
మల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
● ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన మద్దతుదారులు
ఇబ్రహీంపట్నం: స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర పారా మెడికల్ వైద్యుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఉక్కుల అశోక్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన మల్‌రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి దీక్షకు మద్దతు తెలిపారు. అశోక్‌తోపాటు పలువురు ఆర్‌ఎంపీలు శిబిరంలో కూర్చున్నారు.