బండ భారం రూ.4.50 కోట్లు
నేటి నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు
● జిల్లాలో తొమ్మిది లక్షలపైనే గ్యాస్ కనెక్షన్లు ● రోజుకు సగటున 30 వేల బుకింగ్స్ నమోదు ● పేద, మధ్య తరగతి కుటుంబాలనెత్తిన పిడుగు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వంటగ్యాస్ ధర మరోసారి భగ్గుమంది. కేంద్రం ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.50 చొప్పున పెంచి షాక్ ఇచ్చింది. ఇప్పటికే బియ్యం, పప్పు, నూనెల వంటి నిత్యావసరాలతో పాటు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు తాజా ధరలు భారంగా మారనున్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.855 ఉండగా, తాజా పెంపుతో రూ.905కు చేరింది. దీంతో జిల్లా వాసులపై నెలకు సగటున రూ.4.50 కోట్ల భారం పడనుంది. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీలు సహా మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
రోజుకు అదనంగా రూ.15 లక్షలు
జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇండియన్, భారత్, హెచ్‌పీ సహా ఇతర ఆయిల్ కంపెనీల్లో రోజుకు సగటున 30 వేల బుకింగ్స్ నమోదవుతుంటాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపుతో రోజుకు సగటున జిల్లావాసులపై రూ.15 లక్షలు అదనపు భారం కానుంది. ఈ లెక్కన నెలకు రూ.4.50 కోట్ల భారం పడినట్టే. తాజాగా మళ్లీ ధర పెంచడంతో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెంచినప్పటికీ.. భారాన్ని ఆయిల్ కంపెనీలే భరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో వాహనదారులకు ఊరట కల్పించింది.
ఐదేళ్లలో గ్యాస్ ధరల పెంపు
సంవత్సరం సిలిండర్ ధర
2020 మే రూ.589
2021 అక్టోబర్ రూ.646
2021 మార్చి రూ.871
2022 మార్చి రూ.957
2022 మే రూ.1055
2022 జూన్ రూ.1062
2022 జూలై రూ.1,105
2023 మార్చి రూ.1,155
2023 ఆగస్టు రూ.955
2024 మార్చి రూ.855
2025 ఏప్రిల్ రూ.905
సామాన్యులపై పెనుభారం
కేంద్ర ప్రభుత్వం వంటగ్యా స్ సిలిండర్ ధరలను పెంచి పెనుభారం మోపుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి సిలిండర్ల ధరలు పెంచుతూనే ఉంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
– వి.లక్ష్మి, గృహిణి, ఆమనగల్లు
వెంటనే తగ్గించాలి
వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే మోయలేనంతగా ఉంది. ప్రభుత్వం మరింత ధర పెంచటం సరికాదు. కూలి పనులు చేసుకునే పే దలకు వంటగ్యాస్ ధరలు భరించలేని విధంగా మా రుతున్నాయి.పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి.
– సుధ, గృహిణి, అజీజ్‌నగర్,
మొయినాబాద్ మండలం
బండ భారం రూ.4.50 కోట్లు
బండ భారం రూ.4.50 కోట్లు


