ఇంటి దొంగలు! | - | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగలు!

Published Sat, Apr 19 2025 9:48 AM | Last Updated on Sat, Apr 19 2025 9:48 AM

ఇంటి దొంగలు!

ఇంటి దొంగలు!

డీసీఎంఎస్‌లో
రూ.11.45 కోట్లకు టెక్నికల్‌ రైటాఫ్‌ అంటూ ప్రచారం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటి దొంగల వ్యవహారంతో జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)లు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా రైతుల ముసుగులో కొంత మంది డీసీఎంఎస్‌ ఉద్యోగులు, పాలకవర్గం సభ్యులు బినామీ పేర్లతో జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీకి చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏకంగా జిల్లా సొసైటీ అధికారికి తెలియకుండానే మొండి బకాయిలకు టెక్నికల్‌ రైటాఫ్‌ పెట్టడం.. పాలకవర్గం దాన్ని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది.

రూ.కోట్లలో బకాయిలు

దశాబ్దాల కాలంగా డీసీఎంఎస్‌ల నుంచి రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నారు. వరి, కందులు తదితర పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విత్తనాలు, ఎరువులు అరువుగా తీసుకెళ్లిన రైతులు తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేయడం, బకాయిలను వసూలు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో బకాయిలు పెరిగి రూ.కోట్లకు చేరాయి. కొన్ని డీసీఎంఎస్‌ కేంద్రాలు ఏటా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. వికారాబాద్‌, తాండూరు, పరిగి, చేవెళ్ల తదితర డీసీఎంస్‌ల్లో సిబ్బంది, పాలకవర్గం సభ్యులు రైతుల ముసుగులో రూ.కోట్లలో దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కందుల సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణల రావడంతో విచారణ చేపట్టి, కొంత మందిపై కేసులు సైతం నమోదు చేశారు. ఆయా మొత్తాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేశారు. ప్రస్తుతం రైతుల ముసుగులో ఉన్న బినామీల నుంచి పెద్ద మొత్తంలో మొండి బకాయిలను వసూలు చేయడంలో డీసీఎంఎస్‌ సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది. గతంలో కొడంగల్‌ కందుల కేసులో విచారణ ఎదుర్కొన్న వ్యక్తుల పాత్ర ఇందులో ఉందని సమాచారం. ఒక సీజన్‌లో ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లిన వ్యక్తి డబ్బులు చెల్లించకపోతే రెండో సీజన్‌లో మళ్లీ అదే వ్యక్తికి అరువు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా రూ.11 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. డీసీఎంఎస్‌కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్‌కు కందులు అమ్మినప్పుడు తరుగు కింద పట్టుకున్న సొమ్ము సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని, దాన్ని ఇన్‌చార్జిల నుంచి వసూలు చేయాల్సి ఉండగా టెక్నికల్‌ రైటాఫ్‌ పెట్టామని, పాలకవర్గం దీన్ని ఆమోదించిందని తెలిపారు. ఇదిలా ఉంటే సిబ్బంది నియామకంలోనూ అర్హులైన వారు ఉండగా, తమకు అనుకూలమైన వారైన జూనియర్లను కీలక పదవుల్లో కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తోంది.

అనుమతి లేదన్న డీసీఓ

సొమ్ము వసూళ్లలో నిర్లక్ష్యం

విచారణ చేపడతాం..

మొండి బకాయిల విషయంలో టెక్నికల్‌ రైటాఫ్‌ పెట్టాలంటే మేము అనుమతి ఇవ్వాలి. మా దగ్గర నుంచి అలాంటి అనుమతులు ఎవ్వరికీ ఇవ్వలేదు. వాళ్లకు వాళ్లు టెక్నికల్‌ రైటాఫ్‌ పెట్టుకుంటామంటే అది చెల్లదు. విచారణ చేపట్టి అలా చేస్తే సంబంధిత సభ్యుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తాం.

– సుధాకర్‌, జిల్లా సహకార అధికారి, రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement