‘ఎర్లీబర్డ్’కు బోణీ మొదట చెల్లించిన వ్యక్తికి సన్మానం
షాద్‌నగర్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన ఇంటి యజమానిని శనివారం మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకం కింద ఐదు శాతం రాయితీ కల్పిస్తుంది. పట్టణంలోని ఈశ్వర్ కాలనీకి చెందిన పాతూరి సత్యనారాయణ రూ.1.46లక్షల ఆస్తి పన్ను చెల్లించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సునీత, అధికారులు ఆయన్ను శాలువాతో సన్మానించారు.
గౌడ కులస్తుల అభివృద్ధికి ఐక్యతతో పనిచేయాలి
గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కృష్ణగౌడ్
మొయినాబాద్: గౌడ కుల అభివృద్ధికి కులస్తులంతా ఐక్యతతో పనిచేయాలని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నక్క కృష్ణగౌడ్ అన్నారు. మొయినాబాద్‌కు చెందిన రేనట్ల దర్శన్‌గౌడ్ సంఘం జాతీయ కార్యదర్శిగా ఎన్నికై న సందర్భంగా శనివారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గౌడ సదస్సులు నిర్వహించి కులస్తులను ఏకం చేయాలన్నారు. అనంతరం దర్శన్‌గౌడ్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని.. గౌడ కుల అభివృద్ధి, ఐక్యతకోసం పనిచేస్తానని చెప్పారర్థీ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేశ్‌గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మహేందర్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు నర్సింహగౌడ్, మండల అధ్యక్షుడు అంజయ్యగౌడ్, నాయకులు సతీశ్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, లావణ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఫెన్సింగ్ పనులను నిలిపివేయాలి’
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూము ల్లో ఫెన్సింగ్ పనులను ఆపివేయాలని.. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఎం నక్కర్తమేడిపల్లి శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం వారు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసైన్డ్ పట్టా లున్న రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని ఆరోపించారు. రైతులను అడ్డుకుని ఫెన్సింగ్ పనులు చేపట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం గ్రామాలను పోలీసులతో మోహరించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఫెన్సింగ్ పనులను నిలిపివేయకపోతే ఫార్మా బాధిత గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి రైతులను చైతన్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, నాయకులు ఆలంపల్లి జంగయ్య, జహంగీర్, యాదయ్య, భూషన్, పెంటయ్య, శ్రీకాంత్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
నిన్న సీజ్.. నేడు ఓపెన్
క్లినిక్‌లపై వైద్యాధికారుల వరుస దాడులు
షాద్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా షాద్‌నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లను శుక్రవారం సాయంత్రం వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఆర్‌ఎంపీలు ఏర్పాటు చేసిన మనశ్విని, ప్రజా వైద్యశాల, సిద్దాపూర్ దవాఖానా, రాజా మెడికల్ హాల్ వెనక ఉన్న క్లినిక్‌లపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేశారు. కాగా శుక్రవారం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సీజ్ చేసిన క్లీనిక్‌లను శనివారం ఆర్‌ఎంపీలు తెరిచారు. దీంతో స్థానిక అధికారులు శనివారం మళ్లీ సీజ్ చేశారు.
‘ఎర్లీబర్డ్’కు బోణీ మొదట చెల్లించిన వ్యక్తికి సన్మానం
‘ఎర్లీబర్డ్’కు బోణీ మొదట చెల్లించిన వ్యక్తికి సన్మానం


