జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు | - | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు

Apr 4 2025 8:16 AM | Updated on Apr 4 2025 8:16 AM

జీవన్

జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు

శంకర్‌పల్లి: మండల పరిధిలోని టంగుటూర్‌లో భూమి కొనుగోలు చేసిన ఆర్మూర్‌ మాజీ ఎమ్మె ల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మండల పరిధిలోని టంగుటూర్‌లో సామ దామోదర్‌రెడ్డి కుటుంబీకులు, సన్నిహితులకు సంబంధించి 170 ఎకరాల భూమి ఉంది. 2006లో కొంత భూమిని చైతన్య రిసార్ట్స్‌ పేరుతో ప్లాట్లు చేసి, 2011 వరకు సుమారు 70 మంది వ్యక్తులకు వేయి గజాలు, 500 గజాల చొప్పున ప్లాట్లను విక్రయించారు. 2016లో అప్పటి ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డితో కొంపల్లిలో కొంత స్థలానికి గాను టంగుటూర్‌లో 114 ఎకరాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం.. 2016లో సామ దామోదర్‌రెడ్డి 114 ఎకరాలను జీవన్‌రెడ్డితో పాటు ఆయన తల్లి రాజుబాయి, భార్య రజిత పేర్లపై చేశారు. ఒప్పందం ప్రకారం జీవన్‌రెడ్డి కొంపల్లిలో స్థలం ఇవ్వకపోగా.. ఇక్కడ ఉన్న 170ఎకరాలను, గతంలో ప్లాట్లు కొన్నవారి స్థలాలను సైతం కబ్జా చేసి గోడలు నిర్మించారు. ప్లాట్ల యాజమానులు సామ దామోదర్‌రెడ్డిని నిలదీయండంతో ఆయన తన భూమితో పా టు, గతంలో ప్లాట్లు చేసిన స్థలాలను ఆక్రమిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర కు గురువారం మోకిల సీఐ వీరబాబు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని స్టేషన్‌లో విచారించారు.

పొంతనలేని సమాధానాలు

కేసు విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పోలీసులకు సహకరించడం లేదని సమా చారం. సామ దామోదర్‌రెడ్డి ఎలా పరిచ యం? ఎక్కడ కలుసుకున్నారు? ఏమని ఒప్పందం చేసుకున్నారు? రిజిస్ట్రేషన్‌ ఎప్పుడు చేసుకున్నారు? పొజీషన్‌ ఎప్పుడు తీసుకున్నారు? డాక్యుమెంట్లు ఎందుకు లాక్కుకున్నారు? గోడలు ఎందుకు నిర్మించారు? ప్రైవేటు సెక్యూరిటీని ఎందుకు నియమించారు? గతంలో అక్కడ ప్లాట్లు ఉన్న విషయం మీకు తెలియదా? అంటూ సీఐ వీరబాబు ప్రశ్నించగా.. జీవన్‌రెడ్డి పొంతలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. విచారణ సమయంలో డీజీ, సీపీ, డీసీపీలకు ఫోన్లు చేస్తూ, పోలీసు లు హింసిస్తున్నారు అని చెప్పినట్లు సమాచారం.

మా ప్లాట్లు మాకు ఇవ్వండి

పైసా పైసా కూడబెట్టుకుని చైతన్య రిసార్ట్స్‌లో 2006లో వేయి గజాల స్థలం కొ న్నా. 2021వరకు మా ఆధీనంలోనే ఉంది. త ర్వాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి గోడలు నిర్మంచారు. దీనిపై సామ దామోదర్‌రెడ్డిని సంప్రదించగా.. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కొంత ఇబ్బంది ఉందని, కొంతకాలం ఆగ మని చెప్పారు. మా ప్లాట్లు మాకు ఇప్పించండి.

– భూలోకం, ప్లాటు కొనుగోలు చేసిన వ్యక్తి

దౌర్జన్యం చేస్తున్నారు

2006లో కుటుంబ సభ్యులమంతా కలిసి ఎనిమిది ప్లాట్లు (4 వేల గజాలు) కొనుగోలు చేశాం. ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు. తమను విజయవాడ, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం సంప్రదించి తక్కువ ధరకు ప్లాట్లు అమ్మేయాలని జీవన్‌రెడ్డి మనుషులు ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులే మాకు న్యాయం చేయాలి.

– శ్యాం లంబ, ప్లాటు కొనుగోలు చేసిన వ్యక్తి

మరోసారి విచారణకు హాజరైన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే

విషయం తెలుసుకుని ఠాణాకు తరలివచ్చిన బాధితులు

తమ ప్లాట్లు వదిలేయలంటూ వేడుకోలు

జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు1
1/2

జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు

జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు2
2/2

జీవన్‌రెడ్డి కేసు.. రోజుకో మలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement