
ఫెన్సింగ్ పనులు నిలిపేయండి
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో వెంటనే సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనులను వెంటనే నిలిపేయాలని సీపీఎం నాయకులు బుధవారం హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ ఆధ్వర్యంలో సీఐని కలిసి వెంటనే సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనులు ఆపాలని కోరారు. అసైన్డ్‌దారులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని అన్నారు. అదే విధంగా ఫార్మా ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చి మూడేళ్లు అవుతున్నా నేటికి కబ్జాలు చూపించి, రిజిస్ట్రేషన్లు చేయలేదని ఆరోపించారు. వెంటనే ఫెన్సింగ్ పనులు నిలిపేయాలని లేని పక్షంలో ఆందోళన నిర్వహించి, పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పెద్దయ్య, లాజర్, జంగయ్య, కుమార్, భూషణ్, పెంటయ్య, యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు.