వేసవి దుక్కులు.. రైతుకు లాభాలు
షాబాద్: తొలకరి ప్రారంభానికి ముందే రైతులు పొలం పనులకు సమాయత్తం కావాలి. అందుకు వేసవిని అనుకూలంగా మలుచుకోవాలి. ఎండాకాలం చేపట్టాల్సిన దుక్కుల పనులను షాబాద్ మండల వ్యవసాయ అధికారి వెంకటేశం వివరించారు. గతంలో ప్రతి రైతు ఎద్దులు, ఆవులు, గేదెలను రాత్రుళ్లు పొలంలో కట్టేసేవారు. వాటి మలమూత్రాలు పొలానికి చేరి పంటలకు ఉపయోగపడేవి. ఇందువల్ల ఎరువులు ఖర్చు తగ్గేది. ఇప్పుడు పశుపోషణ తగ్గిపోయింది. సేంద్రియ ఎరువు అందించడంతో ఉత్పత్తులను లాభాసాటిగా సాధించవచ్చు. ప్రస్తుతం తుంగ, గరిక వంటి మొండిజాతి కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటలకు నష్టం కలుగజేస్తుంటాయి.
తెగుళ్లు రాకుండా..
ఇటీవల మండలంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్లతో లోతుగా దుక్కులు దున్నాలి. ఇవి సుమారుగా 9 అంగుళాలకు తగ్గకుండా ఉండాలి. అలా లోతు దుక్కులు వేసవిలో చేసినప్పుడు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. నెలలో ఉండే పురుగులు తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంది. అందువల్ల వేసవిలో పంట కోతలు పూర్తయిన వెంటనే పొలాలను ఎద్దులతో లాగే పరికరాలతో లోతు దుక్కి చేసుకుంటే తొలకరిలో ఉపయోగకరంగా ఉంటుంది.
వేర్లు విస్తరించేందుకు అవకాశం
వేసవిలో లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు గొర్రు తిప్పి సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనూకులంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటుక, దతెల వంటి పరికరాలు నెల లోపలికి 3–4 అంగుళాల లోతు వరకు చోచ్చుకుపోతాయి. ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయడంతో నేల లోపల సుమారుగా 3–5 అంగుళాల లోతులో ఒకగట్టి పొర ఏర్పడుతుంది. దీంతో నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది.
సేంద్రియ పదార్థం కలుస్తుంది
పంటకోత తర్వాత నేలపై మిగిలే పంట మొదళ్లు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకుల వంటి లోతు దుక్కి దున్నినప్పుడు కుళ్లిపోతాయి. దీంతో సేంద్రియ పదార్థాలు పెరగడానికి అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా నిలువ చేసిన పశువుల ఎరువులను ఎండా కాలంలోనే పొలాల్లోకి తోలాలి. వర్షాలు పడిన తర్వాత నేలపై చల్లి లోతు దుక్కి దున్నితే మట్టిలో బాగా కలుస్తుంది.
పొలంలో చీడపీడల నివారణకు ఉపయోగం
లోతు దుక్కులతో పెరగనున్న భూసారం
వేసవి దుక్కులు.. రైతుకు లాభాలు


