
54 కేసుల్లో రూ.3.28 కోట్లు రిఫండ్
బాధితుడికి చెక్కు అందించిన సీపీ
సాక్షి, సిటీబ్యూరో: నగర కమిషనరేట్ పరిధిలో మార్చిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో 54 మంది బాధితులకు రూ.3.28 కోట్లు రిఫండ్ అయింది. ఫిర్యాదు వచ్చిన మరుక్షణం స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. న్యాయస్థానం అనుమతితో ఈ మొత్తాన్ని బాధితులకు అందించారు. ఓటీపీ ఫ్రాడ్‌లో రూ.47 లక్షలు పోగొట్టుకున్న బాధితుడికి రూ.40 లక్షలు రిఫండ్‌కు సంబంధించిన చెక్కును నగర కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం అందజేశారు.