ఉత్తమ సేవలకు ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ప్రశంసలు

Apr 10 2025 7:14 AM | Updated on Apr 10 2025 7:14 AM

ఉత్తమ సేవలకు ప్రశంసలు

ఉత్తమ సేవలకు ప్రశంసలు

బడంగ్‌పేట్‌: భద్రత, రక్షణ చర్యల్లో బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఉత్తమ సేవా అవార్డు వరించింది. బుధవారం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో నిర్వహించిన సమావేశంలో కమిషనర్‌ పి.సరస్వతికి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అరుణ్‌ బేహాల్‌ ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. తమ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేయడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.శ్యామ్‌సుందర్‌, మేనేజర్‌ బి.నాగేశ్వర్‌రావు, ఆర్వో వి.వేణగోపాల్‌రెడ్డి, డీఈ వెంకన్న, ఏఈ వినీల్‌గౌడ్‌, అనూష, మమతారెడ్డి, మౌనిక ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement