బియ్యం లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

బియ్యం లేవ్‌!

Apr 11 2025 8:53 AM | Updated on Apr 11 2025 8:53 AM

బియ్య

బియ్యం లేవ్‌!

అసాంఘిక అడ్డాగా..వీకెండ్‌ సరదా కోసం నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లోu

రేషన్‌ షాపుల్లో నిండుకున్న నిల్వలు

పూర్తిస్థాయిలో దుకాణాలకు చేరని కోటా

తొలి విడతలో వచ్చినవి వచ్చినట్లే పంపిణీ

దుకాణాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు

ఏం చేయలేక చేతులెత్తేస్తున్న డీలర్లు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గండిపేట మండలం మణికొండలోని షాప్‌ నంబర్‌ 23లో బియ్యం స్టాక్‌ లేక గురువారం మూతపడింది. నార్సింగి –1 రేషన్‌ షాపులోనూ ఇదే పరిస్థితి. మంచిరేవుల రేషన్‌షాపు నంబర్‌ 15100020లో పాతదొడ్డు బియ్యం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సన్న బియ్యం ఇప్పటికీ సరఫరా కాలేదు. ఖానాపూర్‌, నార్సింగి, బండ్లగూడ, మణికొండ, కోకాపేట్‌, మంచిరేవుల, కిస్మత్‌పూర్‌, గంధంగూడ, హిమాయత్‌సాగర్‌, వట్టినా గులపల్లి, బండ్లగూడ జాగీర్‌, నెక్నాంపూర్‌, పుప్పాల్‌గూడ రేషన్‌షాపుల్లో బియ్యం నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. లబ్ధిదారుల నిష్పత్తి మేరకు సన్న బియ్యం సరఫరా కాకపోవడంతో డీలర్లు ఆయా దుకాణాలను మూసివేశారు. ఇలా ఒక్క మణికొండ మండలంలోనే కాదు.. జిల్లాలో మెజార్టీ మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకం అమలు తీరుపై గురువారం ‘సాక్షి’ బృందం గ్రౌండ్‌ రిపోర్ట్‌ నిర్వహించింది.

స్టాక్‌ లేక.. వచ్చిన వాళ్లకు సమాధానం చెప్పలేక..

సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీకి ముందే ఎంపిక చేసిన గోదాముల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు చేరుకుంటాయి. ఆయా షాపుల డీలర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో షాపులు తెరిచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. సన్న బియ్యం పంపిణీ ప్రకటన, లబ్ధిదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో మెజార్టీ షాపులు తెరుచుకోవడం లేదు. సన్న బియ్యం సంగతేమో కానీ, కనీసం దొడ్డు బియ్యం కూడా దక్కకుండా పోతున్నాయి. ఫలితంగా ఇంట్లో బియ్యం లేక పేదలు పస్తులుండాల్సి వస్తోంది. జిల్లాలో 936 రేషన్‌షాపులు ఉండగా, వీటి పరిధిలో 5,71,696 రేషన్‌కార్డులు, 18,71,696 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం 1,17,54,063 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దొడ్డు బియ్యం స్థానంలో ఏప్రిల్‌ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు తొలి విడతగా కొంత మొత్తాన్ని సరఫరా చేసింది. లబ్ధిదారుల నిష్పత్తి మేరకు సరఫరా కాకపోవడం.. ఇప్పటికే వచ్చిన బియ్యం పంపిణీ చేయడంతో రేషన్‌షాపులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం స్టాక్‌ లేకపోవడం.. లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో వచ్చిన వాళ్లకు సమాధానం చెప్పలేక డీలర్లు తలపట్టుకుంటున్నారు. కొంత మంది ఏకంగా షాపులు మూసేసి పత్తా లేకుండా పోతున్నారు. మరోవైపు మహేశ్వరం, కిస్మత్‌పూర్‌, శంషాబాద్‌, హయత్‌నగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, యాచారం, షాద్‌నగర్‌, శంకర్‌పల్లి గోదాముల నుంచి రేషన్‌షాపులకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాలో రెండు నుంచి మూడు కిలోలు తరుగు ఉండటం గమనార్హం.

వెలవెలబోయిన దుకాణాలు

జిల్లా వ్యాప్తంగా వందకుపైగా దుకాణాల్లో బియ్యం నిల్వలు నిండుకున్నట్లు తేలింది. శంకర్‌పల్లి సహా జన్వాడ, సందేపల్లి రేషన్‌షాపులు ఖాళీగా ఉన్నాయి. మొయినాబాద్‌ మండలం చిలుకూరు–2 రేషన్‌ దుకాణాల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. కనకమామిడి, అప్పారెడ్డిగూడలోనూ ఇదే పరిస్థితి. చేవెళ్ల మండలం చేవెళ్ల–1,2 దుకాణాలతో పాటు కిష్టాపూర్‌, ఇబ్రహీంపల్లి, ఊరెళ్ల, ఆలూరు–2 రేషన్‌షాపుల ముందు నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. శంషాబాద్‌ మండలం ఉట్‌పల్లి–1,2 షాపులు సహా పెద్దతూప్రా, చిన్నగోల్కొండ, చౌదరిగూడలోనూ స్టాక్‌ లేదు. మహేశ్వరం మండలం కేకే బస్తీ, మహేశ్వరం–1, తుక్కుగూడ, దిల్వర్‌గూడ, హబీబుల్లాగూడ దుకాణాల్లోనూ నిల్వలు అయిపోయా యి. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ సహా మంచాల మండలం ఆరుట్ల–2లోనూ నిల్వలు నిండుకున్నాయి. యాచారం మండలం గండ్లగూడ, మొగుళ్లవంపు, నక్కర్త రేషన్‌ షాపులు ఖాళీ అయ్యాయి. కందుకూరు మండలం జైత్వారం, రాచలూరు, కందుకూరు ఎక్స్‌రోడ్‌ సహా షాద్‌నగర్‌లోని ఏ ఒక్క షాపులోనూ నిల్వలు లేవు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని చటాన్‌పల్లి, పీర్లగూడ సహా కేశంపేటలోని వార్డు నంబర్‌ 1లోని షాపు, ఎస్సీ కాలనీలోని షాపులోనూ ఇదే పరిస్థితి. సరూర్‌నగర్‌లోని వనస్థలిపురం కాంప్లెక్స్‌, సీబీఐ కాలనీ, ఎస్‌బీహెచ్‌కాలనీ, లింగోజిగూడ, ఎల్బీనగర్‌, జీజేనగర్‌, ఎర్రకుంట, హయత్‌నగర్‌ ఓల్డ్‌ విలేజ్‌, లెక్చరర్స్‌ కాలనీ, రాజిరెడ్డినగర్‌, వాంబేకాలనీ, నందనవనం, సరస్వతినగర్‌, వినాయకనగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, ఆమనగల్‌, గిరికొత్తపల్లి, కలకొండ, తట్టిఅన్నారం, మరిపల్లి, అబ్దుల్లాపూర్‌, తుర్కయంజాల్‌, రాగన్నగూడ, ఇంజాపూర్‌, కమ్మగూడ, మునగనుర్‌, బ్రాహ్మణపల్లి, లస్కర్‌గూడ, కొత్తగూడెం, కుంట్లూరు రాజీవ్‌గృహకల్ప దుకాణాలు సైతం నిల్వలు లేక వెలవెలబోయాయి. ఇప్పటికే పంపిణీ చేసిన బియ్యంలోనూ నూకల శాతం ఎక్కువగా ఉన్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు.

న్యూస్‌రీల్‌

బియ్యం లేవ్‌!1
1/1

బియ్యం లేవ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement