
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కడ్తాల్: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా శిరసనగండ్లకు వెళ్తూ మండల కేంద్రంలో కాసేపు ఆగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్పతినాయక్ పాల్గొన్నారు.
ఆమనగల్లులో ఘనస్వాగతం
ఆమనగల్లు: నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవికి ఆమనగల్లు పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్‌చైర్మన్ గుర్రం కేశవులు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు తదితరులు పాల్గొన్నారు.