మహేశ్వరం: న్యాయవాది ఎర్రవాపు ఇజ్రాయెల్ హత్య కేసుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలని మహేశ్వరం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని కోర్టు ఎదుట న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఇజ్రాయెల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో న్యాయం కోసం కోట్లాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహేశ్వరం కోర్టులో పని చేస్తున్న సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్‌ను చంపాపేట్‌లో కత్తితో హత్య చేశారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మహేశ్వరం బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
మహేశ్వరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్ గౌడ్