చేవెళ్ల: మున్సిపల్ పరధిలోని దామరగిద్దలో ఈ నెల 29,30 తేదీల్లో 6వ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పవన్, ప్రకాశ్, ప్రసాద్, నరేందర్, నవీన్ తెలిపారు. చేవెళ్లలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎంట్రీ ఫీజు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. పోటీలను రెండు విభాగాలుగా నిర్వహించనున్నట్టు చెప్పారు. రూరల్ విభాగంలో ఆయా గ్రామాలకు చెందిన క్రీడాకారులే పోటీలో పాల్గొనాలని తెలిపారు. మొదటి బహుమతి రూ.30వేలు, రెండో బహుమతి రూ.20 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఉంటుందన్నారు. ఓపెన్ టూ ఆల్ విభాగంలో మొదటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ఉంటుందన్నారు. వివరాలకు 76809 88771, 90321 13340, 95501 64093, 80740 63420 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.