
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించండి
షాద్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నిధులను మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్, కో కన్వీనర్ మాదారం నర్సింలు బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2013లో అనుమతి ఇచ్చారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నార్లాపూర్, ఏదుల, కరివెన, రిజర్వాయర్ పరిధిలో ఉన్న పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను ఇచ్చారని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నిధులను మంజూరు చేయడంతో పాటుగా రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన భూమి సేకరణ పనులను చేపట్టి ఇక్కడి రైతులకు నమ్మకం కలిగించాలని పేర్కొన్నారు.
బీసీసేన అసెంబ్లీ యువజన అధ్యక్షుడిగా శ్రీనివాస్
షాద్‌నగర్: పట్టణంలోని బీసీ సేన కార్యాలయంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కత్తిచంద్ర శేఖరప్ప ఆధ్వర్యంలో బుధవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ సమక్షంలో అసెంబ్లీ యువజన అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన పాలాది శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, ఉపాధి రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించకపోవడంతో అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలిచిన నాయకులు అధికారంలో వచ్చాక వారి సమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం బీసీలు ఐకమత్యంతో ఏకతాటిపైకి వచ్చి సంఘటితంగా పోరాటం చేయాలని సూచించారు. అనంతరం నూనతంగా ఎన్నికై న శ్రీనివాస్‌కు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా యువజన కార్యదర్శి శివ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
ఇంట్లో మంటలు
బొంరాస్‌పేట: వేసవితాపానికి ఉపశమనం కోసం ఇంట్లో పెట్టుకున్న కూలర్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల పరిధిలోని తుంకిమెట్లలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సఫియాబేగం ఇంట్లో మధ్యాహ్నం కూలర్ ఆన్‌చేసుకొని ఉండగా కొద్దిసేపటికి అందులోంచి మంటలు వ్యాప్తించాయి. చూస్తుండగానే వేగంగా వ్యాప్తి చెందడంతో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు అరవడంతో కాలనీవాసులు మంటలు ఆర్పే ప్రయ త్నం చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనంతో సిబ్బంది మంటలు పూర్తిగా చల్లార్చా రు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వస్తువులు కాలిపోయాయని బాధితురాలు వాపోయింది. రూ.6లక్షల మేర నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.