అప్పులు తీరక! | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీరక!

Apr 7 2025 11:11 AM | Updated on Apr 7 2025 11:11 AM

అప్పు

అప్పులు తీరక!

బిల్లులు రాక..

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సుమారు రూ.90 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లింపులో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలి.

– తలసాని వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, కేశంపేట

వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పు

గ్రామంలో రూ.42లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టా. అప్పు చేసి ఆ మొత్తం వెచ్చించా. తెచ్చిన అప్పునకు వడ్డీ కట్టేందుకు మళ్లీ కొత్తగా అప్పు తీసుకుంటున్నాను. ప్రభుత్వం ఇప్పటికై నా బిల్లులు చెల్లిస్తే వడ్డీ చెల్లింపు తప్పుతుంది.

– తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, పాపిరెడ్డిగూడ

కేశంపేట: గ్రామాలను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో కొందరు.. వారసత్వ రాజకీయాలతో మరికొందరు.. రాజకీయాలపై వ్యామోహంతో ఇంకొందరు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. సర్పంచులుగా ఉత్సాహంతో పోటీ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ప్రజలకిచ్చిన మాట కోసం అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం సొంత నిధులు వెచ్చించారు. అవీ సరిపోక అప్పులు చేసి చేపట్టిన పనులు పూర్తి చేశారు. తీరా వాటికి సంబంధించిన బిల్లులు రాక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నారు.

పదవీ కాలం ముగిసి ఏడాది దాటినా..

జిల్లాలోని 21 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రభుత్వం నుంచి స్టేట్‌ ఫైనాన్స్‌, 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. వీటితో పాటు మన ఊరు మన బడి పథకంలో భాగంగా చేపట్టిన పనులకు సైతం బిల్లులు రావాల్సి ఉంది. ఈలోగా 2 ఫిబ్రవరి 2024తో పదవీ కాలం కాస్తా ముగిసింది. అప్పటి వరకు సర్పంచులుగా ఉన్నవారిని తప్పించి గ్రామాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, అప్పటి వరకు తమ పదవీ కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఇటు పదవీ కాలం ముగిసి అటు పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు చేసిన బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు.

వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ఉందనగా టార్గెట్లు పెడుతూ అభివృద్ధి పనులు చేయించింది. గ్రామాల్లో పనులు చేస్తే తమను గ్రామస్తులు జీవితాంతం గుర్తుంచుకుంటారనే తపనతో అప్పట్లో సర్పంచులు అధిక వడ్డీలకు అప్పులు చేసి పనులు చేపట్టారు. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయాయి. ప్రభుత్వం మారిన కొద్ది నెలలకే సర్పంచుల పదవీ కాలం కూడా ముగిసింది. నిలిచిపోయిన బిల్లుల చెల్లింపులకు నేటికీ మోక్షం లభించడం లేదు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం.. కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కాకపోవడంతో కొత్త ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయడం లేదు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. మాజీ సర్పంచులు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది.

మాజీ సర్పంచ్‌ల అవస్థలు

అభివృద్ధి పనులకు సొంత నిధులు

అందినకాడికి అప్పులు తెచ్చి ఖర్చు

అసలుకు మించి వడ్డీ చెల్లింపులు

బిల్లుల కోసం ఎదురుచూపులు

వినతులు.. ఆందోళనలు

పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు అనేకమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందించారు. అయినా బిల్లులు మంజూరు కాకపోవడంతో చలో అసెంబ్లీ, సచివాలయం ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు వెంటనే మంజూరు చేసి తమను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలని, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు.

అప్పులు తీరక! 1
1/2

అప్పులు తీరక!

అప్పులు తీరక! 2
2/2

అప్పులు తీరక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement