
‘రాష్ట్రీయ బాల్ పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
హుడాకాంప్లెక్స్: రాష్ట్రీయ బాల్ పురస్కార్ చిల్డ్రన్స్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్త్రీ, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి సీహెచ్.సంధ్యారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధైర్యసాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్రసాంకేతిక విషయాలు, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి జూలై 31 వరకు 18 ఏళ్ల నిండిన బాలలు అర్హులు అని చెప్పారు. భారతదేశ పౌరసత్వం ఉన్న బాలబాలికలు నేషనల్ అవార్డ్స్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలకు https://awards.gov.in వైబ్‌సైట్‌ణు పరిశీలించాలని సూచించారు.
ఆమనగల్లు సీఐ బదిలీ
నూతన సీఐగా జానకీరామ్‌రెడ్డి
ఆమనగల్లు: ఆమనగల్లు పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రమోద్‌కుమార్ బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది సీఐలను బదిలీచేస్తూ కమిషనర్ అవినాష్‌మహంతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆమనగల్లు సీఐగా పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్‌ను రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా బదిలీచేశారు. కాగా ఏసీబీలో పనిచేస్తున్న వి.జానకీరామ్‌రెడ్డిని ఆమనగల్లు సీఐగా నియమించారు. కడ్తాల సీఐ ఎస్.శివప్రసాద్‌ను సైబర్ క్రైం సీఐగా బదిలీ చేయగా అతనిస్థానంలో షామీర్‌పేట ఠాణాలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చంద గంగాధర్‌ను కడ్తాల సీఐగా నియమించారు.
రేపు భూ సేకరణపై సమావేశం
మంచాల: ఈ నెల 11న లోయపల్లి రెవెన్యూ క్లస్టర్ పరిధిలోని శ్రీమంతన్‌గూడలో భూసేకరణపై సమావేశం నిర్వహించనున్నట్లు రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. వివరాలు.. శివన్నగూడ రిజర్వాయర్ నిర్మాణానికి గాను ప్రభుత్వం భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. శ్రీమంత్‌గూడలో సర్వే నంబర్ 40 నుంచి 66 వరకు 148.31 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ సర్వే నంబర్లలో భూములు కోల్పోతున్న 267 మంది రైతులతో శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి భూసేకరణ నిర్వహించే ప్రదేశంలో ఉదయం 10గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు సకాలంలో హాజరై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాస్, ఫీల్డ్‌ఆఫీసర్ యాట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఏకకాలంలో రైతు రుణమాఫీకి డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట ధర్నా
● హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభులింగం
ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్రంలోని రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ప్రభులింగం డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కె.మాధవరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభులింగం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుభాన్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి డిమాండ్ చేశారు. 57 ఏళ్లు నిండిన రైతులకు వృద్ధాప్య పెన్షన్, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతు వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ వ్యవసా మార్కెట్ విధానాన్ని ప్రకటించాలన్నారు. కిసాన్ సమృద్ధి నిధిని రూ.6వేలకు పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బక్కని మల్లేశ్, గుండాల శివుడు, బాల్‌రెడ్డి, చల్లా నారాయణరెడ్డి, అంజయ్య, వెంకన్న, నర్సింహ, శ్రీనివాస్‌నాయక్, నర్సింహారెడ్డి, చతుర్‌నాయక్, హుస్సేన్, బాల్‌రాజ్, రేఖ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

‘రాష్ట్రీయ బాల్ పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం