భక్తి మార్గంలో నడవాలి
చేవెళ్ల: లోక రక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ వక్తలు డాక్టర్ దయానందస్వామి, భాస్కరయోగిలు అన్నారు. మండలంలోని గొల్లగూడలో జరుగుతున్న సచ్చిదానంద సాయన్నార్యుల 51వ వార్షికోత్సవం, శ్రీసాందీప అచల రుషి పరిపూర్ణ గురుమందిర్ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉదయం నుంచి గురుమందిరంలో వ్యవస్థాపకులు దయానంద నాగుల వెంకటేశం రాజయోగి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దయానందస్వామి, భాస్కరయోగి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని సూచించారు. లోక కల్యాణం కోసం గురుబోధనల వ్యాప్తిని చేసుకుంటూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అచల రుషి గురు బోధనలు విలువైనవని చెప్పారు. కార్యక్రమంలో వివేకానంద రమణ, వెంకట్‌రెడ్డి, నాగేశ్వరరావు, దయానంద, తిరుపతయ్య, చక్రపాణి, చెన్నయ్య, రాజేంద్రప్రసాద్, అనంత్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.


