అహ్మదాబాద్ పర్యటనకు ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పర్యటన కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరారు. అహ్మదాబాద్‌లోని సుందరీకరణ పనులను పరిశీలించడానికి రాష్ట్రం నుంచి ఎకై ్సజ్, పర్యాటక శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుల్ల రాజేశ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్‌రెడ్డి తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు.
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు లేదా ఆహారభద్రత కార్డు ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. అన్ని మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మండల, మున్సిపాలిటీ కార్యా లయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. పీడీ డీఆర్‌డీఏ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నోడల్ అధికారులుగా ఉన్నారని, బ్యాంకు మేనేజర్లు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని, ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
తుర్కయంజాల్‌లో ఒడిశా బృందం
తుర్కయంజాల్: ఒడిశా రాష్ట్రంలోని రైడ జిల్లా నుంచి 15 రైతు సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల బృందం సహకార పర్యటనలో భాగంగా మంగళవారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వారు సంఘం పనితీరును పరిశీలించి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యను అభినందించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు సామ సంజీవ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు
ఇబ్రహీంపట్నం: గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ కుల వివక్ష, అంటరానితనం ప్రత్యక్షంగా, పరోక్షంగా కొనసాగుతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో మంగళవారం కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ పలు గ్రామాల్లో దళితులకు ఆలయ ప్రవేశాలు లేవని.. బతుకమ్మ ఆడనీయడంలేదని.. క్షవరం చేయడంలేదని.. దసరా పర్వదినాన జమ్మి ఆకులు తెంపారని దాడులు చేస్తున్నారని.. హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి.. పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వండితే విద్యార్థులు భుజించకపోవడం.. పట్టణాల్లో అద్దెకు ఇళ్లు ఇవ్వకపోవడం తదితర వివక్షత కొనసాగుతోందన్నారు. దీనిపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సామెల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో, నాయకులు చెన్నయ్య, ఆనంద్, వెంకటేశ్, బుచ్చయ్య, భాస్కర్, వీరే ష్, జంగయ్య, అశోక్, నరసింహ, ఆశీర్వాదం, యాదగిరి, శ్రీనివాస్, సాయిలు పాల్గొన్నారు.
అహ్మదాబాద్ పర్యటనకు ఎమ్మెల్యే కసిరెడ్డి
అహ్మదాబాద్ పర్యటనకు ఎమ్మెల్యే కసిరెడ్డి


