ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా శశాంక | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా శశాంక

Apr 28 2025 7:23 AM | Updated on Apr 28 2025 7:23 AM

ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా శశాంక

ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా శశాంక

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావించిన ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె.శశాంకను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్‌ చైర్మన్‌గా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆర్థిక, పరిశ్రమల, మున్సిపల్‌ అడ్మినిస్ట్రే షన్‌, అటవీశాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు హెచ్‌ఎండీఏ కమిషనర్‌, టీజీఐఐసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, కలెక్టర్‌, డీటీసీపీ హైదరాబాద్‌, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ సభ్యులుగా ఉండునున్నట్లు ప్రకటించింది. 56 రెవెన్యూ విలేజీలతో పాటు 765.25 స్క్వయర్‌ కిలోమీటర్ల పరిధిలో 12 జోన్లుగా విభజించి ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను తొలగించి, ఫ్యూచర్‌సిటీ డెవెలెప్‌మెంట్‌ అథారిటీలో విలీనం చేసింది. ఫ్యూచర్‌ సిటీ ఏర్పాట్లలో భాగంగా 13,500 ఎకరాలు సేకరించింది. మరో 15 వేల ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రావిర్యాల నుంచి ఆమనగల్లు వరకు గ్రీన్‌ కారిడార్‌ ఎలివేటెడ్‌ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లా కలెక్టర్‌గా పని చేసి వెళ్లిన శశాంకను ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement