పిడుగుపాటుకు రైతు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు రైతు అస్వస్థత

Published Fri, Apr 4 2025 8:11 AM | Last Updated on Fri, Apr 4 2025 8:11 AM

పిడుగ

పిడుగుపాటుకు రైతు అస్వస్థత

గేదె దుర్మరణం

శంకర్‌పల్లి: అకాల వర్షాల కారణంగా పలుచోట్ల గురువారం పిడుగుపాటు పడ్డాయి. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురంకి చెందిన రైతు యాభైగూడెం నర్సింహారెడ్డి గేదెలు మెపుతుండగా.. వర్షానికి చెట్టు కిందకి వెళ్లాడు. తన రెండు గేదెలు పక్కనే ఉన్న మరొక చెట్టు కింద ఉన్నాయి. ఒక్కసారిగా పిడుగుపాటు పడడంతో ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మరొక గేదెకి, రైతు నర్సింహారెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రైతుని పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు. కాసేపటికి ఆరోగ్య పరిస్థితి మెరుగయింది. గేదెని పశువైద్యులకు చూపించగా.. ప్రస్తుతం నిలకడ ఉన్నట్లు తెలిపారు.

రైలు ఢీకొని 18 మేకల మృతి

షాద్‌నగర్‌: రైలు ఢీకొని మేకలు మృతి చెందిన ఘటన గురువారం షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం కృష్ణయ్యయాదవ్‌కు చెందిన మేకలను మేత మేసేందుకు రైల్వే ట్రాక్‌ పక్కకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ నుంచి కాచిగూడ వెళ్లే రైలు వచ్చింది. ఆ శబ్దానికి అవి ఒక్కసారిగా భయపడి పట్టాల పైకి పరుగులు తీశాయి. దీంతో రైలు ఢీకొని 18 మేకలు మృతి చెందాయి. దాదాపు రూ.మూడు లక్షల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.

కారు ఢీకొని జింక మృతి

యాచారం: నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై గునుగల్‌ అటవీ ప్రాంతం వద్ద కారు ఢీకొని జింక మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీశైలం గురువారం ఉదయం తన కారులో సాగర్‌ రోడ్డు నుంచి నగరానికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో గునుగల్‌ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింక కారుకు అడ్డంగా వచ్చింది. దీంతో ఢీకొనడంతో జింకకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దానికి అటవీ అధికారులు దహనం చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సమష్టి కృషితోనే సత్ఫలితాలు

జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: సీవరేజ్‌ ఓవర్‌ ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్‌ లక్ష్యంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ రెండో విడత విజయవంతంగా పూర్తయిందని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ అందరి సమష్టి కృషితో సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంతకు మించి కష్టపడతామని వెల్లడించారు. ఇదే స్ఫూర్తి తో జున్‌ నాటికి మిగతా మాన్‌ హోళ్లను కూడా డీ సిల్టింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. వర్షాకాలంలోగా సీవరేజ్‌ పైపులైన్లు, మ్యాన్‌ హోళ్లలో వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. అక్టోబర్‌ 2 నుంచి మార్చి 30 వరకు 180 రోజులు డీ సిల్టింగ్‌ పనులు చేపట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 24,146 ప్రాంతాల్లో 3,185 కిలో మీటర్ల సీవరేజ్‌ పైపులైన్‌, 2.50 లక్షల మ్యాన్‌ హోళ్లలో డీ–సిల్టింగ్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజ్‌ ఫిర్యాదులను విశ్లేషించినట్లు చెప్పారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో చోకేజీ, రోడ్లపై సీవరేజ్‌ ఓవర్‌ ఫ్లో సమస్యలను గుర్తించామని, రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై దృష్టి సారించి పరిష్కరించినట్లు ఆయన వివరించారు.

పిడుగుపాటుకు రైతు అస్వస్థత 
1
1/2

పిడుగుపాటుకు రైతు అస్వస్థత

పిడుగుపాటుకు రైతు అస్వస్థత 
2
2/2

పిడుగుపాటుకు రైతు అస్వస్థత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement