ప్రశాంతంగా ఫార్మా భూముల సర్వే | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఫార్మా భూముల సర్వే

Apr 8 2025 7:29 AM | Updated on Apr 8 2025 7:29 AM

ప్రశా

ప్రశాంతంగా ఫార్మా భూముల సర్వే

యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే సోమవారం ప్రశాంతంగా జరిగింది. యాచారం–కడ్తాల్‌ మండలాల సరిహద్దులోని నక్కర్తమేడిపల్లి, పల్లెచల్కతండా, నానక్‌నగర్‌లో యాచారం తహసీల్దార్‌ అయ్యప్ప ఆధ్వర్యంలో 20 మందికి పైగా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులు ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్‌, పట్టా భూములను సర్వే చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పా టు చేశారు. నక్కర్తమేడిపల్లి– పల్లెచల్కతండా రోడ్డుపై రాకపోకలు సాగించే కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. ఏ గ్రామం..ఎక్కడికి వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. నక్కర్తమేడిపల్లి, పల్లెచల్కతండా, నానక్‌నగర్‌ గ్రామాల్లో ఆందోళనకారులపై నిఘా పెట్టారు.

ఇచ్చిన మాట

నిలబెట్టుకోవాలి

యాచారం: బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నాడు ఫార్మాసిటీ పేరుతో భూసేకరణ చేస్తే అధికారంలోకి వస్తే తిరిగి భూములు ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా నేడు రైతులను మోసం చేస్తోందని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు పేర్కొన్నారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నక్కర్తమేడిపల్లిలో నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులను మోసం చేసిందని, కోర్టు ఉత్తర్వులను అధికారులైనా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫార్మాసిటీ భూముల్లో సర్వే, ఫెన్సింగ్‌ పనులు వెంటనే ఆపాలని కోరారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు కవులు సరస్వతి, నారాయణ, గణేశ్‌, రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సామ నిరంజన్‌, భగవంత్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాధికారంతోనే

అభివృద్ధి సాధ్యం

షాద్‌నగర్‌: బీసీలు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌ అన్నారు. పట్టణంలోని బీసీసేన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బాసవరలక్ష్మి స్వగృహంలో సోమవారం నియోజకవర్గ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో బీసీసేన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుధాకర్‌, ఫరూఖ్‌నగర్‌ మండల మహిళా అధ్యక్షురాలిగా జలజ, పట్టణ అధ్యక్షురాలిగా భాగ్యలక్ష్మిగౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బర్క కృష్ణయాదవ్‌ మాట్లాడుతూ.. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన హక్కు లు, రిజర్వేషన్లను కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప వారి కష్టాలు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. అనంతరం నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శివ, నరేష్‌, భూషణ్‌, నరేష్‌, చందులాల్‌, వరకుమార్‌, వెంకటేశ్‌, రవి, మారుతి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఆదాయ వనరులపై

ప్రత్యేక దృష్టి

తాండూరు టౌన్‌: మున్సిపల్‌ అధికారులు ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై మున్సిపల్‌ పరిధిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరిగినా రుసుం చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో ఏళ్ల తరబడిగా మూతపడిన తైబజార్‌ వసూళ్లకు తిరిగి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే తైబజార్‌ బహిరంగ వేలం వేయడంతో ఓ కాంట్రాక్టర్‌ రూ.10,25,100కు వేలం దక్కించుకున్నారు.

ప్రశాంతంగా  ఫార్మా భూముల సర్వే 
1
1/2

ప్రశాంతంగా ఫార్మా భూముల సర్వే

ప్రశాంతంగా  ఫార్మా భూముల సర్వే 
2
2/2

ప్రశాంతంగా ఫార్మా భూముల సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement