
కదం తొక్కిన గులాబీ దండు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఆదివారం జిల్లా నుంచి పార్టీ శ్రేణులు వరంగల్‌కు భారీగా తరలివెళ్లాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ కేడర్‌ను వెంట తీసుకుని బస్సులు, కార్లలో ర్యాలీగా బయలుదేరారు. ఆమనగల్లు, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ దండు కదిలింది. దారి పొడవునా ర్యాలీలు, గులాబీ జెండాలు, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరడంతో ఇటు ఎల్బీనగర్ నుంచి అటు పెద్ద అంబర్‌పేట్ ఔటర్ జంక్షన్ వరకు.. సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ దాకా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రజతోత్సవ సభకు గ్రేటర్ నుంచి వెయ్యికిపైగా బస్సులు, 1500పైగా కార్లలో గులాబీ శ్రేణులు తరలివెళ్లినట్లు సమాచారం.
దారులన్నీ ఓరుగల్లు వైపే..

కదం తొక్కిన గులాబీ దండు