షాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలతో మమేకం కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి పేర్కొన్నారు. షాబాద్ ఠాణాను గురువారం రాత్రి రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫైళ్లను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం సీపీ అవినాశ్ మహంతి మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై కన్నేసి ఉంచాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ కేసులు ఉండొద్దన్నారు. పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చూసి అభినందించారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఫంక్షన్ వర్టికల్‌పై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐ రమేష్, సిబ్బంది ఉన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి