పల్లెల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
షాద్‌నగర్: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామ పంచాయతీ పిట్టలగడ్డ తండాలో రూ.70లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ, సీసీరోడ్లు, కందివనం గ్రామంలో రూ.9లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, సూర్యప్రకాశ్, శ్రీనివాస్, అనంతం, తుపాకుల శేఖర్, నవీన్, శ్రీధర్‌రెడ్డి, రాజు, యాదయ్య, రఘురాం, సర్ధార్, ప్రసాద్, రాజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ నేత చెంది తిరుపతిరెడ్డిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే నాయకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకొని, ధైర్యం కల్పించారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


