
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న గణితం లెక్చరర్ (డిగ్రీ) ఒక పోస్టు, కెమిస్ట్రీ లెక్చరర్ (డిగ్రీ) రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆయా సబ్జెక్టులను బోధించేందుకు అతిథి అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో ఏప్రిల్ 10వ తేదీలోపు నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
మైసిగండి ప్రధానార్చకుడికి ఉగాది పురస్కారం
కడ్తాల్: మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు మాధారం యాదగిరి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వావసునామ సంవత్సర వేడుకల్లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్, కమిషనర్ శ్రీధర్ చేతుల మీదుగా యాదగిరి పురస్కారం అందుకున్నారు. యాదగిరికి పురస్కారం రావడంపై మైసిగండి ఆలయ అర్చక సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్‌గా ప్రమీల
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ మహిళా విభాగం కన్వీసర్‌గా జి.ప్రమీలను నియమిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా ఎస్సీ సెల్ విభాగం ఇన్‌చార్జి పెంటయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తలకొండపల్లిలో స్వేరోస్ భీందీక్ష ముగింపు సభ
తలకొండపల్లి: వచ్చేనెల 13న మండల కేంద్రంలో స్వేరోస్ భీందీక్ష ముగింపు సభ నిర్వహించనున్నట్టు స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముగింపు సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులంతా స్వేరోస్ స్ఫూర్తితో విద్యారంగంలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే స్వేరోస్ కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర నాయకులు జ్యోతయ్య, వెంకటేశ్, నాగేశం, దుర్గయ్య, చందు, శ్రీనివాస్‌గౌడ్, మల్లేష్, నిరంజన్ పాల్గొన్నారు.

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం