
వాహనదారులు నిబంధనలు పాటించాలి
తాండూరు: తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నంబర్ ప్లేట్ లేని 50 ద్విచక్రవాహనాలను పట్టుకుని అవగాహన కల్పించామన్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం వాహనదారులకు జరిమాన విధించడంతో పాటు కొత్త నంబర్ ప్లేట్ బిగించామన్నారు.
దోమలో..
దోమ: వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నియమ, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇంచార్జి ఎస్‌ఐ నాగేందర్ అన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని బాస్‌పల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి వాహనదారుడు వాహనాలకు సంబంధించి ధ్రువపత్రాలను తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. నంబర్ ప్లేట్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
నంబర్ ప్లేటు లేకుంటే కఠిన చర్యలు
యాలాల: నంబరు ప్లేటు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్‌ఐ గిరి హెచ్చరించారు. శుక్రవారం యాలాల మండ ల కేంద్రంలో సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్లులేని పది ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. అనంతరం వా హన యజమానులతో మాట్లాడి నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించారు. వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ఉండలన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వాహనదారులు నిబంధనలు పాటించాలి