చేవెళ్ల: చేవెళ్ల బార్ అసోసియేషన్‌కు గురువారం హోరాహారీగా ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం.నర్సింలు, జి.క్రిష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సి.మహేశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా కె.యాదగిరిగౌడ్, లైబ్రేరియన్‌గా పి.మల్లేశం, మహిళా ప్రతినిధిగా జె.గీతవనజాక్షి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రకాశం, సీహెచ్.రవీందర్, ఈశ్వర్, ఎం.శివరాజ్, ఎం.ప్రదీప్‌రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న బార్ అసోసియేషన్ సభ్యులను తోటి న్యాయవాదులు అభినందించారు. అడ్వకేట్ల సమస్యలపై బార్‌అసోషియేషన్ నిరంతరం పోరాటం చేస్తోందని నూతన అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి