యూరియా లారీ బోల్తా
డ్రైవర్‌కు గాయాలు
కేశంపేట: యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని అల్వాల శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. యూరియా లోడ్‌తో హైదరాబాద్ వైపు నుంచి కేశంపేట గ్రామం వైపు ప్రయాణిస్తున్న లారీ తులవానిగడ్డ అలుగు సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నగరంలోని బోరబండకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ రాంచందర్, పైలెట్ అనిల్ అక్కడి డ్రైవర్‌ను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పైన ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


