బీఆర్‌ఎస్‌ శ్రేణులో జోష్‌ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ శ్రేణులో జోష్‌

Published Fri, Apr 4 2025 8:11 AM | Last Updated on Fri, Apr 4 2025 8:11 AM

బీఆర్‌ఎస్‌ శ్రేణులో జోష్‌

బీఆర్‌ఎస్‌ శ్రేణులో జోష్‌

కడ్తాల్‌లో హరీశ్‌రావుకు ఘన స్వాగతం

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు

కడ్తాల్‌: భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణుల్లో జోష్‌ వచ్చింది. మండలంలో గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిల పర్యటన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. హరీశ్‌రావు రాకను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌, మాజీ జెడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం తదితరుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, గిరిజన మహిళలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.

దొడ్డి కొమురయ్యకు నివాళి

పర్యటనలో భాగంగా హరీశ్‌రావు మండల కేంద్రంలో సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిలో నాయకులతో కలిసి పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఎక్వాయిపల్లి సమీపంలోని అర్జున్‌రావు ఫాం హౌస్‌లో కాసేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

పార్టీ జెండావిష్కరణ

అనంతరం ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, ముద్వీన్‌లో గ్రామంలో పార్టీ నాయకుల సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్వీన్‌ గ్రామంలో రాధాకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.10 లక్షలు వెచ్చించి షేడం యాదమ్మకు నిర్మించిన ఇంటిని నాయకులతో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. మాజీ మంత్రి పర్యటన ఆద్యంతం సందడిగా సాగింది. ఎటు చూసిన గులాబి జెండాలతో నిండిపోయింది. బోయిన్‌గుట్ట బహిరంగ సభలో హరీశ్‌రావు ప్రసంగం కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ నింపింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి,మాజీ వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పరమేశ్‌,మాజీ ఎంపీపీలు శ్రీనివాస్‌యాదవ్‌, జైపాల్‌నాయక్‌,మాజీ సర్పంచ్‌లుయాదయ్య, నర్సింహగౌడ్‌, లచ్చిరామ్‌నాయక్‌ ,పత్యానాయక్‌, రామకృష్ణ, మహేశ్‌,అంజ్యానాయక్‌, విజయ్‌గౌడ్‌, వీరయ్య, నరేశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement