గురువులు సమాజ నిర్మాతలు | - | Sakshi
Sakshi News home page

గురువులు సమాజ నిర్మాతలు

Mar 28 2025 6:18 AM | Updated on Mar 28 2025 6:16 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

మొయినాబాద్‌: గురువులు నవ సమాజ నిర్మాతలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్‌ ఎంఈఓగా 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక పీవీ కన్వెన్షన్‌లో ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్ని వెంకటయ్యను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని. 15 ఏళ్లుగా మొయినాబాద్‌ మండల ఎంఈఓగా, అజీజ్‌నగర్‌, కనకమామిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుడిగా వెంకటయ్య చేసిన సేవలు అందరికీ గుర్తుండిపోతాయన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేసినా ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా సేవలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంధ్య, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేష్‌, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సధానందంగౌడ్‌, మాజీ జెడ్పీటీసీ అనంతరెడ్డి, మాజీ సర్పంచ్‌ మంజుల, తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌, ఎంఈఓలు విజయ్‌కుమార్‌రెడ్డి, పురందాస్‌, అక్బర్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement