
రేషన్ బియ్యం అవకతవకలపై ఫిర్యాదు
కందుకూరు: జాతీయ ప్రజా పంపిణీ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో డీలర్ అవకతవకలకు పాల్పడుతున్నాడని మండల పరిధిలోని జైత్వారం గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్‌కు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇచ్చే బియ్యం కాంటలో మోసం చేస్తూ చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. రేషన్ షాపులో ఓ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇచ్చారు. అనంతరం అతడు బయట తూకం వేయగా ఒక్క కిలో తగ్గిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓర్సు వెంకటేష్, కుమ్మరి నర్సింహ, చల్లా జైపాల్‌రెడ్డి, నవీన్, మహేందర్, పాండు, అజయ్, కార్తీక్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.