
ఉత్సాహంగా తైక్వాండో, కరాటే పోటీలు
హుడాకాంప్లెక్స్: ఫస్ట్ ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ ఓపెన్ తైక్వాండో కరాటే, కుంగ్‌ఫూ, మార్షల్‌ఆర్ట్స్ చాంపియన్ షిప్–2025 పోటీలు ఉత్సాహంగా సాగాయి. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఇంటర్నేషనల్ తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్‌రెడ్డి, కోచ్ ఖలీల్, గజిందర్ ఆధ్వర్యంలో స్పీడ్ కిక్కింగ్, స్పీడ్ పంచింగ్ విభాగంలో పోటీలు నిర్వహించారు. ఒకేసారి వెయ్యి మంది క్రీడాకారులు ఫాస్ట్ కిక్కింగ్‌లో పాల్గొనడంతో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా అమికల్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ వీణా వాహిని మాట్లాడుతూ.. పిల్లల్లో ఆత్మరక్షణ పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. లండన్‌లో జూలైలో జరిగే పోటీలకు ఇందులోని విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. యువత చెడుమార్గాల వైపు అడుగులు వేయకుండా ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విజేతలకు సుమన్ పల్లె, శ్రీకాంత్ గుర్తింపు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఖాజా అఫ్రిది, ముర్‌వాసిఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైరేంజ్ ప్రతినిధులు వీణా వాహినికి రికార్డ్స్ పత్రాన్ని అందజేశారు.
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో వెయ్యి మందితో ఫాస్ట్ కిక్కింగ్ కాంపిటీషన్
హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఉత్సాహంగా తైక్వాండో, కరాటే పోటీలు