ఇబ్రహీంపట్నం రూరల్: మానవ అక్రమ రవాణాను అరికట్టాడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాపై ఏపీఎం, సీసీలకు కలెక్టరేట్‌లో గురువారం శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఆర్‌డీఓ శ్రీలత మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్నవారు.. వలస వచ్చిన కుటుంబాలు.. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న యువత త్వరగా అక్రమార్కుల వలలో పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గానీ, పేదవారిని గానీ నమ్మించి వారి ప్రమేయం లేకుండా నగరాలకు తరలించి వారిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1930.., 100.., 104.., 1098.., 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ సూర్యారావు, డీపీఎంఎస్ సీహెచ్ స్వర్ణలత, యాదయ్య, విలాస్‌రావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.కవిత, ఎంపీఎంలు రవీందర్, యాదగిరి, విజయమాలిని తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత