చేవెళ్ల: వివిధ కేసులలో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నట్లు చేవెళ్ల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయం సీఐ ఎం.శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల ఎకై ్సజ్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ వేలం ఉంటుందని చెప్పారు. చేవెళ్ల సర్కిల్ పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారు ముందుకు వచ్చి వేలంలో దక్కించుకోవాలని కోరారు.
మంచాల పీఏసీఎస్ కార్యదర్శిపై వేటు
మంచాల: మంచాల పీఏసీఎస్ కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెదెరె హన్మంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. పీఏసీఎస్‌లో రూ.7,25,223 సంబంధించిన అవకతవకలపై నిర్వహించిన విచారణలో భాగంగా డీసీఓ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు రాంరెడ్డి, జెనిగె వెంకటేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంట్లో గొడవపడి వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: తాగుడుకు బానిసైన వ్యక్తి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్‌నగర్‌కు చెందిన వి.నర్సింహులు(55) ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి తాగుడుకు బానిసైన అతడు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నర్సింహులుకు సర్ది చెప్పి బాగు చేయాలని అతని భార్య యాదమ్మ ఈ నెల 26వ తేదీన సర్దార్‌నగర్‌కు తీసుకొచ్చింది. అతనితో మాట్లాడేందు కు యత్నించగా, గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన అతని భార్య పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్‌లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.