మీర్‌పేట: మీర్‌పేటవాసులపై ఇంటి పన్ను భారం తగ్గించి, పాతబస్తీలో పన్ను వసూలు చేయాలని బీజేపీ మహేశ్వరం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గురువారం ఇంటి పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మీర్‌పేట–1, 2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. దీనికి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్‌శంకర్‌రెడ్డిలతో కలిసి శ్రీరాములుయాదవ్ పాల్గొని మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రభుత్వం ఇంటి పన్ను రూపంలో భారం వేస్తోందని, దీనిపై గతంలో నుంచే బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 15 నెలలకే అప్పటి బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక పన్ను వసూలు చేస్తుందని ఆరోపించారు. మీర్‌పేటలో పన్నులు తగ్గించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో నాయకులు నర్సింహ, గోవర్ధన్‌రెడ్డి, సోమేశ్వర్, మధు, మాజీ కార్పొరేటర్లు హరినాథ్‌రెడ్డి, భీంరాజ్, విజయలక్ష్మి, అరుణ, గౌరీశంకర్, మల్లేష్ ముదిరాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, రాఘవేందర్‌ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మహేశ్వరం ఇన్‌చార్జి శ్రీరాములుయాదవ్
మీర్‌పేటలో ఆస్తి పన్ను తగ్గించాలని రిలే నిరాహారదీక్ష


