రోడ్డు నిర్మాణానికి జాయింట్‌ సర్వే | - | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణానికి జాయింట్‌ సర్వే

Published Tue, Apr 1 2025 2:02 PM | Last Updated on Tue, Apr 1 2025 2:02 PM

రోడ్డ

రోడ్డు నిర్మాణానికి జాయింట్‌ సర్వే

తుర్కయంజాల్‌: సాగర్‌ రహదారి నుంచి తొర్రూర్‌ స్కూప్స్‌ ఐస్‌క్రీమ్‌ కంపెనీ వరకు హెచ్‌ఎండీఏ వేయనున్న 60 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సోమవారం రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఎస్‌ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ సమీపంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కమాన్‌ నుంచి సాయిప్రియ లే అవుట్‌లోని హైటెన్షన్‌ లైన్‌ కింద నుంచి రోడ్డు వేయాలని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పలు ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, వాటిల్లో అనేక మంది నివసిస్తు న్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా రోడ్డు నిర్మాణం అంటూ అధికారులు సర్వే నిర్వహిస్తుండటం ఇళ్ల నిర్మాణదారుల్లో గుబులు రేపుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఎన్నికలకు ముందు ఇదే రోడ్డు నిర్మాణానికి పలుమార్లు అధికారులు పరిశీలన చేశారు. అయినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి సర్వే నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలు, ప్లాట్లు, పొలాల గురించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంత్‌ రెడ్డి, తహసీల్దార్‌ సుదర్శన్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శైలజ, మండల సర్వేయర్‌ జ్యోతి పాల్గొన్నారు.

శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి

ఇబ్రహీంపట్నం: శక్తి ఉన్నచోట వైరసులు సోకవని బ్రహ్మర్షి ఎం.ప్రేమ్‌నాథ్‌గుప్తా అన్నా రు. ఇబ్రహీంపట్నంలోని జై హనుమాన్‌ ధ్యాన కేంద్రంలో సోమవారం ప్రత్యేక మెడిటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. దేహనికి ఆరోగ్యం, మనస్సుకు శాంతి, బుద్ధికి ఆలోచన, ఆత్మకు శక్తి, సర్వాత్మకు ముక్తి అవసరమన్నారు. అందుకు సాధన ముఖ్యమని తెలిపారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మన సంకల్పాలు, ఆశయాలు సిద్ధించడమేగాక మనలో ఒక శక్తి ఉద్భవిస్తుందన్నారు. పత్రీజీ చూపిన మార్గంలో పయనించి ముక్తి పొందాలని సూచించారు.

నేటి నుంచే ‘ఎర్లీబర్డ్‌’

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి నెల (ఏప్రిల్‌)లోనే ఆస్తిపన్ను మొత్తం చెల్లించే వారికి 5 శాతం రాయితీ వర్తించే ‘ఎర్లీబర్డ్‌’ పథకం మంగళవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆస్తిపన్ను పాతబకాయిలు లేనివారికి, 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం ఆస్తిపన్ను ఒకే దఫా చెల్లించేవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఇది కేవలం కొత్త ఆర్థిక సంవత్సరానికి మాత్రమే. పాత బకాయిదారులకు ఈ రాయితీ వర్తించదని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ‘ఎర్లీబర్డ్‌ ’కింద 5 శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లించవచ్చు.

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

మంచాల: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఆరుట్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాశం బుచ్చయ్యగౌడ్‌ (65) గీత కార్మికుడు. ఎప్పటిలాగే సోమవారం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు మోకు జారిపోవడంతో కిందపడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. పలువురు నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.

రోడ్డు నిర్మాణానికి  జాయింట్‌ సర్వే 1
1/1

రోడ్డు నిర్మాణానికి జాయింట్‌ సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement