
కొనసాగుతున్న ఫెన్సింగ్ పనులు
యాచారం: మండల పరిధిలో ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల బౌండరీలో బుధవారం టీజీఐఐసీ, సర్వే, రెవెన్యూ సిబ్బంది ఫార్మాసిటీ భూములకు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును నిర్వహించారు. ఫార్మాసిటీ భూముల్లోకి రైతులేవరు రాకుండా ఏర్పాట్లు చేశారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు ఫార్మాసిటీకి భూములు సేకరించిన గ్రామాల్లో రైతుల కదలికలపై నిఘా పెట్టారు. ఐదో రోజు కూడా ఇద్దరి ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, వందకు మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.