
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
కొందుర్గు: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవనశాఖ అధికారి హిమబిందు అన్నారు. బుధవారం కొందుర్గు రైతువేదికలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందన్నారు. ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు కూలీల ఖర్చు తక్కువగా ఉంటుందని, చీడపీడల బాధ ఉండదన్నారు. పంట నాటిన మూడు సంవత్సరాల అనంతరం నిరంతర దిగుబడులు పొందవచ్చన్నారు. ఆయిల్‌పామ్ డీజీఎం రామ్‌మోహన్ మాట్లాడుతూ..సాగుచేసే రైతులకు ఎరువుల వాడకం, పంట యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ పంట దిగుబడులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రాకేష్, ఏఈఓలు వాసవి, రమణ, నిఖిల్, రైతులు పాల్గొన్నారు.
ఉద్యానవనశాఖ అధికారి హిమబిందు