
గ్రూప్–1 ర్యాంకర్‌కు అభినందనలు
మీర్‌పేట: గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 5వ ర్యాంకు సాధించిన మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన సిద్దాల కృతికకు ఆదివారం పలువురు అభినందనలు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు ఎనుగుల అనిల్‌యాదవ్, దోమలపల్లి ధనలక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకుడు రాజ్‌కుమార్‌లు కృతికకు మిఠాయి తినిపించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో యువతి తల్లిదండ్రులు బీరప్ప, లావణ్య ఉన్నారు.
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
కొందుర్గు: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి ఉత్తరాసిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్గ కుమార్(28) ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం అప్పచేసి, ఓ బస్సును కొనుగోలు చేశాడు. దాంతో పాటు మరిన్ని అప్పులు చేశాడు. కానీ అప్పులు తీర్చే మార్గం కానరాక పోవడంతో మనస్తాపం చెందిన కుమార్.. శనివారం రాత్రి 7 గంటలకు పొలం వద్దకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి 12 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లిచూడగా.. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అవివాహితుడు. మృతుడి తండ్రి ఆంజనేయులు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనయ్య తెలిపారు.
ప్రమాదవశాత్తు హోటల్ దగ్ధం
ఆమనగల్లు: ప్రమాదవశాత్తు ఓ హోటల్ దగ్ధమైంది. ఈ సంఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలోని విఠాయిపల్లి వద్ద హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చైత్ర మెస్ హోటల్ ఆదివారం యథావిధిగా ఉదయం వేళలో కొనసాగింది. మధ్యాహ్నం నిర్వాహకుడు శ్రీను హోటల్‌ను మూసివేసి వెళ్లిపోయాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన పలువురు పోలీసులకు, యజమానికి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కల్వకుర్తి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే ఫర్నీచర్, ఫ్రిడ్జ్ తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద స్థలాన్ని ఆమనగల్లు ఎస్‌ఐ సీతారామ్‌రెడ్డి పరిశీలించి, వివరాలు సేకరించారు.

గ్రూప్–1 ర్యాంకర్‌కు అభినందనలు