
చిప్పలపల్లిలో షార్ట్ సర్క్యూట్
కందుకూరు: షార్ట్ సర్క్యూట్‌తో పలు గృహాల్లో మంటలు చెలరేగి విద్యుత్ పరికరాలు, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన కందుకూరు మండలం చిప్పలపల్లిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. చిప్పలపల్లిలోని ఎస్‌ఆర్‌నగర్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌కు సరఫరా అయ్యే 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఇళ్లల్లోకి వచ్చే ఎల్‌టీ విద్యుత్ లైన్‌పై పడ్డాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పలు ఇళ్లల్లోని విద్యుత్ పరికరాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ఫ్యాన్లు, స్విచ్ఛ్ బోర్డులు, వైరింగ్ దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇళ్లలో ఉన్న వారంతా భయాందోళనలకు గురై బయటికి పరుగెత్తారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం ఏఈ వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలంకు చేరుకుని వివరాలు సేకరించారు. నష్టపరిహారం విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇచ్చారు.
విలువైన విద్యుత్ పరికరాలు దగ్ధం