కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ

Apr 6 2025 6:54 AM | Updated on Apr 6 2025 6:54 AM

కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ

కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ

పార్టీ సీనియర్‌ నేత దేప భాస్కర్‌రెడ్డి

పహాడీషరీఫ్‌: రాజ్యాంగాన్ని కించపరుస్తూ.. అంబేడ్కర్‌ను అవమానిస్తున్న బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి ని ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ జై బాపు–జై భీమ్‌–జై సంవిధాన్‌ నినాదంతో ముందుకు వెళ్తోందని కాంగ్రెస్‌ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు దేప భాస్కర్‌ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ ఆ దేశాల మేరకు జల్‌పల్లి మున్సిపాలిటీలో శనివారం సంవిధాన్‌ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యం, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని కా ర్యకర్తలకు సూచించారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను చైతన్య పరిచారన్నారు. 11 ఏళ్లుగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను కాలగర్భంలో కలిపే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని కాపాడే బా ధ్యత కాంగ్రెస్‌ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జై సంవిధాన్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, జల్‌పల్లి నాయకులు షేక్‌ జహంగీరుద్దీన్‌, యాదగిరి, యూ సుఫ్‌ ఖాద్రీ, యాదయ్య, భాస్కర్‌రెడ్డి, జగన్‌, ధన్‌ రాజ్‌గౌడ్‌, శ్రీధర్‌, సుభాన్‌ యాదవ్‌, ఫజిల్‌ ఖాద్రీ, చంద్రమౌలి, నవీన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement