
పౌరుషానికి ప్రతీక సర్వాయి పాపన్నగౌడ్
మొయినాబాద్: తెలంగాణ మట్టి పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేణట్ల మల్లేశ్‌గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను బుధవారం మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు. సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి భానిసత్వాన్ని ధిక్కరించి దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించి గోల్కొండ కోటను ఏలిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. నేటి తరం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు అంజయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, నాయకులు మహిపాల్‌గౌడ్, మల్లేష్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, అశోక్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, కౌకుంట్ల మల్లేష్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, బందయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్