
నేడు కడ్తాల్ మండలంలో హరీశ్‌రావు పర్యటన
కడ్తాల్: మండలంలో గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించనున్నారని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఈ మేరకు బుధవారం బోయిగుట్ట, ముద్వీన్ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరీశ్‌రావు ఉదయం 10 గంటలకు మండలంలోని చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్‌గుట్ట తండాలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్, సంత్ సేవాలాల్ విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ముద్వీన్ గ్రామంలో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిర్మించిన ఇంటిని ప్రారంభిస్తా రని చెప్పారు. అనంతరం బోయిన్‌గుట్ట తండాలో బహిరంగ సభలో మాట్లాడతారని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహగౌడ్, నాయకులు వీరయ్య, రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.
పాలిసెట్ పరీక్షకు
దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్– 2025 పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఈనెల 19 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500 ఉంటుందన్నారు. గడువు దాటిన తర్వాత ఈనెల 21 వరకు రూ.100, ఈనెల 23 వరకు అయితే రూ.300 అపరాద రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని, పరీ క్ష రాసిన 12 రోజుల తర్వాత ఫలితాలు వెలువడుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
నేరాలను సహించేది లేదు
పహాడీషరీఫ్: రౌడీషీటర్లు సామాన్యులను బెదిరించినా, దాడులకు పాల్పడినా ఉక్కుపాదంతో అణచివేస్తామని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి హెచ్చరించారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు బుధవారం ఆమె ఏసీపీ లక్ష్మీకాంత రెడ్డితో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలోని ప్రతి రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వారి ప్రవర్తన, పని చేసే చోట వ్యహరిస్తున్న తీరును పరిశీలిస్తున్నామన్నారు. బస్తీల్లో ఇరుగు పొరుగు వారిపై జులుం ప్రదర్శించడం, దాడులు, ఇతరత్రా నేరాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రవర్తనలో మార్పు లేని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చ రించారు. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కమ్యూనల్ షీట్లు కూడా తెరుస్తామన్నారు. కార్యక్రమంలో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోండి
షాద్‌నగర్: జిల్లా పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి జిల్లా రీజినల్ గిరిజన గురుకులాల కోఆర్డినేటర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు గిరిజన సంక్షేమ గురు కుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షాద్‌నగర్ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనం ఆవరణలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మెస్ మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ) పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలి పారు. మెస్ మేనేజర్‌కు ఎంఎస్సీ (హోం సైన్స్, డైటీషియన్, ఫుడ్‌సైన్స్, న్యూట్రీషియన్) అర్హత కలిగి ఉండాలని, ల్యాబ్ అసిస్టెంట్‌కు బీఎస్సీ (ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్) అర్హత ఉండాల న్నారు. జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 9లోపు రాజేంద్రనగర్‌లోని రీజినల్ గిరిజన గురుకులాల కోఆర్డినేటర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.