ఆ పార్టీలకు దోచుకోవడమే తెలుసు
బడంగ్‌పేట్: తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోచుకోవడం, దాచుకోవడానికే వచ్చాయని.. సేవ చేద్దామని కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బడంగ్‌పేట్‌లోని కాకతీయ స్కూల్ వద్ద చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేద్దామన్నారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా 11 ఏళ్లుగా మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారని, ఇంతకంటే ఈ దేశానికి నీతివంతమైన దేశ భక్తుడిని ఎవరు తేగలరని ప్రశ్నించారు. నేటి నుంచి అంబేడ్కర్ జయంతి వరకు ప్రతి కార్యకర్త ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజుభూపాల్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, పార్టీ అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


