
ఎండుతున్న పంటలు
మండుతున్న రైతన్న గుండెలు
సాగు నీరందక గతేడాది మాదిరిగానే పంటలు ఎండిపోవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. పొలాలు నెర్రలుబారి పొట్ట దశలో పంటలు చేతికందకుండా పోయాయి. దీంతో పెట్టుబడులు అందక నిండా మునిగామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఒక బోరు బావి.. 12 ఎకరాలు
చేవెళ్ల: మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన రైతులు ముకుందారెడ్డి, గోపాల్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి అన్నదమ్ములు. వీరు ఒక బోరుబావి కింద 12 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఎండల తీవ్రత కారణంగా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా సైతం నీరుఅందడం లేదు. నాలుగు ఎకరాలకు మించినీరు అందటం లేదు. రాత్రిపగలు పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల ముందు పంటలు ఎండుతుంటే చూడలేకపోతున్నామని ఆవేదక వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సర్వే చేపట్టి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
సాగుకు నీరందక ఇబ్బందులు
● ఇంకుతున్న భూగర్భజలాలు..ఎండిపోతున్న బోర్లు
● నెర్రెలు బారిన నేలలు
● పశుగ్రాసంగా మారుతున్న పంటలు
● ఆర్థికంగా నష్టపోతున్న అన్నదాత
పశుగ్రాసంగా వరిపైరు
షాబాద్: మండల పరిధిలోని కుమ్మరిగూడకు చెందిన రైతు లింగం తనకున్న అర ఎకరంతో పాటు మరో అర ఎకరం కౌలుకు తీసుకుని వరిసాగు చేశాడు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. సాగునీరు అందక పంట ఎండిపోయింది. గత్యంతరం లేక ఎండిన పంటను పాడి ఆవులకు మేతగా కోసి వేస్తున్నాడు. మండల పరిధిలోని గోపిగడ్డ, పోలారం, పోలారం తండా గ్రామాల్లో రైతులు సాగు చేసిన కాలీఫ్లవర్, పశుగ్రాసం కోసం వేసిన మేతజొన్న పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు లేక.. విద్యుత్ అంతరాయం కారణంగా పంటలకు నీరందక రైతు కన్నీరు మిగిలుతోంది.
ఎన్కేపల్లిలో ఎండిపోతున్న వరి పంటను చూపుతున్న రైతు ముకుందారెడ్డి

ఎండుతున్న పంటలు

ఎండుతున్న పంటలు

ఎండుతున్న పంటలు

ఎండుతున్న పంటలు

ఎండుతున్న పంటలు