ఉపాధ్యాయులే మార్గదర్శకులు
షాబాద్: విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఉపాధ్యాయులు వారిని పోత్సహించడంతో పాటు, మార్గదర్శకంగా నిలవాలని దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర శర్మ సూచించారు. శుక్రవారం రాత్రి షాబాద్ మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. భవిష్యత్తుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్దిష్టమైన లక్ష్యంతో చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని, అప్పుడే సమాజంలో అత్యున్నతమైన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్, పాఠశాల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పూర్వపు విద్యార్థి డాక్టర్ అమరేందర్, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి భూషణ్, మాజీ సర్పంచ్‌లు సుబ్రమణ్వేశ్వరి రవీందర్, శైలజఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


