‌డాటా ఇతర వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు. ముందుగానే పోలీసులు కారు డ్రైవర్ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వాస్తవాలు చెప్పాడు. ఈ మేరకు నిందితులు గూడెపు నర్సింగ్‌రావు, బక్కని కార్తీక్(నర్సింగ్ రావు బామ్మర్ది), గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. హత్య కేసును ఛేదించిన మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూదన్, క్రైమ్ కానిస్టేబుళ్లను డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి అభినందించారు. -
అప్పులు తీరక!
బిల్లులు రాక.. పెండింగ్ బిల్లులు చెల్లించాలి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సుమారు రూ.90 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లింపులో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలి. – తలసాని వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కేశంపేట వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పు గ్రామంలో రూ.42లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టా. అప్పు చేసి ఆ మొత్తం వెచ్చించా. తెచ్చిన అప్పునకు వడ్డీ కట్టేందుకు మళ్లీ కొత్తగా అప్పు తీసుకుంటున్నాను. ప్రభుత్వం ఇప్పటికై నా బిల్లులు చెల్లిస్తే వడ్డీ చెల్లింపు తప్పుతుంది. – తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్, పాపిరెడ్డిగూడ కేశంపేట: గ్రామాలను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో కొందరు.. వారసత్వ రాజకీయాలతో మరికొందరు.. రాజకీయాలపై వ్యామోహంతో ఇంకొందరు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. సర్పంచులుగా ఉత్సాహంతో పోటీ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ప్రజలకిచ్చిన మాట కోసం అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం సొంత నిధులు వెచ్చించారు. అవీ సరిపోక అప్పులు చేసి చేపట్టిన పనులు పూర్తి చేశారు. తీరా వాటికి సంబంధించిన బిల్లులు రాక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నారు. పదవీ కాలం ముగిసి ఏడాది దాటినా.. జిల్లాలోని 21 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రభుత్వం నుంచి స్టేట్ ఫైనాన్స్, 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. వీటితో పాటు మన ఊరు మన బడి పథకంలో భాగంగా చేపట్టిన పనులకు సైతం బిల్లులు రావాల్సి ఉంది. ఈలోగా 2 ఫిబ్రవరి 2024తో పదవీ కాలం కాస్తా ముగిసింది. అప్పటి వరకు సర్పంచులుగా ఉన్నవారిని తప్పించి గ్రామాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అప్పటి వరకు తమ పదవీ కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఇటు పదవీ కాలం ముగిసి అటు పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు చేసిన బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు. వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ఉందనగా టార్గెట్లు పెడుతూ అభివృద్ధి పనులు చేయించింది. గ్రామాల్లో పనులు చేస్తే తమను గ్రామస్తులు జీవితాంతం గుర్తుంచుకుంటారనే తపనతో అప్పట్లో సర్పంచులు అధిక వడ్డీలకు అప్పులు చేసి పనులు చేపట్టారు. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయాయి. ప్రభుత్వం మారిన కొద్ది నెలలకే సర్పంచుల పదవీ కాలం కూడా ముగిసింది. నిలిచిపోయిన బిల్లుల చెల్లింపులకు నేటికీ మోక్షం లభించడం లేదు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం.. కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కాకపోవడంతో కొత్త ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయడం లేదు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. మాజీ సర్పంచులు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. మాజీ సర్పంచ్ల అవస్థలు అభివృద్ధి పనులకు సొంత నిధులు అందినకాడికి అప్పులు తెచ్చి ఖర్చు అసలుకు మించి వడ్డీ చెల్లింపులు బిల్లుల కోసం ఎదురుచూపులువినతులు.. ఆందోళనలు పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు అనేకమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందించారు. అయినా బిల్లులు మంజూరు కాకపోవడంతో చలో అసెంబ్లీ, సచివాలయం ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేసి తమను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలని, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు. -
ఆ పార్టీలకు దోచుకోవడమే తెలుసు
బడంగ్పేట్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోచుకోవడం, దాచుకోవడానికే వచ్చాయని.. సేవ చేద్దామని కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బడంగ్‌పేట్‌లోని కాకతీయ స్కూల్ వద్ద చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేద్దామన్నారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా 11 ఏళ్లుగా మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారని, ఇంతకంటే ఈ దేశానికి నీతివంతమైన దేశ భక్తుడిని ఎవరు తేగలరని ప్రశ్నించారు. నేటి నుంచి అంబేడ్కర్ జయంతి వరకు ప్రతి కార్యకర్త ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజుభూపాల్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, పార్టీ అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి -
సంప్రదాయ విత్తనాన్ని సంరక్షించుకుందాం
కడ్తాల్: కల్తీ విత్తనాల నిర్మూలన.. రైతుకే విత్తన హక్కు అంశాలకు చట్ట రూపం ఇచ్చి అమలు పరిచినప్పుడే దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లిలో మూడు రోజులుగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్–భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ తొలి విత్తన పండుగ ఆదివారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరెడ్డి మాట్లాడుతూ.. సంప్రదాయ విత్తనాలను సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. విత్తన సంరక్షణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు, ధాన్యాల విత్తనాలను భద్రపరుచుకుని పంచుకునే విధానాన్ని పునరుజ్జీవంప జేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. మానవ సాంఘిక జీవనానికి విత్తనం మూలధారమన్నారు. గతంలో రైతులే మేలైన విత్తనాలను నిల్వ చేసి, ఇతరులకు పంచి వ్యవసాయం చేసేవారని, అలాంటి విత్తన మేథో సంపత్తి కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. విత్తనం మూలం ఇదం జగత్ అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని, ఆకుపచ్చ విప్లవం రావాలని అకాంక్షించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 20 అంశాలతో ఐదు భాషల్లో డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం పాలసీ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి రచించిన ‘ఆరోగ్యానికి.. ఆహార భద్రతకు విత్తనం’ పుస్తకాన్ని విష్కరించారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, ఫౌండర్ లక్ష్మారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముగిసిన విత్తన పండుగ -
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కడ్తాల్: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా శిరసనగండ్లకు వెళ్తూ మండల కేంద్రంలో కాసేపు ఆగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్పతినాయక్ పాల్గొన్నారు. ఆమనగల్లులో ఘనస్వాగతం ఆమనగల్లు: నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవికి ఆమనగల్లు పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్‌చైర్మన్ గుర్రం కేశవులు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు తదితరులు పాల్గొన్నారు. -
‘నీరా’ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ ఎకై ్సజ్ అధికారులు
కడ్తాల్: మండల పరిధిలోని ముద్వీన్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘నీరా’ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎకై ్స జ్‌శాఖ అధికారులతో కలిసి ఆదివారం సందర్శించారు. గీత కార్మికులకు లాభాలు చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నీరా తయారీ విధానాన్ని పరిశీలించారు. చెట్టు నుంచి ఏ విధంగా సేకరిస్తున్నారు.. ఎంత మేర ఉత్పత్తి అవుతోంది.. నీరా నుంచి అదనపు ఉత్పత్తుల (బై ప్రొడక్ట్) ను ఎలా తయారు చేయాలి తదితర విషయాలను నీరా కేంద్రం శాస్త్రవేత్త సత్యంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చరికొండ గ్రామంలో పర్యటించి తాటి చెట్ల నుంచి నీరా సేకరణ గురించి గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ బధ్యానాథ్ చౌహన్, ఎస్ఐ అరుణ్‌కుమార్, ఈసీ బాబు తదితరలు పాల్గొన్నారు. ఆలయ హుండీలో రద్దయిన రూ.2వేల నోట్ల కట్టలుపహాడీషరీఫ్: ఆలయ హుండీలో రద్దయిన రూ.2వేల నోట్ల కట్టలు రెండు బయటపడ్డాయి. ఈ సంఘటన బాలాపూర్ మండలం మామిడిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణోత్సవం అనంతరం గత ఏడాది కాలానికి సంబంధించి హుండీ లెక్కింపు కోసం ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. అందులో రద్దయిన రూ.2 వేల నోట్ల కట్టలు రెండు బయటపడ్డాయి. వాటిని లెక్కించగా రూ.2 లక్షలుగా తేలింది. దీనిని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు. 24న చుక్కా రామయ్య ప్రవేశ పరీక్ష అనంతగిరి: ఐఐటీ చుక్కా రామయ్య ట్రస్ట్‌లో ఉచిత విద్య కోసం ఈ నెల 24న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు 5, 6, 7 తరగతుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రెన్స్‌కు ఈ నెల 18వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94404 83015, 96521 802819, 98495 85729, 94916 76672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. స్నేహితుల దాడిలో పెయింటర్ మృతి మల్కాజిగిరి: స్నేహితుడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. మౌలాలికి చెందిన ఆకాశ్ సింగ్ (29) పెయింటర్. ఇదే ప్రాంతా నికి చెందిన ఇంతియాజ్, ఆకాశ్ ఇద్దరూ స్నేహితులు. వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంతియాజ్ సోద రుడు షారూక్ ఇంటికి రాకపోవడంతో అతడికి ఫోన్ చేశాడు. స్పందించకపోవడంతో జెడ్‌టీసీ గ్రౌండ్స్ వద్దకు వెళ్లి చూసేసరికి ఆకాశ్ సింగ్ అతడి మరో స్నేహితుడు కిషన్, షారూక్ మద్యం తాగుతూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన ఇంతియాజ్ అతడితో తిరగొద్దని మందలించాడు. మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇంతియాజ్ సిమెంట్ ఇటుకతో ఆకాశ్ తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సోదరులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో ఉన్న కిషన్.. విషయాన్ని ఆకాశ్ కుటుంబ సభ్యులకు చెప్పగా.. వెంటనే వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకాశ్ మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీర్‌పేట: విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్అండ్బీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల 23వ వార్షికోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది పట్టభద్రులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవాలని ఆయన సూచించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. వేడుకలో కళాశాల కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్నాథ్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం
మొయినాబాద్: సోడెక్స్– హో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ ఏటా ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎంఎస్కే ఇంటర్నేషనల్ గ్రౌండ్లో నిర్వాహకులు సంజయ్‌గుప్తా, ఆనంద్‌కుమార్, రమేశ్, చిరంజీవి, రాంకీ, బి.శ్రీధర్ తదితరులు పోటీలను ప్రారంభించారు. ఆరు రోజులపాటు జరిగే పోటీల్లో 24 ఇంటర్నేషనల్ జట్లు పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి.. ఉత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. -
కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ
పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్‌రెడ్డి పహాడీషరీఫ్: రాజ్యాంగాన్ని కించపరుస్తూ.. అంబేడ్కర్‌ను అవమానిస్తున్న బీజేపీ–ఆర్ఎస్ఎస్ వైఖరి ని ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ జై బాపు–జై భీమ్–జై సంవిధాన్ నినాదంతో ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఆ దేశాల మేరకు జల్పల్లి మున్సిపాలిటీలో శనివారం సంవిధాన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యం, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని కా ర్యకర్తలకు సూచించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను చైతన్య పరిచారన్నారు. 11 ఏళ్లుగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను కాలగర్భంలో కలిపే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని కాపాడే బా ధ్యత కాంగ్రెస్ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జై సంవిధాన్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, జల్పల్లి నాయకులు షేక్ జహంగీరుద్దీన్, యాదగిరి, యూ సుఫ్ ఖాద్రీ, యాదయ్య, భాస్కర్‌రెడ్డి, జగన్, ధన్ రాజ్‌గౌడ్, శ్రీధర్, సుభాన్ యాదవ్, ఫజిల్ ఖాద్రీ, చంద్రమౌలి, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా లారీ బోల్తా
డ్రైవర్‌కు గాయాలు కేశంపేట: యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని అల్వాల శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. యూరియా లోడ్‌తో హైదరాబాద్ వైపు నుంచి కేశంపేట గ్రామం వైపు ప్రయాణిస్తున్న లారీ తులవానిగడ్డ అలుగు సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నగరంలోని బోరబండకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ రాంచందర్, పైలెట్ అనిల్ అక్కడి డ్రైవర్‌ను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పైన ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఘటన శనివారం తెల్లవారుజామున షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ రాజేశ్వర్ తెలిపిన ప్రకారం.. పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో యమ్మీ హోటల్ ఎదురుగా సుమారు 40 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చికిత్స పొందుతూ..మీర్‌పేట: మానసిక ఆశ్రమంలో చికిత్స పొందుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన ప్రకారం.. మీర్‌పేట ఠాణా పరిధి బాలాపూర్ చౌరస్తా లో ఈ నెల 3న మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఓ గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు అతడితో మాట్లా డగా తన పేరు కిషన్ (55) అని, ఇతర వివరాలు చెప్పలేదు. పోలీసులు కిషన్‌ను ఆలేటి మానసిక ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న కిషన్ శనివారం మృతి చెందాడు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. కాలు జారి కిందపడిన వృద్ధుడు మొయినాబాద్: ఇంట్లో కాలు జారి కిందపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి అంజయ్య(75) ఈ నెల 3న సాయంత్రం 5గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఇంట్లో కాలు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. గృహిణి అదృశ్యం పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగా లేని గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన ఆదిల్ల కృష్ణ భార్య ఆదిల్ల నర్సమ్మ(48)కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటుంది. ఏ పని చేయకుండా ఇంట్లోని ఉండమని గత నెల 20వ తేదీన ఆమెకు భర్త చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురై ఆమె ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నర్సమ్మ ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
రౌడీ షీటర్‌కు నగర బహిష్కరణ
మీర్‌పేట: పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ రౌడీషీటర్‌కు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆరాంఘర్‌కు చెందిన సురేందర్ అలియాస్ సూరి (36) రౌడీషీటర్. ఇతనిపై మీర్పేటతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 40 కేసులు నమోదై ఉన్నాయి. ఏడాది క్రితం మీర్‌పేటలో సల్మాన్ అనే యువకుడిని హత్య చేయడంతో పాటు కట్టుకున్న భార్యను కూడా హతమార్చాడు. ఇటీవల చైతన్యపురి పీఎస్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇతని వల్ల మరికొందరికి ప్రాణహాని ఉందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు 261 సిటీ యాక్ట్ ప్రకారం సురేందర్‌ను నగర బహిష్కరణ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. సురేందర్ కమిషనరేట్ పరిధిలో ఉండకూడదని, ఒకవేళ రావాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. -
‘ఎర్లీబర్డ్’కు బోణీ మొదట చెల్లించిన వ్యక్తికి సన్మానం
షాద్‌నగర్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన ఇంటి యజమానిని శనివారం మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకం కింద ఐదు శాతం రాయితీ కల్పిస్తుంది. పట్టణంలోని ఈశ్వర్ కాలనీకి చెందిన పాతూరి సత్యనారాయణ రూ.1.46లక్షల ఆస్తి పన్ను చెల్లించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సునీత, అధికారులు ఆయన్ను శాలువాతో సన్మానించారు. గౌడ కులస్తుల అభివృద్ధికి ఐక్యతతో పనిచేయాలి గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కృష్ణగౌడ్ మొయినాబాద్: గౌడ కుల అభివృద్ధికి కులస్తులంతా ఐక్యతతో పనిచేయాలని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నక్క కృష్ణగౌడ్ అన్నారు. మొయినాబాద్‌కు చెందిన రేనట్ల దర్శన్‌గౌడ్ సంఘం జాతీయ కార్యదర్శిగా ఎన్నికై న సందర్భంగా శనివారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గౌడ సదస్సులు నిర్వహించి కులస్తులను ఏకం చేయాలన్నారు. అనంతరం దర్శన్‌గౌడ్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని.. గౌడ కుల అభివృద్ధి, ఐక్యతకోసం పనిచేస్తానని చెప్పారర్థీ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేశ్‌గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మహేందర్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు నర్సింహగౌడ్, మండల అధ్యక్షుడు అంజయ్యగౌడ్, నాయకులు సతీశ్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, లావణ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఫెన్సింగ్ పనులను నిలిపివేయాలి’ యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూము ల్లో ఫెన్సింగ్ పనులను ఆపివేయాలని.. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఎం నక్కర్తమేడిపల్లి శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం వారు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసైన్డ్ పట్టా లున్న రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని ఆరోపించారు. రైతులను అడ్డుకుని ఫెన్సింగ్ పనులు చేపట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం గ్రామాలను పోలీసులతో మోహరించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఫెన్సింగ్ పనులను నిలిపివేయకపోతే ఫార్మా బాధిత గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి రైతులను చైతన్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, నాయకులు ఆలంపల్లి జంగయ్య, జహంగీర్, యాదయ్య, భూషన్, పెంటయ్య, శ్రీకాంత్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న సీజ్.. నేడు ఓపెన్ క్లినిక్‌లపై వైద్యాధికారుల వరుస దాడులు షాద్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా షాద్‌నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లను శుక్రవారం సాయంత్రం వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఆర్ఎంపీలు ఏర్పాటు చేసిన మనశ్విని, ప్రజా వైద్యశాల, సిద్దాపూర్ దవాఖానా, రాజా మెడికల్ హాల్ వెనక ఉన్న క్లినిక్‌లపై డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేశారు. కాగా శుక్రవారం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సీజ్ చేసిన క్లీనిక్‌లను శనివారం ఆర్ఎంపీలు తెరిచారు. దీంతో స్థానిక అధికారులు శనివారం మళ్లీ సీజ్ చేశారు. -
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
చిలుకూరు వేంకటేశ్వరస్వామి(బాలాజీ) బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతుఉ్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ధ్వజారోహణం, కల్యాణోత్సవం, రథోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాల సందర్భంగా భక్తులకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సారి గరుడ ప్రసాదం పంపిణీ ఉండదు. సంతానం లేని మహిళలు గరుడ ప్రసాదం కోసం రావద్దు. మే నెల నుంచి ప్రతి శుక్రవారం గరుడ ప్రసాదం అందిస్తాం. – రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు● -
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
మొయినాబాద్: వీసా గాడ్‌గా పేరొందిన కలియుగదైవం.. చిలుకూరు బాలాజీ స్వామి వారు బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతూ.. తెలంగాణ తిరుపతి గా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయం వేడుకలకు ముస్తాబైంది. ఐదు శతాబ్ధాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి తరువాత దశమి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితి. ఈ నెల 7న సోమవారం సెల్వర్ కూత్తు తోఉత్సవాల అంకురార్పణ చేసి 14న చక్రతీర్థంద్వజావరోహణంతో ముగుస్తాయి. చివరి దశకు చేరుకున్న ఏర్పాట్లు చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్వామి వారి రథం ఉత్సవాలకు ముస్తాబైంది. వాహన సేవలకు ఉపయోగించే వాహనాలు సిద్ధం చేశారు. ఆలయానికి రంగులు, సున్నం వేయించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ శుక్రవారం గరుడ ప్రసాదం బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అనంతరం గరుత్మంతుడికి పెట్టే నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా వితరణ చేసేవారు. గత ఏడాది గరుడ ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గరుడ ప్రసాద పంపిణీ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. సంతానం లేని మహిళలకు మే నుంచి ప్రతీ శుక్రవారం గరుడ ప్రసాదాన్ని సంతాన భాగ్య ప్రసాదంగా అందజేస్తామని చెప్పారు. గత ఏడాది సైతం ప్రతీ శుక్రవారం గరుడ ప్రసాదాన్ని అందించామన్నారు. ఈ నెలలో గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని చెప్పారు. రేపటి నుంచి 14 వరకు వేడుకలు ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయం గరుడ ప్రసాద పంపిణీకి బ్రేక్ బ్రహ్మోత్సవాల వివరాలు తేదీ సేవలు 7న సెల్వర్ కూత్తు 8న ధ్వజారోహణం, శేషవాహన సేవలు 9న గోపవాహన, హనుమంత వాహన సేవ 10న సూర్యప్రభ, గరుడ వాహన సేవలు 11న వసంతోత్సవం, గజవాహన సేవ 12న పల్లకీ సేవ, అర్ధరాత్రి దివ్య రథోత్సవం 13న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన, దోప్, పుష్పాంజలి సేవలు 14న చక్రతీర్థం, ధ్వజావరోహణం -
దేశీయ విత్తనాలతో భూతాపానికి చెక్
● రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి ● రెండో రోజుకు చేరిన తెలంగాణ తొలి విత్తనాల పండుగ కడ్తాల్: దేశీయ విత్తనాల అభివృద్ధితోనే భూతాపాన్ని తగ్గించుకోవచ్చని.. ఒక డిగ్రీ సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే 15 నుంచి 20 శాతం ఆహార ఉత్పత్తి తగ్గుతుందని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) పర్యా వరణ సంస్థ–భారత్ బీజ్ స్వరాజ్మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎర్త్ సెంటర్లో నిర్వహిస్తున్న తెలంగాణ తొలి విత్తన పండుగ శనివారం రెండో రోజుకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో, రైతులు, యువకులు, వ్యవసాయ రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు, పర్యావరణ వేత్తలు తరలివచ్చారు. సంప్రదాయ విత్తనాల ప్రదర్శన స్టాల్స్ సందర్శకులు, కొనుగోలు దారులతో సందండిగా మారాయి. రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలి సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మోహన్ గురుస్వామి మాట్లాడుతూ.. గడిచిన 50 ఏళ్లలో వ్యవసాయ రంగంలో ఎన్నో మా ర్పులు వచ్చాయన్నారు. గతంలో 1.20లక్షలు ఉన్న వరి రకాల స్థానంలో నేడు కేవలం 3 వేల రకాల వంగడాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సువాసన భరిత చిట్టి ముత్యాలు కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశా రు. విత్తన పరిశోధనకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. మందిరంకంచ గచ్చిబౌలి, వక్ఫ్ బోర్డ్ అంశాల పట్ల ఉన్న శ్రద్ధ, రైతులు వాతావరణం, విత్తనాల అభివృద్ధి మీద పాలకులకు లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వాలు ఇప్పటికై నా రైతులు, రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. భూసారం తగ్గి రైతు ఆత్మహత్యలు అనంతరం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ నిర్వాహకులు గున్న రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచీకరణ కారణంగా వ్యవసాయం, దేశీ ఆవులు తగ్గాయన్నారు. తూర్పు కొండల పశువుల పాల ఉత్పత్తులతో మానవుల ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భూముల్లో వానపాములు తగ్గడంతో భూసారం తగ్గి రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సీజీఆర్ సంస్థ విత్తనాలతో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావాలని కోరారు. స్వదేశీ ఆహారంతో కేన్సర్, షుగర్‌తో పాటు, వివిధ రోగాలను నివారించేలా సహకారం అందిద్దామని తెలిపారు. సీజీఆర్ సంస్థ పర్యావరణ రక్షణకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆరోగ్యానికి ఆహార భద్రత సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా, విత్తన పండుగ నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు వర్క్‌షాపులను సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయ విత్తనాలను సంరక్షిస్తూ.. ప్రకృతి సంపదను భవిష్యత్తరాలకు అందించాలని కోరారు. విజయ్‌రామ్ నేచురల్ ఫార్మిగ్పై సభలో సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సూదిని పద్మారెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణ నిపుణులు సాయిభాస్కర్రెడ్డి, సీజీఆర్ సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సుస్థిర వ్యవసాయాన్ని కొనసాగించాలిస్థానిక సంప్రదాయ విత్తనాన్ని కాపాడుకుంటూనే సుస్థిర వ్యవసాయాన్ని కొనసాగించే పద్దతులను అన్వేషించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. యువతను ఆకట్టుకునేలా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని, వ్యవసాయ రంగంలో జీవనోపాధి, ఆరోగ్యముందనే నమ్మకం వారిలో కలిగిస్తేనే, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలుగుతామన్నారు. అనంతరం ఎర్త్ సెంటర్లోని దేశీ విత్తన స్టాల్స్‌ను సందర్శించడంతో పాటు, లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి ఉన్నారు. -
కలిసి నడుద్దాం
సేంద్రియ సాగులోశంకర్పల్లి: వ్యవసాయంలో రసాయనాల వాడకం మానేసి, సేంద్రియ సాగువైపు దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సూచించారు. గ్రామాల్లో సురాజ్యం, అభివృద్ధి, ప్రగతి రావాలని, అందుకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. శంకర్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో శుక్రవారం రంగారెడ్డి– వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ‘ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్’ (ఈజీవీఎఫ్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ‘ప్రకృతి– సేంద్రియ రైతు సమ్మేళనం’ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పలువురు తయారు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. రైతులకు ఉపయోగకరంగా, సులభతరంగా ఉండే వ్యవసాయ పరికరాలను తయారు చేసే పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని రైతుల్లో చైతన్యం నింపి, వారిని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించే విషయంలో తనవంతు సాయం ఉంటుందన్నారు. రసాయనాల వాడకంతో భూమి ఆరోగ్యం విషతుల్యంతో పాటు, మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు ఈజీవీఎఫ్ ముందుకు రావడం అభినందనీయని కొనియాడారు. సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి, నూతన ఆవిష్కరణలు చేసి, సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సూచించారు. ఆవిష్కరణలకు ఊతమిచ్చాం ఆర్మీలో చేసిన సేవలకు గాను 2005లో రాష్ట్రపతి ద్వారా విశిష్ట సేవా మెడల్‌తో సత్కారించగా.. ఆ ఏడాదిలోనే ఉద్యోగ విరమణ పొందా. రైతులకు సాయం చేయాలనే తపనతో ‘పల్లె సృజన’ పేరుతో సంస్థను స్థాపించాం. 2,500 పైగా జ్ఞాన పద్ధతులను డాక్యుమెంట్ చేసి, గ్రామాల్లో వెళ్లి, కొత్త ఆవిష్కరణలను కనుగొని, ప్రోటో టైపులుగా మార్చి, పేటెంట్లు పొందడం, విక్రయాల్లో తోడ్పాటు అందిస్తున్నాం. – గణేశన్, పల్లె సృజన, బ్రిగేడియర్ వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలి 16, 17 శతాబ్దాల్లో భారతదేశం వ్యవసాయాధార దేశంగా ఉండేది. అప్పటి జీడీపీలో 52శాతం వ్యవసాయమే ఉండేది. ప్రస్తుతం అది 16శాతానికి పడిపోయింది. మళ్లీ వ్యవసాయానికి పూర్వ వైభవం తేవాలి. ప్రస్తుతం చాలా ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారీ చేసే స్థాయికి రైతులు ఎదగడం అభినందనీయం. – సతీశ్‌రెడ్డి, డీఆర్డీఓ మాజీ చైర్మన్ గవర్నర్ జిష్ణుదేవ్వర్మఆకర్షించిన ఆసు యంత్రం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చింతకింది మల్లేశం తయారు చేసిన ఆసు యంత్రం సమ్మేళనానికి వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకుంది. చేనేత కార్మికులు చీర తయారు చేసేందుకు పాత యంత్రాల మీద చేతులతో చేస్తూ, ఎంతో ఇబ్బంది పడేవారు. తన ఇంట్లో తన తల్లి పడే కష్టాన్ని చూసిన మల్లేశం ఒక ఆసు యంత్రాన్ని తయారు చేశాడు. దీంతో మనుషులు లేకుండానే ఆసు పోస్తున్నారు. పెద్ద పెద్ద డిజైన్ల చీరలకు 40 పిన్నులతో ఆసు పోసే వారని, తాను తయారు చేసిన యంత్రం ద్వారా 120 పిన్నులతో ఆసు పోసుకోవచ్చని మల్లేశం స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్సులు భాగయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఈజీవీఎఫ్ చైర్మన్ వెంకటేశ్వరరావు, పద్మశ్రీ సుభాష్వర్మ తదితరులు పాల్గొన్నారు. -
శోభాయాత్ర ఏర్పాట్లపై సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్ సూచనలు సాక్షి, సిటీబ్యూరో: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న బందోబస్తు, భద్రత చర్యలపై నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. శుక్రవారం ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులకు పలు కీలక సూచనలు, సలహాలు అందజేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని, సిటీలోని అన్ని జోనల్ కంట్రోల్ రూమ్స్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. శోభాయాత్రలో జేబుదొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, ఈవ్‌టీజింగ్ వంటివి లేకుండా చూడాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్‌తో పాటు అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) ఎస్.చైతన్య కుమార్ పాల్గొన్నారు. -
పోలీస్ పహారాలో ఫెన్సింగ్
యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లిలో రెండోరోజు పోలీస్ పహారాలో ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు కొనసాగాయి. కోర్టుల్లో కేసులు.. ప్లాట్ల సర్టిఫికెట్లకు కబ్జాలు చూపించకపోవడంతో గుర్రుగా ఉన్నవారు ఫెన్సింగ్ పనులు అడ్డుకోవాలని గురువారం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఇద్దరు ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 మంది ఇతర పోలీస్ సిబ్బంది సర్వే, ఫెన్సింగ్ పనుల వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా నక్కర్తమేడిపల్లి–పల్లెచల్కతండా రోడ్డులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే వారి వాహనాలను తనిఖీ చేసి పంపించారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు వద్ద మరో పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలోని రైతులెవరినీ ఫార్మాసిటీ భూముల్లోకి రానివ్వలేదు. ఆందోళనకారుల కదలికలపై నిఘా పెట్టారు. రెండు రోజులుగా ఫార్మాసిటీకి సేకరించిన భూముల చుట్టూ దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. రెండో రోజు కొనసాగిన ఫార్మాసిటీ భూముల సర్వే, కంచె ఏర్పాటు పనులు రైతులకు మద్దతుగా ఉంటాం ఫార్మాసిటీ రైతులకు మద్దతుగా ఉంటాం, బలవంతంగా ఫార్మా భూములపైకి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజులుగా నక్కర్తమేడిపల్లిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే, ఫెన్సింగ్ వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎకరాకు 121 గజాల ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ స్థలాలు చూపించకపోగా రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం చట్టరీత్యానేరమన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి భూములను రైతులకు తిరిగిచ్చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
పరిధికి మించి వైద్యం చేస్తే చర్యలు
షాద్‌నగర్: ఆర్ఎంపీలు పరిధికి మించి వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు హెచ్చరించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎంపీలు తమ పరిధికి లోబడి రోగులకు ఫస్ట్ ఎయిడ్ నిర్వహించాలని సూచించారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అనే పదాన్ని వాడుకోవద్దని, కేవలం ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే రాయాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణకు విధిగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు పొందాలన్నారు. ఎవరికై నా జలుబు, దగ్గు, జ్వరం తదితర వాటితో పాటు ఇతర ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా నైపుణ్యం కలిగిన వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. పట్టణంలోని ఆస్పత్రులు, పాలీక్లినిక్‌లను తనిఖీ చేసి కీర్తి పాలీక్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక భాగంలో ఉన్న దవాఖాన, మనిశ్విని క్లినిక్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు -
నేడు డయల్ యువర్ డీఎం
షాద్‌నగర్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని డీఎం ఉష శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలను అందించేందుకు 90634 61297 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. డ్రగ్స్ తెచ్చాడు.. అడ్డంగా దొరికాడు మొయినాబాద్: బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అజీజ్‌నగర్ ప్రాంతంలో విక్రయిస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన శ్రీకాంత్ బెంగళూరు నుంచి ఎండీ ఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చి బుధవారం అర్థరాత్రి మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ సమీపంలో విక్రయానికి ఉంచాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద 17.5 గ్రాముల ఎండీ ఎంఏ డ్రగ్స్ దొరికింది. అతన్ని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.2.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అధ్యక్షుడే లక్ష్యంగా.. ● బీజేపీలో రచ్చకెక్కిన అంతర్గత పోరు ● మరోసారి రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు సాక్షి, సిటీబ్యూరో: మహా నగర బీజేపీలో అంతర్గత పోరు చినికి చినికి గాలివానగా మారుతోంది. గత ఎన్నికల ముందు నుంచి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భం వచ్చినపుడల్లా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షుల ఎన్నికలో తన నియోజకవర్గ పరిధిలో.. తనకు తెలియకుండా అధ్యక్షులను ప్రకటించడంపై తీవ్రంగా మండిపడిన రాజాసింగ్.. ఈ దఫా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావు పేరును ఖరారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఎంతో మంది పార్టీకి నమ్మకంగా పని చేస్తున్న వారు ఉండగా, మీ నియోజకవర్గంలోని వ్యక్తులకు మాత్రమే పదవులు వస్తున్నాయని, మీకు గులాంగిరీ చేసేవారికి మాత్రమే పదవులు ఇస్తారా? అంటూ ఏకంగా పార్టీ రాష్ట్రఅధ్యక్షుడినే లక్ష్యంగా చేసుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. తనకు పోటీగా శోభాయాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. లేడి.. రోడ్లపై పరుగిడి.. గచ్చిబౌలి: రోడ్లపై పరుగులు తీసిన ఓ జింక ఎట్టకేలకు ఓ ఇంట్లోకు చేరింది. పోలీసులు, ఫారెస్ట్ అధికారుల దాన్ని జూపార్క్‌కు చేర్చారు. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ జింక గోపన్‌పల్లి ఎన్టీఆర్నగర్లో రోడ్లపై పరుగులు తీయసాగింది. కుక్కలు వెంబడించడంతో వాటి బారినుంచి స్థానికులు రక్షించారు. భయంతో అక్కడే ఉన్న ఓ హార్డ్‌వేర్ షాపులోకి వెళ్లింది. షాపు నిర్వాహకుడు సూరజ్.. దానికి చపాతీ తిపించారు. కొద్ది నిమిషాల తర్వాత అక్కడి నుంచి జింక పరుగుతీసి బస్తీలోకి వెళ్లింది. రాణి అనే మహిళ ఇంట్లో నుంచి కమల అనే మహిళ ఇంటి ఆవరణలోకి చేరింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్నవారు పనికి వెళ్లారు. గమనించిన స్థాని కులు బయటకు వెళ్లకుండా గేట్ మూశారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు రవి కుమార్ యాదవ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గచ్చిబౌలి పోలీసులు జింక బయటకు రాకుండా చర్యలు చేపట్టి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్ఓ రమేష్ కుమార్, వెటర్నరీ డాక్టర్ షానవాజ్, నెహ్రూ జూలాజికల్ సిబ్బంది రెస్క్యూ వాహనంతో వచ్చారు. మొదట వల వేసి బంధించి ఇంటి నుంచి బయటకు రప్పించాలని చూడగా ప్రయత్నం ఫలించలేదు. దీంతో దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెస్క్యూ వాహనంలో జూ పార్క్‌కు తరలించారు. బెదిరి.. సమూహం నుంచి చెదిరి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకల సమూహాలు ఉన్నాయి. అవి గుంపులుగా ఒకచోట నుంచి మరో చోటికి వెళ్తుంటాయి. నాలుగు రోజులుగా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో టీజీఐఐసీ చేపట్టిన పనుల కారణంగా జింకల సమూహాలు బెదిరి.. చెదిరిపోయి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఉపాధ్యాయులే మార్గదర్శకులు
షాబాద్: విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఉపాధ్యాయులు వారిని పోత్సహించడంతో పాటు, మార్గదర్శకంగా నిలవాలని దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర శర్మ సూచించారు. శుక్రవారం రాత్రి షాబాద్ మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. భవిష్యత్తుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్దిష్టమైన లక్ష్యంతో చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని, అప్పుడే సమాజంలో అత్యున్నతమైన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్, పాఠశాల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పూర్వపు విద్యార్థి డాక్టర్ అమరేందర్, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి భూషణ్, మాజీ సర్పంచ్‌లు సుబ్రమణ్వేశ్వరి రవీందర్, శైలజఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
54 కేసుల్లో రూ.3.28 కోట్లు రిఫండ్
బాధితుడికి చెక్కు అందించిన సీపీ సాక్షి, సిటీబ్యూరో: నగర కమిషనరేట్ పరిధిలో మార్చిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో 54 మంది బాధితులకు రూ.3.28 కోట్లు రిఫండ్ అయింది. ఫిర్యాదు వచ్చిన మరుక్షణం స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. న్యాయస్థానం అనుమతితో ఈ మొత్తాన్ని బాధితులకు అందించారు. ఓటీపీ ఫ్రాడ్‌లో రూ.47 లక్షలు పోగొట్టుకున్న బాధితుడికి రూ.40 లక్షలు రిఫండ్‌కు సంబంధించిన చెక్కును నగర కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం అందజేశారు. -
ఆత్మరక్షణకు కరాటే దోహదం
షాబాద్: బాలికలకు చదువు ఒక్కటే సరిపోదని, ఆపద సమయంలో ఆత్మరక్షణకు కరాటే దోహపడుతుందని జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా, తెలంగాణ స్కూల్ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు చెన్న య్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధి ఆస్పల్లిగూడ గ్రామ శివారు కై ట్ కళాశాలలో నిర్వహించిన కరాటే బెల్ట్ పోటీల్లో ఎంజెపీ మొగిలిగిద్ద గురుకుల పాఠశాల విద్యార్థినులు 29 మందిగ్రేడింగ్ ఉత్తీర్ణత సాధించారు. ఇందులో డబుల్ ప్రమోషన్ జయశ్రీ ఎల్లో, మేఘన ఆరెంజ్, శ్రావ్య ఎల్లోతో పాటు మరో 27 జూనియర్ రెడ్ బెల్టులు పొందారు. ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరంజని, పీటీ రేణుక, పద్మిని తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారులు నిబంధనలు పాటించాలి
తాండూరు: తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నంబర్ ప్లేట్ లేని 50 ద్విచక్రవాహనాలను పట్టుకుని అవగాహన కల్పించామన్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం వాహనదారులకు జరిమాన విధించడంతో పాటు కొత్త నంబర్ ప్లేట్ బిగించామన్నారు. దోమలో.. దోమ: వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నియమ, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇంచార్జి ఎస్ఐ నాగేందర్ అన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని బాస్పల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి వాహనదారుడు వాహనాలకు సంబంధించి ధ్రువపత్రాలను తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. నంబర్ ప్లేట్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. నంబర్ ప్లేటు లేకుంటే కఠిన చర్యలు యాలాల: నంబరు ప్లేటు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్ఐ గిరి హెచ్చరించారు. శుక్రవారం యాలాల మండ ల కేంద్రంలో సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్లులేని పది ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. అనంతరం వా హన యజమానులతో మాట్లాడి నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించారు. వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ఉండలన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పరిహారాన్ని వినియోగించుకోండి
తాండూరు: దుద్యాల్ మండలంలో పారిశ్రామిక పార్కు కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం పారిశ్రామిక పార్కు కోసం భూములిచ్చిన హకీంపేట్, లగచర్ల గ్రామాల రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హకీంపేట్, లగచర్ల గ్రామాల్లోని 25 మంది రైతుల నుంచి 31.08 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.6.20 కోట్ల విలువ చేసే పరిహారం చెక్కులను రైతులకు అందజేసినట్లు పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 150 గజాల చొప్పున ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హత ఆధారంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు 75 గజాల ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుందన్నారు. మెనూ అమలు చేయాలి అనంతరం తాండూరులోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను కలెక్టర్ సందర్శించారు. సదుపాయాలపై ఆరా తీశారు. వసతి గృహ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యం మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేయించాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి ఉన్నాయా అని అడగ్గా.. సిబ్బంది లేవని సమాధానం చెప్పారు. దీంతో క్రీడా సామగ్రిని సమకూరుస్తానని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ థారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్ తదితరులు ఉన్నారు. సన్నబియ్యం పంపిణీలో పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు అనంతగిరి: జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సన్నబియ్యం పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వరాదని ఆదేశించారు. గోదాముల్లో బియ్యం కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ పారిశ్రామిక పార్కు కోసం భూములిచ్చిన లగచర్ల రైతులకు చెక్కులు అందజేత -
‘ఆపరేషన్ కగార్’ను ఆపేయండి
చేవెళ్ల: ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యంలో ఆదివాసీలపై కొనసాగిస్తున్న దమనకాండను వెంటనే ఆపేయాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వై.మహేందర్ డిమాండ్ చేశారు. కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు తీరని అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరుతూ ఈ నెల 8న ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న ప్రజాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివాసి జాతిని అంతమొందించి, కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా బీజేపీ యత్నిస్తోందని, దీనిని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, ఏఐకేఎంఎస్ చేవెళ్ల డివిజన్ నాయకులు కె.జైపాల్, న్యూడెమోక్రసీ నాయకులు అశోక్, శ్రీకాంత్ ఉన్నారు. -
కాంగ్రెస్ అంటేనే మోసం
కడ్తాల్: అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించిందని.. మాయమాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన సర్కార్ పాలనలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం ఆయన మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి మండల పరిధిలోని ముద్వీన్, బోయిన్‌గుట్ట తండాలో పర్యటించారు. ముద్వీన్‌లో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథనాయక్ ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ షేడం యాదమ్మకు నిర్మించిన ఇంటిని ప్రారంభించి బోయిన్గుట్టతండాలో మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్, సంత్‌సేవాలాల్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటనే మోసమని.. తాము అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు ప్రతీ నెల రూ.2,500, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర పాలన సగం సగం.. అంత ఆగం ఆగంలా ఉందని ఎద్దేవా చేశారు. గతేడాది యాసంగి, వానాకాలం కలిపి రూ.13వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ జీడీపీ, రాష్ట్ర తలసరి ఆదాయం పెంచితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి గుండాయిజం, కుటుంబ ఆదాయం పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఫోర్త్ సిటీ ఎవరి కోసం.. పేదల భూములు లాక్కొని గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం ఎందుకోసమని ప్రశ్నించారు. పేదలకు పట్టాలిస్తామని చెప్పిన ప్రభుత్వం.. గద్దెనెక్కి భూములు గుంజుకుంటుందని మండిపడ్డారు. నెలకు రూ.4వేల ఫించన్ ఇస్తామని 16 నెలల పాలనలో రెండు నెలల ఫించన్లు ఎగ్గొటాడన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని బంద్ అయ్యాయని వివరించారు. ప్రభుత్వం హెచ్‌సీ యూ వర్సిటీ భూములు అమ్ముకునేందుకు కుట్రపన్నుతోందన్నారు. నల్లమల బిడ్డనని, పాలమూరు బిడ్డనని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డికి పౌరుషం ఉంటే పోలీసులు లేకుండా బోయిన్‌గుట్ట తండాకు వస్తే ప్రజలే సమాధానం చెబుతారని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతీ పేదవాడి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామని మోసం చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. రాష్ట్రంలో రక్షణ కరువు: సబితారెడ్డి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. విదేశీ మహిళలపై దాడులు జరుగుతుంటే రక్షణ ఎక్కడ ఉందని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళపై జరిగిన దాడి అత్యంత దారుణమని, రాష్ట్రంలో మహిళలపై హింస పెరిగిపోయిందని, ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్‌భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్, ఉపాధ్యక్షుడు ధశరథ్నాయక్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎర్రోళ్ల శ్రీను, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్, అంజినాయక్, నర్సింహగౌడ్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి పాలన సగం సగం.. అంతా ఆగమాగం అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు బీఆర్ఎస్యే రాష్ట్రానికి శ్రీరామ రక్ష మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు -
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టరేట్‌ను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు మెయిల్ పెట్టాడు. దీంతో ఈ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతమ్ రాచకొండ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో డీసీపీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ ఏసీపీ గురువారం మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మేడ్చల్ కలెక్టరేట్లోని వివిధ శాఖల్లో బాంబు స్క్వాడుతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి బాంబు జాడ లేకపోవటంతో.. ఉత్తుత్తి బెదిరింపులేనని పోలీసులు తేల్చారు. దీంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కలెక్టర్ గౌతమ్‌కు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు వివిధ విభాగాల జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్యాహ్నం 3 గంటలకు తమ కార్యాలయాల నుంచి బయటకు వెళ్లిపోయారు. బాంబు బెదిరింపు మెయిల్ మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణరావు పేరిట రావటంతో పాటు.. అందులో ముస్లిం సంస్థలకు సంబంధిన పేర్లతో సహా అన్నాడీఎంకే తదితర పార్టీలు, సంస్థల పేర్లు ఉండటంతో.. కావాలనే ఎవరో ఆగంతకుడు మెయిల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చర్చోపచర్చలు.. మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ మెసేజ్‌పై ఉద్యోగులతో సహా ప్రజల్లో పలు రకాలుగా చర్చ సాగుతోంది. జిల్లాలో పలువురు ఉన్నత స్థాయి అధికారులు తమ సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలకు సమయం కేటాయించక పోవటం వల్లే.. విసుగెత్తిన వారు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాంబు బెదిరింపుపై తదుపరి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. తనిఖీలు చేపట్టిన బాంబు స్క్యాడ్ అంతా ఉత్తిదేనని తేల్చిన పోలీసులు -
‘ఫ్యూచర్’కు ఫెన్సింగ్
యాచారం: పోలీస్ బందోబస్తు నడుమ ఫార్మాసిటీకి సేకరించిన భూములను గురువారం అధికారులు సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ హయాంలో మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం 7,640 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. అప్పట్లో సేకరించిన కొన్ని సర్వే నంబర్లల్లోని భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి మిగిలిన భూములు వదిలేశారు. పరిహారం పొంది ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులు ఆ భూములకు ఫెన్సింగ్ లేకపోవడంతో నాలుగేళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి పూనుకొంది. ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించే సమయంలో రైతులు కబ్జాలో ఉంటే కష్టతరమని భావించిన ప్రభుత్వం యాచారం తహసీల్దార్ అయ్యప్ప, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు ఆధ్వర్యంలో భూములను సర్వే చేసి ఫె న్సింగ్ వేసే పనులను ప్రారంభించారు. రైతులు ఆందోళన చేస్తారని ముందు జాగ్రత్తగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామాల చుట్టూ పోలీస్ పహారా నర్కర్తమేడిపల్లి గ్రామాన్ని పోలీసులు ఉదయమే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, మరో ఇద్దరు ఏసీపీలు, ఎనిమిది మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 40 మందికి పైగా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే సిబ్బంది, 20కి పైగా జేసీబీలు, ఇతర యంత్రాలు, 50 మందికి పైగా కూలీలు సర్వే చేసే భూమి వద్దకు చేరుకున్నారు. అధికారులు సర్వే పనులు ప్రారంభించిన వెంటనే రైతులు అడ్డుకునేందుకు యత్నించారు. తమ అంగీకారం లేకుండానే పరిహారం డబ్బులు అథారిటీలో జమ చేశారు. కోర్టులో కేసులుండగా సర్వే చేయడం, ఫెన్సింగ్ వేయడం సరికాదని పనులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌కు తరలించారు. అనంతరం మాజీ సర్పంచ్‌లు పాశ్ఛ బాషా, శ్రీనివాస్‌రెడ్డి, మొరుగు రమేష్ తదితరులు తీవ్ర గందరగోళం సృష్టించడంతో వారిని సైతం అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం, రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నక్కర్తమేడిపల్లి గ్రామంలోని సర్వే పనులను అడ్డుకోవడానికి నానక్‌నగర్, తాడిపర్తి, కు ర్మిద్ద గ్రామాల నుంచి రైతులు తరలిరాకుండా నక్కర్తమేడిపల్లి–నానకనగర్, నక్కర్తమేడిపల్లి–సరికొండ రోడ్లపై పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్లాట్లకు కబ్జాలు చూపండి ఫార్మాసిటీకి సేకరించిన భూములకు పరిహారం ఇచ్చారు. ప్లాట్ల పంపిణీ చేసి కబ్జాలు చూపేవరకు సర్వే, ఫెన్సింగ్ పనులు ఆపాలని రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఇందుకు హామీ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. ఆర్డీఓ అనంత్‌రెడ్డి ఘటన స్థలానికి రాగానే రైతులు చుట్టుముట్టారు. మూడేళ్ల కింద ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చి నేటికి స్థలం చూపించలేదు. ఫెన్సింగ్ వేసి మోసం చేస్తారా.. అంటూ నిలదీశారు. ఫార్మా ప్లాట్లకు లాటరీలు తీసి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో కేసులున్న భూములకు సర్వే చేసి, ఫెన్సింగ్ వేయమని హామీ ఇచ్చారు. ఫార్మా భూ బాధిత గ్రామాల్లోమోహరించిన పోలీసులు సర్వే చేసి కంచె ఏర్పాటుపనులు చేపట్టిన అధికారులు అడ్డుకునేందుకు యత్నించిన రైతులను స్టేషన్‌కు తరలించిన సిబ్బంది ఆ తర్వాత అంతా నిశబ్దం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు రైతులతో మాట్లాడుతూ వారికి నచ్చజెప్పుతున్న సమయంలోనే ఫార్మాకు సేకరించిన భూముల చుట్టు సర్వే, ఫెన్సింగ్ పనులను ముమ్మరంగా చేపట్టారు. రైతులను అటుగా వెళ్లనీయకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొందరు రైతులు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డికి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఫిర్యాదులు చేశారు. కోర్టు కేసులున్న భూములు, రైతుల వద్దకు వెళ్లవద్దని, పరిహారం పొందిన భూములనే సర్వే చేసి ఫెన్సింగ్ వేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం వరకే రైతులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టి ఆ తర్వాత అటు వైపు వెళ్లలేదు. దీంతో అధికారులు సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేసి ఫెన్సింగ్ పనులు చేపట్టారు. -
వర్సిటీ భూములను కాపాడుకుందాం
చేవెళ్ల: వర్సిటీ భూములను, పర్యావరణాన్ని, విద్యార్థుల హక్కులను కాపాడే దిశగా ఉద్యమం కొనసాగిస్తామని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేశ్, చేవెళ్ల బీజేపీ మండల అధ్యక్షుడు అనంత్రెడ్డిలు అన్నారు. గురువారం మండలకేంద్రంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పిలుపు మేరకు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశ విధానాలు తిప్పి కొట్టేందుకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. హెచ్‌సీయూ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియను ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకుడు డాక్టర్ వైభవ్‌రెడ్డి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాజమల్లేశ్, శివకుమార్, ప్రవీణ్, భాస్కర్, శ్రీనివాస్, మధూకర్‌రెడ్డి, శ్రీనివాస్, బి.కృష్ణ, నితీష్‌రెడ్డి, శివకుమార్‌గౌడ్, రిషికేశ్, రాజు, మైసూరారెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్, మహేశ్, సాయి, శ్రీరాములు, శ్యామ్, కిరణ్ పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేశ్ -
జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు
శంకర్పల్లి: మండల పరిధిలోని టంగుటూర్లో భూమి కొనుగోలు చేసిన ఆర్మూర్ మాజీ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మండల పరిధిలోని టంగుటూర్లో సామ దామోదర్‌రెడ్డి కుటుంబీకులు, సన్నిహితులకు సంబంధించి 170 ఎకరాల భూమి ఉంది. 2006లో కొంత భూమిని చైతన్య రిసార్ట్స్ పేరుతో ప్లాట్లు చేసి, 2011 వరకు సుమారు 70 మంది వ్యక్తులకు వేయి గజాలు, 500 గజాల చొప్పున ప్లాట్లను విక్రయించారు. 2016లో అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డితో కొంపల్లిలో కొంత స్థలానికి గాను టంగుటూర్లో 114 ఎకరాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం.. 2016లో సామ దామోదర్‌రెడ్డి 114 ఎకరాలను జీవన్‌రెడ్డితో పాటు ఆయన తల్లి రాజుబాయి, భార్య రజిత పేర్లపై చేశారు. ఒప్పందం ప్రకారం జీవన్‌రెడ్డి కొంపల్లిలో స్థలం ఇవ్వకపోగా.. ఇక్కడ ఉన్న 170ఎకరాలను, గతంలో ప్లాట్లు కొన్నవారి స్థలాలను సైతం కబ్జా చేసి గోడలు నిర్మించారు. ప్లాట్ల యాజమానులు సామ దామోదర్‌రెడ్డిని నిలదీయండంతో ఆయన తన భూమితో పా టు, గతంలో ప్లాట్లు చేసిన స్థలాలను ఆక్రమిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర కు గురువారం మోకిల సీఐ వీరబాబు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని స్టేషన్లో విచారించారు. పొంతనలేని సమాధానాలు కేసు విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పోలీసులకు సహకరించడం లేదని సమా చారం. సామ దామోదర్‌రెడ్డి ఎలా పరిచ యం? ఎక్కడ కలుసుకున్నారు? ఏమని ఒప్పందం చేసుకున్నారు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నారు? పొజీషన్ ఎప్పుడు తీసుకున్నారు? డాక్యుమెంట్లు ఎందుకు లాక్కుకున్నారు? గోడలు ఎందుకు నిర్మించారు? ప్రైవేటు సెక్యూరిటీని ఎందుకు నియమించారు? గతంలో అక్కడ ప్లాట్లు ఉన్న విషయం మీకు తెలియదా? అంటూ సీఐ వీరబాబు ప్రశ్నించగా.. జీవన్‌రెడ్డి పొంతలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. విచారణ సమయంలో డీజీ, సీపీ, డీసీపీలకు ఫోన్లు చేస్తూ, పోలీసు లు హింసిస్తున్నారు అని చెప్పినట్లు సమాచారం. మా ప్లాట్లు మాకు ఇవ్వండి పైసా పైసా కూడబెట్టుకుని చైతన్య రిసార్ట్స్‌లో 2006లో వేయి గజాల స్థలం కొ న్నా. 2021వరకు మా ఆధీనంలోనే ఉంది. త ర్వాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి గోడలు నిర్మంచారు. దీనిపై సామ దామోదర్‌రెడ్డిని సంప్రదించగా.. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కొంత ఇబ్బంది ఉందని, కొంతకాలం ఆగ మని చెప్పారు. మా ప్లాట్లు మాకు ఇప్పించండి. – భూలోకం, ప్లాటు కొనుగోలు చేసిన వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నారు 2006లో కుటుంబ సభ్యులమంతా కలిసి ఎనిమిది ప్లాట్లు (4 వేల గజాలు) కొనుగోలు చేశాం. ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు. తమను విజయవాడ, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం సంప్రదించి తక్కువ ధరకు ప్లాట్లు అమ్మేయాలని జీవన్‌రెడ్డి మనుషులు ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులే మాకు న్యాయం చేయాలి. – శ్యాం లంబ, ప్లాటు కొనుగోలు చేసిన వ్యక్తి మరోసారి విచారణకు హాజరైన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే విషయం తెలుసుకుని ఠాణాకు తరలివచ్చిన బాధితులు తమ ప్లాట్లు వదిలేయలంటూ వేడుకోలు -
నేటి నుంచి తెలంగాణ తొలి విత్తన పండుగ
ఏర్పాట్లను పరిశీలించిన నిర్వాహకులు కడ్తాల్: అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ తొలి విత్తన పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం ఆమె సంస్థ ప్రతినిధులతో కలిసి ఎర్త్ సెంటర్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విత్తన పండుగకు దేశ నలుమూలల నుంచి రైతులు, నిపుణులు పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 50 స్టాల్స్‌లో సంప్రదాయ విత్తనాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఆమె వెంట సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, సంస్థ నిర్వాహకులు జేఏఎస్‌ఆర్ అన్నమయ్య, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. శభాష్.. బలరాం నాయక్ కొడంగల్: ఆస్తి పన్ను వసూలులో చొరవ చూపి న కొడంగల్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్‌ను సీడీఎంఏ(కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టీకే శ్రీదేవి అభినందించారు. గురువారం హైదరాబాద్‌లో ని సీడీఎంఏ కార్యాలయంలో ప్రశంసా పత్రంఅందజేశారు. మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను వసూలులో ముందున్నారని కొనియాడారు. మెరుగైన ప్రతిభ కనబరచి 83 శాతం ఆస్తి పన్ను వసూలు చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఆయన చూపిన చొరవను అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. అవినీతి జలగలపై విచారణ అర్బన్ పార్కులో పర్యటించిన విజిలెన్స్ అధికారులు బషీరాబాద్: తాండూరు అర్బన్ పార్కులో జరిగిన అక్రమాలపై అటవీశాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.పార్కులో రూ.16 లక్షల నిధులతో చేపట్టిన వాకింగ్ పాత్ పనుల్లో బీట్ ఆఫీసర్ మల్లయ్య, సెక్షన్ అధికారి ఫీర్యా నాయక్ అవినీతికి పాల్పడినట్లు ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే వికారాబాద్ డీఎఫ్ఓ ప్రాథమిక విచారణ జరపగా, మార్చి 27వ తేదీ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. గురువారం స్టేట్ ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్ ఓ ముకుంద్‌రెడ్డి ఆధ్వర్యంలో మరోసారి విచా రణ చేపట్టి.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారులనూ ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం తాండూరు రేంజ్ కార్యాలయంలో రికార్డులను, బషీరాబాద్ మండలం గొట్టిగా కళాన్ గ్రామంలో అటవీ భూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించారు. వికారాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు అనంతగిరి: జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా సమస్య ఏర్పడితే 08416–242136 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రం ప్రారంభం కొడంగల్: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డీఆర్డీఓ శ్రీనివాస్ ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ బాలకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు రైతు అస్వస్థత
గేదె దుర్మరణం శంకర్పల్లి: అకాల వర్షాల కారణంగా పలుచోట్ల గురువారం పిడుగుపాటు పడ్డాయి. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురంకి చెందిన రైతు యాభైగూడెం నర్సింహారెడ్డి గేదెలు మెపుతుండగా.. వర్షానికి చెట్టు కిందకి వెళ్లాడు. తన రెండు గేదెలు పక్కనే ఉన్న మరొక చెట్టు కింద ఉన్నాయి. ఒక్కసారిగా పిడుగుపాటు పడడంతో ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మరొక గేదెకి, రైతు నర్సింహారెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రైతుని పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు. కాసేపటికి ఆరోగ్య పరిస్థితి మెరుగయింది. గేదెని పశువైద్యులకు చూపించగా.. ప్రస్తుతం నిలకడ ఉన్నట్లు తెలిపారు. రైలు ఢీకొని 18 మేకల మృతి షాద్‌నగర్: రైలు ఢీకొని మేకలు మృతి చెందిన ఘటన గురువారం షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం కృష్ణయ్యయాదవ్కు చెందిన మేకలను మేత మేసేందుకు రైల్వే ట్రాక్ పక్కకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడ వెళ్లే రైలు వచ్చింది. ఆ శబ్దానికి అవి ఒక్కసారిగా భయపడి పట్టాల పైకి పరుగులు తీశాయి. దీంతో రైలు ఢీకొని 18 మేకలు మృతి చెందాయి. దాదాపు రూ.మూడు లక్షల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. కారు ఢీకొని జింక మృతి యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై గునుగల్ అటవీ ప్రాంతం వద్ద కారు ఢీకొని జింక మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీశైలం గురువారం ఉదయం తన కారులో సాగర్ రోడ్డు నుంచి నగరానికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో గునుగల్ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింక కారుకు అడ్డంగా వచ్చింది. దీంతో ఢీకొనడంతో జింకకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దానికి అటవీ అధికారులు దహనం చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమష్టి కృషితోనే సత్ఫలితాలు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ రెండో విడత విజయవంతంగా పూర్తయిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ అందరి సమష్టి కృషితో సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంతకు మించి కష్టపడతామని వెల్లడించారు. ఇదే స్ఫూర్తి తో జున్ నాటికి మిగతా మాన్ హోళ్లను కూడా డీ సిల్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. వర్షాకాలంలోగా సీవరేజ్ పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. అక్టోబర్ 2 నుంచి మార్చి 30 వరకు 180 రోజులు డీ సిల్టింగ్ పనులు చేపట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 24,146 ప్రాంతాల్లో 3,185 కిలో మీటర్ల సీవరేజ్ పైపులైన్, 2.50 లక్షల మ్యాన్ హోళ్లలో డీ–సిల్టింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజ్ ఫిర్యాదులను విశ్లేషించినట్లు చెప్పారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో చోకేజీ, రోడ్లపై సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలను గుర్తించామని, రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై దృష్టి సారించి పరిష్కరించినట్లు ఆయన వివరించారు. -
సుపారీ ఇచ్చే నా భర్తను చంపారు
మహేశ్వరం: భూ తగాదా వ్యవహారంలోనే తన భర్తను కారుతో ఢీకొట్టి హత మార్చారని మండలంలోని కల్వకోల్‌కు చెందిన కమల ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం పిల్లలు, బంధువులతో కలిసి ఆమె మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్య(52) కారు– బైక్ ఢీకొన్న ప్రమాదంలో బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అన్ని కోణాల్లో విచారిస్తాం మృతుడి భార్య కమల మాట్లాడుతూ.. తన భర్తను డ్రైవర్ ప్రశాంత్‌కి సుపారీ ఇచ్చి కారుతో వెనుక నుంచి ఢీకొట్టి దాయాదులు చంపారని ఆరోపించారు. భూ తగాదా విషయంలో కోర్టులో తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని తెలియడంతో దాయాదులు హత్యకు పూనుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోలీస్‌స్టేషన్ నుంచి కదిలేది లేదన్నారు. విచారణ చేస్తున్న ఎస్ఐ వెంకట్‌రెడ్డిని మార్చాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి చేరుకొని మృతుడి భార్య, పిల్లలు, బంధువులతో మాట్లాడారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని అన్ని కోణాల్లో విచారించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు వెంకట్‌రెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. దాయాదులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి ఆందోళన డీసీపీ హామీతో సద్దుమణిగిన వ్యవహారం -
సిగరెట్లు అమ్మడం లేదన్నందుకు
మేడ్చల్‌రూరల్: సిగరెట్లు అమ్మడం లేదని చెప్పినందుకు హోటల్లో పని చేసి వ్యక్తితో పాటు యజమాని, అతడి కుమారుడు, కుమార్తైపె దాడి చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక వినాయక్‌నగర్ కాలనీకి చెందిన రాజేశ్ చతుర్వేది సోమారం గ్రామ పరిధిలోని రిలాన్స్ గోదాం సమీపంలో హోటల్ నిర్వహిస్తున్నాడు. సదరు హోటల్లో దివాకర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. గత నెల 30న రాత్రి సమీపంలోని బండమైలారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హోటల్‌కు వచ్చి సిగరేట్లు కావాలని అడిగారు. సిగరేట్లు అమ్మడం లేదని దివాకర్ చెప్పడంతో ఆగ్రహానికి లోనైన వారు అతడిపై దాడి చేశారు. దీనిపై అతను యజమాని రాజేశ్ చతుర్వేదికి సమాచారం అందించడంతో అతను తన కుమార్తె శివానీ, కుమారుడు కృష్ణతో కలిసి హోటల్ వద్దకు వచ్చి వారికి సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన 20 మంది యువకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజేశ్ చతుర్వేదితో పాటు అతడి కుమార్తె, కుమారుడికి గాయాలయ్యాయి. అడ్డుగా వచ్చిన రాకేశ్ చతుర్వేది అనే వ్యక్తిపై కూడా వారు దాడి చేశారు. ఈ విషయం ఎవరికై నా చెపితే చంపుతానని బెదిరించారు. ఈ విషయమై బాధితులు మర్నాడు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ నిర్వాహకులపై దాడి -
బలహీనత ఖరీదు రూ.1.57 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువకుడి చిన్న బలహీతన రూ.1.57 లక్షలు నష్టపోవడానికి కారణమైంది. ఆన్లైన్లో కనిపించిన ఎస్కార్ట్ సర్వీస్ ప్రకటనకు ఆకర్షితుడైన సదరు యువకుడు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువకుడిని నిర్ణీత మొత్తం చెల్లిస్తే ఏకాంత సేవలు అందిస్తాం అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటన ఆకర్షించింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్లో సంప్రదించగా... ఈ సేవల కోసం రూ.4 వేలు చెల్లించాలని అవతలి వారు చెప్పారు. తొలుత తమకు రూ.500 చెల్లించాలని, ఆపై తాము సేవలు అందించే యువతితో పాటు చేరుకోవాల్సిన హోటల్ వివరాలు అందిస్తామన్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని సూచించారు. దీంతో సదరు యువకుడు వారు సూచించిన ఖాతాకు రూ.500 చెల్లించాడు. ఆపై ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు మిగిలిన మొత్తం కూడా బదిలీ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా యువకుడి నుంచి వీలున్నంత ఎక్కువ గుంజాలని పథకం వేశారు. దీనిని అమలులో పెడుతూ సెక్యూరిటీ డిపాజిట్, ఐడీ వెరిఫికేషన్ పేమెంట్, పోలీస్ వెరిఫికేషన్ అండ్ సేఫ్టీ పేమెంట్ పేరుతో డబ్బు వసూలు చేశారు. అతడికి అనుమానం వచ్చిన ప్రతిసారీ రూ.4 వేలు మినహా మిగిలింది రిఫండ్ అవుతుందని నమ్మించారు. ఓ దశలో రెండు నిమిషాల్లో రిఫండ్ మొత్తం వస్తుందంటూ మరికొంత, వేగంగా రిఫండ్ కావాలంటే తప్పదంటూ రెట్టింపు మొత్తం బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.1,57,381 బదిలీ చేయించుకున్న తర్వాత ‘ప్రాసెస్ పూర్తయింది. నగదు రిఫండ్ చేయడానికి మీ బ్యాంకుఖాతా వివరాలు పంపండి. మీ బుకింగ్ ఐడీ, హోటల్ పేరు, రూమ్ నెంబర్ తదితరాలు లోకంటో.కామ్ అనే వెబ్సైట్లో పొందుపరుస్తాం’ అనే సందేశాన్ని యువకుడికి పంపారు. దీంతో అనుమానించిన అతగాడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తాను మోసపోయినట్లు గుర్తించాడు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆన్లైన్లో ఎస్కార్ట్ సర్వీస్ ప్రకటనలు ఆకర్షితుడైన నగరానికి చెందిన యువకుడు రిఫండ్ అంటూ ఎర వేసి ఆ మొత్తం స్వాహా సీసీఎస్‌లో కేసు నమోదు -
డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడి అరెస్టు
బంజారాహిల్స్: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–11 తాడిపత్రి బిర్యానీ సెంటర్ సెంటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వెస్ట్‌గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన కోపర్తి సాయి మణికంఠ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగా 07 గ్రాముల కొకై న్, 3.7 గ్రాముల ఎక్టసీ పిల్స్ లభించాయి. ఓ పెడ్లర్ నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పోలీసులు అతడి వద్ద నుంచి మత్తు పదార్థాలు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడి దారుణ హత్య అత్తాపూర్: గంజా యి మత్తులో జరిగిన ఘర్షణలో ఓ బాలుడిని బండరాళ్లతో మోది హత్య చేసిన సంఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు కథనంమేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్డెన్ సిటీ హసన్‌నగర్ ప్రాంతానికి చెందిన రఫిక్ కుమారుడు రహీం(14) ఆవారాగా తిరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడిన అతను ఇతరులతో గొడవ పడుతూ ఉండేవాడు. గురువారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన రహీంకు అతని స్నేహితులతో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఓ బాలుడు అతడి తలపై బండరాయితో మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి తండ్రి రఫిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని టోకరా హోంగార్డుపై కేసు నమోదు పంజగుట్ట: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన హోంగార్డుపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్, ప్రతాప్ సింగారం ప్రాంతానికి చెందిన సునీల్ గౌడ్‌కు తన స్నేహితుల ద్వారా చంద్రప్రకాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చంద్రప్రకాష్ ఒక పోలీస్ ఉన్నతాధికారి వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. 2024లో సునీల్ తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానని, గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి పరీక్ష రాసిందని చంద్రప్రకాష్‌కు చెప్పాడు. దీంతో చంద్రప్రకాష్ తాను ఉన్నతాధికారులతో మాట్లాడి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పి రూ. 3 లక్షలు తన అకౌంట్‌కు ట్రాన్స్వర్ చేయించుకున్నాడు. మరో రూ.3 లక్షలకు చెక్కులు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోక పోగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సునీల్ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్ శ్రేణులో జోష్
● కడ్తాల్‌లో హరీశ్‌రావుకు ఘన స్వాగతం ● భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు కడ్తాల్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. మండలంలో గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిల పర్యటన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. హరీశ్‌రావు రాకను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, మాజీ జెడ్పీటీసీ దశరథ్‌నాయక్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం తదితరుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, గిరిజన మహిళలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. దొడ్డి కొమురయ్యకు నివాళి పర్యటనలో భాగంగా హరీశ్‌రావు మండల కేంద్రంలో సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిలో నాయకులతో కలిసి పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఎక్వాయిపల్లి సమీపంలోని అర్జున్‌రావు ఫాం హౌస్‌లో కాసేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ జెండావిష్కరణ అనంతరం ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, ముద్వీన్‌లో గ్రామంలో పార్టీ నాయకుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్వీన్ గ్రామంలో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 లక్షలు వెచ్చించి షేడం యాదమ్మకు నిర్మించిన ఇంటిని నాయకులతో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. మాజీ మంత్రి పర్యటన ఆద్యంతం సందడిగా సాగింది. ఎటు చూసిన గులాబి జెండాలతో నిండిపోయింది. బోయిన్‌గుట్ట బహిరంగ సభలో హరీశ్‌రావు ప్రసంగం కార్యకర్తలు, నాయకుల్లో జోష్ నింపింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్,మాజీ ఎంపీపీలు శ్రీనివాస్‌యాదవ్, జైపాల్‌నాయక్,మాజీ సర్పంచ్లుయాదయ్య, నర్సింహగౌడ్, లచ్చిరామ్‌నాయక్ ,పత్యానాయక్, రామకృష్ణ, మహేశ్,అంజ్యానాయక్, విజయ్‌గౌడ్, వీరయ్య, నరేశ్ తదితరులు ఉన్నారు. -
లీజు ముగిసినా క్వారీని వదలట్లేదు
సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని క్వారీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలో క్వారీ లీజు గడువు ముగిసినా యజమానులు అక్కడ నుంచి ఖాళీ చేయకుండా స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆరా తీసేందుకు వెళ్లిన రంగనాథ్ సమీపంలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో దాదాపు 400ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో 78 ఎకరాలను లీజుకు తీసుకున్న వారితో హైడ్రా కమిషనర్ వచ్చే వారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. గాజులరామారం నుంచి శేరిలింగంపల్లి వెళ్లిన ఆయన నల్లగండ్ల చెరువు నాలాను పరిశీలించారు. నాలా విస్తీర్ణం తగ్గకుండా చూడాలని, అక్కడ పోసిన మట్టిని తొలగించాలని వెర్టెక్స్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఈ సందర్భంగా నాలాతో పాటు బఫర్ జోన్‌కూ ఆటంకం లేకుండా నిర్మాణాలు చేయపడతామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. గోపన్నపల్లి, పుప్పాలగూడలకు వెళ్లిన కమిషనర్ మేల్లకుంట, మామాసానికుంటలను పరిశీలించారు. సర్వే నంబర్ల ప్రకారం చెరువుల హద్దులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదులు గాజులరామారంలో పర్యటించిన రంగనాథ్ మరో మూడు ప్రాంతాలకు వెళ్లి పరిశీలనలు -
వామ్మో పహాడీషరీఫ్!
పహాడీషరీఫ్: నగర శివారుగా ఉన్న పహాడీషరీఫ్ పరిసరాలను నేరస్తులు తమకు అనువైన ప్రాంతంగా ఎంచుకుంటున్నారు. ఏదైనా నేరం చేయాలన్నా.. చేసిన నేరానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయాలన్నా ఈ ప్రాంతమే సరైనదిగా భావిస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణాలు రూపుదాల్చుకోకుండా నిర్మానుష్య ప్రాంతం అధికంగా ఉండడంతో ఏ తప్పైనా మూడో కంటికి కనబడకుండా చేయొచ్చన్న ఆలోచనకొస్తున్నారు. మూడు రోజుల క్రితం నిందితుడు అస్లాం జర్మనీ యువతిని ఈ ఆలోచనతోనే పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే స్టేషన్ పరిధిలో 2014లో చోటు చేసుకున్న స్నేక్‌గ్యాంగ్ ఘటన కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వెరసి ఇలాంటి ఘటనలతో ఈ ప్రాంతం నేరమయమైనదిగా అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుంది. అసాంఘిక కార్యకలాపాలు నగరంలో విద్యనభ్యసిస్తున్న కొంత మంది కళాశాలల విద్యార్థులు తమ నీచ కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మామిడిపల్లి, జల్పల్లి మధ్యలో రెండు దశాబ్దాల క్రితం చేసిన లేఅవుట్లు నిర్మాణాలు లేకుండా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. భారీ చెట్లతో వనాన్ని తలపించే జల్పల్లి గ్రీన్ హోం వెంచర్లలో నిత్యం జంటలు వచ్చి ఏకాంతంగా గడుపుతున్నారు. ఇలాంటి వారితో క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. 2014లో ఇదే తరహాలో ఫాం హౌజ్‌లో గడిపేందుకు వచ్చిన జంటను గమనించిన స్థానికంగా క్రికెట్ ఆడుతున్న కొందరు యువకులు వారిని పాముతో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన(స్నేక్ గ్యాంగ్) తెలిసిందే. గతంలో పాతబస్తీ నుంచి సరాదా చేసేందుకు తుక్కుగూడ వైపు వచ్చిన ఓ ప్రేమ జంట గొడవపడి.. యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గరిగుట్ట పరిసరాలలో కూడా ఇలాంటి ప్రభావమే ఉంది. పోలీసు అధికారులు ఇలాంటి ప్రాంతాలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎక్కడో హత్య చేసి.. ఇక్కడ పడేసి తమ శత్రువులను ఎక్కడో హత్య చేస్తున్న నిందితులు అర్ధరాత్రి వేళ మృతదేహాలను తీసుకొచ్చి స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలలో పడేస్తున్నారు. దీంతో ఉదయాన్నే చూస్తున్న పోలీసులు కేసు ఛేదించేందుకు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. జల్పల్లి పెద్ద చెరువు, తుక్కుగూడ హైవే పరిసరాలలోనే మృతదేహాలను పడేసేందుకు అనువైన స్థలంగా ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఇతర ప్రాంతాలలో హత్య చేసి ఇక్కడ పడేస్తుండగా.. మరికొన్ని సార్లు ఇక్కడ మద్యం పార్టీలు చేసుకుంటూ పథకంలో భాగంగా హత మారుస్తున్నారు. అధిక శాతం ఉత్తర భారతీయులే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవనోపాధి నిమిత్తం నగరానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. వారంతా పహాడీషరీఫ్ ఠాణా పరిసరాల్లో ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారు హత్యకు గురవుతుండడం.. ఒక్కోసారి వీరే హత్యలు చేసి తమ స్వరాష్ట్రాలకు పారిపోతుండడంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి నెలకొంటుంది. వీరితో పాటు పాతబస్తీ నుంచి వచ్చి కూడా ఇక్కడ హత్యలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. చాలా వరకు ఎక్కడో హత్య చేసి పహాడీషరీప్ పోలీస్‌స్టేషన్ పరిసరాలలో పడేసిన మృతదేహాలలో పోలీసులు కేసులను ఛేదించినప్పటికీ.. ఇంకొన్ని మాత్రం ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. నేరస్తులకు అడ్డాగా మారిన వైనం నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ ఘటనలు నిఘా పెంచాలని స్థానికుల విన్నపంమచ్చుకు కొన్ని ఘటనలు 2023 ఏప్రిల్ 12న బడంగ్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే నిందితుడు సైదమ్మ అనే మహిళను హత్య చేసి రాత్రిపూట కారులో తీసుకొచ్చి తుక్కుగూడ హైవేపై పడేసి పరారయ్యాడు. 2023 మే 25న యూపీకి చెందిన పూరన్‌సింగ్(30)ను అతని ప్రియురాలు, మరికొందరు కలిసి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి, సూరం చెరువులో పడేశారు. 2021 ఆగస్టు 3న జల్పల్లి కార్గో రోడ్డు పక్కన గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండేళ్లు కావొస్తున్నా మృతుడు ఎవరో.. హత్య చేసిందెవరో తెలియరాలేదు. మామిడిపల్లిలోని ఎస్ఎస్పీడీఎల్ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న గెస్ట్ హౌజ్‌లో 2016 జూన్ 25న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రమాకాంత్ పాండే(40) దారుణ హత్యకు గురయ్యాడు. వెంచర్లోకి తాను తీసుకొచ్చిన ఓ యువతి, యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావించినప్పటికీ వారు ఇంకా దొరకలేదు. 2016 ఆగస్టు 13న పహాడీషరీఫ్–మామిడిపల్లి రహదారి పక్కన ఉన్న ఓ ప్రైవేట్ సంస్థ ఆవరణలో 25 ఏళ్ల గుర్తు తెలియని యువకుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. -
రేషన్ బియ్యం అవకతవకలపై ఫిర్యాదు
కందుకూరు: జాతీయ ప్రజా పంపిణీ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో డీలర్ అవకతవకలకు పాల్పడుతున్నాడని మండల పరిధిలోని జైత్వారం గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్‌కు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇచ్చే బియ్యం కాంటలో మోసం చేస్తూ చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. రేషన్ షాపులో ఓ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇచ్చారు. అనంతరం అతడు బయట తూకం వేయగా ఒక్క కిలో తగ్గిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓర్సు వెంకటేష్, కుమ్మరి నర్సింహ, చల్లా జైపాల్‌రెడ్డి, నవీన్, మహేందర్, పాండు, అజయ్, కార్తీక్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. -
పైలెట్‌పై గంపెడాశలు!
యాచారం: కూరగాయలు సాగు చేసే అన్నదాతలు పైలెట్ ప్రాజెక్టుపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ముందుకెళ్తామని చెబుతున్నారు. మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లి గ్రామాలు కూరగాయలు, ఆకుకూరల సాగుకు ప్రసిద్ధి. మూడింటిలో దాదాపు 1200 మందికి పైగా రైతులు కూరగాయలు, ఆకుకూరల సాగుపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకుంటూ టమాట, బెండ, చిక్కుడు, కాకర, వంకాయ, సొర, పుదీన, కొత్తిమీర, మెంతి, పుంటికూర తదితరాలను పండిస్తున్నారు. నిత్యం వాటిని ప్రైవేట్ వాహనాల్లో నగరంలోని మాదన్నపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తారు. కమిషన్‌తో మళ్లీ ఆశలు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా ముదిరెడ్డి కోదండరెడ్డి నియమితులైనప్పటి నుంచి స్థానిక రైతుల్లో ఆశలు చిగురించాయి. మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లి గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహించనున్నారు. రైతు కమిషన్ ద్వారా ఆ మూడు గ్రామాల్లోని రైతులకు నాబార్డు భాగస్వామ్యంతో కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి నిర్ణయించారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖల ఆధ్వర్యంలోని అధికారుల బృందం అక్కడ ఏఏ సౌకర్యాలు కల్పిస్తే సాగుశాతం పెరుగుతుందో గుర్తించారు. మొదటి విడతగా 250 మంది అన్నదాతల నుంచి వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రిప్పు, స్ప్రిక్లర్లు, పైపులైన్లు, నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు, నెట్ షెడ్లు, తేనె, పట్టుపరిశ్రమకు అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. వీటి పంపిణీపై కమిషన్ శ్రద్ధ వహించనుంది. దీంతో స్థానిక కర్షకులు సంబర పడుతున్నారు. మొండిగౌరెల్లి, చౌదర్పల్లి, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో కూరగాయల సాగు ఎంపిక చేసిన రైతు కమిషన్ రాయితీపై పరికరాలు, విత్తనాలు, ఎరువులు అందించేందుకు కసరత్తు -
భక్తి మార్గంలో నడవాలి
చేవెళ్ల: లోక రక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ వక్తలు డాక్టర్ దయానందస్వామి, భాస్కరయోగిలు అన్నారు. మండలంలోని గొల్లగూడలో జరుగుతున్న సచ్చిదానంద సాయన్నార్యుల 51వ వార్షికోత్సవం, శ్రీసాందీప అచల రుషి పరిపూర్ణ గురుమందిర్ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉదయం నుంచి గురుమందిరంలో వ్యవస్థాపకులు దయానంద నాగుల వెంకటేశం రాజయోగి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దయానందస్వామి, భాస్కరయోగి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని సూచించారు. లోక కల్యాణం కోసం గురుబోధనల వ్యాప్తిని చేసుకుంటూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అచల రుషి గురు బోధనలు విలువైనవని చెప్పారు. కార్యక్రమంలో వివేకానంద రమణ, వెంకట్‌రెడ్డి, నాగేశ్వరరావు, దయానంద, తిరుపతయ్య, చక్రపాణి, చెన్నయ్య, రాజేంద్రప్రసాద్, అనంత్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
మల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
● ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన మద్దతుదారులు ఇబ్రహీంపట్నం: స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర పారా మెడికల్ వైద్యుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఉక్కుల అశోక్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన మల్‌రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి దీక్షకు మద్దతు తెలిపారు. అశోక్‌తోపాటు పలువురు ఆర్ఎంపీలు శిబిరంలో కూర్చున్నారు. -
బైక్‌ను ఢీకొన్న కారు
మహేశ్వరం: ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని కల్వకోల్ గేటు సమీపంలో మన్సాన్పల్లి చౌరస్తా–దుబ్బచర్ల మధ్యలో చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్య(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన మహేశ్వరానికి వ్యక్తిగత పని మీద బైక్‌పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన కొండని ప్రశాంత్ కారులో వస్తూ కల్వకోల్ చౌరస్తా వద్ద ముందున్న బైక్‌ను వెనుకాల నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకరయ్య తలకు బలంగా దెబ్బ తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రోడ్డుపై వెళ్లే వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. దాయాదులపై ఫిర్యాదు ఇదిలా ఉండగా తన భర్త శంకరయ్య మృతి పట్ల అనుమానాలున్నాయని భార్య కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల నుంచి తమకున్న భూమిపై దాయాదులతో వివాదం ఉందన్నారు. ఇటీవల కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని తన భర్త చెప్పాడన్నారు. భూమి దక్కదనే ఆలోచనతో దాయాదులు కారు డ్రైవర్‌కు సుపారి ఇచ్చి రోడ్డు ప్రమాదం చేయించి హత్య చేయించారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. గ్రామంలో శంకరయ్య మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. ● అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం ● మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబీకులు ● కల్వకోల్ గ్రామంలో విషాదం -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ బొలెరో వాహనం రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందిన సంఘటన శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని గణేష్‌నగర్‌కి చెందిన లక్ష్మమ్మ(70) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మంగళవారం రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి షాద్‌నగర్: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఉదయం బూర్గుల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాచిగూడ డెమో రైలు ఢీకొని తీవ్ర గాయల పాలయ్యాడు. గమనించిన స్థానికులు షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించగా పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా డాక్టర్ అబ్దుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కాచిగూడ రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో లైన్మెన్లు, ఆర్టిజన్లే కీలకం సందీప్‌కుమార్ సుల్తానియా సాక్షి, సిటీబ్యూరో: నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో ఆర్టిజన్లు, లైన్మెన్ల పాత్రే కీలకమని ప్రభుత్వ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు. వారి పనితీరు, వ్యవహారశైలిపైనే సంస్థ అభివృద్ధి, ప్రతిష్ట ఆధార పడి ఉందన్నారు. ఈ మేరకు బుధవారం విద్యుత్ సరఫరా, సంస్థాగతంగా ఎదురవుతున్న ఇబ్బందులపై బంజారాహిల్స్ సర్కిల్ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వినియోగదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై తక్షణమే స్పందించే గుణంతో పాటు స్నేహపూర్వకంగా వ్యవహరించడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావొచ్చని సూచించారు. వేసవిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు. డిమాండ్‌కు తగ్గట్టే సరఫరా ఈ యాసంగిలో విద్యుత్ డిమాండ్ 17162 మెగావాట్లకు చేరిందని తెలిపారు. గత వేసవితో పోలిస్తే..ఈ సారి గరిష్ట ఉష్ణోగ్రతలు కొంత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగే ఛాన్సు ఉందని, ఆ మేరకు సరఫరా చేసేందుకు సంస్థ సంసిద్ధంగా ఉందని తెలిపారు. గత ఏడాది గ్రేటర్లో 4352 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని తెలిపారు. ఈసారి ఏకంగా 5000 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. సిటీలో దొడ్డు బియ్యమే! సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిస్తే కానీ, సన్న బియ్యం పంపిణీ జరిగే అవకాశాలు కానరావడం లేదు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. విత్‌డ్రాల అనంతరం ఎన్నిక ఏకగ్రీవమైతే 10వ తేదీ తర్వాత కోడ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఎన్నికల బరిలో అభ్యర్థులు మిగిలి ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నెల 29 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఆ తర్వాతనే సన్నబియ్యం జరిగే అవకాశాలున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ కోటా నుంచి బియ్యం కేటగిరి మారుతుండటంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖ ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరినా..ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. దీంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది. దొడ్డు బియ్యంపై అనాసక్తి జీహెచ్ఎంసీ పరిధిలోని ఆహార భద్రత(రేషన్) లబ్ధి కుటుంబాలు దొడ్డు బియ్యంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అర్బన్ పరిధిలో సుమారు 12.56 లక్షల రేషన్ కార్డులుండగా, అందులో బుధవారం నాటికి కేవలం 20 వేల కుటుంబాలు మాత్రమే ఈ నెల కోటా డ్రా చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నెల 17న హైదరాబాద్, 23న రంగారెడ్డి జిల్లాలో, 20న మేడ్చల్మల్కాజిగిరి అర్బన్ పరిధిలో నెల వారి కోటా గడువు ముగియనుంది. -
సిద్ధం
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025విత్తన పండుగకు 8లోuకడ్తాల్: తెలంగాణ తొలి విత్తన పండుగకు మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్ సెంటర్ ముస్తాబవుతోంది. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో విత్తన పండుగ నిర్వహించనున్నారు. ఆరోగ్యానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. దేశీ విత్తనాల ప్రదర్శన, ఉచిత పంపిణీ, విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, పాలసీ మేకర్స్‌ని ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ, పర్యావరణ నిపుణులతో పాటు, పాలసీ మేకర్స్ పెద్ద ఎత్తున తరలిరానున్నారని వారు వివరించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నర్సింహా రెడ్డి, పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, సాయి ప్రభాకర్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు. విత్తన పండుగ లక్ష్యాలు ● విత్తనాలను భద్రపరచడం, ఉపయోగించడం, పంచుకోవడం, ఒక ఉద్యమంగా చేయడం. ● విత్తనాలను గుర్తించడంలో, దాచుకోవడంలో, పెంపొందించుకోవడంలో స్థానికుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ● మన వృక్ష జాతులు, జంతు జాతులను కాపాడుకోవడంతో పాటు, వాటికి సంబంధించిన సహజ సాంస్కృతిక పద్ధతులను సంప్రదాయాలను గౌరవించుకోవడం. ● రైతులు, ఆదివాసులు, అటవీ ప్రజలు, కొండ ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తదితర జీవనోపాధులతోపాటు భవిష్యత్ తరాల విత్తన హక్కులను కాపాడుకోవడం. ● స్థానిక ప్రజల అవసరాలు, ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రకృతి వ్యవసాయానికి, జీవ వైవిద్య, అటవీ సంరక్షణకు తోడుగా ఉండటం. ● సహజ సంపదను కాపాడుతూ, పరిపుష్టికి ప్రయత్నాలు చేస్తూ, స్థిరమైన జీవనోపాధులు, సంప్రదాయ జ్ఞానాన్ని కొనసాగించడం. ● స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతు ప్రకృతి అనుకూల విత్తన విధానాల కోసం కలిసికట్టుగా పనిచేయడం. సదస్సు ప్రత్యేకత ● వివిధ పంటలకు సంబంధించి రకరకాల సంప్రదాయ విత్తన జాతుల ప్రదర్శన. ● రైతులు, విత్తన సంరక్షకులు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలతో నేరుగా మాట్లాడే అవకాశం. ● పోస్టర్లతో, డాక్యుమెంట్లతో, ఫొటోగ్రాప్స్తో ప్రదర్శన. ● ప్రముఖ వ్యవసాయ రంగ, పర్యావరణరంగ నిపుణుల ప్రసంగాలు, ప్రదర్శనలు, వర్క్‌షాపులు, సెమినార్లు. ● పుస్తకాలు, ప్రకృతి అనుకూల ఉత్పత్తులు, సంప్రదాయ కళలు, హస్త కళా ప్రదర్శన, విక్రయాలు. ● విత్తనాలు ఇచ్చి పుచ్చుకోవడం, పంచుకోవడం. ● స్వదేశీ, అటవీ, సేంద్రియ రసాయన రహిత ఆహారం అందుబాటులో ఉంచడం. ● సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, పాటలు, గిరిజన నృత్యాలు. న్యూస్రీల్ముస్తాబవుతున్న అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్‌సెంటర్ రేపటి నుంచి మూడురోజుల పాటు వేడుకలు దేశంలోని పలు రాష్ట్రాల దేశీ విత్తనాల ప్రదర్శన తరలిరానున్న వ్యవసాయ నిపుణులు, పాలసీ మేకర్స్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు -
పేదల ఇంటి స్థలాలకు విముక్తి కల్పించాలి
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం కబ్జాలో ఉన్న పేదల ఇంటి స్థలాలకు రేవంత్ సర్కార్ విముక్తి కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఇంటి స్థలాల బాధితులతో బుధవారం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు 60 గజాల చొప్పున 600 మందికి పంపిణీ చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్ని పేద ప్రజలకు భూములను పంచుతానన్న కేసీఆర్... పదేళ్ల కాలంలో కనీసం పేదల ఇంటి స్థలాలను విడిపించలేకపోయారని విమర్శించారు. ప్రజా సర్కార్ అని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలకు ఇంటి స్థలాలు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రవీంద్రచారి మాట్లాడుతూ.. ఫిలింసిటీ కబ్జాలోని ఇంటి స్థలాలను లబ్ధిదారులకు ఇవ్వకుంటే వేలాది మంది పేదలతో గుడిసెలు వేయించి మరో భూపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కావాలి నర్సింహ, ముత్యాల యాదిరెడ్డి, పొచమోని నీలమ్మ, మొలుగు నర్సింహ, శివరాల లక్ష్మయ్య, నర్సింహ, శ్రీహరి, అంజయ్య, సీతయ్య పాల్గొన్నారు. -
ఫార్మాసిటీ భూముల పరిశీలన
యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్, పట్టా భూములను బుధవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా శాంతియుతంగా నచ్చజెప్పి సేకరించిన భూములను సర్వే చేసి, ఫెన్సింగ్ వేసేలా చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజుకు సూచించారు. మరోవైపు నేటి నుంచి మొదలయ్యే సర్వే 40 నుంచి 60 రోజుల్లోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో ఇద్దరు ఆర్ఐలు, ఇద్దరు సర్వేయర్లు, మరో ఆరుగురు రెవెన్యూ, టీజీఐఐసీ సిబ్బంది సర్వేలో పాల్గొననున్నారు. వీరే కాక ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డితో పాటు ఏసీపీ కేపీవీ రాజు ఇతర ఉన్నతాధికారుల బృందం సైతం సర్వే, ఫెన్సింగ్ వేసే విషయంలో భాగస్వాములు కానున్నారు. -
పరిష్కారం కాక.. తిరగలేక !
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లికి చెందిన పాతూరి మహేశ్వరికి రాందాస్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 41/25లో మూడున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. కాసుల పహాణి, పైసలపట్టి, ఇతర రెవెన్యూ రికార్డుల్లోనూ పట్టా భూమిగా రికార్డయింది. ఈ సర్వే నంబర్లో వెయ్యి ఎకరాలకుపైగా భూమి ఉంది. ఓ అజ్ఞాత వ్యక్తి వేసిన కేసుతో అధికారులు (ఇదే సర్వే నంబర్లో ఓ రియల్టర్ వేసిన వెంచర్‌ను మినహాయించి చిన్న, సన్నకారు రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు) సర్వే నంబర్ మొత్తం బ్లాక్ చేశారు. రైతులందరి భూములను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. బాధితురాలు మహేశ్వరి నిషేధిత జాబితా నుంచి తమ భూమికి విముక్తి కల్పించాలని కోరుతూ 2023 ఆగస్టు 10న టీఎం 15 మాడ్యుల్ కింద దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇచ్చిన దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు బాధితురాలు తహసీల్దార్, ఆర్డీఓను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో 2025 ఫిబ్రవరి 22న మళ్లీ అదే మాడ్యుల్ కింద దరఖాస్తు చేసుకుంది. అయినా సంబంధిత అధికారుల నుంచి కనీస స్పందన లేదు. ఇంటి ఖర్చులు, ఇతర అవసరాల కోసం భూమిని అమ్ముకుందామంటే స్లాట్ బుక్కాని పరిస్థితి’. ఇదీ కేవలం మహేశ్వరికి ఎదురైన అనుభవం మాత్రమే కాదు.. జిల్లాలో 15,936 మంది భూ బాధితులు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా పట్టా భూములను అసైన్డ్ భూములుగా రికార్డు చేయడం.. ఒకరిద్దరు భూ యజమానుల మధ్య నెలకొన్న వివాదాన్ని మొత్తం సర్వే నంబర్‌కు ఆపాదించడం.. సరిహద్దు భూములను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చడం.. ఆ తర్వాత దళారుల ప్రమేయంతో వాటిని క్లియర్ చేయడం రెవెన్యూ యంత్రాంగానికి పరిపాటిగా మారింది. అదనపు కలెక్టర్ వద్దే అత్యధికంగా పెండింగ్ భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 12 లక్షల ఎకరాలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్, లావణి పట్టా భూములు ఉన్నాయి. పహాణీల ఆధారంగా ఆయా భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. పొజిషన్లో ఉన్న భూమికి, రికార్డుల్లో నమోదైన భూములకు పొంతనే లేదు. భూమికి మించి రికార్డులు ఉండటం, రైతుల పేరున పట్టాదారు పాసు పుస్తకాలు ఉండటం అధికారులను ఇక్కట్లకు గురి చేసింది. కొంతమంది అధికారులు రియల్టర్లు, డెవెలపర్లతో కుమ్మకై ్క పట్టా భూములను అసైన్డ్ భూములుగా, సీలింగ్ భూములను పట్టా భూములుగా పోర్టల్‌లో నమోదు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. భూములు నిషేధిత జాబితాలో ఉన్న విషయం తెలిసి.. జాబితా నుంచి వాటిని తొలగించాల్సిందిగా కోరుతూ భూ యజమానుల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. ఇలా ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌కు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో మెజార్టీ దరఖాస్తులను కలెక్టర్ క్లియర్ చేశారు. కొన్ని వివాదాలు అలాగే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. అప్పటి వరకు కేవలం కలెక్టర్ లాగిన్‌లోనే పరిష్కారమయ్యే ధరణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు లాగిన్ సౌలభ్యం కల్పించి, వారి పరిధిలో పలు అంశాలకు పరిష్కారమార్గం చూపేలా చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో కాసులకు కక్కుర్తి పడి.. గత అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భూపాల్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ బాధ్యతలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బాధ్యతలు, అటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో పని భారం కారణంగా మెజార్టీ దరఖాస్తులు అదనపు కలెక్టర్ వద్దే పెండింగ్‌లో ఉండిపోయాయి. బాధితులు ఆయా రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ధరణిలో 15,936 దరఖాస్తులు పెండింగ్ నిషేధిత జాబితా, తప్పుల సవరణ ఎక్కువ ఏళ్లుగా బాధితుల ఎదురుచూపులు ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ పట్టించుకోని జిల్లా రెవెన్యూ యంత్రాంగం -
పౌరుషానికి ప్రతీక సర్వాయి పాపన్నగౌడ్
మొయినాబాద్: తెలంగాణ మట్టి పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేణట్ల మల్లేశ్‌గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను బుధవారం మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు. సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి భానిసత్వాన్ని ధిక్కరించి దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించి గోల్కొండ కోటను ఏలిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. నేటి తరం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు అంజయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, నాయకులు మహిపాల్‌గౌడ్, మల్లేష్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, అశోక్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, కౌకుంట్ల మల్లేష్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, బందయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ -
ట్రైకార్ బకాయి రుణాలు విడుదల చేయాలి
హుడాకాంప్లెక్స్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రైకార్ బకాయి రుణాలు రూ.219 కోట్లు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘాల జేఏసీ, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జర్పుల శివనాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ముడావత్ గోపీనాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సరూర్‌నగర్ మండల కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మానాయక్ మాట్లాడుతూ.. గిరిజనులకు సంబంధించిన ట్రైకార్ 2019–2020, 2021లో 30వేల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం గుర్తించి రూ.219 కోట్లు కేటాయించిందని, క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ నిధులను నేటికీ విడుదల చేయకుండా గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే బకాయి రుణాలు విడుదల చేయాలని కోరారు. లబ్ధిదారులు ఇతర రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో రిజెక్ట్ అవుతోందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ట్రైకార్ నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే ఈ నెల 7న గిరిజనులతో మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాపురం రఘు, కార్యనిర్వాహక అధ్యక్షులు కండాల వెంకటేశ్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
జలమండలికి ‘వరల్డ్ వాటర్’ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలిని వరల్డ్ వాటర్ అవార్డు వరించింది. వాటర్ డైజెస్ట్ అనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 2024–2025 సంవత్సరానికి గాను 19వ వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డుల కు ప్రభుత్వ కేటగిరీలో జలమండలి ఎస్టీపీని ఎంపిక చేసింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కార్య క్రమంలో జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ అవార్డు అందుకున్నారు. బుధవారం ప్రధాన కార్యాలయంలో ఆయన ఈడీ చేతుల మీదుగా ఎండీ అశోక్ రెడ్డికి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో అందరికీ తాగునీరు అందించడంతో పాటు.. మురుగును శుద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. నాగోల్ ఎస్టీపీ పర్యావరణ అనుకూలత, సమర్థంగా మురుగు నీటి శుద్ధి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో విశేష ప్రాముఖ్యతను చూపినందుకు నాగోలు ఎస్టీపీ ఈ అవార్డుకు ఎంపికైందని తెలి పారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఎస్టీపీ సీజీఎంలు పద్మజ, సుజాత, జీఎం కుమార్, డీజీఎం నిరుపమ పాల్గొన్నారు. -
నేడు కడ్తాల్ మండలంలో హరీశ్‌రావు పర్యటన
కడ్తాల్: మండలంలో గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించనున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ మేరకు బుధవారం బోయిగుట్ట, ముద్వీన్ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరీశ్‌రావు ఉదయం 10 గంటలకు మండలంలోని చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్‌గుట్ట తండాలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్, సంత్ సేవాలాల్ విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ముద్వీన్ గ్రామంలో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిర్మించిన ఇంటిని ప్రారంభిస్తా రని చెప్పారు. అనంతరం బోయిన్‌గుట్ట తండాలో బహిరంగ సభలో మాట్లాడతారని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహగౌడ్, నాయకులు వీరయ్య, రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం షాద్‌నగర్: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్– 2025 పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులను ఈనెల 19 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500 ఉంటుందన్నారు. గడువు దాటిన తర్వాత ఈనెల 21 వరకు రూ.100, ఈనెల 23 వరకు అయితే రూ.300 అపరాద రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని, పరీ క్ష రాసిన 12 రోజుల తర్వాత ఫలితాలు వెలువడుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. నేరాలను సహించేది లేదు పహాడీషరీఫ్: రౌడీషీటర్లు సామాన్యులను బెదిరించినా, దాడులకు పాల్పడినా ఉక్కుపాదంతో అణచివేస్తామని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి హెచ్చరించారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు బుధవారం ఆమె ఏసీపీ లక్ష్మీకాంత రెడ్డితో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలోని ప్రతి రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వారి ప్రవర్తన, పని చేసే చోట వ్యహరిస్తున్న తీరును పరిశీలిస్తున్నామన్నారు. బస్తీల్లో ఇరుగు పొరుగు వారిపై జులుం ప్రదర్శించడం, దాడులు, ఇతరత్రా నేరాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రవర్తనలో మార్పు లేని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చ రించారు. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కమ్యూనల్ షీట్లు కూడా తెరుస్తామన్నారు. కార్యక్రమంలో బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోండిషాద్నగర్: జిల్లా పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి జిల్లా రీజినల్ గిరిజన గురుకులాల కోఆర్డినేటర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు గిరిజన సంక్షేమ గురు కుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షాద్‌నగర్ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనం ఆవరణలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మెస్ మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ) పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలి పారు. మెస్ మేనేజర్‌కు ఎంఎస్సీ (హోం సైన్స్, డైటీషియన్, ఫుడ్‌సైన్స్, న్యూట్రీషియన్) అర్హత కలిగి ఉండాలని, ల్యాబ్ అసిస్టెంట్‌కు బీఎస్సీ (ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్) అర్హత ఉండాల న్నారు. జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 9లోపు రాజేంద్రనగర్‌లోని రీజినల్ గిరిజన గురుకులాల కోఆర్డినేటర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. -
కాంగ్రెస్ వచ్చాక నేరాలు పెరిగాయి
మీర్‌పేట: పహాడీషరీఫ్‌లో విదేశీ యువతిపై అత్యాచార ఘటన బాధాకరమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న జర్మనీకి చెందిన యువతిని మంగళవారం ఆమె పరామర్శించి మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తి పెంచుకుని నెల రోజుల క్రితం యువతి దేశానికి రావడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు ఎన్నో జ్ఞాపకాలు తనవెంట తీసుకెళ్దామనుకునే లోపే ఇలాంటి చేదు అనుభవం కలిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఆలయానికి వచ్చిన వివాహితపై, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, పోలీసులు పెట్రోలింగ్ కూడా సరిగ్గా చేయడం లేదని ఆరోపించారు. విదేశీ యువతి ఘటనలో ఫొటోలు, వీడియో రికార్డింగ్‌ల వంటి ఆధారాలన్నీ ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 22 శాతం నేరాలు పెరిగాయని దుయ్యబట్టారు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఇంత పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు, గృహహింసలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకుని నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిల్పారెడ్డి వెంట బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, గాజుల మధు, భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, రవినాయక్, రాజు, నీలారవినాయక్ తదితరులు ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి -
గొర్రెల మందపై కుక్కల దాడి వీధి కుక్కలు మందపై దాడి చేయడంతో 21 గొర్రెలు మృతి చెందగా మరో తొమ్మిది గాయపడ్డాయి.
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోuఇబ్రహీంపట్నంలోని ఓ రేషన్‌షాపు వద్ద లబ్ధిదారుల క్యూ నిజంగా వరమే.. పేదోళ్లకు సన్న బియ్యం పంపిణీ నిజంగా వరమే. స్టాక్ అయిపోతే కష్టమని క్యూలో నిలబడ్డాం. మొన్నటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యంతో వండిన అన్నం తినాలనిపించేదికాదు. సన్న బియ్యం ఇస్తుంటే సంతోషంగా ఉంది. ప్రతీ నెల ఇలాగే ఇవ్వాలి. – స్వరూప, ఇబ్రహీంపట్నం నిరుపేదలకు ఆసరా పేద, మధ్య తరగతి కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ ఆసరాగా నిలుస్తుంది. నేను కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాను. ఇంతకు ముందు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం అన్నం తినలేక పోయేవాళ్లం. ఒక్కొక్కరికి అరు కిలోల చొప్పున నలుగురికి కలిపి 24 కిలోలు వస్తాయి. డబ్బులు ఆదా అవుతాయి. – వెంకటేశ్, ఇబ్రహీంపట్నం బియ్యం బాగున్నాయి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం మంచి పరిణామం. బియ్యం కూడా చాలా బాగున్నాయి. ఈ పథకాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. – శారద, వెంకటేశ్వర కాలనీ, ఆమనగల్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం మంగళవారం జిల్లాలో ప్రారంభమైంది. ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద సందడి మొదలైంది. కొన్ని షాపుల వద్ద కొబ్బరిమట్టలు.. మామిడి తోరణాలు.. పూలదండలు కట్టి.. కొబ్బరికాయలు కొట్టి అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు విశేష ఆదరణ లభించింది. లబ్ధిదారులు బియ్యం తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. పలుచోట్ల బారులు తీరి కనిపించారు. ఇన్ని రోజులు నాణ్యత లేని దొడ్డు బియ్యం తినలేకపోయామని.. బయటి దుకాణాల్లో కొనుగోలు చేసేవారమని.. ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం బాగుందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. – సాక్షి, నెట్వర్క్ మాలాంటి పేదలకు సన్న బియ్యం అందించడం చాలా సంతోషం. ఎప్పటికీ ఇలాగే అందించాలి. పేదల బాధను అర్థం చేసుకుని సన్న బియ్యం అందించడం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. – ఎర్రోళ్ల పెంటమ్మ, కడ్తాల్ న్యూస్రీల్జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన పథకం రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల క్యూ ఉదయం నుంచే సందడి వాతావరణం -
మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించండి
రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల వినతి సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో అవకాశం కల్పించాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌కు వినతిపత్రాలు అందజేశారు. జాతీయ నేతలను కలిసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే డా.టి.రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఆరుగురు మంత్రులు నియమితులయ్యారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కీలకమైన జిల్లాల నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదని వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి కలిపి తెలంగాణ జనాభాలో 42 శాతం ఉన్నారని ఈ వినతిలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడంతో అభివృద్ధి, పాలనాపరమైన సమస్యలను పరిష్కరించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల సంక్షేమాన్ని ప్రభావితం చేయడమే కాకుండా తెలంగాణ పురోగతిపై, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ స్థితిపై విస్తృత ప్రభావాలు ఉండొచ్చని చెప్పారు. 2026లో జరగనున్న డీలిమిటేషన్‌తో, హైదరాబాద్, రంగారెడ్డిలో ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య 44కి, ఎంపీ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుంది.. కావున ఈ జిల్లాల్లో తమ ఉనికిని బలోపేతం చేయడం అవసరమన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ జిల్లాల నుంచి మంత్రివర్గ ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ అవకాశాలను బలోపేతం చేస్తుందని, తమ ఎన్నికల పనితీరును మెరుగుపరుస్తుందని సూచించారు. -
నీటి సరఫరాపై ఆన్లైన్ మానిటరింగ్
సాక్షి,సిటీబ్యూరో: మహా నగరానికి తాగునీటిని అందిస్తున్న గోదావరి తాగు నీటి సరఫరా పథకంలో భాగంగా కొండపాక పంపింగ్ స్టేషన్‌ను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళశారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకుని నగరానికి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపింగ్‌కు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముర్మూర్ వద్ద ఇన్ లెట్ నుంచి నగరానికి సరఫరా, ట్రాన్స్ మిషన్ తదితర వివరాలకు సంబంధించిన ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్(స్కాడా)ను వంద శాతం వినియోగం కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎల్లంపల్లి నుంచి నగరానికి సరఫరా చేసే ప్రతి చుక్కా లెక్కించడానికి ఫ్లో మీటర్ ఏర్పాటు చేసి.. ఆ వివరాలు ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షించేందుకు మీటరింగ్ వ్యవస్థను కూడా ఆటోమేషన్ చేయాలని అధికారులకు సూచించారు. అత్యవసర సమయంలో పంపులు రిపేర్లు.. కాలిపోయిన సందర్భంలో నీటి సరఫరా ఆటంకం ఏర్పడకుండా స్టాండ్ బై మోటార్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంపింగ్ స్టేషన్ పరిసరాల్లో గార్డెన్, సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ట్రాన్స్మిషన్ జీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెండు షిఫ్టుల్లో ట్యాంకర్ల సరఫరా వాటర్ ట్యాంకర్ల పెండెన్సీ తగ్గించేందుకు రెండు షిఫ్టుల్లో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అదేశించారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు, రాత్రి వేళ కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయాలని సూచించారు. మంగళవారం టాంకర్ బుకింగ్.. డెలివరీలపై ఆయన జీఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వరుస సెలవులు, పండగల సందర్భంగా కొందరు టాంకర్ డ్రైవర్లు సెలవులపై వెళ్లడంతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుకింగ్ పెండెన్సీ పెరిగినట్టు గుర్తించామన్నారు. షేక్‌పేట్, షాపూర్‌నగర్, బుద్వేల్, ఆసిఫ్‌నగర్, ఎన్టీఆర్ నగర్, భవానీ నగర్, చిలకలగూడ, షాపూర్‌నగర్–2, మౌలాలీ, గాజులరామారం, ఎర్రగడ్డ, గచ్చిబౌలి–2, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ,వెంకటగిరి ఫిల్లింగ్ స్టేషన్ లలో వందకు పైగా ట్యాంకర్ పెండెన్సీ ఉందని తెలిపారు. పెండెన్సీలు క్లియర్ చేసేందుకు రానున్న రెండు రోజులు అదనపు గంటలు పని చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈడీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. ట్యాంకర్ డేటాను అనుసరించి ఏయే ఫిల్లింగ్ స్టేషన్ లలో, ఏయే సమయాల్లో బుకింగ్ అవుతున్నాయో అనాలసిస్ చేసుకుంటే పెండెన్సీ తగ్గించుకోవచ్చన్నారు. అవసరమైన ఫిల్లింగ్ స్టేషన్లలో ఫిల్లింగ్ పాయింట్స్ పెంచుకోవచ్చని అందుకు ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. ప్రతి చుక్కా లెక్కించడానికి ఫ్లో మీటర్ ఏర్పాటు కొండపాక స్టేషన్‌ను పరిశీలించిన ఎండీ -
గొర్రెల మందపై కుక్కల దాడి
మొయినాబాద్: వీధి కుక్కలు మందపై దాడి చేయడంతో 21 గొర్రెలు మృతి చెందగా మరో తొమ్మిది గాయపడ్డాయి. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సురంగల్‌కు చెందిన జవ్వోజి రవియాదవ్ వ్యవసాయంతోపాటు పాడి గేదెలు, గొర్రెలను పెంచుతున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి జీవాలను దొడ్డిలో పెట్టి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెలకువ రావడంతో.. దొడ్డి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాడు. గొర్రెల మంద వద్ద ఉన్న పెంపుడు కుక్కతో పాటు జీవాల అరుపులు వినిపించడంతో పొలం వద్దకు పరుగులు పెట్టాడు. రవి అరుపులు విన్న కుక్కలు అక్కడినుంచి పారిపోయాయి. వీటి దాడిలో చనిపోయిన గొర్రెల విలు రూ.3 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. 21 జీవాల మృత్యువాత తొమ్మిదింటికి గాయాలు -
ఉరేసుకుని బాలుడి ఆత్మహత్య
మంచాల: ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఓ బాలుడు ఫ్యాను కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఆగాపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. మంచాల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొర్ర సిద్ధార్థ(16) ఇబ్రహీంపట్నంలోని రెసిడెన్సియల్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మూడు నెలలుగా స్కూల్‌కు వెళ్లడం లేదు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పెట్టుకొని చీరతో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులు వచ్చి చూడాగా తలుపు తీయలేదు. బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ ఫొటో కూడా తీసుకున్నట్లు పోలీ సులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మట్టి ట్రాక్టర్ల పట్టివేత కేశంపేట: అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని కాకునూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పెట్రోలింగ్‌లో విధుల్లో ఉన్న పోలీసులు కాకునూర్ గ్రామ శివారులో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుండడంతో వాటిని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు తలకొండపల్లి: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తలకొండపల్లికి చెందిన చెన్నోజి కూలీ పనులు చేసుకుంటు జీవించేవాడు. గత నెల 28న ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి కుమారుడు మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మంగళవారం ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
పోలీస్..గో బ్యాక్!
గచ్చిబౌలి/రాయదుర్గం: ‘పోలీస్ గో బ్యాక్ ... సీఎం డౌన్ డౌన్’ అంటూ విద్యార్థుల నినాదాలతో హెచ్‌సీయూ క్యాంపస్ దద్దరిల్లింది. మంగళవారం కూడా వర్సిటీలో ఆందోళనలు కొనసాగాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వర్సిటీ భూములను పరిరక్షిస్తామని వారు నినదించారు. పోలీసులను వెంటనే వర్సిటీ నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. తరగతుల బహిష్కరణ హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల పిలుపుతో సామూహికంగా తరగతులను బహిష్క రించారు. దీంతో వర్సిటీలో ఎలాంటి తరగతులు జరగలేదు. వ వైవిద్యాన్ని రక్షించాలని, భూములను అప్పగించాలని ప్లకార్డులతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పోలీసులకు క్యాంపస్‌లో ఏమి పని అని ప్రశ్నించారు. వెంటనే క్యాంపస్ నుంచి వారిని వెళ్లి పోయేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 400 ఎకరాలతో పాటు మొత్తం స్థలాన్ని యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం మెయిన్ గేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. విద్యార్థుల నినాదాలతో హోరెత్తిన హెచ్‌సీయూ ● కొనసాగిన ఆందోళనలు ● ఆ భూములను యూనివర్సిటీకే అప్పగించాలని డిమాండ్ -
బస్సును ఓవర్టేక్ చేయబోయి..
కుషాయిగూడ: బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన కొండేపాటి పుల్లారావు నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం అతను భార్య పిల్లలతో కలిసి బైక్‌పై ఈసీనగర్ నుంచి పెద్ద చర్లపల్లి వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం బస్సును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లారావు (32) అక్కడిక్కడే మృతి చెందగా, అతడి భార్య నాగరాణి, కుమారులు రుత్విక్, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఇన్నోవా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టిన కారు భర్త మృతి, భార్య,ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు.. -
ఆస్తి పన్ను వసూలులో ‘పట్నం’ రికార్డు
ఇబ్రహీంపట్నం: ఆస్తి పన్ను వసూలులో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ తొలిసారి రికార్డు సాధించింది. రూ.5 కోట్ల మార్కును దాటి ఔరా అనిపించింది. గ్రామ పంచాయతీ నుంచి 2013లో నగర పంచాయతీగా, 2018 మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. తగిన ఆదాయం సమకూరడంలేదు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పన్ను వసూలులో వెనుకబడింది. ఈ సారి అధికార యంత్రాంగం పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి అనుకూల ఫలితాలను సాధించింది. పాత బకాయి రూ.7 కోట్లు ప్రైవేట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారు 7,239 భవనాల నుంచి ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం వసూలు లక్ష్యం రూ.11.50 కోట్లు కాగా, అందులో రూ.7 కోట్లు పాత బకాయే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడు 3,933 భవన యజమానుల నుంచి రూ.4 కోట్లు, 1,300 భవన యజమానుల నుంచి పాత బకాయి రూ.1.30 కోట్లను పుర అధికారులు రాబట్టగలిగారు. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో రూ.4.42 కోట్లు, 2022– 23లో రూ.4.06 కోట్లు, 2021– 22లో రూ.3.21 కోట్లను వసూలు చేయగా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31 నాటికి రూ.5 కోట్ల 30 లక్షలు వసూలు చేశారు. రూ.5 కోట్లు రాబట్టిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లక్ష్యం చేరుకున్నాం ప్రత్యేక దృష్టితో గడిచిన ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూలు లక్ష్యం నెరవేర్చాం. రూ.5.30 కోట్లు వసూలు చేసి రికార్డు సాధించాం. సుమారు రూ.11.50 కోట్ల టార్గెట్‌లో రూ.7 కోట్లు పాత బకాయి ఉంది. అందులో ప్రభుత్వ సంస్థల బకాయే రూ.2.50 కోట్లు. ఈ సారి పాత బకాయి ఉన్న 1300 భవనాల యాజమానుల నుంచి రూ.1.30 కోట్లు వసూలు చేశాం. పాత బకాయి చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను తీసుకునే వీలుండదు. పేరుకుపోయిన బకాయిలన్నింటిని వసూలు చేయలేకపోయాం. – రవీంద్రసాగర్, కమిషనర్, ఇబ్రహీంపట్నం -
రోడ్డు నిర్మాణానికి జాయింట్ సర్వే
తుర్కయంజాల్: సాగర్ రహదారి నుంచి తొర్రూర్ స్కూప్స్ ఐస్‌క్రీమ్ కంపెనీ వరకు హెచ్ఎండీఏ వేయనున్న 60 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సోమవారం రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కమాన్ నుంచి సాయిప్రియ లే అవుట్‌లోని హైటెన్షన్ లైన్ కింద నుంచి రోడ్డు వేయాలని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పలు ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, వాటిల్లో అనేక మంది నివసిస్తు న్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా రోడ్డు నిర్మాణం అంటూ అధికారులు సర్వే నిర్వహిస్తుండటం ఇళ్ల నిర్మాణదారుల్లో గుబులు రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఎన్నికలకు ముందు ఇదే రోడ్డు నిర్మాణానికి పలుమార్లు అధికారులు పరిశీలన చేశారు. అయినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి సర్వే నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలు, ప్లాట్లు, పొలాల గురించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంత్ రెడ్డి, తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, హెచ్ఎండీఏ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శైలజ, మండల సర్వేయర్ జ్యోతి పాల్గొన్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి ఇబ్రహీంపట్నం: శక్తి ఉన్నచోట వైరసులు సోకవని బ్రహ్మర్షి ఎం.ప్రేమ్నాథ్గుప్తా అన్నా రు. ఇబ్రహీంపట్నంలోని జై హనుమాన్ ధ్యాన కేంద్రంలో సోమవారం ప్రత్యేక మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. దేహనికి ఆరోగ్యం, మనస్సుకు శాంతి, బుద్ధికి ఆలోచన, ఆత్మకు శక్తి, సర్వాత్మకు ముక్తి అవసరమన్నారు. అందుకు సాధన ముఖ్యమని తెలిపారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మన సంకల్పాలు, ఆశయాలు సిద్ధించడమేగాక మనలో ఒక శక్తి ఉద్భవిస్తుందన్నారు. పత్రీజీ చూపిన మార్గంలో పయనించి ముక్తి పొందాలని సూచించారు. నేటి నుంచే ‘ఎర్లీబర్డ్’ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి నెల (ఏప్రిల్)లోనే ఆస్తిపన్ను మొత్తం చెల్లించే వారికి 5 శాతం రాయితీ వర్తించే ‘ఎర్లీబర్డ్’ పథకం మంగళవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆస్తిపన్ను పాతబకాయిలు లేనివారికి, 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం ఆస్తిపన్ను ఒకే దఫా చెల్లించేవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఇది కేవలం కొత్త ఆర్థిక సంవత్సరానికి మాత్రమే. పాత బకాయిదారులకు ఈ రాయితీ వర్తించదని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ‘ఎర్లీబర్డ్ ’కింద 5 శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లించవచ్చు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి మంచాల: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఆరుట్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాశం బుచ్చయ్యగౌడ్ (65) గీత కార్మికుడు. ఎప్పటిలాగే సోమవారం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు మోకు జారిపోవడంతో కిందపడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. పలువురు నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. -
పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి
షాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దామర్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు కుమార్, శివ, శివకుమార్, రాజు, అనిల్, పవన్, మల్లేశ్, మధావచారితో పాటు మరో 15 మంది బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలన్నారు. విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్ధలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ పటిష్టతకు పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుదన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులందరికీ రేషన్ కార్డులు వస్తాయని, అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యులు కుమ్మరి చెన్నయ్య, అశోక్, మాజీ సర్పంచ్‌లు లింగం, జనార్ధన్‌రెడ్డి, ఖాజామియా, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌నాయక్, మహేందర్‌గౌడ్, నాయకులు రవీందర్‌యాదవ్, సుభాష్‌రెడ్డి, మాధవరెడ్డి, మల్లారెడ్డి, బురాన్ దస్తగిరి, సత్యం, శేఖర్, రాఘవేందర్, చేవెళ్ల స్వామి, తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి బీజీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు -
‘ఫ్యూచర్’ బాస్ ఎవరు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి కమిషన ర్ను నియమించనున్నారు. చురుకైన యువ ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ సారథిగా నియమిస్తే బాగుంటుందనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌సీడీఏ పరిధిని ప్రత్యేకంగా భావిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఫార్మా, క్రీడారంగాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్కారు.. ఆ మేరకు జోన్లను కూడా నిర్దేశిస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అంతర్జాతీయ నగరాలపై అవగాహన ఉన్న అధికారులకు దీని పాలనాపగ్గాలు కట్ట బెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. గతంలో కలెక్టర్లుగా వ్యవహరించిన కె.శశాంక (2013), డాక్టర్ ఎస్.హరీశ్ (2015) పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంపై వీరికి స్పష్టమైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం. గోపి (2016) పేరును సైతం పరిశీలించి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ఫోర్త్ సిటీ అభివృద్ధే లక్ష్యం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్లో ఫోర్త్ సిటీ అవసరం ఉందని సీఎం నిర్ణయించారు. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్‌గల్లు, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల తదితర ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్ నియామకం పూర్తవగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజు కుంటుందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో కార్యరూపం ఇప్పటికే ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభంకాగా పనులు చకచకా సాగుతున్నాయి. ఉగాది తర్వాత ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. త్వరలోనే ఫ్యూచర్ సిటీ అథారిటీకి కమిషనర్ నియామకం యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారికి పగ్గాలు యువ ఐఏఎస్‌లు శశాంక, హరీశ్, గోపి పేర్ల పరిశీలన ఇప్పటికే అథారిటీ కోసం 90 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ -
తిట్టాడని చంపేశాడు..
● ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య ● సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడి ఘాతుకం చైతన్యపురి: తిట్టాడని డైలీ ఫైనాన్స్ వ్యాపారిని అతడితో సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడు దారుణంగా హత్య చేసిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..రంగారెడ్డి జిల్లా, పులిమామిడి గ్రామానికి చెందిన బచ్చు వెంకటేశ్వర్లు అలియాస్ రాజు (47) గత కొన్నాళ్లుగా కర్మన్‌ఘాట్‌లోని జానకీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య విడిపోవటంతో ఒక్కడే ఉంటూ డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మామిడి గురవమ్మ భర్త మృతి చెందటంతో కుమారుడు పవన్, కుమార్తెతో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు, గురవమ్మలకు పరిచయం ఏర్పడింది. గురవమ్మ కుమారుడు, కుమార్తె మరో ఇంట్లో ఉంటుండగా ఆమె వెంకటేశ్వర్లుతో సహజీవనం చేస్తోంది. గత కొద్ది రోజులుగా వెంకటేశ్వర్లు గురవమ్మ ఆమె కొడుకు, కుమార్తెను దూషిస్తున్నాడు. ఆదివారం ఉగాది పండుగ నేపథ్యంలో గురవమ్మ తన కుమారుడు, కుమార్తెను ఇంటికి పిలిచింది. రాత్రి వెంకటేశ్వర్లు, గురవమ్మ, పవన్‌ల మధ్య గొడవ జరగడంతో పవన్ కత్తితో వెంకటేశ్వర్లుపై దాడి చేశాడు. అనంతరం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన పవన్ పరారీలో ఉన్నాడని, మృతుడి మేనల్లుడి ఫిర్యాదు మేరకు గురవమ్మతో పాటు ఆమె కుమారుడు పవన్, కుమార్తెలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మహిళా రియల్టర్ అరెస్ట్ బంజారాహిల్స్: డిజిటల్ అరెస్టు పేరుతో మోసానికి పాల్పడిన కేసులో ఓ మహిళా రియల్ ఎస్టేట్ వ్యాపారిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..నగరానికి చెందిన ఓ బాధిరాలికి ముంబై బ్రాందాలోని కుర్లా పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరున ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో అక్రమ లావాదేవీలు జరిగాయని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం స్కైప్ కాల్ చేసిన అవతలి వ్యక్తి మనీలాండరింగ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో మీరు పాల్గొన్నారో లేదో నిర్థారించుకుని, క్లియరెన్స్ సర్టిఫికెట్ అందజేస్తామని, ఇందుకోసం మీరు రూ.3,57,998 పంపించాలని, తిరిగి ఆ మొత్తాన్ని 24 గంటల్లోపు పంపిస్తామని నమ్మబలికారు. దీంతో బాధితుడు తన ఖాతాలో అంత మొత్తం లేకపోయినా రుణం తీసుకుని ఆ మొత్తాన్ని నిందితుడి ఖాతాకు బదిలీ చేశాడు. తాను ట్రాన్స్ఫర్ చేసిన నగదు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. గుంటూరు కాటవరానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ తోట శ్రీనివాసరావు, జీవన్‌కుమార్, రఘువీర్‌లను గత నెల 25న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళా రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంపల్లికి చెందిన క్రోతపల్లి రితికను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, టెలిగ్రామ్, వాట్సప్ కాల్స్ ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలినారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన 9 చెక్కు బుక్‌లు, 3 పాస్‌బుక్‌లు, రెండు స్టాంపులు, ఒక క్యూఆర్ కోడ్ స్కానర్, మూడు ఏటీఎం కార్డులు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సైబర్‌క్రైమ్ యూనిట్‌కు చెందిన ఎస్ఐ మన్మోహన్, హెడ్‌కానిస్టేబుల్ ఫిరోజ్, కానిస్టేబుల్ రాకేష్, మహిళా కానిస్టేబుల్ కుమ్భారవి బృందం దర్యాప్తు చేస్తుంది. డీజిల్ లీకై రేంజ్ రోవర్ కారు దగ్ధం కారులో నుంచి సురక్షితంగా బయటపడిన యువకులు నార్కట్‌పల్లి : రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్ ముగ్గురు స్నేహితులు కలిసి గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్ బంక్‌లో రేంజ్ రోవర్ కారుకు పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. చెర్వుగట్టు సమీపంలోకి రాగానే కారు డీజిల్ ట్యాంక్ లీకై చిన్నచిన్న మంటలు రావడాన్ని గుర్తించిన వారు కారును రోడ్డు పక్కన నిలిపి బయటకు వచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
టీవీ రంగయ్యకు ఉగాది పురస్కారం
షాద్‌నగర్: నగరంలోని అమీర్‌పేట కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అక్కినేని నాగేశ్వర్రావు శతజయంతి సందర్భంగా ఆంధ్ర నాటక కళాపరిషత్ 96వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలో కళారంగానికి అత్యుత్తమ సేవలను అందిస్తున్న పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు టీవీ రంగయ్యను ఉగాది పురస్కారంతో సన్మానించారు. కిమ్స్ ఆస్పత్రి అధినేత బొల్లినేని కృష్ణయ్య, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేక రామకృష్ణ, ప్రధానకార్యదర్శి అన్నమనేని ప్రసాద్ చేతుల మీదుగా ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం టీవీ రంగయ్య మాట్లాడుతూ.. ఆంధ్రనాటక కళాపరిషత్‌లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి ఎందరో ప్రముఖ నటులు ప్రదర్శనలు ఇచ్చారని అన్నారు. అలాంటి సంస్థ తన సేవలను గుర్తించి పురస్కారాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పురస్కారానికి ఎంపిక చేసిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కళాభిమానులు రంగనాథం, బెజుగం రమేష్, వడ్ల రమేష్‌చారి, సింగారం శ్రీనివాస్, నారాయణచారి, మల్లికార్జునగౌడ, సత్యనారాయణ, బాలబ్రహ్మచారి, సుధాకర్ తదితరులు ఆయన్ను అభినందించారు. -
నీళ్లు.. ఏవీ ఆనవాళ్లు?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శేరిలింగంపల్లిలో ఫిబ్రవరి చివరి నాటికి 15.07 మీటర్ల లోతులో కన్పించిన నీటి ఆనవాళ్లు.. మార్చి చివరి నాటికి 23.12 మీటర్ల కిందికి పడిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 8.05 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గృహ, వాణిజ్య అవసరాల కోసం ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్ర యించాల్సి వస్తోంది. బస్తీవాసుల బలహీనతను ట్యాంకర్ల యజమానులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. మినీ ట్యాంకర్(ట్రాక్టర్)కు రూ.1000, పెద్ద ట్యాంకర్ (డీసీఎం, లారీ)కు రూ.2,500 పైగా వసూలు చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ సహా మూసీ పరీవాహక ప్రాంతాల్లో బోర్లు వేసి యథేచ్ఛగా నీటి విక్రయాలు చేపడుతున్నారు. నగరానికి ఆనుకుని ఉన్న శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోనే కాదు.. శివారు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చేవెళ్లలో నెల రోజుల క్రితం 10.83 మీటర్ల లోతు నుంచి 12.00 మీటర్లలోతుకు, షాబాద్‌లో 12.01 మీటర్ల నుంచి 14.59 మీటర్లకు, తలకొండపల్లిలో 13.52 నుంచి 15.47 మీటర్ల లోతుకు జలమట్టం పడిపోయింది. మంచాల సహా యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లపై నీటిని తరలిస్తున్న దృశ్యాలు జిల్లాలో విరివిగా కన్పిస్తుండటాన్ని పరిశీలిస్తే.. మున్ముందు మరింత నీటి సంక్షోభం తప్పదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మంచాలలో కరువు ఛాయలు నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పటి శివారు ప్రాంతాలన్నీ ప్రస్తుతం నగరంలో అంతర్భాగమయ్యాయి. పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. చెరువులు, కుంటలు దాదాపు కనుమరగయ్యాయి. ఒకటి రెండు ఉన్నా..వాటి చుట్టూ భారీ నిర్మాణాలు, సీసీ రోడ్లతో పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారింది. ప్రతి 25 నుంచి 50 ఫీట్ల దూరంలో ఒక బోరు బావిని తవ్వుతుండటం, సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూమిలోకి నీరు ఇంకకపోవడం, చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా లేకపోవడంతో భూగర్భంలోని నీరు పాతాళానికి పడిపోయింది. జనవరి చివర్లో కొంత ఆశాజనకంగా ఉన్న భూగర్భ జలాలు ఏప్రిల్ ప్రారంభం నాటికే పూర్తిగా కన్పించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆకుపచ్చని పైరు.. నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు తమ పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. కొంత మంది రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పంట చేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచాల మండలం తిప్పాయిగూడలో ఇప్పటికే పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. తాగేందుకు కూడా గుక్కెడు నీరు దొరకని పరి స్థితి. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఇప్పటి వరకు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. పడిపోతున్న జలమట్టం ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో మరింత తగ్గుముఖం వట్టిపోతున్న బోరుబావులు ఎండిపోతున్న పంటలు తాగునీటికి తప్పని కటకట -
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచేనా!
ఇబ్రహీంపట్నం: అక్రమ లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు 25 శాతం రాయితీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి ఫీజుల రూపేణ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.8.70 కోట్ల ఆదాయం సమకూరింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 14,053 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులుండగా సోమవారం నాటికి 1,918 దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. ఆరంభంలో ఇబ్బంది ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు అంశాలపై మొదట్లో అవగాహన లేకపోవడం, సాంకేతిక లోపాల కారణంగా మొదటి మూడు వారాల్లో దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. గడిచిన వారం రోజులగా ఫీజులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. వేలాది రూపాయల ఫీజులు, తక్కువ సమయం ఉండటం వలన చెల్లింపుదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఫీజులు చెల్లించాలా వద్దా..? ఇప్పుడు అవసరమా అనే మీమాంసలో పడ్డారు. ఇప్పటికే ఆయా ప్లాట్లు రెండుమూడు చేతులు మారడం ఎల్ఆర్ఎస్ చెల్లింపులు మందకొడిగా సాగేందుకు ఓ కారణం. 25 శాతం ఫీజు రాయితీతో ఎల్ఆర్ఎస్ గడువును పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. ముగిసిన 25 శాతం సబ్సిడీ గడువు ఫీజు చెల్లించిన 1,918 ప్లాట్ల దరఖాస్తుదారులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.8.70 కోట్ల ఆదాయం -
పరుపుల కంపెనీలో అగ్ని ప్రమాదం
పహాడీషరీఫ్: ఓ పరుపుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జనావాసాల నడుమ చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో రంజాన్ వేళ స్థానికులు భయకంపితులయ్యారు. పోలీసులు, స్థానికుల కథ నం ప్రకారం.. జల్పల్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఖాజా బేకరీ గల్లీలో చార్మినార్ ప్రాంతానికి చెందిన మహమూద్ కొన్నాళ్లుగా పరుపుల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించి పరుపులకు అంటుకున్నాయి. చూస్తుండగానే దట్టమైన పొగలు రావడంతో అందులో ఉన్న సిబ్బంది ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన గోడౌన్లో సిలిండర్ ఉండడం.. చుట్టూ నివాసాలు ఉండడంతో తమకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాదాపు 50 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఫైరింజన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఫైర్ సిబ్బంది సిలిండర్‌ను బయటికి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. వ్యాపించిన దట్టమైన పొగలు రంజాన్ వేళ భయకంపితులైన స్థానికులు మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది -
కరెంటు కోతలు.. కన్నీటి రాతలు
ఆమనగల్లు: యాసంగి పంటకు సాగునీరు కష్టాలు మొదలయ్యా యి. ఓ వైపు అడుగంటిన భూ గర్భ జలాలు.. మరో వైపు వి ద్యుత్ కోతల కారణంగా పంట లు కాపాడుకునేందుకు రైతు చే యని ప్రయత్నం లేదు. బోర్లలో నీరు ఉండడం, సన్నాల కు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ .500 బోనస్ ప్రకటించడంతో రైతులు వరిసాగుపై మక్కువ చూపారు. పంటసాగు ప్రారంభంలో వ్యవసాయ బోర్లలో నీరు బాగానే ఉండటంతో రైతులు పంటలు సాగుచేశారు. ప్రస్తుతం బోర్లలో నీటిమట్టం తగ్గి, సాగుచేసిన పంటలకు నీరు అందకపోవడంతో వరి ఎండిపోతోంది. బోర్లలో నీటిమట్టం తగ్గడంతో పాటు కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో పలువురు రైతులు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎకరానికి పైగా ఎండిపోయింది మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాను. వ్యవసాయ బోరు మొదట్లో నీరు బాగానే పోసినప్పటికీ నీటిమట్టం తగ్గడంతో ఇటీవల నీరు అందడం లేదు. ఇప్పటికే ఎకరానికి పైగా పంట ఎండిపోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి. – శ్రీనివాస్‌రెడ్డి, రైతు, చింతలపల్లి -
ఎండుతున్న పంటలు
మండుతున్న రైతన్న గుండెలు సాగు నీరందక గతేడాది మాదిరిగానే పంటలు ఎండిపోవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. పొలాలు నెర్రలుబారి పొట్ట దశలో పంటలు చేతికందకుండా పోయాయి. దీంతో పెట్టుబడులు అందక నిండా మునిగామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక బోరు బావి.. 12 ఎకరాలు చేవెళ్ల: మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన రైతులు ముకుందారెడ్డి, గోపాల్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి అన్నదమ్ములు. వీరు ఒక బోరుబావి కింద 12 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఎండల తీవ్రత కారణంగా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా సైతం నీరుఅందడం లేదు. నాలుగు ఎకరాలకు మించినీరు అందటం లేదు. రాత్రిపగలు పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల ముందు పంటలు ఎండుతుంటే చూడలేకపోతున్నామని ఆవేదక వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సర్వే చేపట్టి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. సాగుకు నీరందక ఇబ్బందులు ● ఇంకుతున్న భూగర్భజలాలు..ఎండిపోతున్న బోర్లు ● నెర్రెలు బారిన నేలలు ● పశుగ్రాసంగా మారుతున్న పంటలు ● ఆర్థికంగా నష్టపోతున్న అన్నదాత పశుగ్రాసంగా వరిపైరు షాబాద్: మండల పరిధిలోని కుమ్మరిగూడకు చెందిన రైతు లింగం తనకున్న అర ఎకరంతో పాటు మరో అర ఎకరం కౌలుకు తీసుకుని వరిసాగు చేశాడు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. సాగునీరు అందక పంట ఎండిపోయింది. గత్యంతరం లేక ఎండిన పంటను పాడి ఆవులకు మేతగా కోసి వేస్తున్నాడు. మండల పరిధిలోని గోపిగడ్డ, పోలారం, పోలారం తండా గ్రామాల్లో రైతులు సాగు చేసిన కాలీఫ్లవర్, పశుగ్రాసం కోసం వేసిన మేతజొన్న పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు లేక.. విద్యుత్ అంతరాయం కారణంగా పంటలకు నీరందక రైతు కన్నీరు మిగిలుతోంది. ఎన్కేపల్లిలో ఎండిపోతున్న వరి పంటను చూపుతున్న రైతు ముకుందారెడ్డి -
గ్రూప్–1 ర్యాంకర్‌కు అభినందనలు
మీర్‌పేట: గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 5వ ర్యాంకు సాధించిన మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన సిద్దాల కృతికకు ఆదివారం పలువురు అభినందనలు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు ఎనుగుల అనిల్‌యాదవ్, దోమలపల్లి ధనలక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు రాజ్‌కుమార్‌లు కృతికకు మిఠాయి తినిపించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో యువతి తల్లిదండ్రులు బీరప్ప, లావణ్య ఉన్నారు. అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య కొందుర్గు: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి ఉత్తరాసిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్గ కుమార్(28) ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం అప్పచేసి, ఓ బస్సును కొనుగోలు చేశాడు. దాంతో పాటు మరిన్ని అప్పులు చేశాడు. కానీ అప్పులు తీర్చే మార్గం కానరాక పోవడంతో మనస్తాపం చెందిన కుమార్.. శనివారం రాత్రి 7 గంటలకు పొలం వద్దకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి 12 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లిచూడగా.. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అవివాహితుడు. మృతుడి తండ్రి ఆంజనేయులు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనయ్య తెలిపారు. ప్రమాదవశాత్తు హోటల్ దగ్ధం ఆమనగల్లు: ప్రమాదవశాత్తు ఓ హోటల్ దగ్ధమైంది. ఈ సంఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలోని విఠాయిపల్లి వద్ద హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చైత్ర మెస్ హోటల్ ఆదివారం యథావిధిగా ఉదయం వేళలో కొనసాగింది. మధ్యాహ్నం నిర్వాహకుడు శ్రీను హోటల్‌ను మూసివేసి వెళ్లిపోయాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన పలువురు పోలీసులకు, యజమానికి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కల్వకుర్తి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే ఫర్నీచర్, ఫ్రిడ్జ్ తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద స్థలాన్ని ఆమనగల్లు ఎస్ఐ సీతారామ్‌రెడ్డి పరిశీలించి, వివరాలు సేకరించారు. -
ఘనంగా గరుడ వాహన సేవ
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వైఖానస ఆగమ శాస్త్రోకంగా తిరుమల తరహాలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటలకు భూదేవి శ్రీదేవి సమేతంగా గరుడ వాహనంపై ఆసీనులైన శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. జాతర స్థలం వరకు కొనసాగిన ఈ ఊరేగింపు ఆద్యంతం గోవింద నామస్మరణతో కొనసాగింది. అర్ధరాత్రి వేంకటేశ్వరస్వామి జాతర స్థలంలో లంకా దహన కార్యక్రమం వైభవంగా జరిగింది. టపాసులు వెలుతురులు ఆకాశంలో కనువిందు చేశాయి. చైన్నె నుంచి ప్రత్యేకంగా తెప్పించిన టపాసులతో లంకాదహనం నిర్వహించారు. -
సన్న రైస్.. వచ్చేశాయ్
ఇబ్రహీంపట్నం: సన్నబియ్యం వచ్చేశాయి.. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరుకున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన కానుకగా రేషన్ కార్డుదారులకు (ఆహార భద్రత కార్డులు) సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి (మంగళవారం) అన్ని గ్రామాల్లో రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం ఈనెల 25 నుంచి రేషన్ దుకాణాలకు స్టాక్ పాయింట్ల (గోదాం) నుంచి తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఆయా రేషన్ షాపుల్లోకి సన్న బియ్యం చేరుకున్నాయి. ఒక్కొక్కరి ఆరు కిలోల చొప్పున.. ఇబ్రహీంపట్నం మండలంలో 18,941 ఆహారభద్రత కార్డులకు 37 రేషన్ షాపులు, యాచారం మండలంలో 13,733 ఆహార భద్రత కార్డులకు 26 రేషన్‌షాపులు, మంచాల మండలంలో 12,122 ఆహార భద్రత కార్డులకు 26 రేషన్ షాపులున్నాయి. ఈ మూడు మండలాల్లో 89 షాపులకుగాను 900 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెల ఇబ్రహీంపట్నంలోని స్టాక్ పాయింట్ నుంచి తరలిస్తారు. రేషన్ దుకాణాల్లో యూనిట్‌కు (కార్డుల్లో ఉన్న ఒక్కొక్కరిని ఒక యూనిట్‌గా) ఆరు కిలోల చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తారు. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. స్టాక్ పాయింట్ల నుంచి తరలింపు రేషన్ దుకాణాలకు చేరిన బియ్యం రేపటి నుంచి పంపిణీ షురూ -
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న గణితం లెక్చరర్ (డిగ్రీ) ఒక పోస్టు, కెమిస్ట్రీ లెక్చరర్ (డిగ్రీ) రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆయా సబ్జెక్టులను బోధించేందుకు అతిథి అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో ఏప్రిల్ 10వ తేదీలోపు నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మైసిగండి ప్రధానార్చకుడికి ఉగాది పురస్కారం కడ్తాల్: మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు మాధారం యాదగిరి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వావసునామ సంవత్సర వేడుకల్లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్, కమిషనర్ శ్రీధర్ చేతుల మీదుగా యాదగిరి పురస్కారం అందుకున్నారు. యాదగిరికి పురస్కారం రావడంపై మైసిగండి ఆలయ అర్చక సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్‌గా ప్రమీల సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ మహిళా విభాగం కన్వీసర్‌గా జి.ప్రమీలను నియమిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా ఎస్సీ సెల్ విభాగం ఇన్చార్జి పెంటయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తలకొండపల్లిలో స్వేరోస్ భీందీక్ష ముగింపు సభ తలకొండపల్లి: వచ్చేనెల 13న మండల కేంద్రంలో స్వేరోస్ భీందీక్ష ముగింపు సభ నిర్వహించనున్నట్టు స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముగింపు సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులంతా స్వేరోస్ స్ఫూర్తితో విద్యారంగంలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే స్వేరోస్ కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర నాయకులు జ్యోతయ్య, వెంకటేశ్, నాగేశం, దుర్గయ్య, చందు, శ్రీనివాస్‌గౌడ్, మల్లేష్, నిరంజన్ పాల్గొన్నారు. -
నాలుగు పోస్టులు.. ఒక్కరే అధికారి!
వేధిస్తున్న ఉద్యోగుల కొరత ● పదేళ్లుగా నియామకాలు నిల్ ● 40 మంది పని చేయాల్సిన చోట 15 మందే.. ● సీఈఐజీ గుప్పిట్లోనే కీలక పోస్టులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి కార్యాలయంలో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పదేళ్లుగా కొత్త నియామకాలు లేకపోవడం.. ఉన్నవాళ్లకు పదోన్నతులు రాకపోవడంతో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ హైదరాబాద్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రూరల్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ నిజామాబాద్ పోస్టుల్లో ఒక్కరే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఇప్పటికే ఉన్న 17,130 హెచ్‌టీ కనెన్షన్లకు పీరియాడికల్ ఇన్స్పెక్షన్లు నిర్వహించడంతోపాటు కొత్తగా పుట్టుకొచ్చే చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు, సినిమా థియేటర్లు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఐటీ, అనుబంధ సంస్థల కార్యాలయాలు, క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లు, గృహ, వాణిజ్య బహుళ అంతస్తుల భవన సముదాయాలను తనిఖీ చేసి వాటికి అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ● కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండడం, ఒక్కరే ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించాల్సి రావడంతో అనుమతుల జారీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. థర్డ్‌పార్టీ నివేదికలను గుడ్డిగా అనుసరిస్తూ.. ● విద్యుత్ పనుల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, ప్రమాదాల నియంత్రణ కోసం ప్రభుత్వం విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి విభాగాన్ని ఏర్పాటు చేసింది. 75 కేవీఏ సామర్థ్యం దాటిన ఏదైనా బహుళ అంతస్తుల భవనం సహా పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లను జారీ చేయాలంటే ముందు ఈ సీఈఐజీ అనుమతి తప్పనిసరి. అధికారులు తమ తనిఖీల్లో భాగంగా ఎర్తింగ్, వైరింగ్, బ్రేకర్స్ పని తీరు, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్స్, లైటింగ్ ఎరిస్టర్స్ ఎర్తింగ్, హెచ్‌టీ, ఎల్టీ ప్రొటక్షన్స్, ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ, సెకండరీ ప్రొటక్షన్స్ను పరిశీలించాల్సి ఉంది. ● ఐఎస్ఐ ప్రమాణాల మేరకు ఆయా సాంకేతిక పరికరాలను, కేబుళ్లు, స్విచ్ బోర్డులు వాడారా లేదో? పరిశీలించాలి. నిర్దేశిత ప్రమాణాల మేరకు అన్ని ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఆయా భవనాలు, పరిశ్రమలకు అనుమతులు జారీ చేయాల్సి ఉటుంది. అయితే సిబ్బంది కొరతతో థర్డ్‌పార్టీ సమర్పించిన నివేదికను గుడ్డిగా అనుసరిస్తున్నారు. క్షేత్రస్థాయి వరకు వెళ్లినా.. కారు దిగకుండానే ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. అడ్డుకుంటూ.. అడ్డగోలుగా సంపాదిస్తూ.. డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉంటాయి. డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రూరల్ పరిధిలో మెదక్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ నిజామాబాద్ పరిధిలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ● 2014 నుంచి కొత్త నియామకాలు లేకపోవడంతో 15కు పైగా ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేవీ కనెక్షన్లు 16,140 వరకు ఉండగా, 33 కేవీఏ కనెక్షన్లు 883 వరకు ఉన్నాయి. 132కేవీ కనెక్షన్లు 107 వరకు ఉన్నాయి. మెజార్టీ కనెక్షన్లు గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. పీరియాడికల్ ఇన్స్పెక్షన్లలో భాగంగా ఒక్కో అధికారి రోజుకు సగటున 50 కనెక్షన్లను తనిఖీ చేయాల్సి వస్తోంది. వీటితో పాటు కొత్తవాటికి అనుమతులు జారీ చేయాలి. కొంత మంది అధికారులు ఒకే చోట ఏళ్లుగా పాతుకుపోయారు. సమాన కేడర్‌లో పని చేస్తున్న తోటి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉన్నా.. తమకున్న ఆర్థిక పలుకుబడితో వాటికి అడ్డుపడుతున్నట్లు తెలిసింది. ఫలితంగా కొత్తవాళ్లకు అవకాశాలు లేకుండా పోతుండటంతో పాటు ఏళ్లుగా పాతుకుపోయిన వాళ్లు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
మాది ప్రోత్సాహం
మీది సాయం..రోడ్డు ప్రమాదంలో గాయపడి సమయానికి సరైన వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోతున్నాయి.. ఘటన జరిగినప్పుడు కేసులు.. పోలీసులుమా కెందుకీ పంచాయితీ అనుకుని చాలామంది చూస్తూ వెళ్తున్నారే తప్ప సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.. ఇలాంటి సమయాల్లో క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రుల్లో చేర్చండి.. మీకు మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తోంది కేంద్రం.. ప్రోత్సహించడంతోపాటు ప్రోత్సాహకం అందిస్తోంది.ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో గుడ్ సమరిటన్ పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయి అవార్డులకు అవకాశంతో పాటు రూ.5వేల నగదు, ప్రశంసాపత్రం అందిస్తోంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్తే కేసు, పోలీసుల పంచాయితీ ఉంటుందని గతంలో చాలామంది సాయం చేయాలనుకున్నా వెనునకాడేవారు. ప్రస్తుతం అవగాహన పెరగడంతో పాటు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 108 వాహనం అందుబాటులో లేకపోతే తమ వాహనంలో, ఇతర వాహనాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్చుతున్నారు. గుడ్ సమరిటన్ పథకం ద్వారా ఇలాంటి వారికి ప్రోత్సాహం లభిస్తోంది. ఆస్పత్రులకు తరలించి.. ప్రాణాలను నిలబెట్టి సకాలంలో వైద్యం అందక రోడ్డు ప్రమాద బాధితుల్లో దాదాపు 50 శాతం మృతి చెందుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు సాయం చేయకపోగా సంఘటనా స్థలంలో క్షతగాత్రులను వీడియో, ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సమరిటన్ పథకం అందరినీ సాయం చేసేలా ప్రోత్సహిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు 108 అంబులెన్స్ రావడం సైతం ఇబ్బందికరంగా మారుతోంది. అలాంటి సమయాల్లో చాలామంది ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్నారు. సరైన సమయంలో ఆస్పత్రులకు తరిలించడం ద్వారా ప్రాణాలను నిలబెడుతున్నారు. ప్రశంసలతోపాటు నగదు ప్రోత్సాహకం ప్రమాదం జరిగిన గంటలోగా ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్నే గోల్డెన్ అవర్‌గా పేర్కొంటున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన సమరిటన్ తో గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేర్చిన వారికి రూ.5 వేలు అందనున్నాయి. ఇందుకు దరఖాస్తు చేసుకోవాలంటే పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓలు లెటర్ ప్యాడ్‌పై వివరాలు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు కూడా కేసుతో సంబంధం లేకుండా రాసివ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ జత చేస్తే నేరుగా వారి ఖాతాలో నగదు జమ అవుతుంది. ప్రశంసాపత్రం కూడా అందుతుంది. సంవత్సరానికి గరిష్టంగా ఐదు అవార్డులు ఇస్తారు. అత్యంత విలువైన మంచి సహాయకులకు ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు, జాతీయ స్థాయి అవార్డులు సైతం ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయడానికి ప్రజలను ప్రేరేపించడం.. చట్టపరమైన పరిణామాలకు భయపడకుండా సాయం చేసే సంస్కృతిని పెంపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంపై సమగ్రంగా ప్రచారం చేసి అవగాహన కల్పిస్తే .. మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆపద్బాంధవులకు కేంద్రం భరోసా క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు తరలించండి గుడ్ సమరిటన్ పథకంతో గుర్తిస్తాం రూ.5వేలు ప్రోత్సాహకం.. ప్రశంసా పత్రంప్రజలను చైతన్యం చేస్తాం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమరిటన్ పథకంపై ప్రజలను చైతన్యం చేస్తాం. అవగాహన సమావేశాలు నిర్వహించేలా స్థానిక పోలీసులకు, వివిధ శాఖల అధికారులకు సూచిస్తాం. గాయపడ్డ వారిని ఆస్పత్రిలో చేర్పిస్తే గుర్తింపు లభిస్తుంది. దాంతో పాటు ఆర్థిక సహకారం అందుతుంది. ప్రభుత్వాలు గుర్తిస్తాయి. – కేపీవీ రాజు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం -
నేడు వాహనాల వేలం
చేవెళ్ల: వివిధ కేసులలో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నట్లు చేవెళ్ల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయం సీఐ ఎం.శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల ఎకై ్సజ్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ వేలం ఉంటుందని చెప్పారు. చేవెళ్ల సర్కిల్ పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారు ముందుకు వచ్చి వేలంలో దక్కించుకోవాలని కోరారు. మంచాల పీఏసీఎస్ కార్యదర్శిపై వేటు మంచాల: మంచాల పీఏసీఎస్ కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెదెరె హన్మంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. పీఏసీఎస్‌లో రూ.7,25,223 సంబంధించిన అవకతవకలపై నిర్వహించిన విచారణలో భాగంగా డీసీఓ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు రాంరెడ్డి, జెనిగె వెంకటేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో గొడవపడి వ్యక్తి అదృశ్యం పహాడీషరీఫ్: తాగుడుకు బానిసైన వ్యక్తి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్‌నగర్‌కు చెందిన వి.నర్సింహులు(55) ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి తాగుడుకు బానిసైన అతడు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నర్సింహులుకు సర్ది చెప్పి బాగు చేయాలని అతని భార్య యాదమ్మ ఈ నెల 26వ తేదీన సర్దార్‌నగర్‌కు తీసుకొచ్చింది. అతనితో మాట్లాడేందు కు యత్నించగా, గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన అతని భార్య పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
మెట్రో రెండో దశపై కేంద్రం నజర్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండో దశ ప్రాజెక్టుపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో దశలో ప్రతిపాదించిన మొదటి 5 కారిడార్ల డీపీఆర్‌లపైన సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు అధికారుల బృందం రెండు రోజుల క్రితం ఢిల్లీలో పర్యటించింది. డీపీఆర్లలోని సాంకేతిక అంశాలపైన చర్చలు జరిగినట్లు తెలిసింది. వివిధ మార్గాల్లో చేపట్టనున్న కారిడార్లపై కేంద్ర అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకే హెచ్ఏంఆర్ఎల్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మెట్రో రెండో దశలో ప్రభుత్వం మొదట 76.4 కిలోమీటర్లతో 5 కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 5 కారిడార్లపైన హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి అందజేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సుమారు రూ.24 వేల కోట్ల అంచనాలతో రెండో దశలో మొదటి 5 కారిడార్లను ప్రతిపాదించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు డీపీఆర్‌లలో సాంకేతిక అంశాలపైన చర్చలు సాధారణమైన అంశమేనని, కేంద్ర కేబినెట్ దీనిపైన దృష్టి సారించినప్పుడే కీలకమైన ముందడుగు పడ్డట్లుగా భావించాలని హెచ్‌ఏఎంఆర్‌ఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నార్త్, ఫ్యూచర్ సిటీల డీపీఆర్‌లు.. మరోవైపు నార్త్‌సిటీలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు ప్రతిపాదించిన రెండు కారిడార్లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రెండో దశ ‘బి’ విభాగంలో ప్రతిపాదించిన కారిడార్లకే ఏప్రిల్‌లో డీపీఆర్‌లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకే అందజేయాల్సి ఉండగా ప్రాజెక్టుపైన సర్వేలు, అధ్యయనాల దృష్ట్యా ఏప్రిల్‌లో డీపీఆర్‌లు పూర్తి చేసే అవకాశం ఉంది.‘బి’ విభాగంలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు 22 కిలోమీటర్లు, ఫ్యూచర్‌సిటీ కారిడార్ 41 కిలోమీటర్ల చొప్పున నిర్మించనున్న సంగతి తెలిసిందే. రెండో దశలో రెండు విభాగాలుగా మొత్తం 8 కారిడార్లలో 190.4 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. డీపీఆర్‌లపై స్పష్టత ఢిల్లీలో ఎన్వీఎస్ రెడ్డి పర్యటన సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చలు రెండోదశ మొదటి ఐ కారిడార్లలో 76.4 కిలోమీటర్లు నార్త్, ఫ్యూచర్సిటీలపై వచ్చే నెలలో డీపీఆర్‌లు -
కోహెడ మార్కెట్ నిర్మాణానికి సహకరించండి
అబ్దుల్లాపూర్‌మెట్: కోహెడలో నిర్మించబోయే అంతర్జాతీయ సమీకృత మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన పరిపాలన అనుమతులు వేగవంతం చేయడంతో పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించినట్లు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శవంతంగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారి, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు, సీఎం ఓఎస్డీ చంద్రశే ఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి -
చేవెళ్ల బార్ అసోసియేషన్‌కు ఎన్నిక
చేవెళ్ల: చేవెళ్ల బార్ అసోసియేషన్‌కు గురువారం హోరాహారీగా ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం.నర్సింలు, జి.క్రిష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సి.మహేశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా కె.యాదగిరిగౌడ్, లైబ్రేరియన్‌గా పి.మల్లేశం, మహిళా ప్రతినిధిగా జె.గీతవనజాక్షి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రకాశం, సీహెచ్.రవీందర్, ఈశ్వర్, ఎం.శివరాజ్, ఎం.ప్రదీప్‌రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న బార్ అసోసియేషన్ సభ్యులను తోటి న్యాయవాదులు అభినందించారు. అడ్వకేట్ల సమస్యలపై బార్‌అసోషియేషన్ నిరంతరం పోరాటం చేస్తోందని నూతన అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి -
పాతబస్తీలో పన్ను వసూలు చేయాలి
మీర్‌పేట: మీర్పేటవాసులపై ఇంటి పన్ను భారం తగ్గించి, పాతబస్తీలో పన్ను వసూలు చేయాలని బీజేపీ మహేశ్వరం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గురువారం ఇంటి పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మీర్‌పేట–1, 2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. దీనికి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్శంకర్రెడ్డిలతో కలిసి శ్రీరాములుయాదవ్ పాల్గొని మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రభుత్వం ఇంటి పన్ను రూపంలో భారం వేస్తోందని, దీనిపై గతంలో నుంచే బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 15 నెలలకే అప్పటి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక పన్ను వసూలు చేస్తుందని ఆరోపించారు. మీర్‌పేటలో పన్నులు తగ్గించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో నాయకులు నర్సింహ, గోవర్ధన్‌రెడ్డి, సోమేశ్వర్, మధు, మాజీ కార్పొరేటర్లు హరినాథ్‌రెడ్డి, భీంరాజ్, విజయలక్ష్మి, అరుణ, గౌరీశంకర్, మల్లేష్ ముదిరాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, రాఘవేందర్‌ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మహేశ్వరం ఇన్చార్జి శ్రీరాములుయాదవ్ మీర్‌పేటలో ఆస్తి పన్ను తగ్గించాలని రిలే నిరాహారదీక్ష -
గురువులు సమాజ నిర్మాతలు
ఎమ్మెల్యే కాలె యాదయ్యమొయినాబాద్: గురువులు నవ సమాజ నిర్మాతలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్ ఎంఈఓగా 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక పీవీ కన్వెన్షన్‌లో ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్ని వెంకటయ్యను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని. 15 ఏళ్లుగా మొయినాబాద్ మండల ఎంఈఓగా, అజీజ్‌నగర్, కనకమామిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుడిగా వెంకటయ్య చేసిన సేవలు అందరికీ గుర్తుండిపోతాయన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేసినా ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా సేవలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంధ్య, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సధానందంగౌడ్, మాజీ జెడ్పీటీసీ అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ మంజుల, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్, ఎంఈఓలు విజయ్‌కుమార్‌రెడ్డి, పురందాస్, అక్బర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డుపై కాలిబూడిదైన కారు
చేవెళ్ల: రోడ్డుపై వెళ్తున్న స్కోడా కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి మొత్తం కాలిపోయింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముడిమ్యాల గేట్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కేసారానికి చెందిన కె.రాజశేఖర్‌రెడ్డి తన స్కోడా కారులో గ్రామం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. మూడు కిలోమీటర్లు వెళ్లగానే కారు లోపలికి ఏసీ విండోల నుంచి మంటలు అకస్మాత్తుగా రావటంతో భయపడి ఆయన దిగాడు. ఈ క్రమంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారులో ఒక్కడే ఉండటంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడ్డాడు. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయం
షాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలతో మమేకం కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి పేర్కొన్నారు. షాబాద్ ఠాణాను గురువారం రాత్రి రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫైళ్లను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం సీపీ అవినాశ్ మహంతి మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై కన్నేసి ఉంచాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ కేసులు ఉండొద్దన్నారు. పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చూసి అభినందించారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఫంక్షన్ వర్టికల్‌పై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్, సిబ్బంది ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మానవ అక్రమ రవాణాను అరికట్టాడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాపై ఏపీఎం, సీసీలకు కలెక్టరేట్లో గురువారం శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్నవారు.. వలస వచ్చిన కుటుంబాలు.. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న యువత త్వరగా అక్రమార్కుల వలలో పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గానీ, పేదవారిని గానీ నమ్మించి వారి ప్రమేయం లేకుండా నగరాలకు తరలించి వారిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1930.., 100.., 104.., 1098.., 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సూర్యారావు, డీపీఎంఎస్ సీహెచ్ స్వర్ణలత, యాదయ్య, విలాస్‌రావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.కవిత, ఎంపీఎంలు రవీందర్, యాదగిరి, విజయమాలిని తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత -
29, 30 తేదీల్లో వాలీబాల్ పోటీలు
చేవెళ్ల: మున్సిపల్ పరధిలోని దామరగిద్దలో ఈ నెల 29,30 తేదీల్లో 6వ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పవన్, ప్రకాశ్, ప్రసాద్, నరేందర్, నవీన్ తెలిపారు. చేవెళ్లలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎంట్రీ ఫీజు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. పోటీలను రెండు విభాగాలుగా నిర్వహించనున్నట్టు చెప్పారు. రూరల్ విభాగంలో ఆయా గ్రామాలకు చెందిన క్రీడాకారులే పోటీలో పాల్గొనాలని తెలిపారు. మొదటి బహుమతి రూ.30వేలు, రెండో బహుమతి రూ.20 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఉంటుందన్నారు. ఓపెన్ టూ ఆల్ విభాగంలో మొదటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ఉంటుందన్నారు. వివరాలకు 76809 88771, 90321 13340, 95501 64093, 80740 63420 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
యూజీ పవర్
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025ఓహెచ్ లైన్ల బదులు అండర్‌గ్రౌండ్ కేబుళ్లు 10లోuసాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇళ్లపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్ (ఓహెచ్) లైన్ల స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్స్ వేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయా రు చేసి సమర్పించాల్సిందిగా కోరుతూ డిస్కం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు ప్రముఖ అధ్యయన సంస్థలు దీనికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. 900 కిలోమీటర్ల ఓహెచ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను వేసేందుకు రూ.520 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఆయా ఏజెన్సీలు రూపొందించిన నివేదికను శుక్రవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సమర్పించనున్నాయి. ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా.. ● గ్రేటర్లో ప్రస్తుతం 60 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం లేకపోలేదు. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్‌హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ● చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలతో పాటు అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి. ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగ్‌లను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్‌హెడ్ లైన్‌కు ఆనుకుని విద్యుత్ షాక్‌తో మృతి చెందుతున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఓవర్‌హెడ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చవచ్చని డిస్కం భావిస్తోంది. హైదరాబాద్‌ను ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా అంతర్జాతీయ పటంలో చూపించవచ్చని యోచిస్తోంది. ప్రాధాన్య క్రమంలో పనులు ● హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రమాదకరంగా మారిన బహిరంగ విద్యుత్లైన్ల (ఓవర్‌హెడ్)ను తొలగించి, వాటిస్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుళ్లను వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటికే సుమారు 900 కిలోమీటర్ల ఓవర్ హెడ్ (ఓహెచ్) లైన్లు ఉన్నట్లు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు రూ.520 కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా వేసింది. డీపీఆర్ సమర్పించిన ఏజెన్సీలకే పనులను అప్పగించాలని యోచిస్తోంది. ● గ్రేటర్ మొత్తంగా ఒకే సమయంలో కాకుండా ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నట్లు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం తెలిసిందే. పేదలు ఎక్కువగా నివసించే నందినగర్, వారాసిగూడ, రాంనగర్, చిలకలగూడ, ఎన్టీఆర్ నగర్, ఇందిరా పార్కు, అశోక్‌నగర్, పద్మారావునగర్, గాంధీనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, రాజేంద్రనగర్, బోరబండ, శ్రీరామ్‌నగర్, లెనిన్‌నగర్, మన్సూరాబాద్, నాగోలు, అడ్డగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన లైన్లను మార్చే అవకాశం ఉంది. న్యూస్రీల్జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ నెట్వర్క్ ఇలా.. 33/11కేవీ సబ్స్టేషన్లు 498 33కేవీ యూజీ కేబుల్ 1,280 కి.మీ 33కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 3,725 కి.మీ 11 కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 21,643 కి.మీ పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022 11కేవీ యూజీ కేబుల్ 957 డిటీఆర్లు 1,50,992 ఇంటర్మీడియట్ స్తంభాలు 58,271 ఆసక్తిగల ఏజెన్సీల నుంచి డీపీఆర్‌ల ఆహ్వానం గ్రేటర్లో 900 కిలోమీటర్ల ఓవర్‌హెడ్ లైన్లు అండర్ గ్రౌండ్ కేబుల్స్‌కు రూ.520 కోట్లు అవసరం డిస్కంకు నేడు డీపీఆర్‌లు సమర్పించనున్న ఏజెన్సీలు -
అల్మాస్‌గూడలో హైడ్రా పంజా
బడంగ్పేట్: కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో హైడ్రా పంజా విసిరింది. రోడ్లను అక్రమించి నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని నేలమట్టం చేసి కాలనీవాసులకు విముక్తి కల్పించింది. వివరాలివీ.. అల్మాస్‌గూడలో బోయపల్లి కుటుంబీకులు 1982లో జీపీ లే అవుట్ చేశారు. కాలనీకి బోయపల్లి ఎన్క్లేవ్ అని పేరుపెట్టారు. సర్వే నంబర్ 39,40,41,42,44లో 5.7 ఎకరాల లే అవుట్ ఉండగా అందులో మూడు రోడ్లు, 236 గజాల పార్కు స్థలం చూపించి ప్లాట్లు విక్రయించారు. భూ యజమానులు మూడు లింక్ రోడ్లతో పాటు పార్కు జాగా ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆక్ర మించిన రోడ్ల స్థానంలో బాక్స్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. ఈ క్రమంలో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం హైడ్రా అధికారులు లే అవుట్‌ను పరిశీలించి కబ్జాను నిర్ధారించారు. గురువారం హైడ్రా సీఐ తిరుమలేశ్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హైడ్రా సీఐపై దాడికి యత్నం బాక్స్ క్రికెట్ స్టేడియంను కూల్చివేస్తుండగా ల్యాండ్ వర్గీయులు అడ్డుకునే యత్నం చేశారు. హైడ్రా సీఐ తిరుమలేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అదే రీతిలో సీఐ బదులివ్వడంతో భూ యజమానులు వెనక్కి తగ్గారు. హైడ్రా సిబ్బంది వెంటనే జేసీబీతో క్రికెట్ స్టేడియాన్ని ధ్వంసం చేసి చదును చేశారు. లేఅవుట్లో చూపించిన పార్కు స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇది పార్కు స్థలం అంటూ బోర్డు పాతించారు. దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ తిరుమలేశ్ తెలిపారు. అనంతరం కాలనీవాసులు సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ స్టేడియం కూల్చివేత మూసిన మూడు రోడ్లు, పార్కు స్థలానికి విముక్తి హైడ్రా సీఐపై దాడికి ల్యాండ్ వర్గీయుల యత్నం -
డెయిరీ పేరుతో బురిడీ
మొయినాబాద్: డెయిరీ ఫాంలో పెట్టుబడులు పెడితే ప్రతీ నెల కచ్చితమైన లాభాలు ఉంటాయని ప్రకటన ఇచ్చాడు.. పెట్టుబడులు ఆకర్షించి రూ.15 కోట్లు రాబట్టాడు.. ఆ తర్వాత బిచాణా ఎత్తేశాడు.. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలివీ.. నగరానికి చెందిన వ్యాపారులు శ్రీనివాస్‌రావు, కోటేశ్వరరావు 2019లో అజీజ్‌నగర్ రెవెన్యూలో 15 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో కూరగాయలు, పూల తోటలతోపాటు డెయిరీ ఏర్పాటు చేస్తామని లీజు పత్రాల్లో రాసుకున్నారు. వారు లీజుకు తీసుకున్న భూమిలో కోటేశ్వరరావు బంధువైన వేముల సుబ్బారావు 2021లో కొండపల్లి డెయిరీ ఫాం పేరుతో డెయిరీ ఏర్పాటు చేశాడు. సుమారు 400 గేదెలతో డెయిరీని నడుపుతూ పాల ఉత్పత్తులు చేసేవారు. రెండేళ్ల క్రితం సుబ్బారావు డెయిరీలో పెట్టుబడులు పెడితే ప్రతి నెల కచ్చితమైన లాభాలు ఉంటాయని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన కొంత మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. రూ.15 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటి నుంచి కొనసాగిన డెయిరీని పది రోజుల క్రితం సుబ్బారావు మూసివేశాడు. అందులోని గేదెలను రాత్రికి రాత్రే తరలించాడు. దీంతో రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన సాయి హరీష్ అనే వ్యక్తి ఈ నెల 17న మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం మరో ఎనిమిది మంది బాధితులు వేముల సుబ్బారావు, అతని భార్య కుమారి పెట్టుబడులు పెట్టించుకుని తమను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో ఆర్థిక నేరం జరిగిందని కేసును సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసినట్లు ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించి.. బిచాణా ఎత్తేసి రూ.15 కోట్ల వరకు టోకరా పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఆలస్యంగా వెలుగులోకి..నేడు బాధితుల సమావేశం అజీజ్‌నగర్‌లో డెయిరీ ఫాంలో పెట్టుబడులు పెట్టించుకుని మోసం చేసిన వేముల సుబ్బారావు మోసాలను ఆధారాలతో బయట పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. శుక్రవారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మొత్తం 60 రోజులకు గాను రూ.12,01,567 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరా బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, సిబ్బంది, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మాసబ్ చెరువును పరిరక్షిస్తాం తుర్కయంజాల్: మాసబ్ చెరువును పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు శిఖం సర్వే నంబర్ 137లోని భూమిలో రోడ్డు నిర్మాణానికి డంప్ చేసిన మట్టిని తొలగిస్తున్న పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టి డంప్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారా లేదా అని ఆరా తీశారు. మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో కలపండి మొయినాబాద్: మండలంలోని నాగిరెడ్డిగూడ పంచాయతీని కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేయాలని నాగిరెడ్డిగూడ గ్రామస్తులు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈ మేరకు గురువారం వేర్వేరుగా వారిని కలిసి వినతిప్రతాలు అందజేశారు. నాగిరెడ్డిగూడ గ్రామం గతంలో రాజేంద్రనగర్ సమితిలో ఉండేదని.. 1982 వరకు హుడా పరిధిలోనే ఉన్న తమ గ్రామ రెవెన్యూలోని భూముల రిజిస్ట్రేషన్ ధరణి రాకముందు హైదరాబాద్‌లో జరిగేవని వివరించారు. భౌగోళికంగా మొయినాబాద్ మున్సిపాలిటీ మధ్యలో నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ భూములు ఉన్నాయన్నారు. హిమాయత్‌సాగర్ జలాశయానికి ఆనుకుని ఉన్న తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కీసరి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ సద్గుణాచారి, మాజీ ఎంపీటీసీ అర్జున్, నాయకులు మాణిక్యం, సుధాకర్, వినోద్‌కుమార్, మహేందర్, యాదగిరి, మల్లేష్, అశోక్, రవీందర్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీశైలం, ముత్యాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’మహేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లక్ష్మీసుధ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రయాణికులు 91542 98784 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని, సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే.. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్‌గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపా యాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ సూచించింది. -
పేదల ఇళ్ల కోసం మరో పోరాటం
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమణలో ఉన్న పేదల ఇళ్ల స్థలాలు, 370 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించుకునేందుకు మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామేల్ అన్నారు. ఇబ్రహీంపట్నం పాషనరహరి స్మారక కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాగన్‌పల్లి రెవెన్యూ పరిధిలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లోకి బుధవారం లబ్ధిదారులు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం, అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఫిలింసిటీ యాజమాన్యంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కమ్మకై ్క లబ్ధిదారులైన పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. 18 ఏళ్లుగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ఇంటి స్థలాల లబ్ధిదారులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కోసం సేకరించిన భూములను తాము అధికారంలోకి వస్తే తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేసిందని వారు విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో మరో 2,500 ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం చేయడం ఏమిటని నిలదీశారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు బుగ్గరాములు, జంగయ్య, జగన్, నర్సింహ, యాదయ్య, బాలరాజ్, శ్రీను, చరణ్, యాదగిరి, ఎల్లేష్ పాల్గొన్నారు. రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణలో ఉన్న 370 ఎకరాలను విడిపిస్తాం సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య -
నిందితులను శిక్షించాలి
మహేశ్వరం: న్యాయవాది ఎర్రవాపు ఇజ్రాయెల్ హత్య కేసుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలని మహేశ్వరం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని కోర్టు ఎదుట న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఇజ్రాయెల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో న్యాయం కోసం కోట్లాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహేశ్వరం కోర్టులో పని చేస్తున్న సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్‌ను చంపాపేట్‌లో కత్తితో హత్య చేశారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మహేశ్వరం బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మహేశ్వరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్ గౌడ్