Ranga Reddy District Latest News
-
పకడ్బందీగా ‘భూ భారతి’
కొత్తూరు/నందిగామ: భూముల రికార్డుల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకమైన రికార్డుల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కొత్తూరు, నందిగామ మండలాల్లో శనివారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు, మేధావులు, అధికారులు, ప్రతిపక్షాల సూచనలు, సలహాలతో భూ భారతి చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు, వ్యాపారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ప్రస్తుత చట్టంలో ఎలాంటి ఇబ్బందులు, ఆలస్యం, పొరపాట్లకు తావు లేకుండా రూపొందించినట్లు వివరించారు. గతంలో మాదిరిగా కాకుండా మండలస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకునే విధంగా చట్టం ఉందన్నారు. రిజిస్ట్రేషన్, విరాసత్, హక్కుల బదలాయింపు తదితర సేవలు మరింత పకడ్బందీగా అందుతాయన్నారు. త్వరలో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రికార్డులను సరిచేయడంతో పాటు వివాదాలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆర్డీఓ సరిత, తహసీల్దార్లు రవీందర్‌రెడ్డి, రాజేశ్వర్, ఎంపీవోలు అరుంధతి, సుమతి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
కారెనుక.. కారుగట్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : వరంగల్ జిల్లా ఎల్కతుర్తితో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు గ్రేటర్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వేల మందిని తరలించాలని తీర్మానించింది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు 1,200 బస్సులు సహా మరో 1,500కుపైగా కార్లను కేటాయించింది. అధిష్టానం ఈ బాధ్యతను మాజీ మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అప్పగించింది. ఇప్పటికే వీరంతా ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, మున్సిపాలిటీ, కార్పొరేషన్, మండలం, గ్రామ పంచాయతీల వారీగా బస్సులు, కార్లు, ఇతర వాహనాలను కేటాయించారు. ‘ఇంటికో జెండా.. ఊరికో బస్సు’ చొప్పున గ్రేటర్ జిల్లాల నుంచి లక్ష మందిని తరలించాలని నిర్ణయించారు. పురుషులనే ఎక్కువగా తరలించాలని.. భగ్గున మండుతున్న ఎండల నేపథ్యంలో మహిళలు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పురుషులనే ఎక్కువగా తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తలను, అభిమానులను సన్నద్ధం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం, క్యాంపు ఆఫీసుల నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. ఎవరికి వారు ఆయా సమీప మార్గాల నుంచి ఔటర్ మీదుగా ఘట్కేసర్ జంక్షన్‌కు చేరుకోనున్నారు. అటు నుంచి భారీ ర్యాలీగా వరంగల్ బయలుదేరనున్నారు. సభకు వచ్చే ముఖ్య నాయకులు, కార్యకర్తలకు తాగునీరు, భోజన వసతి కల్పించనున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు టూరిస్ట్ బస్సులతో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల బస్సులను కేటాయించారు. 25 ఏళ్లు.. ఎన్నో ఆటుపోట్లు 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించింది. కేసీఆర్ సహా ఆచార్య జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలే నరేంద్ర, గాదె ఇన్నయ్య తదితరులు మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత 2003 ఏప్రిల్ 27న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వేదికగా శ్రీతెలంగాణ గర్జనశ్రీ పేరుతో ద్వితీయ వార్షికోత్సవ సభను నిర్వహించారు. 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. అప్పటి వరకు ఒక్క సికింద్రాబాద్ (పద్మారావు గౌడ్) మినహా గ్రేటర్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఆ సమయంలో తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పోరు గర్జనతో కేంద్రం స్పందించింది. డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసింది. కొందరి అభ్యంతరాలతో డిసెంబర్ 23న కేంద్రం మళ్లీ వెనక్కి తగ్గింది. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్, ఆ తర్వాత సకల జనుల సమ్మె, ఉద్యోగుల సహాయ నిరాకరణ వంటి వరుస ఆందోళనలతో చివరకు కేంద్రం దిగొచ్చింది. గ్రేటర్లో అనేక అభివృద్ధి పనులు 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది, జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అప్పటివరకు గ్రేటర్ జిల్లాల్లో పార్టీకి పెద్దగా బలం లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ, కాంగ్రెస్ నుంచి భారీగా పార్టీలోకి వలసలు పెరిగాయి. మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు సహా గ్రేటర్ పీఠాన్ని కై వసం చేసుకుంది. 2018 నాటికి మరింత బలపడింది. పదేళ్లు అధికారంలో ఉండి గ్రేటర్లో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. 2024 ఎన్నికల్లో ఎల్బీనగర్, మహేశ్వరం, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో గెలుపొందింది. రూరల్ జిల్లాలతో పోలిస్తే.. గ్రేటర్ జిల్లాల్లోనే పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి, భారీగా నిధుల కేటాయింపుల పేరుతో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ముఖ్య నేతలు పార్టీ మారినా.. కేడర్ మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే నమ్ముకుని పని చేస్తోంది. రేపు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రేటర్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ ఒక్కో నియోజకవర్గం నుంచిఐదు వేల మంది 1,200 బస్సులు సహా 1,500కు పైగా కార్లు సిద్ధం సమన్వయం చేస్తున్న పార్టీ ప్రధాన నేతలు -
సాగులో ఏఐ వినియోగంపై అవగాహన ఒప్పందం
● ముందుకువచ్చిన ఏజీ వర్సిటీ, బిట్స్ పిలానీ సంస్థలు ఏజివర్సిటీ: వ్యవసాయంలో కృత్రిమ మేధ వినియో గంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని అగ్రి హబ్‌లో జరిగిన కార్యక్రమంలో పీజేటీఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లాస్ జానయ్య, బిట్స్ పిలాని ఉపకులపతి ప్రొఫెసర్ వి.రాంగోపాల్‌రావు సమక్షంలో అవగాహన ఒప్పందం పత్రాలపై ఇరు సంస్థల అధికారులు సంతకాలు చేశారు. పరస్పరం ఒప్పంద పత్రాల్నిమార్చుకున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మకమైనసంస్థల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనకు, పీహెచ్డీ విద్యార్థులకు పరిశోధన సలహాలు ఇవ్వడానికి దోహదం చేస్తుందని బిట్స్ పిలాని ఉపకులపతి ప్రొఫెసర్ వి.రాంగోపాల్‌రావు అన్నారు. ఇరు సంస్థల శాస్త్రవేత్తలు కలిసి నాణ్యమైన పరిశోధనా పత్రాలు ప్రచురించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. దుబాయ్‌తో పాటు దేశంలోని నాలుగు చోట్ల బిట్స్ క్యాంపస్‌లు ఉన్నాయని, అందులో ప్రతి ఏటా సుమారు 600 మంది పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. బిట్స్ పిలానీ సంస్థకు దేశంలోనే మూడో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ నెట్వర్క్ ఉందని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ పరిజ్ఞానం (హార్డ్‌వేర్), బిట్స్ పిలానిలోని సాఫ్ట్వేర్ కలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఉపకులపతి జానయ్య తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగుకు ఉపయోగపడే అగ్రి రోబోల రూపకల్పన జరగాలని జానయ్య ఆకాంక్షించారు. పరిశోధనా సంచాకులు డాక్టర్ బలరాం అవగాహన ఒప్పందం ముఖ్య లక్ష్యాల గురించి సమావేశంలో వివరించారు. రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, బిట్స్ పిలాని డీన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ సంకేత్ గోయల్, పీజేటీఏయూ అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్ రాములు, డిజిటల్ అగ్రికల్చర్ సంచాలకులు డాక్టర్ బాలాజీనాయక్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి చట్టం ఎంతో మేలు
ఆమనగల్లు: భూ భారతి చట్టం–2025 ద్వారా రైతు లు, పేదలకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ చట్టంతో బాధితులకు న్యాయ సలహా వ్యవస్థ ఉంటుందని చెప్పారు. పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో శుక్రవారం భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో భూమి హక్కులు పరిరక్షించబడతాయని తెలిపారు. ధరణితో ప్రజలు అధికారుల వద్దకు వచ్చారని, భూ భారతి చట్టంతో అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు. త్వరలో గ్రామ రెవెన్యూ అధికారులు, అన్ని మండలాలకు సర్వేయర్ల నియామకం జరుగుతుందన్నారు. భూభారతి ద్వారా 90 శాతం సమస్యలు స్థానికంగానే పరిష్కారమవుతాయని వివరించారు. రైతులకు అన్యాయం జరిగితే ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. వచ్చే నెలలో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ లలిత, ఆమనగల్లు మార్కెట్‌చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్, వైస్ చైర్మన్ సత్యం, ఎంపీడీఓ కుసుమమాధురి, ఏడీఏ శోభారాణి, ఏఓ అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, ఎంఈఓ పాండు, ఎస్ఐ వెంకటేశ్ పాల్గొన్నారు. భూ భారతితో భూ హక్కుల పరిరక్షణ మాడ్గుల: భూ భారతి చట్టంతో భూమి హక్కులు పరిరక్షించబడతాయని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హల్లో శుక్రవారం తహసీల్దార్ వినయ్ సాగర్ అధ్యక్షతన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో భూ సమస్యలన్నీ సత్వరం పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. దీనిపై మే 1 నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
రైతులందరికీ రుణమాఫీ చేయాలి
తుర్కయంజాల్: రైతులందరికీ వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు, రుణమాఫీ చేయాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం టెస్కాబ్వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాధవరెడ్డి మాట్లాడుతూ.. క్రాప్ లోన్, ఎల్టీ లోన్ పెంచాలని, 55 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు పింఛన్ ఇవ్వాలని కోరారు. రైతులకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు ఎస్.బాల్ రెడ్డి, జంగారెడ్డి, బాలరాజు, బాలయ్య, శ్రీనివాస్, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌లో షాద్‌నగర్ ఎమ్మెల్యే షాద్‌నగర్: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. పెట్టుబడులు, న్యాయం, అహింస, ప్రపంచ శాంతి లక్ష్యంగా ప్రభుత్వం భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నట్రాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిశారు. భూ భారతిపై నందిగామలో అవగాహన సదస్సు నేడు నందిగామ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిపై మండల కేంద్రంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాజేశ్వర్ తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలోని ప్రిన్స్ ప్యాలెస్ ఆవరణలో మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు చెప్పారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సూచించారు. తుర్కయంజాల్ ఇన్చార్జి కమిషనర్‌గా రవీందర్ రెడ్డి తుర్కయంజాల్: మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్ రెడ్డి పది రోజుల పాటు సెలవులో వెళ్లారు. దీంతో పెద్ద అంబర్‌పేట కమిషనర్ ఎస్.రవీందర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టి.శ్రీదేవి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో రవీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా జడ్జికి సత్కారం ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కరుణకుమార్‌ను ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సభ్యులు విజయ్‌కుమార్, కృష్ణ, గణేశ్, ఆంజనేయులు, శిరీష్, బిక్యానాయక్ తదితరులు ఉన్నారు. -
అగ్గిపుడితే.. బుగ్గే.!
అగ్నిమాపక కేంద్రం తరలింపు గాంధీ మెడికల్ కళాశాల, వసతి భవనాలు, ఆసుపత్రి ఐపీ, ఓపీ, పరిపాలనా భవనాలు, తదితరాలు మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఉండాలనే డిమాండ్ ఉంది. దీంతో గతంలో ఆసుపత్రి ప్రాంగణంలో తాత్కాలిక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. ఏదైనా సంఘటన జరిగినపుడు సిబ్బంది అప్రమత్తమయ్యేవారు. కరోనా అనంతరం ఇక్కడున్న అగ్నిమాప కేంద్రాన్ని తరలించారు. ఇప్పుడేదైనా చిన్న సంఘటన జరిగినా సికింద్రాబాద్, చిక్కడ్పల్లి కేంద్రాల నుంచి వాహనాలు రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ట్రాఫిక్‌లో అగ్నిమాపక శకటం ఆసుపత్రి ఆవరణకు చేరుకోవడానికి కనీసం 40 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, అవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో/గాంధీఆస్పత్రి : ఎక్కడైనా ప్రమాదం జరిగినపుడు హడావుడి చేయడం.. నిధులు అవసరం అంటూ నివేదికలు తయారు చేయడం. ఆనక ఆ విషయాన్ని గాలికి వదిలేయడం గాంధీ ఆస్పత్రి అధికారులకు అలవాటుగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దవాఖానలో అగ్నిప్రమాదాల నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పదేళ్ల నుంచి ఏటా ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలుకు సంబంధించి రూ.కోట్లలో ప్రతిపాదనలు పంపిస్తున్నా నేటికీ అవి అనమతులకు నోచుకోక దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. తుప్పుపట్టిన పరికరాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యప్రదాయినిగా వెలుగొందుతున్న గాంధీ ఆస్పత్రిలో ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రోగులు, వారి సహాయకులు, వైద్యులు, నర్సింగ్, ఇతర సహాయక సిబ్బంది అంతా కలసి రోజు కు సుమారు 15 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. 8 అంతస్తుల్లో నిర్మించిన ప్రధాన భవనంలో 36 విభాగాలకు చెందిన ఇన్ పేషెంట్ వార్డులు ఉన్నాయి. 2003లో నిర్మించిన ప్రధాన భవనంలో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు నిర్వహణ కొరవడి కొన్ని తుప్పుపట్టి పోగా.. మరికొన్ని దొంగతనానికి గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర మార్గాలు లేవు. ప్రస్తుతం ఉన్న లిప్టులు, మెట్ల మార్గం ఆసుపత్రి లోపలి నుంచి మాత్రమే ఉన్నాయి. ప్రమాద సమయంలో వీటిని వినియోగించలేరు. అందుకు ప్రత్యామ్నాయంగా భవనం వెలుపల నుంచి మెట్ల మార్గం, ర్యాంప్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అలాంటివి అందుబాటులో లేవు. దీంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచి భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం గాంధీ ఆసుపత్రిలో ఫైర్‌సేఫ్టీకి సంబంధించిన ప్రతిపాదనలు గత పదేళ్ల నుంచి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కొత్త పరికరాల కొనుగోళ్లకు సుమారు రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి అప్పట్లో ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తర్వాత దాని పర్యవేక్షణ మరిచారు. దీంతో ఆ దస్త్రాలు కాగితాలకే పరిమితమయ్యాయి. అక్కడి నుంచి సందర్భం వచ్చినపుడల్లా పదేపదే నివేదికలు అందించడం తప్ప నిధుల మంజూరుపై శ్రద్ధ వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో మారని దుస్థితి దశాబ్ద కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన నివేదికలు ఉన్న అగ్నిమాపక కేంద్రం తరలింపు ప్రమాదం జరిగితే హడావుడి.. అనంతరం పట్టించుకోని ఉన్నతాధికారులు 2019 సంవత్సరం ఆగస్టులో అగ్నిప్రమాదం జరిగి గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్ సర్జరీ ప్రిపరేషన్ వార్డు అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో పిల్లలెవరూ వార్డులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ విలువైన పరికరాలు దగ్ధమయ్యాయి. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
పోచారం: ఇంటర్మీడియట్లో ఫెయిలైనందుకు మనస్తాపం చెందిన విద్యార్థి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..జగిత్యాలలోని హనుమాన్‌వాడకు చెందిన భూసి జశ్వంత్ (17) అన్నోజిగూడలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ప్రథమ సంవత్సం 90 శాతం మార్కులతో పాసైన జశ్వంత్..ద్వితీయ సంవత్సరంలో మాత్రం మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఇటీవల నగరంలో ఉంటున్న తన మామ ఇంటికి వెళ్లి 90 శాతం మార్కులతో ఇంటర్ పాసయ్యానని చెప్పాడు. కానీ, తల్లిదండ్రులతో ఫెయిలయ్యానని ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్రమంలో జశ్వంత్ బుధవారం సాయంత్రం ఉప్పల్‌లో గడ్డి మందు బాటిల్ కొనుక్కుని కాలేజ్‌కు వచ్చాడు. ఆ రోజు రాత్రి కావడంతో ఇంటికి వెళ్లడం కుదరలేదు. మరుసటి రోజు గురువారం ఉదయం 4 గంటల సమయంలో గడ్డి మందు తాగాడు. విషయం తెలుసుకున్న కళాశాల నిర్వాహకులు సమీపంలోని హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం జశ్వంత్‌ను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం జశ్వంత్ మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని, ఈ విషయంలో కళాశాల యాజమాన్యంతో పాటు సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తనను హేళనగా చూడడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జశ్వంత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడని స్నేహితులు చెబుతున్నారు. -
ఇది సర్కారు వారి భూమి
● కొనుగోలుదారులకు నోటీసులు అందజేసిన రెవెన్యూ అధికారులు ● సీలింగ్ భూముల్లో బోర్డుల ఏర్పాటు ధారూరు: పేదలకు పంచిన సీలింగ్ భూములను ఎవరు కొనుగోలు చేసినా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తహసీల్దార్ సాజిదాబేగం అన్నారు. సీలింగ్, అసైన్డ్ భూములను ఎవరు కొనుగోలు చేసినా చెల్లదని, ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే సదు భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేశాఉ. మండల కేంద్రంలోని 197/4, 197/5 సర్వేనంబర్లలోని 4.08 ఎకరాల సీలింగ్ భూమిని తహసీల్దార్ ఆదేశం మేరకు శుక్రవారం ఆర్ఐ స్వప్న, అసిస్టెంట్ ఆర్ఐ అంజలి, సర్వేయర్ శ్రీహరి, రెవెన్యూ సిబ్బంది కలిసి సదరు భూములను పరిశీలించారు. ఇందులో ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతారు. ఏం జరిగిందంటే.. ధారూరుకు చెందిన పత్తి అమృతమ్మకు, చాకలి శంకరయ్యకు ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ కింద 2.04 ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసింది. వీరి నుంచి అవుసుపల్లి లక్ష్మి సెప్టెంబర్, 0226లో 2.04 ఎకరాలు, శెట్టి లలితాదేవి నవంబర్ 2, 2008లో 2.04 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే తనకు, తమ పిల్లకు తెలియకుండానే తన భర్త శంకరయ్య సీలింగ్ భూమిని విక్రయించారని, దీన్ని తిరిగి ఇప్పించాలని ఇటీవల భూమి విక్రేత కుటుంబ సభ్యులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు పీఓటీ చట్టం 1977 కింద కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సదరు భూమిలో బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ భూముల్లో వరి సాగు చేశారని, పంట కోత అనంతరంఎవరూ ఇందులోకి వెళ్లకూడదని తహసీల్దార్ ఆదేశించారు. -
విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి
మొయినాబాద్‌రూరల్: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని డీఎస్పీలు హరీశ్చంద్రారెడ్డి, సుబ్బరామిరెడ్డి అన్నారు. శుక్రవారం జేబీఆర్ ఎడ్యూకేషన్ సోసైటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్కిటెక్చర్ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఎస్పీలు హరీశ్చంద్రారెడ్డి, సుబ్బరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్య విద్యార్థికి బంగారు భవిష్యత్ అందిస్తుందన్నారు. విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తెచ్చేలా ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జోగిన్‌పల్లి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణారెడ్డి, ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ సునీల్‌కుమార్, ఫార్మసీ ప్రిన్సిపాల్ శర్మ, మెడికల్ కళాశాల సీఏఓ మాజీ డీఎస్పీ యాదయ్య, వైస్ ప్రిన్సిపాల్ అరుణ్మూర్తి, యాంటీ ర్యాగింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్, రమేష్, యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ ప్రత్యూష, ఎన్సీసీ కోఆర్డినేటర్ గంగారామ్, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ హరీశ్చంద్రారెడ్డి -
ఉగ్రవాదం అణచివేతలో కేంద్రం విఫలం
షాబాద్: పహల్గాం ఉగ్రవాదదాడిలో పర్యాటకులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కుర్వగూడ, మన్మర్రి గ్రామాల్లో సీపీఐ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి కులం, మతం, జాతి ఉండదని మానవ మృగాల్లాగా మానవజాతిని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేసే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాద సంస్థల కదలికలను పసిగట్టడంలో కేంద్ర నిఘా వర్గాలు తీవ్రంగా విఫలం చెందాయన్నారు. ఉగ్రవాద దాడిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ప్రాణాలు కోల్పోయారని.. బీజేపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఇది హిందువుల మీద జరిగిన దాడిగా చిత్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి నక్కలి జంగయ్య, తదితరులున్నారు. కుర్వగూడ, మన్మర్రి సీపీఐ గ్రామ శాఖల నూతన కమిటీల ఎన్నిక సీపీఐ శాఖ మన్మర్రి, కుర్వగూడ కార్యదర్శులుగా వెంకటయ్య, శ్రీనివాస్ సహాయ కార్యదర్శులుగా వెంకటేష్, రాజు, మన్మర్రి కోశాధికారిగా నాగేష్, కమిటీ సభ్యులుగా బాలమణి, లక్ష్మమ్మ, శంకరయ్యను ఏకగ్రీవంగా నియమితులయ్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య -
బార్లో కల్తీమద్యం
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు ● ప్రీమియం మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యంతో కల్తీ ● రూ.1.48 లక్షల విలువైన కల్తీమద్యం పట్టివేత సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ బార్ కల్తీ మద్యం విక్రయాలకు తెరలేపింది. ఖరీదైన ప్రీమియం మద్యం బాటిళ్లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని నింపి వినియోగదారులకు అందజేస్తుండగా ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్‌ను కొంతకాలంగా లైసెన్స్ పునరుద్ధరించకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ ఎకై ్సజ్ సిబ్బందితో కలిసి శుక్రవారం బార్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బార్‌లోని పనిచేసే కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్‌లు కలిసి ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని వాటిలో కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.2690 ధర కలిగిన జేమ్సన్ బాటిళ్లలో రూ.1000 ధర కలిగిన ఓక్స్మిత్ మద్యాన్ని కలుపుతున్నట్లు ఎకై ్సజ్ పోలీసులు గుర్తించారు. ఇలా వివిధ రకాల బ్రాండ్లకు చెందిన 75 మద్యం బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎకై ్సజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా ట్రూప్ బార్ లైసెన్స్ ఫీజ్ చెల్లించకపోవడమే కాకుండా మద్యం డిపోల నుంచి మద్యం కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలిపారు. డిపోల నుంచి కొనుగోలు చేయడానికి బదులు వైన్‌షాపుల నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధర కలిగిన బాటిళ్లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలుపుతూ అమ్మకాలు చేపడుతున్నట్లు ఎకై ్సజ్ విచారణలో వెల్లడైంది. మొత్తం రూ.1.48 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నారు. బార్ యజమాని ఉదయ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణరెడ్డి, బార్లో పనిచేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్లపైన కేసు నమోదు చేసినట్లు ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. -
హామీలు అమలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి కె.రామస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని అంతారంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రామస్వామి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలో ఉన్న 11 ఏళ్లలో కోటి ఉద్యోగాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు తమ తీరును మార్చుకుని పేదలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి జయమ్మ, సహాయ కార్యదర్శి లక్ష్మి, నాయకులు అమృత, నరసింహ, చంద్రయ్య, గంగమ్మ, పద్మమ్మ, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్తుకు టెక్నాలజీ కీలకం
ఇబ్రహీంపట్నం రూరల్: భవిష్యత్తును రూపొందించడానికి టెక్నాలజీ ఎంతో కీలకమని ఈసీఐఎల్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అనిష్‌కుమార్ శర్మ పేర్కొన్నారు. మంగళ్‌పల్లి సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఎంబిడెడ్ కంప్యూటింగ్, కంట్రోల్ ఆటోమేషన్శ్రీ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అనిష్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అంశాల్లో అధిక నాణ్యత గల పరిశోధన.. ఎంబిడెడ్ సిస్టం, డిజైన్, రోబోటిక్స్, ఆటోమేషన్, సెన్సార్ నెట్వర్క్, రియల్ టైం సిస్టమ్ అవసరమన్నారు. కార్యక్రమంలో గౌరవ అథితి డాక్టర్ భోజన్న పాసిక్, కీనోట్ స్పీకర్ సుమన్సనం, కళాశాల చైర్మన్ డాక్టర్ రాఘవ, డైరెక్టర్ రామశాస్త్రి, ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి, డీన్ లాల్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘరానా దొంగ అరెస్టు
జీడిమెట్ల: ఇంట్లో ఎవరూలేని సమయంలో కిటీకీ గ్రిల్స్ తొలగించి ఇంట్లో ఉన్న బంగారు, వెండి నగలు దోచుకెళ్లే గజదొంగను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రూ.11.5లక్షల సొత్తు రికవరీ చేశారు. గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య వివరాలను వెల్లడించారు. అపురూప కాలనీకి చెందిన పింటూ మార్చి 5న కుటుంబ సభ్యులతో కలిసి కలకత్తా వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. ఉదయం సీసీ కెమరాలను పరిశీలించిన పింటూ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు వేణుగోపాల్(26), సంపత్సాయి(20)గా గుర్తించారు. బుధవారం సాయంత్రం వేణుగోపాల్‌ను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ.11.5లక్షలు విలువచేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు సంపత్ సాయి పరారీలో ఉన్నాడు. ఈమేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి వేణుగోపాల్‌ను రిమాండుకు తరలించారు. వేణుగోపాల్ సైబరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటికే 44కేసుల్లో నిందితుడుగా ఉండగా గతంలో దుండిగల్ పీఎస్ నుండి పీడీయాక్టు ద్వారా సంవత్సరం జైలుశిక్ష అనుభవించాడు. ● 44 కేసుల్లో నిందితుడు -
విద్యావ్యస్థను గాలికొదిలేసిన ప్రభుత్వం
● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ షాద్‌నగర్: ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ విమర్శించారు. పట్టణంలోని ఠాగూర్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఎస్ఎఫ్ ఐ జిల్లా 26వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో కోట్ల రూపాయలు దండుకుంటున్నా అడిగే నాథుడే కరువయ్యాడని వాపోయారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రణయ్, ఉపాధ్యక్షులుగా చరణ్, శ్రీకాంత్, శివ, తరంగ్, కార్యదర్శిగా శంకర్, సహాయ కార్యదర్శిగా అరుణ్, శ్రీకాంత్, స్టాలిన్, సభ్యులుగా వంశీ, శ్రీనివాస్, కుమార్, తనీష్, ప్రణవ్, శివ, తరుణ్, రాము, చరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
అదృశ్యమై.. చెరువులో శవమై..
మొయినాబాద్: భార్యతో గొడవ పడి అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపల్లికి చెందిన మల్కపురం రాజ(37) పెయింటర్‌గా పనిచేసేవాడు. ఈ నెల 21న రాత్రి మద్యం మత్తులో భార్య స్వప్నతో గొడవ పడ్డాడు. 22న తెల్లవారు జాము 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తెలిసిన చోట్ల ఆరా తీశారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి భార్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువులో రాజు మృతదేహం తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శంకరయ్యకు డాక్టరేట్ మహేశ్వరం: మహేశ్వరం మండల పరిధి కల్వకోల్ గ్రామానికి చెందిన పులిమామిడి శంకరయ్య ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌కు ఎంపికయ్యాడు. ఓయూలో తెలుగు ఓరియంటల్ విభాగంలో తెలుగు శాఖలో పీహెచ్డీ చేశారు. ఆ విభాగంలో డాక్టర్ చవ్వ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో.. రంగారెడ్డి జిల్లా జానపద మౌఖిక కథలు, సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించిన తనకు, ఈ డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. శంకర్‌ను గ్రామస్తులు అభినందించారు. త్వరలో డాక్టరేట్ పట్టా, ప్రశంసా పత్రం అందుకోనున్నారు. బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు మొయినాబాద్: అతివేగంతో ఎదురుగా వచ్చిన ఆటో, బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా ఆలంపల్లికి చెందిన మహ్మద్ ముబీన్, అతడి స్నేహితుడు షాబాద్ మండలం నాగర్‌గూడకు చెందిన మహ్మద్ ముదాసిర్.. మొయినాబాద్ మున్సిపల్ పరిధి గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం 2.30లకు ఓలా ఎలక్ట్రిక్ బైక్‌పై ఇద్దరు కలిసి కళాశాలకు వెళ్తుండగా, రాధాస్వామి సత్సంగ్ సమీపంలోకి రాగానే.. ఎదురుగా వచ్చిన ఆటో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 అంబులెన్స్‌లో స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలికపై కుక్కల దాడి షాద్‌నగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై గ్రామ సింహాలు దాడి చేశాయి. ఈ ఘటన పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న నాగరాజు కూతురు అవని(8), ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ అయిందని, మున్సిపల్ అధికారులు స్పదించి శునకాలను తరలించాలని కోరుతున్నారు. పెట్టుబడి పేరుతో టోకరా సనత్‌నగర్: పెట్టుబడి పేరుతో వాట్సప్‌లో వచ్చిన సందేశానికి ఆకర్షితుడైన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1,07,000 టోకరా వేసిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సనత్‌నగర్‌లో నివాసం ఉండే నాగరాజు ఫోన్ వాట్సప్‌కు పెట్టుబడి పేరుతో సందేశం వచ్చింది. ఆ సందేశం నాగరాజును ఆకట్టుకుంది. ఎలా పెట్టుబడి పెట్టాలో వారిని అడగ్గా వారు మార్గనిర్దేశం చేశారు. దీనికి ఫిర్యాదుదారుడు నమ్మి రూ.1,07,000 భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వారు చెప్పిన అన్ని పనులు పూర్తి చేశాడు. కానీ పెట్టుబడితో పాటు వారు ఇస్తానన్న కమిషన్ కూడా రాలేదు. దీంతో తాను ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ నాగరాజు వారిని అడగ్గా ఎటువంటి స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్య రంగంలో అపార అవకాశాలు
చేవెళ్ల: దేశంలో వైద్యరంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల మొదటి బ్యాచ్ (2019) విద్యార్థుల స్నాతకోత్సవం (గ్రాడ్యుయేషన్ డే) వేడుకలను గురువారం పద్మావతి కన్వెన్షన్‌లో కళాశాల చైర్మన్, మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, కనిపించే దేవుడు వైద్యడేనని ప్రజలు నమ్ముతారన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. మండలి చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే వైద్య కళాశాలను యూనివర్సిటీగా తీర్చి దిద్దేంకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాంతా బయోటెక్ ఫార్మా వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎస్సార్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ వరదారెడ్డి, కళాశాల డైరెక్టర్లు సంతోష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కళాశాల డీన్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జోయారాణి, సూపరింటిండెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ -
‘భూ భారతి’తో భూ హక్కుల పరిరక్షణ
మొయినాబాద్: భూ భారతి చట్టంతో భూమి హక్కులు పరిరక్షించబడతాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మొయినాబాద్‌లోని సురంగల్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో గురువారం తహసీల్దార్ గౌతమ్‌కుమార్ అధ్యక్షతన భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీ సత్వరం పరిష్కరించబడుతాయన్నారు. వ్యవసాయ, వాణిజ్య భూములను పక్కాగా పరిరక్షించే అవకాశం భూ భారతి చట్టం కల్పిస్తుందన్నారు. దీనిపై మే 1 నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించి రైతుల ఇబ్బందులు తీర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టం తీసుకురావడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జంగయ్య, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, ఎంపీఓ వెంకటేశ్వరరెడ్డి, ఏఓ అనురాధ, ఏపీఎం రవీందర్, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలకు పరిష్కారం షాబాద్: భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు హక్కులు భద్రంగా ఉంటాయని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో గురువారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టం విధి విధానాలను రైతులకు వివరించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధరణిని రద్దు చేసి కొత్త చట్టం తెచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ అన్వర్, డిప్యూటీ తహసీల్దార్ మధు, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, టీపీసీసీ కార్యదర్శి ఎన్.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.● కలెక్టర్ నారాయణరెడ్డి -
అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని..
● కత్తితో గొంతుకోసి..పెట్రోల్ పోసి తగులబెట్టి ● ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ● నిందితుల అరెస్టు..రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ రంగస్వామి షాద్‌నగర్: అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నా డని భర్తను అంతమొందించాలనుకుంది.. ప్రియు డితో కలిసి పథకం వేసింది.. పథకం ప్రకారంమద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి కత్తితో గొంతుకోసి హత్య చేసింది.. మృతదేహాన్ని గుంతలో పడేసి పెట్రోల్‌తో తగలబెట్టింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఏసీపీ రంగస్వామి వివరాలు వెల్లడించారు. ఫరూఖ్‌నగర్ మండలం చిన్నచిల్కమర్రి గ్రామానికి చెందిన ఎరుకలి యాదయ్య(32)కు ఎనిమిదేళ్ల క్రితం కొందుర్గు మండలం మహదేవ్పూర్కు చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాదయ్య కూలి పనులు చేస్తుండగా మౌనిక గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పని చేస్తోంది. ఈ పరిశ్రమకు మండల పరిధిలోని కంది వనం గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ తన ఆటోలో కూరగాయలు, వంట సామగ్రి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో మౌనికకు అతడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అశోక్‌ను తమకు దూరపు బంధువని భర్తకు పరిచయం చేసింది. భర్తను అడ్డు తొలగిస్తే సుఖంగా ఉండొచ్చని భావించి హత్య చేయాలనుకుంది. మద్యం మత్తులో ఉండగా.. శంషాబాద్ మండలం రామాంజపూర్‌లోని తన బాబాయ్ ఇంట్లో విందుకు వెళదామని 18 ఫిబ్రవరి 2025న అశోక్ తన ఆటోలో యాదయ్య, మౌనికను తీసుకొని రామాంజపూర్కు బయలుదేరారు. నందిగామ మండలం గూడూరు గ్రామ పరిధిలోని పెద్దగుట్టతండా సమీపంలో ఆటోను నిలిపి ముగ్గురూ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న భర్తను పథకం ప్రకారం అశోక్‌తో కలిసి కత్తితో గొంతుకోసి హత్య చేసింది. మృతదేహాన్ని గుంతలో పడేసి పెట్రోల్‌పోసి తగలబెట్టింది. అనంతరం మౌనికను అశోక్ తన ఆటోలో చిన్నచిల్కమర్రి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. కనిపించడం లేదని ఫిర్యాదు చేసి ఎప్పటిలాగే ఉదయం పాలు పితకడానికి వెళ్లిన తన భర్త యాదయ్య కనిపించడం లేదని 24 ఫిబ్రవరి 2025న మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లాడని, నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత మౌనిక, అశోక్ భా ర్యాభర్తలమని చెప్పి పట్టణంలోని అయ్యప్పకాలనీ లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. విషయం మృతుడి బంధువులకు తెలియడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించా రు. నిందితులతో ఘటనా స్థలానికి వెళ్లి యాదయ్య ఎముకలు, పుర్రెను సేకరించారు. నిందితుల నుంచి ఆటో, వేటకొడవలి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసులను అభినందించిన ఏసీపీ శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్, ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కేసును ఛేదించారు. నిందితుల ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ సుశీల, హెడ్‌కానిస్టేబుల్ విజయభాస్కర్, సిబ్బంది నరేందర్, రాజేష్, కరుణాకర్‌ను ఏసీపీ రంగస్వామి అభినందించారు. -
రూ.74.56 లక్షల హవాలా డబ్బు స్వాధీనం
గచ్చిబౌలి: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాల డబ్బును రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బులు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురెందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులు తెలిపారు. లెక్క చూపించని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయత్నించినా పట్టుబడలేదు.విశ్వసనీయ సమాచారంతో ఎట్టకేలకు భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. -
విక్రయానికి యత్నం
బాలికను కిడ్నాప్ చేసి చాంద్రాయణగుట్ట: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్, చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ మనోజ్ కుమార్‌తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 20న బార్కాస్ ప్రాంతానికి చెందిన మరియం భాను(5) చాక్లెట్ ఇప్పించాలని మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్తున్న పెద్దనాన్న బాబాసాదితో మారాం చేయడంతో తన వాహనంపై తీసుకెళ్లాడు. బాలికను వైన్స్ బయట ఉంచి మద్యం తీసుకొచ్చే సరికి బాలిక కనిపించలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మలక్‌పేట్ సలీంనగర్ కాలనీకి చెందిన భార్యాభర్తలు సయ్యద్ జావిద్ పాషా(51), షహిస్తా పర్వీన్(40)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించారు. బాలికను కిడ్నాప్ చేసి ఉప్పల్ ప్రాంతానికి చెందిన పర్వీన్ భాను(40)కు రూ.1.30 లక్షలకు విక్రయించారు. పర్వీన్ భాను ఆ చిన్నారిని ఉప్పల్ చిలుకానగర్‌లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించే సునీతా కుమారి(50), బంజారాహిల్స్‌లోని నోవా ఫర్టిలిటీ సెంటర్లో ఏజెంట్‌గా పనిచేసే కప్పల రాజేంద్ర ప్రసాద్(39) వద్ద అమ్మేందుకు బేరం పెట్టింది. సునీతా కుమారి, రాజేంద్రప్రసాద్ గతంలో ఈస్ట్ ముంబయ్‌లో ఇదే తరహా చిన్నారులను విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ ఐదుగురు ముఠాగా ఏర్పడి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. నిందితుల వద్ద నుంచి యాక్టివా ద్విచక్ర వాహనం, ఆటో, రూ.76 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చిన్నారిని రక్షించిన పోలీసులు ఐదుగురి రిమాండ్ -
ఆరోగ్యానికి వరం
ప్రకృతి ప్రసాదం.. హుడాకాంప్లెక్స్: వేసవి కాలంలో అందరికీ గుర్తుకు వచ్చేవి తాటి ముంజులు. వీటిని ఐస్ యాపిల్ తదితర పేర్లతో పిలుస్తుంటారు. ఈ సహజ ఫలంలో శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అధిక మొత్తంలో నీరు ఉండటం వలన శరీర బరువును తగ్గించడానికి ఇవి ఎంతాగానో తోడ్పడతాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే ముంజలను ప్రకృతి ప్రసాదంతో పోలుస్తుంటారు. వీటిని ఇష్టపడని వారు ఉండరూ. ప్రతి ఒక్కరూ ఆరగిస్తుంటారు. ఇవి ఎక్కువగా వేసవిలో లభిస్తుంటాయి. నగరంలో తాటి వనాలు లేనప్పటికీ.. గ్రామీణ వ్యాపారులు పల్లెల నుంచి పట్టణాలకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. నగరంలోని రహదారులకు ఇరువైపులా తోపుడు బండ్లు, ఆటోలు ఇలా ఏదేనీ వాహనంలో తెచ్చి.. పట్టణ వాసులకు పోషకాలను అందజేస్తున్నారు. నోరూరిస్తున్న తాటి ముంజలు వేసవిలో విరివిగా లభ్యం.. ఉపాధి పొందుతున్న గ్రామీణులు పోషకాలు ఆస్వాదిస్తున్న పట్టణ ప్రజలు కల్తీలేని ఫలం కల్తీలేని ఫలాలు తాటి ముంజలు. వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. వేసవిలో నిత్యం రంగారెడ్డి జిల్లా మాల్ నుంచి తాటికాయలు తెచ్చి విక్రయిస్తాం. రోజుకు రూ.1500ల నుంచి రూ.2 వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఏప్రిల్ మాసంలో కష్టపడితే రూ.లక్ష వరకు మిగులుతుంది. – రమేష్, వ్యాపారి, మాల్ ఆరోగ్యానికి మేలు తాటి ముంజలను పొట్టుతో తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది. జీర్ణకోశ సమస్యలకు దివ్య ఔషదంగా పనిచేస్తాయి. ఎక్కువగా పొటాషియం లభిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. – డాక్టర్ చిలువేరు శ్రీనివాసులు పోషక భాండాగారం తాటి ముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజ లవణాలను సమతుల్యం చేస్తాయి. విటమిన్ బీ7, కే. సెలెబుల్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్– ఏ,డీ, జింక్, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వలన వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉండడంతో రక్తపోటు అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను ధరిచేరనివ్వదు. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ముంజలను క్రమం తప్పకుండా తినడం వలన కొలస్ట్రాల్ తగ్గుతుంది. ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యను తగ్గిస్తాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బడం, ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. వేసవి తాపానికి వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. చికున్ ఫాక్స్‌ను నివారిస్తుంది. ముంజలను గుజ్జుగా చేసి, ముఖానికి పై పూతగా రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందించి, వేసవిలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. -
మహేశ్వరం ఆర్టీసీ డిపోకు ‘హై లెవల్’ అవార్డు
మహేశ్వరం: ఆర్టీసీ డిపోలో బస్సులకు అత్యధిక కేపీఎల్ వచ్చినందుకు మహేశ్వరం డిపోకు హైలెవల్ మైలేజ్ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని అశోక్ లేలాండ్ వారు నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ సిటీ విభాగంలో ఆల్ బీఎస్–6 బస్సులకు అత్యధికంగా 5.77 కేపీఎల్ వచ్చినందుకు మహేశ్వరం డిపోకు హై మైలేజ్ అవార్డ్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా డిపో మేనేజర్ లక్ష్మీసుధ అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీసుధ మాట్లాడుతూ.. మహేశ్వరం డిపోలో డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది క్రమశిక్షణతో పని చేయడంతో ఈ అవార్డు దక్కిందన్నారు. అందరి కృషితో అవార్డు వచ్చిందని, ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు. -
వక్ఫ్ బోర్డు ఒక మతానికి సంబంధించింది కాదు
మొయినాబాద్‌రూరల్: వక్ఫ్ బోర్డు ఒక మతానికి సంబంధించింది కాదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. హిమాయత్‌నగర్ చౌరస్తాలోని బీజేపీ కార్యాలయంలో గురువారం వక్ఫ్ చట్ట సవరణ సదస్సు 2025 పేరుతో వక్ఫ్ చట్టసవరణ జిల్లా కన్వీనర్ అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వక్ఫ్ అనేది 90 శాతం అన్ని మతాలకు సంబంధించిందని స్పష్టం చేశారు. 2024 వక్ఫ్ బిల్లు పాసైందన్నారు. దాదాపు పది లక్షల ఎకరాల ఆర్థిక సంపద ఉన్నా 2024లో కేవలం రూ.168 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. వక్ఫ్ బోర్డుపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, అంజన్‌కుమార్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కార్యదర్శి కవిత డిమాండ్ చేశారు. మే నెలంతా ఒకేసారి సెలవులపై వెంటనే నిర్ణయం చేయాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో పోషణ పక్వాడ కార్యక్రమం సందర్భంగా మేనెలంతా సెలవులు ఇచ్చేలా పరిశీలిస్తున్నామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. 40 డిగ్రీల ఎండలు మండుతున్నప్పటికీ సెలవులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాగమణి, బాలమణి, జయమ్మ, జ్యోతి, సుధ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. నేడు భూ భారతిపై అవగాహన సదస్సు ఆమనగల్లు: పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ లలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పలువురు అధికారులు హాజరు కానున్నట్టు తెలిపారు. పారే నీటిని ఒడిసిపట్టాలి మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో పారే వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని, భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత అన్నారు. మండలంలోని చిత్తాపూర్, తిప్పాయిగూడ గ్రామాల్లో గురువారం వాటర్‌షెడ్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. భూ గర్భజలాలను పెంచడమే వాటర్ షెడ్ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. అవసరమైన చోట చెక్‌డ్యాం నిర్మాణాలు, చెక్ వాల్స్, గల్లీ కంట్రోల్ పనులు, పారే నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాటర్‌షెడ్ కమిటీల ద్వారా పనులు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ రంగారావు, మండల ప్రత్యేకాధికారి సుజాత, ఎంపీడీఓ బాలశంకర్, ఎంపీఓ ఉమారాణి, ఏపీఓ వీరాంజనేయులు, వాటర్‌షెడ్ పీఓ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
సెలవులు భారం
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మిత్రులు దూరం..10లోuఅమ్మానాన్నలు లేకపోవడంతో.. మాది మాల్ మండలం నేరెళ్లపల్లి. పదేళ్ల క్రితమే ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అమ్మ చనిపోయింది. ఆ తర్వాత అనారోగ్యంతో నాన్న కూడా చనిపోయాడు. నాతో పాటు తమ్ముడు ఉదయ్ కిరణ్ కూడా ఉన్నాడు. బంధువులు ఉన్నా.. ఎవరూ దగ్గరకు తీసుకోలేదు. అప్పటి నుంచి మేము ఒంటరి అయ్యాం. అప్పుడప్పుడు మా మామయ్య వచ్చి చూసి వెళ్తాడు. అమ్మానాన్నలు లేకపోవడంతో వేసవి సెలవులు వచ్చినా.. ఇంటికి వెళ్లలేని పరిస్థితి. వీఎం హోంలోనే ఉండిపోతాం. – రాంచరణ్, 8వ తరగతి అక్కను తీసుకెళ్లారు కానీ.. మాది వలిగొండ. అమ్మనాన్నలు లేరు. చిన్నప్పుడే వాళ్లు నన్ను వదిలి వెళ్లారు. ఆ తర్వాత రామన్నపేటలోని మా అమ్మమ్మ, తాతయ్యలే నన్ను చేరదీశారు. వారికి సరైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో నన్ను వీఎం హోంలో చేర్చారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు. మా అక్క శ్రవంతి కూడా ఇక్కడే చదువుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియగానే ఆమెను వెంట తీసుకెళ్లారు. కానీ నన్ను ఇక్కడే ఉంచారు. అందరిలాగే నాకు కూడా ఇంటికి వెళ్లాలని ఉంది. అమ్మానాన్నా లేరు కానీ ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. – శ్రవణ్‌కుమార్, 9వ తరగతి బాధగా ఉంది మాది వికారాబాద్ జిల్లా జిన్నారం గ్రామం. చిన్నతనంలోనే అమ్మానాన్నలు చనిపోయయారు. ఎనిమిదేళ్ల క్రితం తాత, అమ్మమ్మ నన్ను వీఎం హోంలో చేర్పించారు. వాళ్లు ఏడాదికి ఒకసారి వచ్చి చూసి వెళ్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో మిత్రులంతా వాళ్ల సొంతూళ్లకు వెళ్తున్నారు. కానీ నేను మాత్రం గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఒంటరిగా ఉంటున్నా. ఇప్పటి వరకు ఊరికి కూడా వెళ్ల లేదు. సొంతూరిని గుర్తుపట్టలేను. నాకు కూడా మా గ్రామానికి వెళ్లాలని ఉంది. కానీ ఏం చేస్తాం. నన్ను తీసుకెళ్లే వారు లేరు. నాకు ఎవరూ లేరనే బాధకన్నా.. ఇప్పటి వరకు తోడుగా ఉన్న మిత్రులు కూడా నన్ను వదిలి వెళ్తుంటే బాధగా ఉంది. – వై.శ్రీశైలం, 8వ తరగతి వీఎం హోంలోనే అనాథ విద్యార్థులు ● స్నేహితులు ఇళ్లకు వెళ్తుంటే చెమ్మగిల్లుతున్న కళ్లు హుడాకాంప్లెక్స్: వార్షిక పరీక్షలు ముగిశాయి. ఎండలు భగ్గున మండుతుండటంతో ప్రభుత్వం విద్యార్థులకు సేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు వచ్చి వెంట తీసుకెళ్లారు. అయితే సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమంలో చదువుతున్న 60 మంది మాత్రం సెలవుల్లోనూ వసతి గృహానికే పరిమితం అవుతున్నారు. ఇక్కడ 800 మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో అమ్మానాన్నలిద్దరూ చనిపోయిన వారితో పాటు సింగిల్ పేరెంట్ పిల్లలు కూడా ఉంటున్నారు. పాఠశాలకు సెలవులు కావడంతో వీరంతా తమ తండ్రి/ తల్లి/ గార్డియన్ వెంట సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే ఏ ఆదరణ లేని వారు మాత్రం భారంగా అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పటి వరకు తమతో ఆడుకున్న మిత్రులు నెలరోజుల పాటు దూరం కానున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. న్యూస్‌రీల్ -
నేడు ‘భూ భారతి’పై అవగాహన సదస్సు
మొయినాబాద్: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూ భారతి’పై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గౌతమ్‌కుమార్ తెలిపారు. సురంగల్ రోడ్డులోని స్టార్ కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. మొయినాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.నేడు డయల్ యువర్ డీఎం ఇబ్రహీంపట్నం: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకటనర్సప్ప తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలపై గురువారం మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 4గంటల వరకు 7981745576 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని సూచించారు. మరింత మెరుగైన సేవల కోసం సలహాలు, సూచనలు అందించాలని కోరారు. రజతోత్సవాలను జయప్రదం చేయండి శంషాబాద్ రూరల్: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవాలను జయప్రదం చేయాలని డీసీసీబీ డైరెక్టర్ బూర్కుంట సతీష్ పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అఽఽధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయడంలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల్లో పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని స్పష్టంచేశారు. పీసీసీ అబ్జర్వర్ల నియామకం సాక్షి, సిటీబ్యూరో: సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్ల (పరిశీలకులు)ను నియమించారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అబ్జర్వర్ల జాబితాను విడుదల చేశారు. ● హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలకు ఇద్దరేసి చొప్పున పీసీసీ అబ్జర్వర్లను నియమించగా, రంగారెడ్డి జిల్లాకు ముగ్గురు నేతలను నియమించారు. ● మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు పీసీసీ అబ్జర్వర్లుగా సీహెచ్.పారిజాతా నర్సింహారెడ్డి, కె.శివకుమార్లను నియమించగా, రంగారెడ్డి జిల్లాకు కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.సంతోష్‌కుమార్, దారాసింగ్, వికారాబాద్‌కు ఎంఆర్జీ వినోద్ రెడ్డి, రాంశెట్టి నరేందర్‌లను నియమించారు. ● హైదరాబాద్ జిల్లాకు ఎస్.సురేష్‌కుమార్, పి.సుబ్రమణ్యప్రసాద్, సికింద్రాబాద్‌కు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, ఖైరతాబాద్‌కు ఎస్.వినోద్‌కుమార్, భీమగాని సౌజన్యగౌడ్లను పీసీసీ అబ్జర్వర్లుగా నియమించారు. రేపు ద్విచక్ర వాహనాలకు వేలం తాండూరు: ఆబ్కారీ నేరాల్లో పట్టుబడిన రెండు స్ప్లెండర్ బైక్‌లకు ఈ నెల 25న వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ శాఖ తాండూరు సీఐ బాల గంగాధర్ బుధవారం ఓ ప్రకనటలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాండూరు ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఈ వేలం ఉంటుందని చెప్పారు. బాలకేంద్రంలో సమ్మర్ క్యాంపు అనంతగిరి: వికారాబాద్‌లోని బాలకేంద్రంలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి సూపరింటెండెంట్ అనురాధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి మే 26 వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఈ క్యాంపు కొనసాగతుందని చెప్పారు. నృత్యం, వాయిద్యం, చిత్రలేఖనం, కుట్టు, అల్లికలు తదితర అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఉంటుందని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కొరడా
వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన వైద్యారోగ్య శాఖ అనైతిక ఆస్పత్రులపై చర్యలు తప్పవు వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు పొందకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు ఏర్పాటు చేసిన నకిలీ వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. పేదలు, నిరక్షరాస్యులు ఎక్కువగా నివసించే సరూర్‌నగర్, మీర్పేట్, నందనవనం, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, ఆమనగల్లు, యాచారం, తలకొండపల్లి, మాడ్గుల, కేశంపేట్, కొందుర్గులో ఇవి ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిసాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎలాంటి అనుభవం, అర్హత లేకుండా క్లినిక్‌లు ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా పేషంట్లను చేర్చుకుని, చికిత్సలు చేస్తున్న అనైతిక వైద్యులు, ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తోంది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, ఆస్పత్రి రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసిన నార్సింగిలోని ఆరోన్ ఆస్పత్రిని అధికారులు ఇటీవల సీజ్ చేశారు. తాజాగా ఎలాంటి అనుభవం, అర్హతలేని శంకర్‌దాదా ఆర్‌ఎంపీలపైనే కాకుండా యునానీ, ఆయుర్వేద కోర్సులు పూర్తి చేసి అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతున్న వారిపైనా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే షాద్‌నగర్, హఫీజ్‌పేట, సరూర్‌నగర్‌లో పలు ఆస్పత్రులు, క్లినిక్‌లను సీజ్ చేశారు. శంకర్‌దాదా ఆర్ఎంపీలపై చర్యలు హైదరాబాద్ జిల్లాలో 286 ప్రభుత్వ, 2,298 ప్రైవేటు ఆస్పత్రులు, రంగారెడ్డి జిల్లాలో 355 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి సహా తొమ్మిది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 55 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 231 సబ్ సెంటర్లు, 57 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 2,500పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మెజార్టీ క్లినిక్స్ వనస్థలిపురం, హస్తినాపురం, సరూర్‌నగర్, బాలాపూర్, మీర్పేట్, హఫీజ్‌పేట్, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా వీటిని నడుపుతుండటంతో తరచూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మదీనాగూడలో రామకిరణ్ నడుపుతున్న కిరణ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, న్యూ హఫీజ్‌పేట గణేశ్ మండపం వద్ద అబ్దుల్ వాహిద్ నిర్వహిస్తున్న రెహమానియా క్లినిక్, ప్రేమ్‌నగర్‌లో ఎ.రమేష్ నడుపుతున్న శ్రీసాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మార్తండనగర్లోని ఎం.కవిత ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కొండాపూర్ గణేశ్ టెంపుల్ రోడ్డులోని పి.అర్వింద్ నడుపుతున్న శ్రీవేంకటేశ్వర క్లినిక్‌లను సీజ్ చేశారు. ఆ కేసులో పట్టుబడిన పది.. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై అనుమానం రావడంతో 2023 సెప్టెంబర్‌లో సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో ఎనిమిది జిల్లాల్లోని 28 ఆస్పత్రులు నకిలీ బిల్లులు సృష్టించి, నిధులను కొల్లగొట్టినట్లు తేలడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. మోసాలు రుజువు కావడంతో చర్యలకు ఆదేశించింది. వీటిలో హైదరాబాద్ జిల్లాలో నాలుగు, రంగారెడ్డి జిల్లాలోని ఆరు ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో మాదన్నపేటలోని జనని ఆస్పత్రి సహా బీఎన్ఎరెడ్డినగర్లోని శ్రీరక్ష ఆస్పత్రి, ఎల్బీనగర్లోని ఎంఎంస్ ఆస్ప త్రి, ఐఎస్‌సదన్‌లోని అరుణశ్రీ ఆస్పత్రి, సైదాబాద్‌లోని శ్రీకృష్ణ ఆస్పత్రి, రామంతాపూర్‌లోని ఏడీఆర్ఎం ఆస్పత్రి, కొత్తపేటలోని ఎంఎంవీ ఇందిరా ఆస్పత్రి, బైరమల్గూడలోని శ్రీసాయితిరుమల ఆస్పత్రి, హస్తినాపురంలోని డెల్టా ఆస్పత్రి, మీర్‌పేటలోని హిరణ్య ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో పలు ఆస్పత్రులను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా కొన్ని.. ఫేక్ సర్టిఫికెట్లతో మరికొన్ని.. నకిలీ మెడికల్ బిల్లులతో సీఎంఆర్ఎఫ్కు టోకరా జిల్లాలో ఇప్పటికే పలు క్లినిక్‌లు సీజ్ -
అఘోరీకి 14 రోజుల రిమాండ్
చేవెళ్ల/శంకర్పల్లి: అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 308(5),318(1),351(3),352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్ ఫస్ట్‌క్లాస్ జడ్జి ధీరజ్‌కుమార్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ సమయంలో హైడ్రామా న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు కోసమే.. తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్‌లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు, కోర్డులకు సహకరిస్తా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పోలీసులు, కోర్టులకు పూర్తిగా సహకరిస్తానని అఘోరీ తెలిపారు. జడ్జి ముందు హాజరైన సమయంలో తనకు లాయర్‌ను పెట్టుకునే స్తోమత లేదని, ప్రభుత్వ అడ్వకేట్‌ను ఏర్పాటు చేయాలని అఘోరీ కోరినట్లు తెలిసింది. అరెస్ట్, కస్టడీ నేపథ్యంలో కోర్టులో ఎలాంటి వాదనలు జరగలేదని సమాచారం. అఘోరీ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి ఈ కేసును లీగలేయర్ కౌన్సిల్‌కు అప్పగించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుని కేసును ముందుకు తీసుకెళ్తానని ఆయన తెలిపారు. చేవెళ్ల కోర్టులో హాజరు పర్చిన పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలింపు హోమ్‌కు శ్రీవర్షిణి.. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్‌లో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. -
కలిసి పోరాడితేనే పరిష్కారం
షాద్‌నగర్: రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏకతాటిపైకి వచ్చి ప్రమోషన్లలో రిజర్వేషన్ సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలో క్రిమిలేయర్ ఎత్తివేయడంతో పాటు ఈడబ్ల్యూఎస్‌ను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎదురవుతున్న సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు. బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ (అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్), వైస్ ప్రెసిడెంట్‌గా పద్మనళిని (బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం), కార్యదర్శిగా రాఘవేందర్‌గౌడ్(ఐటీఐ కాలేజీ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్), మహిళా విభాగం అధ్యక్షురాలిగా శ్వేత(లెక్చరర్), ముఖ్య సలహాదారులుగా బాల్‌రాజ్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమ, రాష్ట్ర కార్యదర్శి మహేంద్రసాగర్, జిల్లా బీసీ ఉద్యోగులు కరుణశ్రీ, శ్వేత, జ్యోతి, నర్సింలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం నేతలు జిల్లా నూతన కమిటీ ఎన్నిక -
మళ్లీ దరఖాస్తు అక్కర్లేదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/బడంగ్పేట్: భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న బాధితులు మరోసారి అర్జీ పెట్టుకోవాల్సిన అవరసం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ‘ధరణి’ పోర్టల్‌లో పెండింగ్ జాబితాలో ఉన్న దరఖాస్తులన్నింటినీ కొత్తగా తెచ్చి ‘భూభారతి’ ఫోర్టల్లోకి బదిలీ చేశామని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పాల్గొన్నారు. సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్ వ్యవసాయ, వాణిజ్య భూములను పక్కాగా పరిరక్షించే గొప్ప అవకాశాన్ని భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం బడంగ్‌పేట కార్పొరేషన్‌లోని మీటింగ్ హాలులో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జియో సర్వే చేసిన తర్వాతే భూములను రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కొత్త చట్టంలో పొందుపర్చారని తెలిపారు. రాబోయే కాలంలో భూధార్ వల్ల రైతులు, ప్లాట్ల యజమానులు నష్టపోయే ప్రమాదం లేదన్నారు. రాష్ట్రంలో భూరికార్డులు సరిగా లేవనే కారణంతో ధరణిని తీసుకువచ్చారని, ఇందులోని లోపాలను సరిచేసే అవకాశం అధికారులకు లేకపోవడంతో బాధితులు కోర్టులకు వెళ్లేవారని గుర్తుచేశారు. ఇక నుంచి ఆసమస్య ఉండబోదని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓలు, అక్కడా పని కాకపోతే కలెక్టరేట్లో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. కొత్త చట్టంలో గ్రామ పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్ట్రర్, మార్పుల రిజిస్ట్రర్, వనరుల రిజిస్ట్రర్ ఇలా నాలుగు రకాలుగా గ్రామ రికార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, భూదాన్ భూములను సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. 2025 చట్టం ప్రకారం భూమి కలిగిన రైతుల పేరున ఆర్ఓఆర్(రికార్డ్ ఆఫ్ రైట్)లో పేర్లు ఉంటాయన్నారు. 18 రాష్ట్రాల్లోని భూ చట్టాలను పరిశీలించి, పరిశోధించి భూభారతిని తీసుకువచ్చారని వెల్లడించారు. దరఖాస్తు పెట్టుకున్న నెల రోజుల్లో మండల స్థాయిలోనే సమస్య పరిష్కామయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ శాఖను పటిష్టం చేసి, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో గ్రామ అధికారులు(వీఆర్వోలు), మరో రెండు నెలల్లో సర్వేయర్ల నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. పలువురు రైతులు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, టీయూడీ ప్రోగ్రాం చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, కార్పొరేషన్ కమిషనర్లు పి.సరస్వతి, ఆర్.జ్ఞానేశ్వర్, జల్పల్లి కమిషనర్ వెంకట్రామ్ పాల్గొన్నారు. నెల రోజుల్లోపే భూ సమస్యకు పరిష్కారం భూ భారతి చట్టంతో పక్కాగా ఆస్తుల పరిరక్షణ కలెక్టర్ సి.నారాయణరెడ్డి కొత్త చట్టంపై రైతులకు అవగాహన -
ప్రసవాల సంఖ్య పెంచాలి
కేశంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్రావు సిబ్బందికి సూచించారు. మండల పీహెచ్‌సీని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులతో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... టీకాల కార్యక్రమం సకాలంలో జరిగే విధంగా చూడాలన్నారు. డ్రాప్ అవుట్లు, లెఫ్ట్ అవుట్లను గుర్తించి వెంటనే టీకాలను వేయాలని చెప్పారు. ఆరోగ్య కార్యక్రమాలను మెరుగుపర్చుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో పరిశుభ్రతపైన ప్రత్యేక దృషి పెట్టాలన్నారు. సిబ్బంది రోగుల ఆరోగ్యం కోసం నిబద్ధతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నిఖిత, సిబ్బంది ఉపేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మెరిక్లిన్, సంగీత, చంద్రశేఖర్, హనుమంతు, సుజాత, సుమతి, వసంత, గీత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్రావు -
గాలి వానకు నేలరాలిన మామిడి
కడ్తాల్: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వానకు మామిడి తోటలోని కాయలు నేల రాలాయి. అసలే ఈ ఏడాది అంతంతా మాత్రమే కాసిన మామిడి, అకాల వర్షాలకు నేలరాలడంతో తీవ్రంగా నష్ట పోయామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. మండల కేంద్రం సమీపంలో బీక్యానాయక్కు చెందిన ఆరు ఎకరాల మామిడి తోట గాలి వానకు పూర్తిగా కాయలు నేలరాలడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించి, నష్ట పోయిన మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేడే వాల్ పోస్టర్ ఆవిష్కరణ తుర్కయంజాల్: మే 1వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ కార్మిక దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్ర మోహన్ కోరారు. బుధవారం తుర్కయంజాల్‌లో మేడే వేడుకల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మాల్యాద్రి, సత్యనారాయణ, శ్రీనివాసులు, కృష్ణ, మాధవరెడ్డి, జంగయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. లారీలో చెలరేగిన మంటలు ఇబ్రహీంపట్నం: అకస్మాత్తుగా ఇంజన్లో మంటలు చెలరేగి ఓ లారీ దగ్ధమైన సంఘటన ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీ నుంచి గ్రానేట్ లోడ్‌తో లారీ హైదరాబాద్‌కు వస్తోంది. మార్గమధ్యలో ఇబ్రహీంపట్నం చెరువు కట్టపైకి రాగానే సాంకేతిక లోపంతో ఇంజన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ చకచక్యంగా లారీ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. మంటలకు లారీ ముందుభాగం పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి వచ్చిన ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కానీ ఈ ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. 23ఐబీఆర్06: దగ్ధమవుతున్న లారీని ఆర్పుతున్న ఫైరింజన్ సిబ్బంది -
భారతి సిమెంట్‌కి తిరుగులేదు
మహేశ్వరం: వ్యాపారంలో తిరుగులేని సంస్థగా భారతి సిమెంట్ ఆల్ట్రాఫాస్ట్ పేరుతో.. ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5 స్టార్ గ్రేడ్‌ను విడుదల చేసిందని సంస్థ టెక్నికల్ ఇంజినీర్ మహ్మద్ సాహేర్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో శ్రీరామ స్టీల్ ట్రేడర్స్ డీలర్ షాపులో తాపీమేసీ్త్రలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి ఆల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు ఈ సిమెంట్ సరైన ఎంపికని చెప్పారు. స్లాబ్ నిర్మాణ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారని తెలిపారు. డీలర్ నర్సింహ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే ఇది చాలా బెట్టర్ అన్నారు. అంతకు ముందు తాపీమేసీ్త్రలకు భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. సంస్థ టెక్నికల్ ఇంజినీర్ మహ్మద్ సాహేర్ -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 76.95 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవగా, సెకండియర్‌లో 77.72 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఫలితాల శాతం కొంత తగ్గినప్పటికీ ఇతర జిల్లాలతో పోలిస్తే ఉత్తమ ఫలితాలు సాధించింది. ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలదే హవా కొనసాగింది. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షి యల్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ మార్కులు సాధించిన వారిలో ఆటోడ్రైవర్, దినసరి కూలీల పిల్లలు సైతం ఉన్నారు. ఇక జనరల్ విద్యార్థులతో పోలిస్తే..ఒకేషనల్ విద్యార్థులు ఈసారి కొంత ముందంజలో ఉన్నారు. మొదటిలో రెండో స్థానం ● ఫస్టియర్ జనరల్‌లో మొత్తం 76,967 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 59,227 మంది ఉత్తీర్ణత (76.95శాతం) సాధించారు. వీరిలో 39,503 మంది బాలురకు 28,537 మంది (72.24 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 37,464 మంది పరీక్షకు హాజరు కాగా 30,690 మంది ఉత్తీర్ణత (81.92 శాతం) సాధించారు. ● ఒకేషనల్ కోర్సులో 3,445 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2,179 మంది ఉత్తీర్ణత (63.25 శాతం) సాధించారు. బాలురు 1,736 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 834 మంది ఉత్తీర్ణత (48.04 శాతం) సాధించారు. బాలికలు 1,709 మంది పరీక్షకు హాజరు కాగా 1,345 మంది ఉత్తీర్ణత (78.70శాతం) సాధించారు. ద్వితీయంలో నాలుగో స్థానం ● సెకండియర్ జనరల్ కోర్సుల్లో మొత్తం 67,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 52,526 మంది ఉత్తీర్ణత (77.72 శాతం) సాధించారు. 34,884 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 25,711 మంది ఉత్తీర్ణత (73.70 శాతం) సాధించారు. 32,702 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా 26,815 మంది ఉత్తీర్ణత (82 శాతం) సాధించారు. ● ఒకేషనల్ కోర్సుల్లో 2,995 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2,195 మంది ఉత్తీర్ణత (73.29 శాతం) సాధించారు. బాలురు 1,521 మంది పరీక్షకు హాజరుకాగా 901 మంది ఉత్తీర్ణత (59.24 శాతం) సాధించారు. బాలికలు 1,474 మంది పరీక్షకు హాజరుకాగా 1,294 (87.79 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2024తో పోలిస్తే 2025లో తగ్గిన ఉత్తీర్ణత శాతం ప్రథమ సంవత్సరంలో ఒకటి నుంచి రెండో స్థానానికి.. ద్వితీయ సంవత్సరంలో మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన ర్యాంకు -
ఇంద్రారెడ్డి ఆశయసాధనకు కృషి
చేవెళ్ల: స్వర్గీయ హోంశాఖ మంత్రి పి.ఇంద్రారెడ్డి ఆయశ సాధనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి 25వ వర్థంతి సందర్భంగా మండలంలోని కౌకుంట్లలో మంగళవారం ఆయన సమాధి వద్ద ఆమె కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, కళ్యాణ్‌రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి వారసురాలిగా రాజకీయంలోకి వచ్చి న తనకు 25 ఏళ్లుగా అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, అభివృద్ధి, ఈప్రాంత సమస్యల పరిష్కారమే ఇంద్రారెడ్డి ఆశయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, శుభప్రద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు. నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని జీరో చేశారు ఇంద్రారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సబితారెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ స్థానంలోకి తీసుకెళ్లారని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జీరోస్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. పరిస్థితి ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మళ్లీ కేసీఆర్, బీఆర్ఎస్ పాలన రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 27 వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
ప్రైవేటు ఆస్పత్రులపై కొరడా
మీర్‌పేట: ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి దుర్వినియోగానికి పాల్పడిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. కార్పొరే షన్ పరిధి బాలాపూర్ చౌరస్తాలోని హిరణ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం కొంత కాలంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి తప్పు డు బిల్లులతో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై వైద్య శాఖ విచారణ చేపట్టింది. ఈ మేరకు మంగళవారం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు ఇతర అధికారులతో కలిసి ఆస్పత్రిని సీజ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి గీత ఉన్నారు. కేసులు నమోదు చేసి విచారణ.. హుడాకాంప్లెక్స్: తప్పుడు వైద్య బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝులిపించింది. సరూర్‌నగర్ మండల పరిధిలోని ఎంఎంఎస్, ఇందిరా ఆస్పత్రులను మంగళవారం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు సీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా ఆస్పత్రులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిందని అన్నారు. -
‘భూ భారతి’ విప్లవాత్మక మార్పు
మంచాల: భూ భారతి చట్టం తేవడం విప్లవత్మాక మార్పు అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మంగళవారం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా భూ సమస్యలతో సతమతవుతున్న రైతులకు భూభారతి చట్టం ఎంత మేలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గతంలో ధరణి ద్వారా కనీసం రికార్డుల్లో తప్పులను కూడా సరి చేసుకోలేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు తిరిగి తలెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం మంచాలలో డీసీసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో భూభారతి చట్టం చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మంచాల పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, తహసీల్దార్ ఎం.వీ.ప్రసాద్, ఎంపీడీఓ బాలశంకర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి -
పనులు సాగక
నిధులు లేక..● పడకేసిన పల్లెపాలన ● అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ ● వెలగని వీధిలైట్లు.. తాగునీటికి తండ్లాట ● నత్తనడకన అభివృద్ధి పనులు ● నిధులు విడుదల చేయని ప్రభుత్వాలు ● కరువైన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ సాక్షి, రంగారెడ్డిజిల్లా: సర్పంచుల పదవీకాలం ముగియడం.. 14 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండడం.. 15వ ఆర్థికసంఘం నుంచి ఏడు నెలలుగా నిధులు రాకపోవడం.. ఆస్తి పన్నుల రూపంలో వసూలు కావాల్సిన మొత్తం ఆశించినస్థాయిలో రాకపోవడంతో పల్లె ల్లో అభివృద్ధి పడకేసింది. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఖర్చులకు.. రాబడికి పొంతనేది? జిల్లా వ్యాప్తంగా 558 పంచాయతీలు, 307 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల వీటిలో కొన్ని సమీప మున్సిపాలిటీల్లో విలీనం కాగా, మిగిలినవి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 252 మంది గెజిటెడ్ స్థాయి అధికారులను రెండు మూడు గ్రామాలకు ఒకరు చొప్పున ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఆయా గ్రామాల పరిధిలో 1,722 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థ ఉండగా, వీటిలో 210 కిలోమీటర్లు ఓపెన్ డ్రైనేజీ, 1,320 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 192 కిలోమీటర్లు కచ్చ డ్రైనేజీ ఉంది. 1,631 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా,17,536 వాటర్ సంపులు ఉన్నాయి. 2,52,252 నివాసాలకు తాగునీరు సరఫరా అవుతోంది. 3,204 పబ్లిక్ నల్లాలు ఉన్నాయి. 536 నర్సరీల్లో 32,57,458 మొక్కలు పెంచుతున్నారు. 865 పల్లె ప్రకృతి వనాలు ఉండగా, వీటిలో 17,44,993 మొక్కలు నాటారు. 253 డంపింగ్ కేంద్రాలు, 557 వైకుంఠధామాలు ఉన్నాయి. ఆయా పంచాయతీల నుంచి ఆస్తిపన్నుల రూపంలో 2022–24 ఆర్థిక సంవత్సరంలో రూ.32.69 కోట్లు రావాల్సి ఉండగా, రూ.28.15 కోట్లు మాత్రమే సమకూరాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.104.54 కోట్ల గ్రాంటు విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు ఆస్తి పన్నుల రూపంలో ఆయా పంచాయతీలకు వస్తున్న ఆదాయానికి.. క్షేత్రస్థాయి ఖర్చులకు.. వస్తున్న రాబడికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఏడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో పంచాయతీల నిర్వహణ అధికారులకు భారంగా మారింది. చేయలేక.. చేతులు చాచలేక.. రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులకే కాదు కనీసం ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులు, వీధిలైట్ల కొనుగోలు, మంచినీటి మోటార్లకు వచ్చే చిన్నచిన్న రిపేర్లకు సైతం చేతులు చాచాల్సి వస్తోంది. ఖర్చులకు ఖాతాలో డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తోంది. ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. వారికి నాలుగు నెలల వేతనం బకాయి పడడం, ఇస్తున్న వేతనం కూడా చాలా తక్కువగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో చేతులెత్తేస్తున్నారు. నెలవారీ ఖర్చులు భారమవుతుండటంతో ఇప్పటికే పలువురు ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు ఉద్యోగం మానేశారు. సర్పంచులు పదవుల్లో కొనసాగినప్పుడు ఖర్చులను సర్దుబాటు చేసేవారు. గ్రామంలో పేరు కోసం సొంత డబ్బులు వెచ్చించేవారు. చీకట్లోనే మెజార్టీ పంచాయతీలు ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వీధిలైట్లు దెబ్బతిన్నాయి. పాడైన లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు జీపీల వద్ద కనీస నిధులు లేవు. ఆయా వీధులన్నీ అంధకారంలోనే మగ్గాల్సి వస్తోంది. ట్రాక్టర్ డీజిల్‌కు నిధులు లేక పల్లె ప్రకృతి వనాల్లోని చెట్లకు నీరు పోయలేని పరిస్థితి. చాలా చోట్ల మొక్కలు వాడిపోయి కన్పిస్తున్నాయి. విధిలేని పరిస్థి తుల్లో కొంత మంది కార్యదర్శులు అప్పులు చేసి తాత్కాలిక పరిష్కారం చూపుతుంటే.. మరికొంత మంది అటువైపు వెళ్లడానికే వెనకడుగు వేస్తున్నారు. ‘ఇది కేశంపేట మండలంలోని ఓ మారుమూల పంచాయతీ. ఇక్కడ సుమారు 500 మంది జనాభా ఉంది. మిషన్ భగీరథ పైపులైన్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పైపులు మూసుకుపోవడంతో ఇంట్లోకి నీరు చేరని పరిస్థితి. బోరు నీరు సరఫరా చేయాలన్నా మోటార్లు పని చేయడం లేదు. మరమ్మతులకు జీపీలో కనీస నిధులు కూడా లేవు. విధిలేని పరిస్థితుల్లో ఔట్ సోర్సింగ్ కార్యర్శి సొంత ఖర్చుతో కంప్రెషన్ మిషన్ తెప్పించి పైపులైన్లను రిపేరు చేయించాల్సి వచ్చింది’. ‘ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. భూ గర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. కరెంట్ సరఫరాలో హెచ్చుతగ్గులు, తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు వీధిలైట్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఏ వీధిలో చూసినా అంధకారమే నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో మోటారు రిపేరు చేయించాలంటే కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కాలిపోయిన వీధిలైటు స్థానంలో కొత్తగా మరోటి వేయించాలంటే కనీసం రూ.500 నుంచి రూ.1000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ట్రాక్టర్ నెలవారీ డీజిల్ ఖర్చు రూ.3వేల వరకు వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడు నెలలుగా పైసా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలను ఎలా నెట్టుకురావాలి’ ఇదీ ఓ ఔట్ సోర్సింగ్ కార్యదర్శి ఆవేదన. ఇళ్లలో ఉండలేక పోతున్నాం మా గ్రామంలో ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రంతా చీకట్లోనే కాలం వెల్లదీసాం. కనీసం ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇళ్లలో ఉండలేకపోతున్నాం. – నర్సింగ్ వెంకటయ్య, లోయపల్లి, మంచాల మండలం ఇళ్లలోకి మురుగు నీరు గ్రామంలో నాలుగు వాన చినుకులు వస్తే చాలు కష్టాలు ఎదురైనట్లే. వర్షాలకు అండర్‌డ్రైనేజీ వాల్వ్‌లో మురుగు నీరు నిండి ఇళ్లలోకి వస్తున్నాయి. ఏళ్ల తరబడి మురుగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు. – మాతంగి కమలమ్మ, లోయపల్లి, మంచాల మండలం -
సమస్యలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ నారాయణరెడ్డిమహేశ్వరం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణితో భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, భూ భారతి చట్టంతో అలాంటి అవసరం రాదన్నారు. 90 శాతం సమస్యలు స్థానికంగానే పరిష్కారం అవుతాయని, 10 శాతం మాత్రమే ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో ఉంటాయని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసే ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులు, పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం రైతులు కొత్త చట్టంపై కలెక్టర్, ఆర్డీఓలను సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ రైతులకు వివరించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, ఏడీఏ సుధారాణి, ఎంపీడీఓ శైలజ, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కోరుపోలు రఘుమారెడ్డి, సునీతా అంధ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిషా కోసం పెయిన్ కిల్లర్
● డోస్ ఎక్కువై యువకుడి మృతి ● ఆస్పత్రిలో మరో ఇద్దరు పహాడీషరీఫ్: మత్తు కోసం పెయిన్ కిల్లర్ అలవాటు చేసుకున్న యువకుడు, మరింత నిషా కోసం డోస్ పెంచి మృత్యువాత పడ్డా డు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ కథనం ప్రకారం.. సుల్తాన్‌పూర్‌కు చెందిన ఎంఎస్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి మహ్మద్ అబ్దుల్ నాసర్(17), షాబాజ్(22), మరో బాలుడు స్నేహితులు. కొద్ది నెలలుగా మత్తు కోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు. ఎలా వాడాలనేదానిపై షాహిన్నగర్కు చెందిన సాహిల్ అనే మరో వ్యక్తి సాయం తీసుకుంటున్నారు. మొదట్లో కొద్ది స్థాయిలో పెయిన్ కిల్లర్లను తీసుకున్న వీరు మరింత నిషా కోసం మోతాదును మించి తీసుకోవడం ప్రారంభించారు. ఈనెల 17న ముగ్గురూ కలిసి పెయిన్ కిల్లర్లను తీసుకున్నారు. నాసర్ కోమాలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రైవేటు పాఠశాలలు వద్దు..
ౄనందిగామ: అన్ని వసతులు, అర్హతగల ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులను చేర్పించాలని టీజీయూఎస్(తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్షుడు తవుర్యా నాయక్ అన్నారు. ఇప్పటికే సర్కారు బడుల్లో చదువుతున్న వారిని ప్రైవేటు బాట పట్టించవద్దని కోరారు. మండల పరిధి బండకుంటతండా, బండమీదితండాలలోని ప్రాథమిక పాఠశాలలకు సోమవారం సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని బలోపేతం చేసేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. నిరుపేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తూ అప్పుల బారిన పడుతున్నారని, అలా కాకుండా నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, వారానికి రెండు సార్లు గుడ్లు, రాగి జావ, డిజిటల్ టీచింగ్, వర్క్ బుక్కులు, ఏఐ టీచింగ్ తదితర అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ రాథోడ్, దీప్తి నాయక్, రాజశేఖర్, చందు నాయక్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించండి టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడుతవుర్యానాయక్ -
సీనియర్ సివిల్ జడ్జికి ఘనంగా వీడ్కోలు
షాద్‌నగర్: షాద్‌నగర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సోమవారం సిద్దిపేట కోర్టులో జడ్జిగా పని చేసిన స్వాతిరెడ్డి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న రాజ్యలక్ష్మికి బార్ అసోసియేషన్ సభ్యులు వీడ్కోలు పలికారు. బదిలీపై వచ్చిన స్వాతిరెడ్డికి న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్వ వేణుగోపాల్‌రావు, న్యాయవాదులు కంచి రాజగోపాల్, గుండుబాయి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో శాఖల వారీగా అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడే పరిష్కరించే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ వారం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 68 అర్జీలు వచ్చాయని, వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 27, ఇతర శాఖలకు సంబంధించి 41 ఉన్నట్టు తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇబ్రహీంపట్నం: పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు అధికారుల పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలు సమీక్షించేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, రికార్డుల నిర్వహ ణ, పెట్రోలింగ్, సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని, మహిళా భద్రతకు అధి క ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ సూచించారు. సీపీ వెంట ఏసీపీ రాజు, సీఐ జగదీశ్ ఉన్నారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య మీర్‌పేట: ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివసించే ఆకుల దీపిక (38) రెండున్నరేళ్లుగా నాగోలు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు భర్త రవికుమార్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏంజరిగిందో తెలియదు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుమార్తె విషయాన్ని గమనించి వెంటనే తండ్రికి సమాచారం అందించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీపిక ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా, మరేవైనా కారణాలా అనేది తెలియరాలేదు. ఆమె తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. -
మాల్ ‘సంత’సం
ఐదేళ్లుగా పశువుల సంతతో వచ్చిన రాబడి (రూ.లక్షల్లో) యాచారం: జాతీయ స్థాయిలో ‘ప్రత్యేక’ గుర్తింపుతో మాల్ ఒక్కసారిగా మెరిసింది. రాష్ట్రంలోనే ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డు దక్కించుకున్న గ్రామంగా నిలిచింది. రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దు యాచారం మండల పరిధిలోని మాల్‌కు మొదటి నుంచీ వ్యాపార కేంద్రంగా పేరుంది. ప్రతి మంగళవారం ఇక్కడ పశువుల సంతతో పాటు వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతాయి. సంత రోజు రూ.కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరగడంతోపాటు వందలాది మంది ఉపాధి పొందుతారు. రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల నుంచే కాకుండా నాగర్‌కర్నూల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల, మార్కాపురం, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చి తమకు కావాల్సిన సరుకులతో పాటు పాడి పశువులు, అరక దున్నే కాడెద్దులు కొనుగోలు చేస్తుంటారు. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై ఉన్న ఈ గ్రామం 70 ఏళ్లుగా వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు రావడంపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అవార్డు దక్కిందిలా.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అవార్డులు అందజేయడం కోసం గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి మాల్ పశువుల సంత ఆర్థిక వనరులపై దృష్టి పెట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎంపీడీఓ పంపిన నివేదిక ఆధారంగా ఈ నెల మొదటి వారంలో కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సందర్శించింది. మాల్ పంచాయతీకి ఏటా పశువుల సంత వేలం పాట నిర్వహణ ద్వారా రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరుతుండడం, తద్వారా గ్రామాభివృద్ధి గణనీయంగా జరగడాన్ని గుర్తించిన అధికారుల బృందం గ్రామాన్ని ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డుకు ఎంపిక చేసింది. పశువుల సంత ద్వారా వచ్చే ఆదాయం కాకుండా పన్నుల వసూళ్లు, ఇతర అభివృద్ధి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. అవార్డ్‌తో పాటు రూ. కోటి పారితోషికం దక్కనుంది. సంతకు కలగానే శాశ్వత స్థలం ఆత్మనిర్భర్ అవార్డు రావడానికి ప్రధాన కారణమైన పశువుల సంతకు శాశ్వత స్థలం ఎంపిక కలగానే మిగిలింది. ప్రతి మంగళవారం ప్రవేట్ వెంచర్లలోని ప్లాట్లలోనే నిర్వహణ కొసాగుతోంది. సంతకు వచ్చే మూగజీవాలకు కనీసం దాహం తీర్చేందుకు తాగునీరు, నీడ సౌకర్యం లేదు. సంత కొనసాగుతున్న పక్కనే సర్వే నంబర్ 640 లోని 16 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 5 ఎకరాలు కేటాయించాలని 25 ఏళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోయింది. మాల్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఎన్నో ఏళ్లుగా ఉంది. జాతీయ స్థాయిలో ‘ప్రత్యేక’ గుర్తింపు ఆత్మనిర్భర్ స్పెషల్ పంచాయతీ కింద ఎంపిక అవార్డుకు కారణమైన పశువుల సంత తెలంగాణ నుంచి ఎంపికై న ఏకై క గ్రామం హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఏడాది వచ్చిన ఆదాయం 2021–22 రూ. 53,00,000 2022–23 రూ. 59,00,000 2023–24 రూ. 71,03,000 2024–25 రూ.73,00,000 2025–26 రూ. 82,00,000ఎన్నోసార్లు అధికారుల దృష్టికి.. ఐదేళ్ల పదవీ కాలంలో మాల్ పశువుల సంతకు శాశ్వత స్థలంపై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. గ్రామం మధ్యలోనే సర్వే నంబర్ 640లో ఐదెకరాలు కేటాయించాలని కోరినా రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. సంతకు స్థలం కేటాయిస్తే మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. – పడకంటి కవిత, మాజీ సర్పంచ్ సంతోషంగా ఉంది రాష్ట్రంలోనే మాల్ ఆత్మ నిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. అత్యధిక ఆర్థిక వనరుల కేటగిరీ కింద ఉన్నతాధికారులకు నివేదిక పంపించగా, స్వయంగా పంచాయతీని సందర్శించి అవార్డుకు ఎంపిక చేశారు. వచ్చే రూ.కోటి నగదుతో మరింత అభివృద్ధి జరుగుతుంది. – నరేందర్‌రెడ్డి, ఎంపీడీఓ, యాచారం స్థల కేటాయింపునకు కృషి రాష్ట్రంలోనే ఇబ్రహీంపట్నం నియోజవర్గంలోని గ్రామం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. మాల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన పశువుల సంతకు శాశ్వత స్థలం కేటాయించేలా కృషి చేస్తా. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం -
రహదారిపై విరిగిపడిన మర్రి చెట్టు
● గంటకుపైగా ట్రాఫిక్ జాం చేవెళ్ల: గాలిదుమారంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఓ పెద్ద మర్రి చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టింది. సాయంత్రం 4 గంటల నుంచి వాతవారణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు, పలుచోట్ల వర్షం కురిసింది. మండలంలోని ఖానాపూర్, ఆలూరు, అంతారం, కౌకుంట్ల తదితర గ్రామాల్లో జోరు వర్షం కురిసింది. బలమైన గాలులకు అంతారం బస్‌స్టేజీ సమీపంలో ఓ పెద్ద మర్రి చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రోడ్డుపై వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుపై చెట్టు పడిపోవటంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గంటకుపైగా రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిపోయిన చెట్టును జేసీబీల సాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
అల్లర్లు చేస్తే అరెస్టే..!
ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనుల్లో పోలీసులు దూకుడు పెంచారు. పను లకు ఆటంకం కలిగిస్తున్నవారిపై కన్నెర్ర చేస్తున్నారు. అల్లర్లు చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చ రిస్తున్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. యాచారం: ఫార్మాసిటీ భూముల వ్యవహారం హాట్‌టాఫిక్‌గా మారింది. సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ పనుల్లో బాధితులతో పాటు.. పరిహారం పొందిన వారు కూడా తరచూ పనులు అడ్డుకుంటుండంతో సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం, పోలీసులకు ఫుల్ పవర్ ఇచ్చింది. దీంతో పనులకు ఎలాంటి అడ్డంకి కలిగినా క్షణాల్లో వాలిపోతున్నారు. పది రోజుల క్రితం నక్కర్తమేడిపల్లి గ్రామం నుంచి ఫార్మా భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుంచి భూములు సేకరించిన రెవెన్యూ శాఖ, డబ్బులు ఇచ్చిన టీజీఐఐసీ కంటే పోలీస్ శాఖనే అప్రమత్తంగా ఉంది. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు బందోబస్తును ఏర్పాటు చేస్తుండగా, సమన్వయ బాధ్యతలను గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు పర్యవేక్షిస్తున్నారు. పోలీసు పహారాలో.. భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా.. డీసీపీ పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ, ముగ్గురు ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, మరో వంద మందికి పైగా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. భూములు సేకరించిన నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని రోడ్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. భూసేకరణలో నిజంగానే రైతులకు అన్యాయం జరిగినట్లు తెలిస్తే.. వారి సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, కోర్టు కేసులున్న భూముల వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్సి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సీఎంఓ నుంచి పర్యవేక్షణ ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో ఫ్యూచర్(ఫోర్త్)సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం సేకరించిన 14 వేల ఎకరాల భూమికి పక్కగా సర్వే చేసి, ఫెన్సింగ్ పనులు చేపట్టింది. పలు ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించడానికి నిర్ణయించినకాంగ్రెస్ సర్కార్.. రైతులు, ప్రజల నుంచి ఏ సమస్య రాకుండా సీఎంఓ కార్యాలయం నుంచి నిత్యం పర్యవేక్షిస్తోంది. పోలీస్, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులకు సలహాలు, సూచనలు చేస్తోంది. నెల రోజుల్లో సర్వే, ఫెన్సింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. కొన్ని నిర్మాణ సంస్థలకు కావాల్సిన భూమిని అప్పగించి, మే నెల చివరి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.వేగంగా ఫార్మాసిటీ భూముల సర్వే ఫెన్సింగ్ పనుల్లో పోలీసుల దూకుడు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్న వైనం పరిహారం ఇప్పిస్తామంటూ అధికారుల భరోసా మే నెలలో భూములను పరిశీలించనున్న సీఎం బాధితులకు భరోసా భూ సేకరణలో చాలా మందికి పరిహారం అందలేదని, నకిలీ పత్రాలతో కొందరు రూ.కోట్లు దండుకున్నారని పేర్కొంటూ పలువురు రైతులు సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకుంటున్నారు. ఏళ్లుగా కబ్జాలో ఉన్న తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు.. రెవెన్యూ, టీజీఐఐసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. పల్లెచల్కతండాలో 20మందికి పైగా గిరిజనులు, కుర్మిద్దలో పదిమందికి పైగా పేదలు, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల్లో మరో 40 మంది.. హక్కుదారులమైన మాకు పరిహారం ఇవ్వకుండా, దళారులకు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఇదే అంశాన్ని ఏసీపీ కేపీవీ రాజు.. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి దృష్టికితీసుకెళ్లారు. ఆ భూములను పరిశీలించేలా చేశారు. దీంతో భరోసా కలిగిన రైతులు.. సర్వే, ఫెన్సింగ్ పనులకు సహకరిస్తున్నారు. -
ధరణి కష్టాలు.. భూ భారతితో దూరం
● రైతుల వద్దకే రెవెన్యూ సేవలు ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇబ్రహీంపట్నం: ధరణితో పడిన కష్టాలు భూ భారతితో దూరమవుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఓ గార్డెన్లో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలు, రైతులకు ఇచ్చి న హామీల్లో భాగంగానే ఈచట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భూమి ఉండీ అమ్ముకోలేని స్థితిలో అనేక మంది ధరణితో అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. ధరణితో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, భూభారతితో అధికారులే ప్రజల చెంతకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. గతంలో ఒక్క ఆన్లైన్ దరఖాస్తుకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉండేదని, ప్రస్తుతం ఆ దుస్థితి ఉండబోదని స్పష్టంచేశారు. ఇకనుంచి సర్వే మ్యాప్లతోనే రిజిస్ట్రేషన్లు అవుతాయని వెల్లడించారు. ఇందుకోసం 6వేల మంది ట్రైన్డ్ లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే అన్ని గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. ఆధార్ మాదిరిగా భూధార్ కార్డులు అందించి, భూవివరాలు పొందుపరుస్తామన్నారు. అర్హులైన కౌలుదారులకు న్యాయం చేసే వెసులుబాటు ఈ చట్టంలో ఉందని తెలిపారు. భూ భారతి ద్వారా రికార్డుల్లోని తప్పొప్పులను సరిచేసే అధికారాన్ని రెవెన్యూ శాఖకు కల్పించినట్టు మంత్రి పేర్కొన్నారు. పార్ట్– బీలోని 18 లక్షల ఎకరాల భూ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించామన్నారు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ అధికారి నుంచి జమాబందీ నమోదు చేయించి, రికార్డులు భద్రపరుస్తామని స్పష్టం చేశారు. చట్టంలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రతీ తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన వారికి పాసు పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతి మాసింగ్, ఆర్డీఓ అనంతరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, టీపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహ్మారెడ్డి, మార్కెట్ చైర్మన్లు గురునాథ్‌రెడ్డి, చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోటా దాటింది!
ఉపాధ్యాయ కేటాయింపుల్లో స్థానిక రగడ● స్పౌజ్ కేటగిరీలో జిల్లాకు మరో 32 మంది రాక ● ఇప్పటికే 50 శాతం మించిన నాన్ లోకల్ టీచర్లు ● తాజాగా మరికొంత మంది కేటాయింపుపై విమర్శలు ● వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా విద్యాశాఖలో మళ్లీ స్థానిక రగడ మొదలైంది. ఇప్పటికే అనేక మంది స్థానికతకు విరుద్ధంగా వచ్చి జిల్లాలో పాగా వేశారు. తాజాగా మరికొంత మంది ఉపాధ్యాయులను కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. స్పౌజ్ కోటాలో ఇతర జిల్లాలకు చెందిన మరో 32 మందిని జిల్లాకు కేటాయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇతర జిల్లాల వారితో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా స్థానికంగా ఉన్న నిరుద్యోగులు తమ ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4,054 ఎస్జీటీలు, 3,997 స్కూల్ అసిస్టెంట్లు, 278 మంది హైస్కూలు ప్రధానోపాధ్యాయులు, 200 మంది ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. నిజానికి స్థానికేతరుల కోటా 20 శాతానికి మించకూడదు. కానీ ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి చేరినవారితో స్థానికేతరుల కోటా 50 శాతం దాటిపోయింది. ప్రభుత్వ తాజా కేటాయింపులపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుకుబడిని అడ్డంపెట్టుకుని.. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉంది. ఆరోగ్య సమస్యలు, పిల్లల ఉన్నత చదువుల పేరుతో ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయసంఘాల నేతలు సహా ప్రజాప్రతినిధుల బంధువులు తమకున్న రాజకీయ, ఆర్థిక పలుకుబడిని అడ్డంపెట్టుకుని డిప్యూటేషన్లపై అడ్డదారుల్లోవచ్చి చేరుతున్నారు. వీరంతా శివారు మండలాల్లో కాకుండా నగరానికి ఆనుకుని ఉన్న సరూర్‌నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, రాజేంద్రనగర్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలోని విద్యార్థుల సంఖ్య పెద్దగా లేని ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టింగులు పొందుతున్నారు. ఏళ్ల తరబడి శివారు మండలాల్లో పని చేస్తున్న స్థానిక ఉపాధ్యాయులకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలోనూ తీరని అన్యాయం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే బీఈడీ, టీటీసీ వంటి కోర్సులు పూర్తి చేసుకుని డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పోస్టులు ఖాళీ లేక ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలి భార్యభర్తల బదిలీల పేరు తో ప్రభుత్వం జిల్లాకు మ రోసారి తీరని అన్యాయం చేసింది. ఇప్పటికే 50 శాతానికి మించి ఉన్న స్థానికేతరులను వారి సొంత జిల్లాలకు పంపకుండా కొత్తగా మరికొంత మంది ఉపాధ్యాయులను కేటాయించడం దారుణం. భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పని చేయాలనే ప్రభుత్వ నిబంధనను స్వాగతిస్తున్నాం. కానీ 317 జీఓను అడ్డుపెట్టుకుని ఇప్పటికే జిల్లాలో పాగా వేసిన స్థానికేతరులను వారి జిల్లాలకు పంపకుండా, తాజాగా వారి సహచరులను స్పౌజ్కేటగిరీలో కేటాయించడం అన్యాయం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లా నిరుద్యోగులు మరింత నష్టపోయే పరిస్థితి నెలకొంది. స్పౌజ్ కేటగిరీలో జిల్లాకు కేటాయించిన 32 మంది ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడానికి వెనుకాడబోం. – సత్తారి రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
మహాసభలను జయప్రదం చేయండి
చేవెళ్ల: ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రం అంబేడ్కర్ భవన్లో సోమవారం ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి అరుణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అరకొర నిధులతో విద్యాభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం అమలు చేయాలంటే దేశ వ్యాప్తంగా రూ.4లక్షల 82వేల కోట్లు అవసరమని, కానీ బడ్జెట్లో రూ.125 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. విద్యారంగానికి జరుగుతున్న అన్యాయంపై చర్చించి, భవిష్యత్ పోరాటాల కోసం జిల్లాలో అన్ని స్థాయిల్లో మహాసభలు జరుపుకొని, రాష్ట్ర మహాసభలను ఖమ్మంలో ఈ నెల 25,26,27 తేదీలలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సభకు విద్యార్థులు, మేధావులు, పుర ప్రముఖలు, ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ.. సమావేశంలో ఫెడరేషన్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎ.శ్రీనివాస్, అరుణ్‌కుమార్‌లు, ఉపాధ్యక్షులుగా సమీర్, యశ్వంత్, వివేకానంద, దిలీప్, సహాయ కార్యదర్శిలుగా చరణ్‌గౌడ్, చందు, తేజ, పండు, సోషల్‌మీడియా కన్వీనర్‌గా చిరంజీవి, సాయి గణేశ్, డివిజన్ కమిటీ సభ్యులు దేవేందర్, సాయిగౌడ్, రాహుల్, హరికృష్ణ, బన్నీ, నవీణ్, శశాంక్లను నియమించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ -
పౌరసరఫరాల అధికారికి సన్మానం
బడంగ్పేట్: నూతనంగా బాధ్యతలు చేపట్టిన పౌరసరఫరాల జిల్లా అధికారిని వనజాతరెడ్డి(డీఎస్ఓ)ను సోమవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మీనారాయణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని డీలర్లు కోరారు. ఇందులో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.సత్తయ్య, కార్యవర్గ సభ్యులు భానుగౌడ్, విజయ్‌సూర్య, కృష్ణగౌడ్, సందీప్‌గౌడ్, సంఘం మహేశ్వరం మండల అధ్యక్షుడు ఎంఏ సత్తార్, మోయినాబాద్ డీలర్ల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బాలాపూర్ రేషన్ డీలర్లు సురేష్‌గుప్తా, వినయ్‌గౌడ్, రాజుయాదవ్, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం కేతేపల్లి: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్‌లో నివాసముంటున్న వి.వెంకట్రావు చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తన భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి నుంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. నీటి సంపులో యువతి అస్తిపంజరం కవాడిగూడ: లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్‌లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్ఆర్మిల్స్ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. -
విద్యతోనే మార్పు సాధ్యం
మంచాల: విద్యతోనే మార్పు సాధ్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర విద్య శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో పిల్లల తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లలను బడికి పంపించి చేతులు దులుపుకోకుండా పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ రకంగా తమ పిల్లలకు విద్యను అందిస్తున్నారు తదితర విషయాలు గమనించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ప్రత్యేక ఆల్గర్‌థెమ్‌తో పని చేస్తున్న బెట్టింగ్ యాప్స్
రోజుకు విత్‌డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్‌లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్‌కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్‌లో వెచ్చించడానికి పరిమితులు ఉండవు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్‌లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్‌ను ఇన్‌స్టల్ చేసుకుంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ఆధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ ఆధీనంలోనే ఉండేలా డిజైన్చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్‌కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్‌లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్‌ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్‌లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్‌గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్‌థెమ్ పని చేస్తుంది. గెలిచినప్పటికీ డబ్బు వెనక్కు తీసుకోలేని పరిస్థితి ప్రధాన సూత్రధారులందరూ చైనీయులే సిట్ ఏర్పాటు చేసినా సాగుతున్న దందా మూడు రోజుల్లో ఒకరి ఆత్మహత్య.. మరొకరి హత్య -
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల తాకిడి
అత్తాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు రాజేంద్రనగర్ మండల విద్యాధికారి కె.శంకర్‌రాథోడ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు విశాలమైన తరగతి గదులు, ఒక్క రూపాయి ఖర్చు లేకుంండా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఎలాంటి సదుపాయాలు లేకుండా ఇరుకు గదుల్లో డిగ్రీలు లేని శిక్షణ లేని ఉపాధ్యాయుల చేత విద్యార్థులను రుద్దడం మాత్రమే చేస్తారని అన్నారు. హంగు.. ఆర్భాటాలతో విద్యార్థులు.. విద్యార్థుల తల్లిదండ్రులను భ్రమలో పడేస్తూ పాఠశాల నుంచి అడ్మిషన్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు స్థానిక యువకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని ఎంఈఓ కోరారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మంచి రికార్డులు ఉన్నాయని అన్నారు. దివంగత మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలు ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వేలకు పైచిలుకు ఉందని అంతేస్థాయిలో ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు సొంతమని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్వేచ్చ ఉంటుందని ప్రతి విద్యార్థి ఎంతో దైర్యంగా స్వేచ్ఛగా తన మనోభావాలను కుటుంబ నేపథ్యం తదితర అంశాలను వివిధ సభల్లో చెప్తారన్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పాఠశాలల పేర్లలో ముందు వెనుక తోకలు తగిలిస్తూ విద్యార్థి లోకాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోనే ఉన్న ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. విద్యా శాఖ అనుమతి లేకుండా ఎలా పాఠశాల బోర్డులను ఏర్పాటు చేసుకుంటారని అలాంటి వాటిని వెంటనే తొలగించాలని ఆయన సూచించారు. రాజేంద్రనగర్ మండల విద్యాధికారి శంకర్‌రాథోడ్ -
చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి
యాచారం: తీవ్ర మనస్తాపంతో చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మొరుగు యాదయ్య(45) గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో శనివారం సాయంత్రం కొందరితో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అదేరోజు రాత్రి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. ఆరో అంతస్తు పైనుంచి పడి కార్మికుడి మృతి శంకర్పల్లి: ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కార్మికుడు కింద పడి మృతి చెందిన సంఘటన మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన బికాశ్ కుమార్ (24) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మండల పరిధిలో ఇక్ఫాయ్ కళాశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ పని నిమిత్తం ఐదు రోజుల నుంచి వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఆరో అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి పోయాడు. వెంటనే స్థానికులు శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ పోలీస్
కోల్‌కతా కాప్స్ వర్సెస్ సాక్షి, సిటీబ్యూరో/గోల్కొండ: ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్–సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు మాట అటుంచితే...ప్రస్తుతం ఓ మోసగాడి అరెస్టు విషయంలో కోల్‌కతా కాప్స్ వర్సస్ హైదరాబాద్ పోలీసు అనే పరిస్థితి వచ్చింది. గోల్కొండ పోలీసుస్టేషన్లో నమోదైన మోసం కేసులో నిందితుడు జస్బిందర్ సింగ్‌ను నగర పోలీసులు గురువారం కోల్‌కతాలో అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఇది కిడ్నాప్ అంటూ అతడి స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో అక్కడి షేక్స్పియర్ సరానీ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ నిందితుడి అరెస్టుపై తమకు ముందస్తు, తదనంతర సమాచారం లేదని కోల్‌కతా అధికారులు చెప్తుండగా..అలా సమాచారం ఇస్తే ఫలితాలు తారుమారు అవుతున్నాయని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నగర వ్యాపారిని మోసం చేసిన కేసు... నగరంలోని సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న గోల్కొండకు చెందిన సాజిద్ అహ్మద్ ఖాన్ అల్కాపూర్‌లో దుకాణం నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇరువురు తన స్నేహితుడి ద్వారా ఖాన్‌ను పరిచయం అయ్యారు. ఈయన వ్యాపారాల లావాదేవీలు, విస్తరణపై ఉన్న ఆసక్తిని తెలుసుకున్నారు. ఫుడ్ ప్రాడక్టస్ వ్యాపారంలో ఉన్న హల్దీరామ్స్ సంస్థ డీలర్షిప్ ఇప్పిస్తామంటూ ఖాన్‌ను నమ్మించారు. ఈ పక్రియ పూర్తి చేసే దళారి అంటూ కోల్‌కతాకు చెందిన జస్బిందర్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడించారు. సింగ్ చెప్పినట్లే ఆయన కంపెనీకి చెందిన ఖాతాలోకి ఖాన్ ఈ నెల 9న రూ.75 లక్షలు బదిలీ చేశారు. ఆపై సింగ్‌తో సహా అందిరి ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో తాను మోసపోయినట్లు ఖాన్ గ్రహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు ఈ నెల 13న కేసు నమోదు చేసుకున్నారు. ఇందులో జస్బిందర్ సహా నలుగురిని నిందితులుగా చేర్చారు. వారికి చెప్తే వీళ్లు చెక్కేస్తున్నారు... ఇతర రాష్ట్రాల్లో నిందితుల అరెస్టు అనేది సర్వసాధారణమే. ప్రధానంగా చీటింగ్ కేసులతో పాటు సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి కోసం గాలిస్తూ పోలీసులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఉన్నతాధికారుల నుంచి లిఖిత పూర్వక అనుమతి తర్వాతే ఇలా వెళ్తారు. గతంలో ఇలా వెళ్లిన బృందాలు కచ్చితంగా అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి నిందితుల వద్దకు వెళ్లేవి. అయితే కొన్నాళ్లు ఇలా సమాచారం ఇచ్చిన వెంటనే ఆ విషయం నిందితులకు తెలిసిపోతోంది. ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న కేటుగాళ్లు నగర పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు. దీంతో తమ పంథా మార్చిన నగర పోలీసులు రహస్యంగా వెళ్లి నిందితుల్ని పట్టుకుంటున్నారు. ఇలా అరెస్టు చేసినప్పుడు పరిస్థితుల్ని బట్టి అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై తీసుకురావడమో... నేరుగా తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరచడమో చేస్తున్నారు. జస్బిందర్ సింగ్ అరెస్టు విషయంలోనూ తాము నిబంధనలు పాటించామని, కోల్‌కతా పోలీసుల కేసును చట్ట పరంగా ఎదుర్కొంటామని సిటీ అధికారులు చెప్తున్నారు. రూ.75 లక్షలు మోసం కేసులో నిందితుడిగా జస్బిందర్ అక్కడకు వెళ్లి అరెస్టు చేసిన గోల్కొండ పోలీసులు దీనిపై షేక్స్పియర్ సరానీ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదు తమకు ముందస్తు సమాచారంలేదంటున్న ఆ అధికారులు సమాచారం ఇస్తే ఫలితాలుతారుమారని చెప్తున్న సిటీ కాప్స్ అరెస్టు విషయంలో ఏర్పడిన వివాదం... ఈ కేసు దర్యాప్తులో భాగంగా గోల్కొండ పోలీసులు నిందితుల ఆచూకీ ఆరా తీశారు. సాంకేతిక ఆధారాలను బట్టి హౌరాకు చెందిన సింగ్ కోల్‌కతాలోని కామిక్ స్ట్రీట్‌లో ఉన్న ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం ఉదయం ఆ హోటల్లోని రూమ్ నెం.418లో ఉన్న సింగ్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. దీనిపై సింగ్ స్నేహితుడు, జార్ఖండ్‌కు చెందిన అజిత్ కుమార్ దాస్ సమాచారంతో షేక్స్పియర్ సరానీ పోలీసులు ‘హైదరాబాద్ పోలీసులుగా చెప్పుకున్న వ్యక్తుల’పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుపై తమకు ముందస్తు, తదనంతర సమాచారం లేదని ఆ పోలీసులు చెప్తున్నారు. హోటల్ నిర్వాహకుడు చెప్పిన వివరాల ప్రకారం ఆ వ్యక్తులు గోల్కొండ పోలీసులుగా భావిస్తూ షేక్స్పియర్ సరానీ అధికారులు ఈ–మెయిల్ ద్వారా సమాచారం అడిగారు. దీంతో తామే చీటింగ్ కేసులో సింగ్‌ను అరెస్టు చేసినట్లు నగర అధికారులు జవాబు ఇచ్చారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలా అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకం అని కోల్‌కతా పోలీసులు ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది
మొయినాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం మాజీ సర్పంచ్, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కేటీఆర్‌ని కలిసి బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్రనగర్ స్థానాల్లో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. ప్రజలు బీఆర్ఎస్నే కోరుకుంటున్నారన్నారు. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, సుధాకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు జిల్లాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు ఖాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
స్తంభాలు ఒరిగి
చెట్లు కూలి.. కడ్తాల్: మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని మైసిగండి, గోవిందాయిపల్లితండా, గోవిందాయిపల్లి, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, కర్కల్‌పహాడ్, వంపూగూడ, చల్లంపల్లి, మక్తమాధారం తదితర గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో, మైసిగండి ఆలయ సమీపంలో చెట్లు కూలిపోవడంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎన్హెచ్ఏ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిన వృక్షాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. భారీ వర్షానికి మైసిగండి ఆలయం పరిసరాల్లో భారీగా వర్షం నీరు చేరడంతో బురదమయంగా మారింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. కర్కల్‌పహాడ్‌లో వ్యవసాయ పొల్లాలో పలు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.. గాలివానకు కడ్తాల్, తలకొండపల్లి, యాచారం మండలాల్లోని ఆయా గ్రామాల్లో చెట్లు నేల కూలాయి.. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి, తీగలు తెగిపడ్డాయి.. మామిడి, వివిధ కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన రహదారులపై నేలకూలిన వృక్షాలు పడిపోయిన విద్యుత్ స్తంభాలు గాలికి ఎగిరిపోయిన పైకప్పులు దెబ్బతిన్న ఆయా పంటలు ఎగిరిపోయిన ఇళ్ల రేకులు యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి తాడిపర్తి, కుర్మిద్ద, మల్కీజ్‌గూడ, గొల్లగూడ గ్రామాల్లో 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు వ్యవసాయ పొలాలపై పడిపోవడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. తాడిపర్తిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నుంచి కిందికి పడిపోయింది. మల్కీజ్‌గూడలో నాలుగు కుటుంబాలకు చెందిన ఇళ్ల రేకులు గాలికి లేచిపోవడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, సామగ్రి పూర్తిగా తడిసిపోవడంతో నిరాశ్రయులుగా మారారు. రూ.లక్షల్లో నష్టం జరిగింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడికాయలు, పలు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణకు మరమ్మతులు చేపట్టారు. -
మృత్యుపాశాలు
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోuప్రాణాలు తీస్తున్న విద్యుత్ తీగలు ● గత సంవత్సరం 69 మంది మృత్యువాత ● తాజాగా కొందుర్గు, శంషాబాద్‌లో విద్యుత్‌షాక్‌తో ఇద్దరి మృతి ● సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నా.. చర్యలు శూన్యం సాక్షి, రంగారెడ్డిజిల్లా: వెలుగులు పంచాల్సిన విద్యుత్ తీగలు.. ప్రాణాలు తోడేస్తున్నాయి.. కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి.. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ప్రమాదాల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. విద్యుత్‌షాక్‌కు గురై మృత్యువాతపడుతున్న వారిలో అధికంగా సంస్థతో సంబంధం లేని ప్రైవేటు కార్మికులు, సాధారణ ప్రజలే ఉంటుండటం విశేషం. గ్రేటర్ పరిధిలో గత సంవత్సరం ఏకంగా 69 మంది విద్యుదాఘాతాలతో మృత్యువాత పడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలల్లోనే అత్యధిక ప్రమాదాలు వెలుగు చూస్తుండటం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అనేక చోట్ల ఇళ్లపైనే వైర్లు వేలాడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు తెగిపడుతున్నాయి. తరచూ చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. వాటి చుట్టూ సరైన కంచె సహా ఎర్తింగ్ సిస్టం సరిగా లేకపోవడంతో సాధారణ పౌరులతో పాటు మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. బయటివారితో విద్యుత్ పనులు మెజార్టీ సెక్షన్ల పరిధిలో అనుభవం, అర్హత ఉన్న జూనియర్ లైన్మెన్లకు బదులు ఎలాంటి అనుభవం, అర్హత లేని ప్రైవేటు కార్మికులతో పని చేయిస్తున్నారు. విద్యుత్ లైన్లపై వీరికి సరైన అవగాహన కూడా ఉండటం లేదు. లైన్ల పునరుద్ధరణ, ఇతర మరమ్మతుల సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ.. గృహాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లోని ఇన్వర్టర్లు/ జనరేటర్లు ఆన్‌లో ఉండటం వాటి నుంచి రివర్షన్‌లో కరెంట్ సరఫరా కావడం తెలిసిందే. ఈ విషయం తెలియక కార్మికులు వాటిని ముట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. వాస్తవానికి స్తంభాలు ఎక్కే ముందే టంగ్ టెస్టర్‌తో ఎర్తింగ్ చెక్ చేయాల్సి ఉంది. కానీ కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా ఏకంగా స్తంభాలు ఎక్కి సర్వీసు వైర్లు కలుపుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన మృతుల్లో జేఎల్ఎంలు, ఆర్టిజన్లతో పాటు ప్రైవేటు కార్మికులే ఎక్కువగా ఉన్నట్లు డిస్కం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీరా ప్రమాదాల్లో చనిపోయిన తర్వాత సంస్థ నుంచి వారికి ఎలాంటి బెన్ఫిట్స్ కూడా అందడం లేదు. కార్మికుల మృతదేహాలను సబ్స్టేషన్ల ముందు పెట్టి ఆందోళన చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రైవేటు కార్మికుల మరణాలకు కారణమైన సంబంధిత క్షేత్రస్థాయి అధికారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు.న్యూస్రీల్భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఇటీవల కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల శివారులోని ఓ వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం నేలకూలి, వైర్లు తెగిపడ్డాయి. పర్వతాపూర్‌కు చెందిన అశోక్‌రెడ్డి (35) అటు వైపు వెళ్లగా ప్రమాదవశాత్తు తెగిపడిన వైరు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. సాధారణంగా వైర్లు తెగిపడిన వెంటనే ఫీడర్ ట్రిప్పై సరఫరా నిలిచిపోతోంది. కానీ ఇక్కడ అలా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ రైల్వేట్రాక్ సమీపంలోని ఓ తోటలో ఇబ్రహీంపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కె.చేతన్‌రెడ్డి(26) మామిడికాయలు కోసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రేటర్లో విద్యుత్‌షాక్ మరణాలు సర్కిల్ మృతులు మేడ్చల్ 15 రాజేంద్రనగర్ 13 సైబర్‌సిటీ 12 సరూర్‌నగర్ 12 బంజారాహిల్స్ 04 హబ్సీగూడ 04 హైదరాబాద్ సెంట్రల్ 04 హైదరాబాద్ సౌత్ 03 సికింద్రాబాద్ 02 -
మహనీయుల స్ఫూర్తితో ఉద్యమబాట
ఇబ్రహీంపట్నం: మహిళలు, దళిత, గిరిజన హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జాతీయ నాయకురాలు టి.జ్యోతి అన్నారు. ఈనెల 14న ప్రారంభమైన పూలే, అంబేడ్కర్ యాదిలో మహిళ హక్కుల పరిరక్షణ యాత్ర రాష్ట్రంలో 18 జిల్లాల్లో కొనసాగింది. ఇబ్రహీంపట్నంలో ఆదివారం ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా హక్కుల పరిరక్షణకు కృషిచేసిన మహనీయులైన జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే, అంబేడ్కర్ స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది వీరమణులు పోరాడి సాధించుకున్న మహిళా హక్కులు ప్రస్తుతం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో రాజ్యాంగం, మహిళల హక్కులను పక్కన పెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. మనుధర్మాన్ని రాజ్యాంగ స్థానంలో అమలు పరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహిళలకు రక్షణ, ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించిందని పేర్కొన్నారు. మున్సిపల్, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికుల, మహిళల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు అరుణజ్యోతి, ఆశాలత, సరళ, నాగలక్ష్మి, శశికళ, సాయిలీల, వినోద, గీత, వరలక్ష్మి, అనురాధ, సుమలత తదితరులు పాల్గొన్నారు.ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
నేడు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు
మహేశ్వరం: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై సోమవారం మండల కేంద్రంలోని కాకి ఈశ్వర్ ఫంక్షన్ హాలులో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు మహేశ్వరం తహసీల్దార్ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదస్సుకు కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి హాజరుకానున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు కొత్త చట్టంలోని ప్రయోజనాలను వివరించి, సందేహాలను నివృత్తి చేయనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నంలో.. ఇబ్రహీంపట్నం: భూ భారతిపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇబ్రహీంపట్నంలోని శాస్త్రా గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ప్రభుత్వాధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధు లు, రైతులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో నేచర్ క్యాంప్ మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో నేచర్ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్ వడ్స్ అండ్ ట్రయల్స్ పేరిట శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు చేపట్టిన నేచర్ క్యాంపులో మైక్రాన్ సంస్థ ఐటీ ఉద్యోగులు 52 మంది పాల్గొన్నారు. అడవిలో టెంట్ ఎలా వేయాలి, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, టెంట్లో విడిది, పక్షుల వీక్షణ, చెట్ల గురించి, సహజ రాతి నిర్మాణాల గురించి వారికి నేచురలిస్ట్‌లు అఖిల్, అపరంజిని, సుమన్ వివరించారు. చెట్లు, వాటి ఉపయోగాల గురించి తెలియజేశారు. ఐటీ ఉద్యోగులు నేచర్ క్యాంపులో ఆసక్తికరంగా పాల్గొన్నారు. క్రికెట్ ఆడుతూ కుప్పకూలి.. గుండెపోటుతో యువకుడి మృతి కీసర: మైదానంలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం రాంపల్లిదాయరలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఎం.ప్రణీత్ (32) కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి రాంపల్లిదాయర సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రణీత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చి గుండెపోటుతో మృతి చెందడంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
చైతన్యపురి: పాత కక్షలతో ఓ యువకు డిని కత్తితో పొడిచి దారుణంగా చంపేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు.. ఓల్డ్ నాగోల్ విలేజ్‌కు చెందిన వంగ మనోజ్ (21) శనివారం అర్ధరాత్రి సమయంలో స్నేహితుడు బందెల వంశీతో కలిసి నాగోల్ ఫ్లైఓవర్ సమీపంలోని ఓ రెస్టారెంట్ ముందు బైక్‌పై కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు. అదే సమయంలో నాగోలు జైపురి కాలనీకి చెందిన సంజయ్ ముగ్గురు స్నేహితులతో కలిసి బైక్‌పై వచ్చి మనోజ్ మెడను గట్టిగా పట్టుకుని వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచాడు. కింద పడిపోయిన మనోజ్‌ను మరో వ్యక్తి పట్టుకోగా పైన కూర్చుని చాకుతో గొంతుకోశాడు. అతని స్నేహితుడు వంశీ అడ్డుకోవటానికి ప్రయత్నించగా అతనిపైనా కత్తితో దాడి చేయటంతో గాయాలయ్యాయి. మనోజ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. రాజీ కుదుర్చుకున్నా.. మనోజ్, సంజయ్‌లు గతంలో స్నేహితులు. ఈ నేపథ్యంలోనే పోయిన ఏడాది ఏప్రిల్ నెలలో వీరి మధ్య గొడవ జరిగింది. సంజయ్‌పై కత్తితో దాడి చేయగా అప్పట్లో మనోజ్‌పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం కొన్ని రోజుల తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. అయినా సంజయ్ పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న మనోజ్‌ను హతమార్చినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతుడి సోదరుడు మధు పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఆర్టీఏ పౌరసేవలకు సాంకేతిక చిక్కులు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ పౌరసేవలు సాంకేతిక చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. సకాలంలో ఓటీపీలు లభించక వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. రవాణా శాఖ అందజేసే అన్ని రకాల పౌరసేవలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. వాటిలో కొన్నింటిని నేరుగా మొబైల్ ఫోన్ నుంచే పొందే సదుపాయం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టీ–ఫొలియో’ మొబైల్ యాప్ ద్వారా ఈ సేవలను పొందొచ్చు. కానీ.. సాంకేతిక సమస్యలతో వాహనదారులకు ప్రత్యక్ష సేవలు లభించడం లేదు. టీ–ఫొలియో ద్వారా 17 సేవలు డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, ఫీజులు, పన్ను చెల్లింపులు, పర్మిట్లు, పర్మిట్ల పునరుద్ధరణ వంటి సుమారు 56 రకాల పౌరసేవలను రవాణాశాఖ 2016లో ఆధునికీకరించింది. పౌరసేవలు పొందేందుకు వాహన వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి తర్వాత కేటాయించిన సమయానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలి. రవాణా కార్యకలాపాలను సరళతరం చేయడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి వీటిలో 17 రకాల పౌరసేవల కోసం వాహనదారులు ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మరింత సులభం చేశారు. ఇంట్లో కూర్చొని నేరుగా మొబైల్ ఫోన్ నుంచే వాటిని పొందేసదుపాయం అందుబాటులో ఉంది. ● లెర్నింగ్ లైసెన్సుల కాల పరిమితి పొడిగింపు, డ్రైవింగ్లైసెన్సుల పునరుద్ధరణ, వాహన రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ, డూప్లికేట్ డాక్యుమెంట్లను తీసుకోవడం, వాహనాలు, లైసెన్సుల చిరునామా బదిలీలు, నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీలు) వంటి 17 రకాల సేవలను మొబైల్ ఫోన్ నుంచే పొందే సదుపాయం ఉంది. ఆర్టీఏ ఆఫీస్‌కు నేరుగా రాలేనివాళ్లు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. గత ప్రభుత్వం అన్ని రకాల పౌరసేవల కోసం ప్రవేశపెట్టిన ‘టి–ఫొలియో’ యాప్‌తో ఈ సేవలను అనసంధానం చేసిన తర్వాతే ఆటంకాలు మొదలయ్యాయి. జాడ లేని ఓటీపీలు సాధారణంగా పౌరసేవను ఎంపిక చేసుకున్న వెంటనే వాహనదారుడి మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత మాత్రమే ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఓటీపీలు లభించకపోవడంతో వినియో గదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్లు డౌన్లోడ్ కాకపోవడం మరో సమస్య. ‘డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్‌లో తరచుగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. టీ–ఫొలియో యాప్‌ను ఈ సేవ కేంద్రాలు నిర్వహించడం వల్లే సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే సాంకేతిక వైఫల్యాలను అధిగమించనున్నట్లు చెప్పారు. ఓటీపీలు అందక పడిగాపులు తరచూ తలెత్తే సమస్యలతో తీవ్ర జాప్యం -
జాబ్ ఫ్రాడ్ కేసులో కేటుగాడి అరెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: జాబ్ పోర్టల్స్, సోషల్ మీడియా, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను సంప్రదించి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న సైబర్ నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన యువతి ఇండీడ్ జాబ్ పోర్టల్‌లో ఉద్యోగానికి రిజిస్టర్ చేసుకుంది. అనంతరం ఆమెకు +91 9318498011, +91 9821176350 నంబర్ల నుంచి సైబర్ నిందితుడు ఫోన్ చేశాడు. తనను రాజత్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు.. ఆరు కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని బాధితురాలిని నమ్మించాడు. ఏదైనా కంపెనీని ఎంచుకోవాలని సూచించి, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3 వేలు చెల్లించాలని కోరాడు. రుసుము చెల్లించింన అనంతరం బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం మరో రూ.10,999 మొత్తాన్ని కోరాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందనీ, నియామక ప్రక్రియ మొదలైన తర్వాత చెల్లించిన మొత్తం తిరిగి ఇస్తామని నమ్మించాడు. మెడికల్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని సూచించాడు. మొత్తం బాధితురాలి నుంచి రూ. 1.49 లక్షలు వసూలు చేశాడు. అనంతరం నకిలీ జాబ్ కన్పర్మేషన్ లెటర్లు పంపించారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. -
సన్న బియ్యం కేంద్రానివే
చేవెళ్ల: పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో రేషన్ లబ్ధిదారుడు చీర మహేందర్ ఇంట్లో శనివారం బీజేపీ నాయకులతో కలిసి సన్న బియ్యంతో వండిన భోజనం తిన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తామే ఇస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎ.అనంత్‌రెడ్డి, యువ నాయకులు డాక్టర్ ఎం.వైభవ్‌రెడ్డి, బీఎస్ఎన్ఎల్ బోర్డు కమిటీ సభ్యుడు సామ మానిక్యరెడ్డి, నాయకులు ఆంజనేయులుగౌడ్, వెంకట్‌రెడ్డి, శర్వలింగం, జయశంకర్ తదితరులు ఉన్నారు. అద్దంకి.. నోరు అదుపులో పెట్టుకో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేఎస్ రత్నం హెచ్చరించారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీనిఉద్దేశించి దయాకర్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు. మంత్రి పదవి కోసం.. దేశ ప్రధానిని విమర్శిస్తే దళితజాతి అంగీకరించబోదని తెలిపారు. ఎవరైనా స్థాయికి తగ్గట్లు మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు.● రాష్ట్ర ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే ● మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం -
సన్న బియ్యం.. స్పందన భేష్
బడంగ్పేట్: బాలాపూర్ మండలంలోని పలు రేషన్ దుకాణాలను హైదరాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారులు శనివారం పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఎలా కొనసాగుతోందని ఆరా తీశారు. కోటా వచ్చిన రెండు రోజుల్లోనే లబ్ధిదారులు అందరూ బియ్యం తీసుకెళ్లడంపై సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని డీలర్లు తెలిపారు. బాలాపూర్‌లోని రేషన్ దుకాణాలతోపాటు బడంగ్‌పేట్‌లోని రేషన్ షాప్ నంబర్– 4, 11, 22లో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని దుకాణాలకు సకాలంలో కోటా అందేలా చూస్తామని సివిల్ సప్లై టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్లు బాల్‌రెడ్డి, కల్యాణి స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ మండల రేషన్ దుకాణాల సంఘం అధ్యక్షుడు టేకుల శశిధర్‌రెడ్డి, డీలర్లు బి.నర్సింహారెడ్డి, భీమిడి నర్సింహారెడ్డి, అవుల పావని పాల్గొన్నారు. -
ఎన్నికల వరకే రాజకీయం
మంచాల: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంచాల మండలంలోని ఆగాపల్లి, కాగజ్‌ఘట్, జాపాల, అస్మత్పూర్ గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ తదితర పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని ఆగాపల్లి– నోముల రోడ్డును రూ.4 కోట్లతో బీటీగా మార్చామన్నారు. ఈ రహదారితో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. మైనార్టీలకు కమ్యూనిటీ హాల్ కోసం రూ.11 లక్షలు, మరో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామన్నారు. కాగజ్ఘట్లో రూ.6 లక్షలతో కబ్రస్తాన్ చుట్టూ ప్రహరీ నిర్మించామని, మరో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మించామని, జాపాలలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు. అస్మత్‌పూర్‌లో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు, మరో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేశామని స్పష్టంచేశారు. మండలంలోని 33 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.13 లక్షలు అందజేశామని వెల్లడించారు. భవిష్యత్‌లో కూడా ప్రజల కోసమే పని చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ఎజెండా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, డైరెక్టర్లు ఎల్లేశ్, పాండు, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, పీఆర్ డీఈఈ అబ్బాస్, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, రాంరెడ్డి, నరేందర్‌రెడ్డి, వాజిద్, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకటేశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పోరాటం గొప్పది.. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ చేసిన పోరాటం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఆగాపల్లి, కాగజ్‌ఘట్, అస్మత్పూర్ గ్రామాల్లో శనివారం జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భూపతిగళ్ల మహిపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో అందరితో కలిసి నడుస్తాం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం -
‘వక్ఫ్’సవరణకు వ్యతిరేకంగా..
పహాడీషరీఫ్: వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా నగరంలోని దారుస్సలాంలో తలపెట్టిన బహిరంగ సభకు జల్పల్లి మున్సిపాలిటీ నుంచి ముస్లింలు శనివారం సాయంత్రం భారీగా తరలివెళ్లారు. ఎంఐఎం పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అహ్మద్ సాదీ పర్యవేక్షణలో మాజీ చైర్మన్ అబ్దుల్లా సాదీ, నాయకులు ఉమర్ బామ్, ఉస్మాన్ షరీఫ్, హసన్ షా తదితరులు వందలాది మంది యువకులతో బయల్దేరారు. ఈ సందర్భంగా అహ్మద్ సాదీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముస్లింలకు సంబంధించిన ఆస్తులను లాక్కొనేందుకే వక్ఫ్ సవరణకు పట్టుబట్టిందన్నారు. ఇటీవల ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. -
లోపాలను సరిచేసేందుకే ‘భూ భారతి’
చేవెళ్ల: ధరణి లోపాలను సరిచేసి, రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుతవం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపల్ పరిధి మల్కాపూర్ సమీపంలోని ఓ కన్వెన్షన్‌లో శనివారం భూభారతిపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్‌తో ఏర్పడిన అనేక సమస్యలను సవరించే వీలుకూడా లేకపోవడంతో పదేళ్లుగా రైతులు అనేక కష్టాలు పడ్డారని తెలిపారు. భూ భారతి చట్టంతో రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భవిష్యత్తులో సమస్యలు అనేవి రాకుండా కొత్త చట్టంలో అనేక అంశాలను పొందుపరిచినట్లు చెప్పారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. భూ భారతతిలో అధికార వికేంద్రీకరణతో మండల, డివిజన్ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. చట్టంపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకుడు వసంతం, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్లు పెంటయ్యగౌడ్, సురేందర్‌రెడ్డి, డీవీఆర్, ప్రతాప్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, చంద్రశేఖర్, తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం శంకర్పల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూ భారతి చట్టం ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం చూపబోతోందని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ శివారులోని ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో శనివారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, మండల ప్రత్యేకాధికారి సురేశ్‌బాబు, ఎంపీడీఓ వెంకయ్య పాల్గొన్నారు. మండలి చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి -
హిందువులపై దాడులు అరికట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడికి నిరసనగా శనివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడం పేరుతో బెంగాల్ మొత్తం హింసాకాండలో కాలిపోతోందని అన్నారు. బెంగాల్లో భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మమత ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నారు. హిందూ ఉనికికి ప్రమాదం వాటిల్లిందని, హిందువులకు భద్రత కల్పించాలన్నారు. బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని, హింసపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోరారు. బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులను గుర్తించి బహిష్కరించాలన్నారు. కార్యక్రమంలో చింతల వెంకన్న, శ్రీనివాస్, రాజు, రాఘవేందర్, మహేశ్, విక్రం, సురేష్, రాజు పాల్గొన్నారు. అధికారుల సమన్వయం భేష్ యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్‌లో అధికారుల సమన్వయం బాగుందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. నానక్‌నగర్‌లో శనివారం ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న రెవెన్యూ, పోలీస్, టీజీ ఐఐసీ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులతో మర్యాదగా ఉందాం.. వారి సమస్యలు తెలుసుకుందాం, న్యాయం చేద్దాం.. ఇదే మాదిరిగా ఐక్యతతో ఉండి టార్గెట్ పూర్తి చేద్దామని పేర్కొన్నారు. రైతుల నుంచి ఏ ఇబ్బందులు వచ్చినా క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే సీఐ, తహసీల్దార్, ఆర్డీఓ, ఏసీపీల దృష్టికి తేవాలన్నారు. వేసవి తీవ్రతలో సర్వే, ఫెన్సింగ్ పనుల్లో నిమగ్నమవుతున్న సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని టీజీఐఐసీ అధికారులకు ఆమె సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రైతులతో మాట్లాడుతూ.. ఫూచర్సిటీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు,యాచారం తహసీల్దార్ అయ్యప్ప, టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండి ఇబ్రహీంపట్నం రూరల్: ఫార్మాలో పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఫార్మాతో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ ఆధ్వర్యంలో శనివారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డిని ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ.. ఫార్మాసిటీ పేరుతో 10,200 ఎకరాల అసైన్డ్ భూములు, 9,133 ఎకరాల పట్టా భూములు తీసుకున్నారని తెలిపారు. వెంటనే రైతులకు రుణమాఫీ, రైతుబీమా చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు 121 గజాలకు బదులు 500 గజాల ప్లాట్లు ఇవ్వాలన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కందుకూరు మండల కార్యదర్శి బుట్టి బాలరాజు, నాయకులు మల్లేష్, పౌలు, గడ్డం యాదగిరి, రాములు, సంజీవ, గోవర్ధన్ పాల్గొన్నారు. నేటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరణ సాక్షి, సిటీబ్యూరో: వివిధ మార్గాల్లో నిలిపివేసిన 26 ఎంఎంటీఎస్ సర్వీసులను ఈ నెల 20 నుంచి పునరుద్ధరించనున్నట్లు శనివారం దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు లింగంపల్లి–ఫలక్‌నుమా, ఫలక్‌నుమా–నాంపల్లి, ఫలక్‌నుమా–మేడ్చల్, ఫలక్‌నుమా–ఉందానగర్, నాంపల్లి–మేడ్చల్, సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఏర్పాటు చేసి 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పుర్కరించుకుని శనివారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్‌సెంటర్‌లో యూత్ లీడర్స్ కాంక్లేవ్ ఫర్ బెటర్ ఎర్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో పర్యావరణానికి సంబంధించి సరైన పాఠ్య ప్రణాళికను తయారు చేసి సిలబస్‌లో ప్రవేశపెడతామన్నారు. విద్యార్థులు నవతర పర్యావరణ పరిరక్షకులని, పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు. సమాజ శ్రేయస్సు, పుడమి తల్లి సేవకు సీజీఆర్ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సిటీ ఒక నాలెడ్జ్ హబ్ కావాలని, పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే, మన విద్యార్థులు పర్యావరణాన్ని గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. మన సహజ సంపదను మనం కాపాడుకోవాలని సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టి పర్యావరణ రక్షణకు నడుం బిగించాలన్నారు. పాలసీ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక శక్తిగా మారి, పర్యావరణ రక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ నవీన్‌రావు, డాక్టర్ జగన్, డాక్టర్ వసంతలక్ష్మి, వెంకటేశ్, సీజీఆర్ సిబ్బంది ఉన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
ఫీడర్!
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఇంటర్నెట్, టీవీ కేబుళ్లు విద్యుత్ తీగల పాలిట శాపంగా మారుతున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఎప్పుడు.. ఎక్కడ.. ఏ చెట్టుకొమ్మ విరిగి మీద పడుతుందో.. ఏ వైపు నుంచి ఫ్లెక్సీ/బ్యానర్ గాలికి ఎగిరివచ్చి పడుతుందో.. ఏ హోర్డింగ్ విరిగి పడుతుందో.. తెలియని పరిస్థితి. ఫలితంగా 33/11 కేవీ ఓవర్‌హెడ్ లైన్లు తెగిపడుతుండటంతో పాటు విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. లైన్లపై పడిన చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల తొలగింపు ఆపరేషన్/ సెంట్రల్ బ్రెక్డౌన్(సీబీడీ)/డీఆర్ఎఫ్ బృందాలకు పెద్ద సవాల్‌గా మారింది. ఈదురు గాలులతో బెంబేలు.. వరుస ఈదురు గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈనెల 3న భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి నగరంలో 57 విద్యుత్ స్తంభాలు సహా 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 449 ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిచిపోయింది. తాజాగా శుక్రవారం ఈదురుగాలితో కూడిన వర్షానికి గ్రేటర్లో మొత్తం 359 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లోని చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడ్డాయి. భారీ ఈదురు గాలులు వీస్తుండటం, తరచూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటం, ఫీడర్లు ట్రిప్పై సరఫరాలో అంతరాయాలు తలెత్తుతుండటం సంస్థకు, సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ● జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సిబ్బంది ఎప్పటికప్పుడు రోడ్లకు ఇరువైపులా వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు తొలగిస్తున్నప్పటికీ.. మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తుండటం, సాయంత్రం ఈదురుగాలితో కూడిన వర్షానికి ఎగిరి లైన్లపై చిక్కుకుంటుండటం, అత్యవసర పరిస్థితుల్లో వాటిని తొలగించాల్సి వస్తుండటం డిస్కం సిబ్బందికి సవాల్‌గా మారింది. ఈ పనుల కోసం డిస్కం భారీగా ఖర్చు చేస్తోంది. విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్న సిబ్బంది న్యూస్రీల్చినుకు వేళ తీగల వణుకు తరచూ షార్ట్ సర్క్యూట్లు ట్రిప్పవుతున్న ఫీడర్లు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం గంటల తరబడి పునరుద్ధరణ పనులు అంధకారంలో పలు కాలనీలు క్షేత్రస్థాయిలోనే సీఎండీ, సిబ్బంది ప్రస్తుత సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ప్రతి రోజూ ఉదయం అన్ని విభాగాల డైరెక్టర్లు, సీజీఎంలు, ఎస్ఈలు సహా డీఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రోజువారీ ప్రగతిని సమీక్షిస్తున్నారు. సర్కిళ్ల వారీగా బిల్లింగ్ నమోదు, రెవెన్యూ వసూళ్లతో పాటు కొత్త కనెక్షన్ల జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విపత్తుల సమయంలో స్వయంగా ఆయనే ఫీల్డ్‌లోకి వెళ్తున్నారు. దగ్గరుండి పునరుద్ధరణ పనులను సమీక్షిస్తున్నారు. ఫలితంగా అంతరాయాల సంఖ్య కొంత తగ్గు ముఖం పట్టడం శుభపరిణామం. -
మహిళల కోసం ప్రోత్సాహకాలు
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత అన్నారు. జిల్లా స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ర్యాంప్ ప్రోగ్రాం గురించి శనివారం కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీహబ్‌తో జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీస్ ఆఫ్ ఎంస్ఎంఈ నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమం మహిళలకు ఎంతో మద్దతుగా నిలుస్తుందన్నారు. రెండేళ్ల పాటు కొనసాగుతున్న ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న మహిళా పారిశ్రామికవేత్తలు బిజినెస్ అభివృద్ధిని వేగవంతం చేసుకొని తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఇందులో భాగంగా టెక్స్టైల్స్, ఫుడ్ మాన్యుఫాక్షరింగ్, హస్తకళల వంటి రంగాల్లోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డైవర్సీఫికేషన్, బ్రాండింగ్, మార్కెట్ యాక్సెస్, క్రెడిట్లింకేజ్, ఎక్స్పర్ట్ మెంటరింగ్ మద్దతు అందనుందని తెలిపారు. అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో వీహబ్ డైరెక్టర్ అక్తర్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఉహా సజ్జ, డీపీఎంలు, ఏపీఎంలు, స్వయం సహాయ సంఘాల మహిళలు పాల్గొన్నారు. యూనిఫామ్ త్వరగా అందించేలా చూడాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ త్వరితగతిన అందించేలా చూడాలని డీఆర్డీఓ శ్రీలత ఏపీఎంలు, సీసీలను ఆదేశించారు. విద్యార్థులకు సరైన కొలతలు తీసుకోవాలని తెలిపారు. క్లాత్ వచ్చిన తరువాత ఏవిధంగా కటింగ్ చేయాలో కొలతల ప్రకారం కుట్టేలా చూడాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత -
సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులపై ఆయన వివరణాత్మక సమీక్ష నిర్వహించారు. రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన సమీక్షించారు. స్టేషన్ బుకింగ్, పార్కింగ్, సర్క్యులేటింగ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పునరాభివృద్ధి పనులను అత్యున్నత ప్రమాణాలతో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తూ కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కాలనీలకు ‘దారి’ చూపిన హైడ్రా
తుర్కయంజాల్: ‘హైడ్రా’ చొరవ పలు కాలనీలకు ‘దారి’ చూపింది. తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి కమ్మగూడలోని సర్వే నంబర్లు 213, 214, ఇంజాపూర్ రెవెన్యూ సర్వే నంబర్ 131లో 2.24 ఎకరాల భూమి తమదని, కోర్టు తీర్పు అనుకూలంగా ఉందని, ఎవరూ దీంట్లోకి ప్రవేశించడానికి వీలు లేదంటూ 2023 నవంబర్‌లో వైజయంతి మాల, గోవింద్ దాస్, అమ్రీష్ వీరన్ అనే ముగ్గురు ప్రీకాస్ట్ వాల్ ఏర్పాటు చేశారు. ఈ భూమిని 1974లోనే ఏషియన్ హౌసింగ్ కార్పొరేషన్ వెంచర్ ఏర్పాటు చేయగా అనేక మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్రీకాస్ట్ ఏర్పాటు చేయడం, ప్లాట్లలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో చేసేదే లేక బాధితులు కోర్టును ఆశ్రయించారు. పలుమార్లు మున్సిపల్ కార్యాలయం, ప్లాట్ల వద్ద ఆందోళనకు దిగడంతో పాటు పలువురు అధికారులను కలిశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇటీవల ప్లాట్ల యజమానులు, స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు శనివారం రెండు జేసీబీలు, బందోబస్తుతో అక్కడికి చేరుకుని ప్లాట్ల చుట్టూ ఉన్న ప్రీకాస్ట్ను, రోడ్లకు ఉన్న అడ్డంకులను తొలగించారు. దీంతో శ్రీరంగాపురం, సాయినాథ్ కాలనీ, అపిల్ అవెన్యూ, ఇందిరమ్మ కాలనీ, సుందరయ్య కాలనీ, శ్రీశ్రీ నివాస్ కాలనీలకు వెళ్లే రోడ్డు మార్గం కొన్ని నెలల విరామం తర్వాత సుగమమైంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు -
సర్కారు బడుల్లో సౌకర్యాల సర్వే
కేశంపేట: సర్కారు బడుల్లో సౌకర్యాల కల్పనకు చేపట్టిన సర్వే జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన సర్వే 21వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యూడైస్ ప్లస్ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)లో నమోదు చేస్తారు. ఈ సమాచారంతోనే పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు కావాల్సిన ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయిస్తుంది. యూడైస్ ప్లస్‌లో ప్రధానోపాధ్యాయులు ఇస్తున్న సమాచారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూడైస్ ప్లస్‌లో ఇచ్చిన సమాచారంపై విద్యాశాఖ థర్డ్‌పార్టీతో సర్వే నిర్వహిస్తోంది. సర్వేలో డైట్ కళశాల విద్యార్థులు జిల్లాలోని 27 మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కేజీబీవీ, గురుకుల, మోడల్ పాఠశాలలు కలిపి మొత్తం 1,244 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో యూడైస్ ప్లస్‌పై సర్వే నిర్వహించేందుకు వికారాబాద్‌లోని డైట్ కళాశాల విద్యార్థులతో పాటు ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రజ్ఞ డైట్ కళాశాల విద్యార్థులు 96 మంది సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కో విద్యార్థికి పది పాఠశాలల చొప్పున్న జిల్లా కార్యాలయం నుంచి లిస్టు అందిస్తున్నారు. యూడైస్‌లో హెచ్ఎంల నమోదు.. యూడైస్ ప్లస్‌లో టాయిలెట్స్ వివరాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, మధ్యాహ్న భోజన వివరాలు, విద్యార్థుల ఆధార్ అనుసంధానం, స్కూల్ యూనిఫాంల పంపిణీ, పాఠ్యాపుస్తకాల పంపిణీ లాంటి వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే పాఠశాల ఆవరణలో క్రీడాస్థలం ఉందా లేదా, తరగతి గదుల సంఖ్య, ల్యాబ్, ఫర్నిచర్ వివరాలు సైతం ఇప్పటికే నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయులు యూడైస్ ప్లస్‌లో నమోదు చేసిన వివరాలపై ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. సర్వే చేస్తున్న విద్యార్థులు విద్యార్థులు లిస్టు ప్రకారం తమకు కేటాయించిన పాఠశాలల్లో సర్వే చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. లిస్టును రెండు కాపీలు చేసి ఒకటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, మరొకటి డైట్ కళాశాలలో అందించనున్నారు. ఈ 21లోగా సర్వే పూర్తి చేసి వివరాలు డైట్ కళాశాలలో అందించాల్సి ఉంటుంది. డైట్ కళాశాలలో అందించిన లిస్టును కళాశాల సిబ్బంది ఈ నెల 22న డీఈఓ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే యూడైస్‌ప్లస్‌లో వివరాలు నమోదు చేసిన ప్రధానోపాధ్యాయులు వాస్తవాలపై థర్డ్‌పార్టీతో విద్యాశాఖ సర్వే జిల్లాలో 1,244 ప్రభుత్వ పాఠశాలలు సర్వేలో పాలుపంచుకుంటున్న 96 మంది విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం సర్వేకు సహకరిస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా అధికారుల సూచనలతో యూడైస్ ప్లస్‌లో ఇచ్చి న వివరాలపై సర్వే కొనసాగుతోంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన లిస్టు ప్రకారం ఆయా పాఠశాలలకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఇస్తూ సర్వేకు సహకరిస్తున్నాం. – మఠం చంద్రశేఖర్, ఎంఈఓ, కేశంపేట -
అత్తతో గొడవపడి వెళ్లిపోయిన కోడలు
కేశంపేట: ఇంట్లో అత్తతో గొడవ పడిన కోడలు ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన కూడళ్ల బాలమణికి నలుగురు సంతానం. అందులో రెండో కూతురు స్పందనను ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన బట్టు సురేష్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. భార్యాభర్తలు వేములనర్వ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యులుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం అత్తాకోడళ్లు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన స్పందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం భర్త సురేష్ వెతకగా లభ్యం కాలేదు. దీంతో స్పందన తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. -
మన ఎయిర్‌పోర్టుకు మరో ఘనత
‘ఆర్జీఐఏ’కు లెవెల్ 5 కార్బన్ అక్రిడిటేషన్ గుర్తింపు శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సంస్థ నిర్వహణలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ప్రఖ్యాత గుర్తింపు దక్కింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆసియా పసిఫిక్, మధ్య తూర్పు దేశాల్లో నాలుగు విమానాశ్రయాల్లో కార్బన్ అక్రిడిటేషన్ గుర్తింపు పొందిన నాలుగు విమానాశ్రయాల్లో ఆర్జీఐఏ ఒకటి అన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపును జీరో స్థాయికి తీసుకురావడంతో ఆర్జీఐఏ చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించిందని జీఎంఆర్ ఎయిర్‌పోర్టుల ఈడీ, చీఫ్ ఇన్నోవేషన్ అధికారి ఎస్జీకే కిశోర్ తెలిపారు. పర్యావరణహిత చర్యలు, సోలార్ ఎనర్జీ, ఎల్ఈడీల నిర్వహణ తదితర అంశాల్లో వివిధ భాగస్వాముల సహకారంతో ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు. -
ఇంటి దొంగలు!
డీసీఎంఎస్‌లో రూ.11.45 కోట్లకు టెక్నికల్ రైటాఫ్ అంటూ ప్రచారం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటి దొంగల వ్యవహారంతో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా రైతుల ముసుగులో కొంత మంది డీసీఎంఎస్ ఉద్యోగులు, పాలకవర్గం సభ్యులు బినామీ పేర్లతో జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీకి చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏకంగా జిల్లా సొసైటీ అధికారికి తెలియకుండానే మొండి బకాయిలకు టెక్నికల్ రైటాఫ్ పెట్టడం.. పాలకవర్గం దాన్ని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్లలో బకాయిలు దశాబ్దాల కాలంగా డీసీఎంఎస్‌ల నుంచి రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నారు. వరి, కందులు తదితర పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విత్తనాలు, ఎరువులు అరువుగా తీసుకెళ్లిన రైతులు తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేయడం, బకాయిలను వసూలు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో బకాయిలు పెరిగి రూ.కోట్లకు చేరాయి. కొన్ని డీసీఎంఎస్ కేంద్రాలు ఏటా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల తదితర డీసీఎంస్ల్లో సిబ్బంది, పాలకవర్గం సభ్యులు రైతుల ముసుగులో రూ.కోట్లలో దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కందుల సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణల రావడంతో విచారణ చేపట్టి, కొంత మందిపై కేసులు సైతం నమోదు చేశారు. ఆయా మొత్తాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేశారు. ప్రస్తుతం రైతుల ముసుగులో ఉన్న బినామీల నుంచి పెద్ద మొత్తంలో మొండి బకాయిలను వసూలు చేయడంలో డీసీఎంఎస్ సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది. గతంలో కొడంగల్ కందుల కేసులో విచారణ ఎదుర్కొన్న వ్యక్తుల పాత్ర ఇందులో ఉందని సమాచారం. ఒక సీజన్లో ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లిన వ్యక్తి డబ్బులు చెల్లించకపోతే రెండో సీజన్లో మళ్లీ అదే వ్యక్తికి అరువు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా రూ.11 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. డీసీఎంఎస్‌కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్‌కు కందులు అమ్మినప్పుడు తరుగు కింద పట్టుకున్న సొమ్ము సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని, దాన్ని ఇన్చార్జిల నుంచి వసూలు చేయాల్సి ఉండగా టెక్నికల్ రైటాఫ్ పెట్టామని, పాలకవర్గం దీన్ని ఆమోదించిందని తెలిపారు. ఇదిలా ఉంటే సిబ్బంది నియామకంలోనూ అర్హులైన వారు ఉండగా, తమకు అనుకూలమైన వారైన జూనియర్లను కీలక పదవుల్లో కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తోంది. అనుమతి లేదన్న డీసీఓ సొమ్ము వసూళ్లలో నిర్లక్ష్యంవిచారణ చేపడతాం.. మొండి బకాయిల విషయంలో టెక్నికల్ రైటాఫ్ పెట్టాలంటే మేము అనుమతి ఇవ్వాలి. మా దగ్గర నుంచి అలాంటి అనుమతులు ఎవ్వరికీ ఇవ్వలేదు. వాళ్లకు వాళ్లు టెక్నికల్ రైటాఫ్ పెట్టుకుంటామంటే అది చెల్లదు. విచారణ చేపట్టి అలా చేస్తే సంబంధిత సభ్యుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తాం. – సుధాకర్, జిల్లా సహకార అధికారి, రంగారెడ్డి -
‘భరోసా’ కొందరికే..!
చేవెళ్ల: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ‘భరోసా’ పై స్పష్టత కరువైంది. అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రెండువిడతల్లో రూ.12వేల చొప్పున రైతు భరోసా సొమ్ము నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందించలేకపోతోంది. భరోసా వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. మార్చి 31వ తేదీ వరకు అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో అందిస్తామని ప్రకటించినప్పటికీ 31 దాటిపోయినా పూర్థిసాయిలో డబ్బులు జమ కాలేదు. చేవెళ్ల డివిజన్లోని ఐదు మండలాలకు సంబంధించి మొత్తం 73,729 మంది రైతులు ఉండగా 58,082 మందికి సుమారు రూ.42 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. వీరిలో ఎంత మందికి ఎన్ని ఎకరాలకు అనే స్పష్టత లేదు. దాదాపు నాలుగు ఎకరాల లోపు రైతులకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 7,51,441 ఎకరాలు ఉండగా ఇందులో 50,119 ఎకరాలు సాగుకు యోగ్యంగా లేని భూములుగా 7,01,322 ఎకరాలు సాగు భూములుగా గుర్తించారు. విడతల వారీగా విడుదల చేసిన వారికి కూడా పూర్తిస్థాయిలో భరోసా సొమ్ము అందడం లేదు. తప్పుల తడక జాబితాతో.. భూ సమస్యలు, సాగుయోగ్యం కాని భూముల లెక్కల తేడాలతో జిల్లాలో చాలామంది అర్హులైన రైతులు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు జమ కావడం లేదు. ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతులకు సైతం సాయం అందక బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఒక సర్వే నంబర్లో భూమి ఉన్నదాని కంటే రికార్డుల్లో ఎక్కువగా(ఆర్ఎస్ఆర్) ఉంటే ఆ సర్వే నంబర్ మొత్తం నిలిచిపోయింది. ప్లాట్లు, వెంచర్లు, ఫాంలాండ్స్గా గుర్తించిన వాటితో పాటు రైతుల భూములు కూడా తప్పుగా పడడంతో వాటికి ఆగిపోయాయి. వ్యవసాయాధికారులు రికార్డు చేసే సాగుభూముల రికార్డుల్లో సాగు చేస్తున్నట్లుగా నమోదు చేయని భూములకు సైతం రైతు భరోసా రావడం లేదు. రికార్డులు తప్పులతడకగా ఉన్నాయని, దీంతో తాము పథకానికి నోచుకోలేకపోతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులందరికీ రైతుభరోసా అందించాలని కోరుతున్నారు. అందరికీ అందని ‘రైతు భరోసా’ పూర్తిస్థాయిలో జమకాని డబ్బులు ఎదురుచూస్తున్న అన్నదాతలు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు రాలేదో ఏమో.. నాది మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామం. చేవెళ్ల మండలం మల్కా పూర్లో 18 ఏళ్ల కిత్రం 1.4 ఎకరాలు కొన్నాను. వర్షా ధార పంటలు వేస్తున్నాను. నాకు రైతు భరోసా డబ్బులు రాలేదు. ఎందుకు రాలేదో తెలియడం లేదు. అధికారులను అడిగితే ప్రాసెస్‌లో ఉంది వస్తుంది అని చెబుతున్నారు. – కనకమామిడి జంగయ్య, రైతు విడతల వారీగా జమ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడతల వారీగా వేస్తోంది. ఎన్ని ఎకరాలు, ఎలా అనేది ప్రభుత్వ నిర్ణయం. మాకు కూడా ఎలాంటి సమాచారం లేదు. డివిజన్లో ఎంత మందికి వస్తున్నాయి అనేది ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా కారణం చేత రాని రైతులు వచ్చి అడిగితే పరిశీలించి చెబుతున్నాం. – సురేష్, ఏడీఏ, చేవెళ్ల -
పంట మార్పిడి విధానం మేలు
చేవెళ్ల: రైతులు వ్యవసాయంలో పంట మార్పిడి విధానాలను పాటిస్తే అధిక దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చని మోజర్ల కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కందవాడలో శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటలో భాగంగా పంటలను వారు పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న పొలాలు పరిశీలించి అవలంబించే పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని రైతులతో సమావేశమై సాగుపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. వ్యవసాయ రంగంలో నూతనంగా వస్తున్న విధానాల గురించి వివరించారు. ఒకే రకం పంటల సాగు చేయటంతో పంటల దిగుబడులు తగ్గటంతోపాటు చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పంట మార్పిడిలతో రైతులకు మేలు జరుగుతుందని సూచించారు. సాగు పద్ధతులను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు స్వాతి, ప్రీతి, అఖిల, లావణ్య, గ్రామ రైతులు ఉన్నారు. కందవాడలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థుల పర్యటన -
ఉమ్మడి ఆవిష్కరణలకు ఒప్పందం
శంకర్పల్లి: భారతదేశ భద్రత, నైపుణ్య అభివృద్ధి పెంపొందించేందుకు ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీ సంస్థలు ఉమ్మడిగా ఆవిష్కరణలు చేసేందుకుగాను ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఇక్ఫాయ్ వైస్ చాన్స్‌లర్ ఎల్ఎస్ గణేశ్, బిట్స్ పిలానీ వైస్ చాన్స్‌లర్ రాంగోపాల్‌రావు ఎంఓయూపై సంతకాలు చేసి, ఫైళ్లు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులలో నైపుణ్యాలను వెలికితీసేందుకు గాను సంస్థలు చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం ఇరు సంస్థల వైస్ చాన్స్లర్లు మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థల్లోని విద్యార్థులు ఉమ్మడిగా ఆవిష్కరణలు చేయవచ్చని స్పష్టం చేశారు. దీంతో సమయంతో పాటు, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిట్స్ పిలానీ ప్రొఫెసర్లు సౌమ్యా ముఖర్జీ, సీఆర్‌ఈఎన్‌ఎస్ అధిపతి ప్రొ.రాంమనోహర్బాబు, ఇక్ఫాయ్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ప్రొఫెసర్లు సీఎస్ శైలజన్ తదితరులు పాల్గొన్నారు.సంతకాలు చేసుకున్న ఇక్ఫాయ్, బిట్స్ పిలానీ వైస్ చాన్స్లర్లు -
గోతుల దారి.. విమానం చేజారి
తరచూ దెబ్బతింటున్న ఎర్రకుంట రహదారి ● స్తంభించిపోతున్న ట్రాఫిక్ ● సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోతున్న ప్రయాణికులు పహాడీషరీఫ్: అది హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి.. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రూట్ కావడంతో ఈ రహదారిలో నిత్యం వేల సంఖ్యలో వాహనా లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంత ప్రధానమైన రోడ్డుపై జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ గోతులు పడ్డాయి. దీంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్‌తో విమానాశ్రయానికి వెళ్లే వాహనదారులు విమానాలను అందుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌లు సైతం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుంటుండడంతో రోగుల బంధువులు ఆర్తనాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రమాదాలు జరిగినా స్పందన కరువు ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మర్రి చెట్టు వరకు రోడ్డు తరచూ పాడవుతుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. రెండేళ్ల క్రితం ఎర్రకుంట చౌరస్తాలో రోడ్డుపై మురుగు నీరు పారి గోతులమయంగా మారింది. ఈ గుంతలో కొంద రు నిర్మాణ వ్యర్థాలు పోయడంతో రోడ్డు ఎగుడు దిగుడుగా మారి పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఐదారుగురు వ్యక్తులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడాల్సి వచ్చింది. చివరకు మున్సిపాలిటీ తరఫున రూ.6 లక్షలు వెచ్చి ంచి ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడంతో కొన్నాళ్ల పాటు వాహనదారులకు ఉపశమనం కలిగింది. మళ్లీ తాజాగా ఎర్రకుంట పెట్రోల్ పంప్ ప్రాంతంలో కూడా ఎగువ బస్తీల మురుగునీరు రోడ్డుపై పారడంతో రోడ్డు గుంతలమయంగా మారింది. మురుగు నీరు పారడంతో.. శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న తుక్కుగూడ, కందుకూర్, కడ్తాల్ లాంటి పట్టణాలలో విశాలమైన రహదారితో పాటు రోడ్డు మధ్యలో డివైడర్, వర్షం వచ్చిన సమయంలో నీరు సాఫీగా వెళ్లేలా ఇరువైపులా కచ్చామోరీలను నిర్మించారు. జల్పల్లి మున్సిపాలిటీలోని ఈ రహదారిపై మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చాంద్రాయణగుట్ట సరిహద్దు దాటిన అనంతరం ఎర్రకుంట నుంచి మొదలుకొని పహాడీషరీఫ్ వరకు రహదారికి ఇరువైపులా కచ్చామోరీలు లేవు. కేవలం యూటర్న్లు మినహాయిస్తే పాదచారులు కూడా మధ్యలో రోడ్డు దాటకుండా ఇనుప కంచెలను నిర్మించ లేదు. సెంట్రల్ లైటింగ్ సిస్టం కూడా అసంపూర్తిగానే ఉంది. షాహిన్‌నగర్ హైవే హోటల్ పరిసరాలలో మురుగునీరు ఏడాది పొడవునా రోడ్డుపైనే పారడం అలవాటుగా మారిపోయింది. రోడ్లపై మరమ్మతులు కూడా చేయకుండా అటు ఆర్అండ్బీ అధికారులు పెట్టిన నిబంధనలతో స్థానిక మున్సిపాలిటీ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. రోడ్డుపై అడ్డంకులు ఉండొద్దు ఎర్రకుంట నుంచి పహాడీషరీఫ్ వరకు రహదారిపై అడ్డంకులు లేకుండా ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకోవాలి. ఈ రోడ్డు దుస్థితి చూసి చాలా మంది ప్రత్యామ్నాయంగా ఆర్సీఐ, బాలాపూర్ రూట్లో వెళుతున్నారు. ఎర్రకుంటలో కిలోమీటర్ మేర డివైడర్ లేకపోవడంతో స్థానిక వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ వాహనాల మధ్యలో యూటర్న్లు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. – సయ్యద్ ఫెరోజ్, షాహిన్‌నగర్ -
కురుమలు అన్ని రంగాల్లో ఎదగాలి
చేవెళ్ల: కురుమలు ఐకమత్యంతో అన్ని రంగాల్లో ఎదగాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఆకాంక్షించారు. మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సంఘం నూతన భవనాన్ని శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు అందించే రుణాలను కురుమలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పారు. కుల వృత్తితోపాటు ఇతర ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కురుమలు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో రాణించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం, రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. కురుమల ఐక్యతనుచాటే విధంగా అన్ని గ్రామాల్లో సంఘాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కురుమ సంఘం నాయకుడు, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పనాగేశ్, పలు పార్టీల నాయకులు, కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్–శ్రీశైలం రహదారిని విస్తరించాలి
ఆమనగల్లు: హైదరాబాద్–శ్రీశైలం రహదారిని విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆచారి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్‌తో వెళ్లి కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిందని, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. వాహనాల రద్దీకి అనుగుణంగా ఉండేలా రహదారని నాలుగు లేన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. జూ పార్కులో రైనో ఫుడ్ కోర్టు ప్రారంభం చార్మినార్: నగరంలోని జంతు ప్రదర్శన శాలకు వచ్చే సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అన్ని రకాల సేవలను అభివృద్ది చేస్తున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు. జూ పార్కులో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫుడ్ కోర్టును అటవీశాఖ అందుబాటులోకి తెచ్చింది. రైనో పేరుతో ఫుడ్ కోర్టు ప్రారంభమైంది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్ కొత్త క్యాంటీన్ సేవలను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు, జూ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరేమత్, క్యూరేటర్ వసంత పాల్గొన్నారు. పుప్పాలగూడలో హిట్ అండ్ రన్ స్విగ్గీ డెలివరీ బాయ్ దుర్మరణం మణికొండ: కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువకుడు వేసవి సెలవుల్లో స్విగ్గీబాయ్గా చేరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి లోని పుప్పాలగూడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసుల కథనంప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన కుతాడి జీవన్ కుమార్ (21) కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. వేసవి సెలవులు ఉండటంతో నగరానికి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేరాడు. తన తండ్రికి ఇటీవల గుండె ఆపరేషన్ కావటం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో నగరానికి వచ్చి పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పుప్పాలగూడ ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ సమీపంలో జీవన్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కింద పడిన అతడిపై నుంచి వెనకగా వచ్చిన టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, టిప్పర్ల డ్రైవర్లు పరారయ్యారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నెలాఖరులోగా టెన్త్ ఫలితాలు
ముగిసిన పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. మార్కుల జాబితాను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో 1,100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల జవాబు పత్రాలను దిద్ది రికార్డు సృష్టించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వలేదని ఆ శాఖ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కుల జాబితాను ఆన్లైన్లో పొందుపరిచే ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు గురువారంతో ముగిశాయి. శనివారం నుంచి ఆయా పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అయితే ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు మాత్రం ఈ నెల 24 వరకు హాజరు కానున్నారు. ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు పదోన్నతి ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న ఎన్.బాలకృష్ణకు పదోన్నతి లభించింది. రాష్ట్రంలోని పలువురు కమిషనర్లను గ్రేడ్–2 ఉద్యోగులుగా గుర్తించిన ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు సైతం ప్రమోషన్ దక్కింది. పదోన్నతి రావడంతో గ్రూప్–1 అధికారి హోదాకి చేరుకోవడం జరిగిందని.. ఈ హోదా తన బాధ్యతను మరింత పెంచిందని బాలకృష్ణ తెలిపారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు ఆమనగల్లు: ఎరువుల డీలర్లు, ఫర్టిలైజర్ షాపుల డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్లు, బిల్ బుక్స్, స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సీజన్‌కు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆయా మండలాలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందుగా తెచ్చుకోవాలని, సీజన్ ప్రారంభం నాటికి విక్రయానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. స్టాక్ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. సామాజిక తనిఖీలు పక్కాగా జరగాలి యాచారం: ఈజీఎస్ సామాజిక తనిఖీల కార్య క్రమం పక్కాగా జరగాలని జిల్లా విజిలెన్స్ అధికారి కొండయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏడాది పాటు జరిగిన ఉపాధి పనులకు సంబంధించి తనిఖీల సిబ్బందికి రికార్డులు అందజేయాలని సూచించారు. కూలీలతో కలిసి పనులు చూపించాలని, పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈజీఎస్ అధికారులు రికార్డులు అందజేస్తే త్వరలో తనిఖీల సిబ్బంది గ్రామాలకు వచ్చి గ్రామ సభలు నిర్వహిస్తారని తెలిపారు. సర్వే పక్కగా ఉండాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు పౌష్టికాహారం అందించండి
తుక్కుగూడ: ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే చిన్నారులకు ప్రభుత్వాలు పంపిణీ చేసే పౌష్టికాహారం అందించాలని కేంద్ర మహిళ సంక్షేమ శాఖ జాయింట్ సెకట్రరీలు డాక్టర్ ప్రీతం, యశ్వంత్ అన్నారు. పురపాలక కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారుల వ్యక్తిగత వివరాలు, అందుతున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డు లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆట పాటలతో చిత్రాలను ఉపయోగించి చిన్నారులకు బోధన చేయాలని, పిల్లల మేధో వికాసం పెంపొదించే విధంగా బోధన ఉండాల న్నారు. వారి మానసిక, శారీరక ఎదుగుదలను ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్రావు, సీడీపీఓలు శాంతిశ్రీ, షబానా పాల్గొన్నారు. -
రసాభాసగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కందుకూరు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ రసా భాసగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. మండల పరిషత్ సమావేశ హాల్లో గురువారం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ నెరవేర్చాలని, అప్పటి వరకు లబ్ధిదారులు బాకీగానే భావించాలని అన్నారు. అంతలోనే కేసీఆర్ హయాంలో దళితు లకు ఇస్తామని చెప్పిన మూడెకరాల భూమి ఎందుకివ్వలేదని మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ క్రమంలో తోపులాట, గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సబితారెడ్డి జోక్యం చేసుకుని అందరినీ శాంతింపజేసి బయటికి పంపించారు. అనంతరం చెక్కుల పంపిణీ పూర్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, ఎంపీడీఓ సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, డైరెక్టర్లు పి.పాండు, యుగంధర్‌గౌడ్, సురేందర్, ఆనంద్, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రశాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట సర్దిచెప్పి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సబితారెడ్డి -
ప్రాణం తీసిన విద్యుత్ తీగలు
కొందుర్గు: విద్యుత్ తీగలు ఓ యువకుడి పాలిట యమపాశాలయ్యాయి. పొలంలో తెగిపడిన తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మండలంలోని చిన్నఎల్కిచర్ల శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామానికి చెందిన చింతకుంట లక్ష్మమ్మ, రవీందర్ రెడ్డి దంపతులు వ్యవసాయంతోపాటు ఆవుల వ్యాపారం నిర్వహిస్తారు. 15 ఏళ్ల క్రితం కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. చిన్నఎల్కిచర్ల శివారులో అఖిల్ రెడ్డి అనే వ్యక్తి పొలాన్ని కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం గాలివానకు పొలం పక్కనే ఓ విద్యుత్ స్తంభం విరిగి తీగలు తెగిపడ్డాయి. గురువారం రవీందర్ రెడ్డి కుమారుడు అశోక్ రెడ్డి (35) పొరపాటున అటు వైపు వెళ్లడంతో తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అక్షయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన.. మూడు రోజుల క్రితం స్తంభం విరిగిపోయి తీగలు తెగిపడినా మరమ్మతులు చేయకపోవడంతోనే నిండు ప్రాణం పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అశోక్ రెడ్డి మృతదేహాన్ని చిన్నఎల్కిచర్ల సబ్‌స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం తోనే అశోక్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలస్వామి, షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య, ఏసీపీ రంగస్వామి అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించినా ఫలితం దక్కలేదు. సాయం ప్రకటనతో ఆందోళన విరమణ గాలివానకు చాలా గ్రామాల్లో కరెంటు స్తంభాలు విరిగిపోయాయని అన్నీ సరిచేసుకుంటూ వస్తున్నామని ఏఈ రవికుమార్ తెలిపారు. తీగలు తెగిన చోట సరఫరా నిలిపివేశామని, తీగలపై చెట్లు విరిగిపడటంతో ఎక్కడో మరో లైన్ తీగలు తగలి ఉంటాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, స్వతహాగా తాము మరో రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా -
యువత సృజనాత్మకతను అందిపుచ్చుకోవాలి
షాద్‌నగర్: యువత ఆధునిక పరిజ్ఞానంతో సృజనాత్మకతను అందిపుచ్చుకోవాలని రీసోర్స్‌పర్సన్ డాక్టర్ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఐఐసీ సెల్ సంయుక్త సహకారంతో గురువారం ప్రోటోటైప్, ప్రాసెస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంశంపై ఒక రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేపట్టి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థికవృద్ధిని సాధించడంకోసం ఇలాంటి వర్క్‌షాపులు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలను సాధించడం కాదు ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. వర్క్‌షాపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, వైస్ ప్రిన్సిపాల్ సృజన, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు డాక్టర్ శ్రీలత, శ్రీలక్ష్మి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఆఫీసర్ సంతోష, ఐఐసీ సెల్ హెడ్ స్పందన తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు నిప్పు!
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, రంగారెడ్డిజిల్లా: చిన్నపాటి నిర్లక్ష్యం అగ్ని ప్రమాదాలకు దారితీస్తోంది.. విలువైన ఆస్తులే కాదు.. ప్రాణాలను సైతం హరిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు వెలుగు చూసిన అగ్నిప్రమాదాలను పరిశీలిస్తే మెజార్టీ ప్రమాదాలు కాల్చిన సిగరెట్, బీడీ ముక్కలతోనే జరిగినట్లు తేలింది. ఆ తర్వాతి స్థానంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్లు, మెకానిక్ హీట్స్, గ్యాసు లీకేజీలు ఉన్నాయి. 2014 నుంచి 2025 వరకు 2,657 అగ్ని ప్రమాదాలు వెలుగు చూశాయి. వీటిలో స్మోకింగ్ కారణంగా 968, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా 924, మెకానికల్ హీట్ కారణంగా 172, గ్యాసు లీకేజీ కారణంగా 94 ప్రమదాలు చోటు చేసుకున్నట్లు తేలింది. కొంత మంది అలవాటుగా, మరికొంత మంది ఫ్యాషన్ కోసం సిగరెట్ కాలుస్తున్నారు. స్మోకింగ్ తర్వాత కాలుతున్న ఆయా సిగరెట్/బీడీ ముక్కలను బహిరంగ ప్రదేశాలు, చెత్తకుండీల్లో విసిరేస్తున్నారు. పక్కనే ఉన్న పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, ఎండుగడ్డి, ఇతర పదార్థాలకు అంటుకుని మంటలు వ్యా పిస్తున్నాయి. మాదాపూర్‌లోనే అత్యధికం హోటళ్లలో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య సముదాయాల్లో నాసిరకం వైరింగ్, లూజ్ కాంటాక్ట్‌లతో విద్యుత్ షార్ట్సర్క్యూట్లు వెలుగు చూస్తున్నాయి. ఇళ్ల మధ్య వెలసిన ప్లాస్టిక్ గోదాములను కాల్చిపడేసిన సిగరెట్, బీడీ ముక్కలు బుగ్గి చేస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశాల్లో మండే రసాయనాలను నిల్వ ఉంచడం ద్వారా గృహ సముదాయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆస్పత్రులు, ఇతర వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకున్నా.. నిర్వహణ లోపంతో తరచూ ప్రమాదాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. విలువైన ఆస్తులతో పాటు ప్రాణాలు పోతున్నాయి. ఏటా ప్రచారం కల్పిస్తున్నా ప్రమాదాలు తగ్గకపోగా, మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బహుళ అంతస్తుల భవనాలు అధికంగా ఉన్న మాదాపూర్‌లోనే ఎక్కువ ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజేంద్రనగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జిల్లా పరిధిలో తొమ్మిది అగ్నిమాపక కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని విపత్తులు, అగ్ని ప్రమాదాల నియంత్రణ శాఖ పలు సూచనలు చేసింది. మాదాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం (ఫైల్)న్యూస్రీల్హోటల్స్లో పాటించాల్సినవి పై అంతస్తుల్లోని డోర్లు, మెట్లకు ఎలాంటి వస్తువులు అడ్డుపెట్టరాదు. ప్రధాన ద్వారాలకు ఎదురుగా అగ్నిమాపక పరికరాల స్థానం తెలిపే ‘ఎస్కేప్ ప్లాన్’ ఉంచాలి. ఎయిర్ కండిషన్ ద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా ‘డ్యాంపర్స్’ను ఏర్పాటు చేసి, ఆటోమెటిక్ డిటెక్షన్ సిస్టంకు అనుసంధానించాలి. విద్యుత్ వైరింగ్, ఉపకరణాలు, స్విచ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడంతో పాటు లోపాలను సరిదిద్దుకోవాలి. తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి, అత్యవసర సమయాల్లో ఏ విధంగా అనుసరించాలో వివరించాలి. వంట గదుల్లోని ఎల్పీజీ సిలిండర్ నిల్వ చేసే ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బేస్మెంట్ను కేవలం పార్కింగ్ కోసమే వాడాలి. మండే పదార్థాలు, ఆయిల్స్ నిల్వ చేయరాదు. షార్ట్సర్క్యూట్లు జరగకుండా.. బీఎస్ఐ స్టాండర్డ్ ఎలక్ట్రిక్ ఉపకరణాలు మాత్రమే వాడాలి. క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్‌తోనే పనులు చేయించాలి. వైరింగ్‌లో జాయింట్స్, లూజు కాంటాక్ట్‌లు లేకుండా చూసుకోవాలి. ప్లగ్ లేని వైర్ చివరను సాకెట్లో ఉంచాలి. రిఫ్రిజిరేటర్, ఓవెన్లను ధారాళమైన గాలి, వెలుతురు వచ్చే ప్రదేశాల్లోనే ఉంచాలి. కిచెన్‌లో ఉంచరాదు. కార్పెట్లు, చాపల కింద ఎలక్ట్రిక్ వైర్లు లాగొద్దు. వాటిని తొక్కడం ద్వారా షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల నివారణ కోసం సరైన ఎర్తింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను బెడ్ వద్ద చార్జింగ్ పెట్టరాదు. విద్యుత్ పరికరాలకు నిప్పంటుకుంటే వాటిని నీటితో ఆర్పే ప్రయత్నం చేయొద్దు. స్విచ్ఛాఫ్ చేయడం, పొడి ఇసుక, కార్బన్‌డై ఆకై ్సడ్‌తో మంటను ఆర్పేయాలి. విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తికి అధిక మోతాదులో నీళ్లు ఇవ్వాలి. స్విచ్రూమ్లో చెత్త వేయకూడదు. ఆస్పత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ్లోర్లను ఫైర్ కంపార్టుమెంట్స్గా విభజించి, అగ్ని ప్రమాదాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర ద్వారాలు, ఫైర్ డోర్లకు లాక్ చేయకూడదు. బయటికి వెళ్లే మార్గాల ‘ఎవాక్యూయేషన్ ప్లాన్’ను ప్రతి అంతస్తులో అందరికీ కన్పించేలా ఏర్పాటు చేయాలి. ప్రతి ఐదేళ్లకోసారి విద్యుత్ వైరింగ్, ఎంసీబీలు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్‌తో పరీక్ష చేయించుకోవాలి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు లిఫ్ట్‌లు వాడొద్దు. అత్యవసర ద్వారాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలి. బ్యాటరీ బ్యాకప్‌తో కనిసం 20 నిమిషాలు పని చేసేలా ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. ఫైర్ అలారం మోగిన వెంటనే భవనం ఖాళీ చేయాలి. అగ్ని ప్రమాదాలపై 101కు సమాచారం ఇవ్వాలి. ఏటా పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు జిల్లాలో గత ఏడాది 1,390 ఘటనలు బుగ్గి చేస్తున్న సిగరెట్, బీడీ ముక్కలు కారణమవుతున్న విద్యుత్ షార్ట్సర్క్యూట్లు ఆందోళన కలిగిస్తున్న ఆస్తి, ప్రాణనష్టాలు అప్రమత్తంగా ఉండాలంటున్న అగ్నిమాపక శాఖ గత ఏడాది జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదాలు ఫైర్‌స్టేషన్ అగ్ని ప్రమాదాలు మాదాపూర్ 316 హయత్‌నగర్ 178 రాజేంద్రనగర్ 173 ఎల్బీనగర్ 161 వట్టినాగులపల్లి 147 చేవెళ్ల 130 ఇబ్రహీంపట్నం 106 షాద్‌నగర్ 104 మహేశ్వరం 75 -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలఆమనగల్లు: రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఆకుతోటపల్లిలో గురువారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ అభియాన్‌లో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ జీవీ వెన్నెల, మార్కెట్ చైర్పర్సన్ యాట గీత, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి బుదిధ చెప్పడానికి ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ జీవీ వెన్నెల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జగన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ఫరీద్, మాజి ఎంపీపీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో సమస్యలకు చెక్
షాద్‌నగర్: భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో హక్కుల రికార్డు సవరణ కోసం అవకాశం లేదని, తప్పుల సవరణ కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. కొత్త భూ భారతి చట్టంలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందన్నారు. నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భవిష్యత్తులో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్ర వివరాలతో భూధార్ కార్డును జారీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త చట్టంలోని అంశాలపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీఓ సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన, వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ పార్థసారధి, ఏడీఏ రాజరత్నం, ఏఓ నిషాంత్‌కుమార్, ఎంపీడీఓ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. కేశంపేటలో అవగాహన సమావేశం కేశంపేట: భూ భారతి చట్టంపై రైతులు, ప్రజలకు గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో షాద్‌నగర్ ఆర్డీఓ సరిత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. కలెక్టర్ నారాయణరెడ్డి నూతన చట్టం గురించి వివరించారు. అనంతరం చట్టంపై పలువురి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజరత్నం, తహసీల్దార్ అజాంఅలీ, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల, వీరేష్, జగదీశ్వర్, శ్రీధర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ నారాయణరెడ్డి -
హీమోఫిలియాతో జాగ్రత్త
జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు హుడాకాంప్లెక్స్: రక్తం సరిగ్గా గడ్డకట్టకపోవడాన్ని హీమోఫిలియా అంటారని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం హీమోఫిలియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టకపోవడంతో అధిక రక్తస్రావం జరుగుతుందని, ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందని అన్నారు. ఇది అరుదైన జన్యు రక్త రుగ్మత అని తెలిపారు. మృదు కణజాలంలో గాయాలు అయినప్పుడు కీళ్లు, మోకాళ్లు, మోచేతుల్లో రక్తస్రావం జరిగి నొప్పి, వాపులు వస్తుంటాయని, గాయాలు కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా.గీత, మెడికల్ ఆఫీసర్ అర్చన, డా.వినోద్ పాల్గొన్నారు. వ్యాధి నిర్మూలనకు కృషి షాద్‌నగర్: ప్రతిఒక్కరూ హీమోఫిలియా నిర్మూలనకు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని పురస్కరించుకొని చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... హీమోఫిలియా అనేది వంశపారపర్యంగా వస్తుందని, ఇది రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు జగదీష్, సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డీపీఎంఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్లు చంద్రకళ, శ్రీరామ, అమృత, ల్యాబ్ టెక్నీషియన్ శివ పాల్గొన్నారు. పట్టణ సమీపంలో గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ నీతాపోలే ఆధ్వర్యంలో ప్రపంచ హెమోఫిలియా దినోత్సవాన్ని నిర్వహించారు. -
పోక్సో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారం
రూ.30 వేల జరిమానా ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమపేరుతో బాలికను మోసం చేసి, వివాహం చేసుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎంపీపటేల్‌గూడకు చెందిన జంగం నరేందర్ (20) మేసీ్త్ర పని చేస్తుండేవాడు. ఇదే గ్రామంలోని ఓ ఇంట్లో పనులు చేస్తుండగా.. బాలిక పరిచమైంది. ప్రేమ పేరుతో ఆమెను అపహరించి, పెళ్లి చేసుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై 2018లో ఆదిబట్ల పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోక్సో చట్టం ప్రకారం నరేందర్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నరేందర్‌కు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. బాధితురాలికి రూ.40 లక్షల పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, రఘు వాదనలు వినిపించినట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ పరువునష్టం కేసు వాయిదా ● గైర్హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ● విచారణను ఈనెల 24కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు సిటీ కోర్టులు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంతో న్యాయస్థానం విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఫిర్యాదుదారుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కూడా గైర్హాజరయ్యారు. ప్రతివాది అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కార్యకలాపాల నేపథ్యంలో కోర్టుకు రాలేకపోయారని ఆయన తరుఫు న్యాయవాదులు విశ్వేశ్వర్రావు కోర్టుకు సూచిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. -
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
చేవెళ్ల: సొంతూరుకు వెళ్తానని బయలుదేరిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలం మక్తగూడ గ్రామానికి చెందిన బుత్తుల వెంకటయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలంగా చేవెళ్లలో నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో సొంతూరు మక్తగూడకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. తరువాత అతని భార్య శ్రీలత ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మక్తగూడకు వెళ్లి ఉండవచ్చని భావించి బుధవారం రాత్రి శ్రీలత తన అత్తకు ఫోన్ చేసింది. ఆయన అక్కడికి వెళ్లలేడని తెలిసి గురువారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య మొయినాబాద్: ఇంట్లోనే ఉరి వేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిగూడలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌరొళ్ల వెంకటస్వామికి పదేళ్ల క్రితం మొదటి భార్య మరణించడంతో జయమ్మ(40)ని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు, రెండో భార్యకు ఒక కూతురు. మొదటి భార్య పెద్ద కొడుకు ఆరు నెలల క్రితం మృతి చెందాడు. కాగా గురువారం వెంకటస్వామి పనికి వెళ్లగా జయమ్మ ఇంటి వద్దనే ఉంది. తనతోపాటు ఉన్న కూతురిని బయటకు పంపించి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక్ఫాయ్లో ముగిసిన మేధో సమ్మేళనం శంకర్పల్లి: మండలంలోని దొంతాన్పల్లిలో గల ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘ఇక్ఫాయ్ కాన్ఫరెన్స్ ఆఫ్ నేషన్స్ (ఐకాన్)–2025’ కార్యక్రమం గురువారంతో ముగిసింది. కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ కార్యనిర్వాహక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల మేధో సమ్మేళనంలో ముఖ్యంగా అంతర్జాతీయ సహకారం, న్యాయ పరిజ్ఞానం, మానవీయ సిద్ధాంతాలు, మేథో వినిమయం, కుటుంబ త్యాగాలు, శాంతి, రాజీ, పరస్పర గౌరవం, అంతర్జాతీయ సంబంధాల వంటి వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రకాశ్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎప్పటికీ న్యాయం వైపే ఉండాలని, భారత రాజ్యాంగం పట్ల విధేయతతో ఉండాలని, మానవ విలువలని నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. ఇక్ఫాయ్ వైస్ చాన్సలర్ ఎల్ఎస్ గణేశ్, లా స్కూల్ డైరెక్టర్ ప్రొ. రవిశేఖరరాజు మాట్లాడుతూ.. ఇలాంటి వేదికలు విద్యార్థులు జీవితంలో ఎదగడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో రీసెర్చ్ డీన్ ప్రతాప్‌రెడ్డి, అసిస్టెంట్ డీన్ డా.అరుణ్, ఐకాన్ 2025 కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడండి చేవెళ్ల ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన చిలుకూరు గ్రామస్తులు మొయినాబాద్: అక్రమంగా కబ్జాలకు గురవుతు న్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని చిలుకూరు గ్రామస్తులు చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళకు ఫిర్యాదు చేశారు. గురువారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో సర్వేనంబర్ 164, 166లో ఉన్న ప్రభు త్వ భూమిని కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తొలగించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. మరోవైపు మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు సైతం ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రేమ్‌కుమార్, ప్రభాకర్, దేవకుమార్, పద్మారావు, ప్రశాంత్, నవీన్, జయవర్ధన్, కిరణ్, రాజు, వెంకటేష్, సునీల్, సుధాకర్, ప్రసాద్, గోపాల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై కూలిన చెట్టు
చేవెళ్ల: ఈదురుగాలులతో కూడిన వర్షానికి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మర్రిచెట్టు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో మండలంలోని మీర్జాపుర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద మర్రిచెట్టు కూలింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో ఇరువైపులా కిలోమీటర్‌కుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. భారీగా ట్రాఫిక్ జాం -
టీచర్ పర్స్ పోయిందని..
విద్యార్థిని పరీక్ష రాయనీయని వైనం కొందుర్గు: పాఠశాలలో ఉపాధ్యాయురాలి పర్స్ పోయిందనే నెపంతో.. ఓ విద్యార్థిని వార్షిక పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన కొందుర్గు గురుకుల పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాలలో గ్రంథాలయ బాధ్యతలు చూసుకునే ఉపాధ్యాయురాలు స్వాతి పర్స్ మిస్ అయ్యింది. అందులో ట్యాబ్లెట్లతో పాటు ఏటీఎం కార్డు, రూ.100 ఉన్నాయని స్వాతి తెలిపారు. అయితే ఈ పర్స్‌ను 9వ తరగతికి చెందిన ఓ విద్యార్థి తీసుకున్నాడనే అనుమానంతో గురువారం ఉదయం జరిగిన వార్షిక పరీక్షను క్లాస్ టీచర్ రాయనీయలేదు. అంతేకాకుండా పర్స్ తీసుకొచ్చాక పరీక్ష రాయాలని ఆదేశించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రిన్సిపల్ కుర్షీద్ సదరు విద్యార్థిని తన ఎదుట కూర్చోబెట్టుకుని పరీక్ష రాయించారు. టీచర్ పర్స్ మాత్రం ఎక్కడా దొరకకపోవడం గమనార్హం. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
చేవెళ్ల: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో గురువారం నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్లు పంపిణీ చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడుతాయని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కమిటీ సూచించిన జాబితా ప్రకారం ఇళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి 3700ల ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో మండలానికి 700లకు పైగా ఇళ్లు అందుతాయన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసుదన్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, ఐదు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, ఇందిరమ్మ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య -
కుటుంబ కలహాలతో పురుగు మందు తాగిన వ్యక్తి
చిక్సిత పొందుతూ మృతి కేశంపేట: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయ్యవారి వేణు(32) డ్రైవర్‌గా పని చేస్తు భార్య లత, ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నాడు. వేణు ప్రేమ వివాహం చేసుకొని కొద్దికాలం సంతోషంగా ఉన్నాడు. తదనాంతరం కుటుంబ విషయంలో అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవలు పడేవారు. ఇలా తగాదా జరిగినప్పుడు లత కొన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చేదని గ్రామస్తులు తెలిపారు. ఆమె ఇలా చేస్తుండటంతో వేణు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మనోవేదనతో ఆయన మంగళవారం రాత్రి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల సూచన మేరకు ఉస్మానియాకి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఆయన మృతి చెందారు. మృతుడి తండ్రి నర్సింహాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు. రోడ్డుపై ఆక్రమణల తొలగింపు చేవెళ్ల: మున్సిపాలిటీ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆక్రమిత కట్టడాలను తొలగించాలని టౌన్‌ప్లానింగ్ అధికారి మణిహారిక, ట్రాఫిక్ సీఐ వెంకటేశంలు హెచ్చరించారు. బుధవారం చేవెళ్లలో ప్రధాన రహదారిపై దుకాణాల ముందు ఆక్రమించిన స్థలాలను తొలగించే పనులు చేపట్టారు. ఇందులో భాగంగా బోర్డులు, కట్టడాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో తొలగించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రోడ్డుపై ఆక్రమణలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పాడుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు కూడా రోడ్లపై పార్క్ చేయవద్దని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రోడ్లు విస్తరణ అవసరమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాఘవేందర్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. పరువు నష్టం కేసు వాయిదా సిటీ కోర్టులు : తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతోపాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడు హీరో నాగచైతన్య–సమంత విడాకుల విషయంపై వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదైన విషయం విదితమే. -
హోటళ్లలో అధికారుల తనిఖీలు
చేవెళ్ల: మండల కేంద్రంలో ఉన్న పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. కుళ్లిన ఆహార పదార్థాలు గుర్తించి యాజమాన్యానికి జరిమానా విధించారు. మున్సిపాలిటీ అధికారులు రమేశ్, రాఘవేందర్, అమర్, తదితరులు పట్టణ కేంద్రంలోని ఎంజీ ఫుడ్ కోర్టులో(హోటల్) ఆకస్మికంగా సోదాలు చేశారు. అక్కడ కుళ్లిన ఆహార పదార్థాలు(చికెన్, గుడ్లు) కనిపించాయి. ఫ్రీజ్‌లో నిల్వ ఉంచిన వాటిని గుర్తించి పారబోయించారు. అపరిశుభ్రంగా ఉండటంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని, హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిత్యం ఆకస్మికంగా హోటళ్లను తనిఖీలు చేస్తుంటామని పేర్కొన్నారు. కుళ్లిన ఆహార పదార్థాల వినియోగంపై ఆగ్రహం -
వాటర్ లైన్మెన్లతో జూమ్ మీటింగ్
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి నీటి సరఫరాలో శాశ్వతంగా లో–ప్రెషర్ సమస్యను పరిష్కరించేందుకు వాటర్ లైన్మెన్లపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఏకంగా ఎండీ అశోక్ రెడ్డి లైన్మెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం డివిజన్ 18 పరిధిలోని లైన్మెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఒక్కో లైన్మెన్ ఎన్ని వాల్వ్‌లను ఆపరేట్ చేస్తారో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు ఎలా చేయాలో చర్చించారు. ప్రతి లైనన్మన్ ఆధీనంలో ఉన్న ఆపరేషన్ వాల్వ్‌ల సంఖ్య, నీటి సరఫరా చేసే క్యాన్ నంబర్లు, వాల్వ్ ఆపరేషన్ సమయాన్ని తగ్గించడం తదితర అంశాలపై లైన్మెన్లతో చర్చించారు. వీటితోపాటు మెట్రో కస్టమర్లో నమోదయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను జీఎంను అడిగి తెలుసుకున్నారు. ఈ జూమ్ మీటింగ్‌లో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ– డైరెక్టర్ ఆపరేషన్–2 వీఎల్ ప్రవీణ్ కుమార్, జీఎం, డీజీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు బైకును ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్ భార్య మృతి..భర్తకు గాయాలు మాదాపూర్: వాటర్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం..బిహార్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ కుమార్ భార్య మనీషా కుమారితో కలిసి బుధవారం ఉదయం బైక్‌పై పర్వత్‌నగర్ నుంచి మైహోంభుజ అపార్ట్మెంట్కి వెళ్తుండగా..సైబర్ టవర్ ఎంట్రీ గేట్ వద్ద ఓ వాటర్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు బైక్‌పై నుంచి పడిపోగా మనీషాకుమారి పైనుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్రగాయాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీకాంత్ కుమార్ తల, చేతులకు స్వల్పగాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా నడిపిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను కె.శ్రీనివాస్‌గా గుర్తించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోపంతోనే వృద్ధురాలిని చంపేశాడు... ● కమలాదేవి హత్య కేసును ఛేదించిన పోలీసులు ● జువైనల్ హోంకు మైనర్ తరలింపు కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెచ్‌బీకాలనీ, కృష్ణానగర్ రోడ్డు నెంబరు–5లో చోటు చేసుకున్న కమలాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె తిడుతుందనే కోపంతో కసి పెంచుకున్న మైనర్ బాలుడే ఆమెను హత్యచేశాడని, ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చారు. నిందితుడితో పాటు హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాప్ యజమానులు ప్రకాష్‌చౌదరి, లలిత్చౌదరిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సుదీర్ఘంగా విచారించారు. సీసీ పుటేజీలతో పాటు వారి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు చివరకు బాలుడే కమలాదేవిని హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు అతన్ని జువైనల్ హోంకు తరలించారు. ఈ విషయాలను బుధవారం కుషాయిగూడ ఏసీపీ మహేష్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. విషయం వెల్లడవడంతో పారిపోయేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ట్రైన్ కోసం వేచి చూస్తున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. కమలాదేవిని హత్య చేసిన విషయాలను బాలుడు వెల్లడించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. మేడ్చల్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం అతడి వద్ద నుంచి రక్తపు మరకల దుస్తులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. దైవ సన్నిధానంలో సీఎస్ ప్రత్యేక పూజలు ఫిలింనగర్: ఫిలింనగర్ దైవ సన్నిధానంలో బుధవారం సంకష్ట హరచతుర్థి సందర్భంగా వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేష మల్లె పుష్పార్చనతో పాటు 350 కిలోల బెల్లంతో అలంకరించారు. వేకువ జామునే పంచామృతాభిషేకం, పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజల్లో చీఫ్ సెక్రటరీ (సీఎస్) శాంతికుమారి పాల్గొన్నారు. -
వేసవికాలం.. అప్రమత్తతే ముఖ్యం
షాద్‌నగర్: వేసవికాలం నిత్యం ఏదో ఓ చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరైన అవగాహన లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీంతో విలువైన ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక జాతీయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇళ్లు, అపార్ట్మెంట్, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల్లో ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణ కోసం అగ్నిమాపక శాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి వేసవిలో అగ్ని ప్రమాదా లు జరిగే అవకాశం ఎక్కు వ. ప్రమాదాలపై నిరంత రం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం – జగన్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్ అవగాహనతోనే అగ్ని ప్రమాదాల నివారణ కొనసాగుతున్న జాతీయ వారోత్సవాలు -
అకాల వర్షం.. మిగిలిన నష్టం
కొందుర్గు: అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మంగళవారం కొందుర్గు మండలంలోని ఆగిర్యాల, వెంకిర్యాల, లక్ష్మీదేవిపల్లి, ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వానలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని ఆయా అన్నదాతలు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి చాలిచాలని నీటిని రాత్రింబవళ్లు పొలానికి పెట్టి పండించిన పంట నేలపాలు కావడంతో విలవిలల్లాడుతున్నారు. ఆగిర్యాలకు చెందిన చించోడి మొగులయ్య, పందిబండ రామచంద్రయ్య, గుమ్మడి వెంకటయ్య, గుమ్మడి రామచంద్రయ్య, మహదేవ్పూర్ రాములు, నర్సిరెడ్డి తదితర రైతులకు సంబంధించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉద్యానవన శాఖ అధికారి హిమబిందు, ఏఈఓ రమణ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆయా గ్రామాలను సందర్శించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కాగా ఆగిర్యాల గ్రామంలో 27 మంది రైతులకు సంబంధించిన 28 ఎకరాల వరిపంట దెబ్బతిందని వ్యవసాయ విస్తరణాధికారి రమణ తెలిపారు. అలాగే 176 మంది కర్షకులకు సంబంధించి 216 ఎకరాల్లో మామిడి చెట్లకు కాయలు రాలిపోయాయని షాద్‌నగర్ ఉద్యానవన అధికారి హిమబిందు పేర్కొన్నారు. విరిగిన బొప్పాయితోట ఫరూఖ్‌నగర్ మండలంలోని దేవునిపల్లికి చెందిన జంగయ్య అనే రైతుకు సంబంధించిన బొప్పాయితోట గాలివానకు విరిగి పూర్తిగా నేలపై పడిపోయాయి. దాదాపు 70 శాతానికి పైనే రైతు నష్టపోయాడని ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. దెబ్బతిన్న పంటల వివరాలను రైతులవారీగా ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని పేర్కొంటున్నారు. అకాల వర్షాలకు తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. రాలిన మామిడిని పరిశీలిస్తున్న అధికారులు దెబ్బతిన్న వరి పంటను చూపుతున్న రైతన్న వడగళ్ల వానలకు నేలరాలిన వరి, మామిడి పంటలను పరిశీలించిన అధికారులు -
చేవెళ్ల పీఎస్‌కు జీవన్‌రెడ్డి
అప్రమత్తతే ముఖ్యం జాతీయ అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.8లోuచేవెళ్ల: మండల పరిధిలోని ఈర్లపల్లి భూములకు సంబంధించిన కేసులో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఐ భూపాల్‌రెడ్డి బుధవారం ఆయన్ను రెండున్నర గంటల పాటు విచారించారు. శంకర్పల్లి మండలం టంగటూరు, చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామాల పరిధిలోని తనకున్న 170 ఎకరాల భూమిని కబ్జాచేసి ఆక్రమించుకున్నాడని సామ దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జీవన్‌రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై మోకిల, చేవెళ్ల పీఎస్‌లలో 2024మే 22, 27 తేదీల్లో కేసులు నమోదయ్యాయి. దీనిపై జీవన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఆయన తల్లి రాజుబాయి, భార్య రజితకు బెయిల్ మంజూరైంది. జీవన్‌రెడ్డికి బెయిల్ రాకపోవటంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జీవన్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, ఆయన విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే మూడుసార్లు మోకిల పీఎస్‌లో విచారణకు హాజరైన జీవన్‌రెడ్డి రెండోసారి చేవెళ్ల పీఎస్‌కు వచ్చారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఈర్లపల్లి పరిధిలో ఉన్న 14.30 ఎకరాల భూమికి సంబంధించి జీవన్‌రెడ్డిని పలు ప్రశ్నలు అడగ్గా ఆయన కొన్నింటికి సమాధానాలు చెప్పడంతో పాటు కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయంటూ దాటవేసినట్లు తెలిసింది. కక్ష సాధింపు.. జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు తనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనను విచారణ పేరిట పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత పలు అంశాలపై రెండున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులుఅవసరమైతే మళ్లీ పిలుస్తాం సీఐ భూపాల్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఈర్లపల్లిలోని దామోదర్‌రెడ్డికి సంబంధించిన 14.30 ఎకరాల భూమిని కబ్జా చేయడంతో పాటు కాంపౌండ్ ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడనే కేసు విచారణలో భాగంగా జీవన్‌రెడ్డిని పిలిపించామన్నారు. కేసుకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నామని, ఈ సమాధానాలతో కేసును పరిశీలిస్తామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీఐ చెప్పారు. -
ఇళ్ల స్థలాల్లోకి పేదలను అనుమతించండి
ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న ఇళ్ల స్థలాల కబ్జా కోసం లబ్ధిదారులకు సహకరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సమక్షంలో బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిలింసిటీ చెరలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలన్నారు. గతంలో నిరుపేదలకు ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటామని, ఇందుకు సహకరించాలని కోరారు. దీనిపై సీపీ స్పందిస్తూ ఇంటి స్థలాల అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సామేలు, మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గరాములు, ఇంటి స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ పి.జగన్, మండల కమిటీ సభ్యుడు ఆనంద్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న భూముల చెర విడిపించండి సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం -
ఆర్ఎంపీలు, పీఎంపీలను నియంత్రించండి
డీఎంహెచ్ఓకు ఐఎంఏ సభ్యుల వినతి షాద్‌నగర్: ఆర్ఎంపీలు, పీఎంపీలను నియంత్రించాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సభ్యులు బుధవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావుకు వినతిపత్రం అందజేశారు. ఐఎంఏ షాద్‌నగర్ అధ్యక్షుడు డాక్టర్ నాగవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ను కలిసిన వైద్యులు ఎలాంటి అర్హత లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా షాద్‌నగర్‌లో ఆర్ఎంపీలు చికిత్సలు చేస్తున్నారని వారిని నియంత్రించాలని కోరారు. కేవలం ప్రథమ చికిత్సలు మాత్రమే నిర్వహించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు, ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు ఆయనకు వివరించారు. వారిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు వేదికకు కేటాయించిన భూమిని కాపాడండి కందుకూరు: ప్రభుత్వం రైతు వేదిక నిర్మాణానికి కేటాయించిన భూమిలో కొంత మేర ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి ప్లాట్లు చేశారని.. సర్వే చేసి ఆ భూమిని కాపాడాలని కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్‌ను కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, నాయకుడు ఎస్.శేఖర్‌గౌడ్ తదితరులు తహసీల్దార్ గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు పిల్లి వాగును సైతం వెంచర్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా మార్పులు చేశారన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట ఖదీర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి ఆమనగల్లు: ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతర పోరాటం చేస్తోందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల బీజేపీ క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం బీజేపీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్తూ పార్టీ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మాజీ సభ్యుడు రాంరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షుడు కర్నాటి విక్రంరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెక్కల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు విజయ్‌కృష్ణ, చెన్నకేశవులు, సుండూరి శేఖర్, కృష్ణనాయక్, కృష్ణయాదవ్, బీజేపీ నాయకులు రవిరాథోడ్, ప్రశాంత్, మహేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సరెండర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణిని సరెండర్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను మహిళాళా శిశు సంక్షేమ శాఖకు సరెండర్ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిగా పని చేస్తున్న శ్రీలతకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టానికి సంబంధించిన పోర్టల్‌ను అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న ఆవిష్కరించి రైతులకు అంకితం చేసింది. జూన్ 2 నుంచి పోర్టల్ అమలు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్న సర్కార్ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.8లోu● కమతాలకు భూధార్ నంబర్ల కేటాయింపు ● వాటి ఆధారంగానే సంక్షేమ ఫలాలున్యూస్రీల్ -
కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ స్ఫూర్తికి రక్షణ
కొత్తూరు: రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పనిచేస్తోందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ మంగళవారం చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని వైఎం తండా, పులిచర్లకుంట తండా, చింతగట్టు తండా, సిద్ధాపూర్, ఎస్బీపల్లి, కొడిచర్ల గ్రామాల్లో నిర్వహించిన సమా వేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగంలో పొందుపర్చిన పలు చట్టాలను సవరణ చేస్తూ నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి తాము రాజ్యాంగ రక్షణకు కృషి చేస్తున్నామన్నారు. చట్టాల సవరణతో ప్రజలు ప్రశ్నించే హక్కుకు దూరమవుతున్నారని వివరించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదలం గత ప్రభుత్వ హయాంలో సిద్ధాపూర్లో టీజీఐఐసీకి కేటాయించిన భూముల అక్రమాలపై విచారణ సా గుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. కొందరు ఈ విషయమై అసత్య ప్రచారం చేస్తున్నారని వారి ఆరో పణలకు త్వరలోనే సమాధానం చెప్తామన్నా రు. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఇన్చార్జి జైపాల్, మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్యాంసుందర్రె డ్డి, శివశంకర్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, ప్రభాకర్, రవీందర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్, మల్లారెడ్డి, జంగ య్య, రాంచందర్, దయానంద్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
మణికొండలో జలమండలి తనిఖీలు
మణికొండ: తాగునీటి కనెక్షన్లకు మోటార్లను బిగించి అధిక మొత్తంలో నీటిని తీసుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. మంగళవారం నుంచి మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో అధికారులు బృందాలు తనిఖీలు చేస్తున్నారు. మొదటి రోజు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, నేతాజీ కాలనీలలో నల్లా కనెక్షన్లకు ఏర్పాటు చేసిన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఏర్పాటు చేసిన వారికి రూ.5వేల చొప్పున జరిమానాలను విధిస్తున్నామని విజిలెన్స్ సిబ్బంది తెలిపారు. మరోసారి అదే పద్ధతిలో మోటార్లను ఏర్పాటు చేస్తే వారి నీటి కనెక్షన్లను తొలగించడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
బడంగ్పేట్: బాధ్యత గల ప్రభుత్వం భద్రతను గాలికొదిలేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. బడంగ్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు పర్యాయాలు రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం రుణమాఫీ చేశా మని గొప్పలు చెప్పుకొంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ బహిరంగసభకు పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కందుకూరు మండల అధ్యక్షుడు జయేందర్, మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజునాయక్, తుక్కుగూడ కార్పొరేషన్ అధ్యక్షుడు లక్ష్మయ్య పాల్గొన్నారు. -
అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను హైకోర్టులో జస్టిస్ సూరేపల్లి నందా ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాణాలను త్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించనున్నారు. బాంబే డాక్ యార్డులో ‘ఫోర్ట్ స్టికిన్’అనే నౌకలో 1944లో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పే క్రమంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారి వీరత్వాన్ని స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
పోగొట్టుకున్న సెల్ఫోన్లు రికవరీ
ఇబ్రహీంపట్నం: సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు వాటిని రికవరీ చేసి మంగళవారం అప్పగించారు. ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపిన ప్రకారం.. సెల్ఫోన్లను పోగొట్టుకుని తమకు ఫిర్యాదు చేసిన బాధితులకు సీఎంఐఆర్ పోర్టల్ సహకారంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు పది సెల్ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగరాజు, శ్రీనివాస్ తదితరులున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కందుకూరు: కందుకూరు ఠాణా పరిధిలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కొత్తగూడ పంచాయతీ పరిధి బాలాజీ వెంచర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు 40–45 సంవత్సరాలు ఉంటుందని.. ఒంటిపై ఎటువంటి గాయాలు లేవన్నారు. కొద్ది రోజులుగా కందుకూరు చౌరస్తాలో భిక్షాటన చేసుకుని జీవిస్తున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712662687 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. వాహనాల బ్యాటరీలు చోరీ షాద్‌నగర్: పార్క్ చేసిన వాహనాల నుంచి గుర్తు తెలియని దుండగులు బ్యాటరీలను చోరీ చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో పాటు గ్రామానికి చెందిన వాడ్యాల శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్యకు చెందిన ట్రాక్టర్ల నుంచి, వడ్డె శంకర్ ఆటోలోని బ్యాటరీలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిడుగుపాటుకు పశువులు మృత్యువాతకొందుర్గు: పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని శ్రీరంగాపూర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బుయ్యని లాలయ్య మంగళవారం ఉదయం తన ఎద్దులను మేపి వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు కట్టేసి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం తగ్గిన తర్వాత పొలానికి వెళ్లి చూడగా పిడుగుపడి ఓ ఎద్దు మృత్యువాత పడింది. మృతి చెందిన ఎద్దు విలువ సుమా రు రూ.70 వేలు ఉంటుందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. కుర్మిద్దలో ఆవు.. యాచారం: పిడుగు పాటుకు ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కుర్మిద్దలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పసుల సత్తయ్య రెండు నెలల క్రితం రూ.90 వేలు వెచ్చించి పాడి ఆవులను కొనుగోలు చేశాడు. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపడడంతో వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు కట్టేసిన ఆవు మృత్యువాత పడింది. ఆవుతోనే జీవనోపాధి పొందుతున్నానని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
షాద్‌నగర్: ఆయిల్‌పామ్‌తో రైతులు అధిక లాభాలు పొందొచ్చని ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పొన్ను స్వామి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెలిజర్లలో రైతు నర్సింహారెడ్డి సాగు చేసిన ఆయిల్‌పామ్‌ను పంటను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ పొన్ను స్వామి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు చాలా మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. నీటి వసతులు ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తే ఎక్కువ లాభాలు ఆర్జించ వచ్చని చెప్పారు. ఈ తోటలకు చీడపీడలు సోకే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. తోట సాగులో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ విజయకృష్ణ, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని, వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థ ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం పరిధిలో పంటల పరిశీలన మహేశ్వరం: మండల పరిధిలోని మన్సాన్పల్లి, ఘట్టుపల్లి గ్రామాల్లో సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను మంగళవారం ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పొన్ను స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ పంటకు లేని విధంగా ఆయిల్‌పామ్‌కు చట్టం ఉందన్నారు. జిల్లాలో వ్యాల్యూ అనే కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని, వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థ ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు, జిల్లా ఉద్యాన అధికారి సురేష్, ఏడీహెచ్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
కొత్తూరు: గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ పంచాయతీ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన కార్మికులతో కలిసి ఎంపీడీఓ అరుంధతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు నూతన జీఓల ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని కోరా రు. ఉధ్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలు కల్పించాలన్నారు. విధుల్లో భాగంగా, సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు బీమా సౌకర్యం, కార్మికులకు రక్షణ పరికరాలు, బూట్లు, మాస్కులు ఇవ్వాలని విన్నవించారు. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్‌రెడ్డి, భిక్షపతి, దేవయ్య, సురే శ్, జంగయ్య, రాములు, కృష్ణయ్య పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
‘ఫార్మా‘ సర్వేను అడ్డుకోవద్దు
యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకోవద్దని, అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలోని సర్వేనంబర్ 109, 114లోని రైతులతో మంగళవారం యాచారం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రెవెన్యూ, అటవీ శాఖ, టీజీఐఐసీ అధికారులతో ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని, ఏఏ సర్వే నంబర్లలో ఏ భూములున్నాయో గుర్తిస్తామని తెలిపారు. దీంతో అర్హులైన రైతులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. సమావేశంలో తాడిపర్తి మాజీ సర్పంచ్ దూస రమేష్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముప్పిడి బావయ్య, స్థానిక టీజేఎస్ నాయకుడు నిరంజన్ పాల్గొన్నారు. కొనసాగుతున్న సర్వే, ఫెన్సింగ్ పనులు ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ పనుల సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం నక్కర్తమేడిపల్లి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారానికి దాదాపు 35 కిలోమీటర్ల మేర సర్వే జరిగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు మధ్య పనులు చేస్తున్నారు. ఇబ్రహీంట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి -
వ్యాపారం కోసం యువతుల ఎర
చైతన్యపురి: వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ పబ్‌పై చైతన్యపురి పోలీసులు దాడి చేశారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కొత్తపేట కిలా మైసమ్మ దేవాలయ సమీపంలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లో యువతులతో అర్దనగ్న నృత్యాలు చేయిస్తుండటమేగాక, నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. 16 మంది యువతులను డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి యువకులే టార్గెట్.. పబ్‌కు వెళ్లాంటే కస్టమర్ల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. జంటలుగా వచ్చిన వారిని కాకుండా మద్యం సేవించేందుకు ఒంటరిగా వచ్చిన యువకుల వద్దకు యువతులు వచ్చి వారికి కంపెనీ ఇస్తారు. అసభ్యంగా డాన్సులు చేస్తూ తాము సేవించే మద్యం, ఆహారం కూడా సదరు యువకుల బిల్‌లోనే వేస్తారు. వ్యాపారం పెంచుకునేందుకు మోసపూరితంగా పబ్ నిర్వాహకులే యువతులకు ఫ్రీ పాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. తద్వారా బిల్లు ఎక్కువ అయ్యేలా చేసి వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఇందుకు గాను ముంబై నుంచే కాక నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యవతులను పబ్ నిర్వాహకలు ఎంగేజ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. బ్యూటీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులను ఎంచుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పట్టుపడిన యువతులను వనస్థలిపురం, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. 16 మంది యువతులతో పాటు డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు. పబ్ యాజమాన్యం నిర్వాకం డీజే సాంగ్స్, అసభ్య నృత్యాలు వైల్డ్ హార్ట్ పబ్ౖపైచెతన్యపురి పోలీసుల దాడి 16 మంది యువతుల అరెస్ట్, పరారీలో పబ్ నిర్వాహకులు -
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగులోకి.. రసూల్‌పురా: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్‌మెంట్‌లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనరాజేంద్రనగర్: స్లాట్ విధానం వద్దు..పాత పద్ధతే కొనసాగించాలని నిరసిస్తూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మంగళవారం తెలంగాణ డాక్యుమెంట్ రైటర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దస్తవేజు లేఖర్లు (డాక్యుమెంట్ రైటర్లు) ప్ల కార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గురువారం, శనివారాలు డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసులను మూసి వేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు గౌడ్, యాదగిరి, జీవం రెడ్డి, శర్మ, రఫీ, క్రాంతికుమార్, ఖదీర్, రమేశ్, సాయినాథ్, పవన్, అస్లాం, ప్రభాకర్ రెడ్డి, బలరాం, జూబైర్, కస్యం మల్లేష్, శ్యామ్ ఆనంద్ పాల్గొన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలుబండ్లగూడ: అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటిపై చర్యలు తీసుకుంటామని బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని పీఅండ్‌టీ కాలనీలోని ప్లాట్ నంబర్ 29–సీ బ్లాక్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తు నిర్మాణాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నిర్మాణాలు చేసే ముందే పూర్తి అనుమతులు తీసుకోవాలన్నారు. -
చూసొద్దాం
జూసందర్శన టికెట్ రేట్లు పెరిగినా..తగ్గని ఆదరణఎప్పటికప్పడు కొత్తదనం.. జూపార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతరించిపోయే జంతువు, పక్షుల సంతానోత్పత్తిని చేపట్టేందుకు జూపార్కు కేంద్ర బిందువుగా ఉంది. చిన్నారులు ఆడుకునేందుకు చిల్డ్రన్స్ పార్కు, సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, రచ్చబండలు, సహాపంక్తి భోజనాలు చేసేందుకు పచ్చని తోరణాలతో విచ్చుకున్న పచ్చదనం జూపార్కు అందచందాలను తిలకించేందుకు విజిటర్ వ్యాన్, లయన్ సఫారీ, చిట్టి రైలు అందుబాటులో ఉన్నాయి. చార్మినార్: పాతబస్తీలోని నెహ్రూ జులాజికల్ పార్కును సందర్శించడానికి చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఇష్టపడుతున్నారు. జూ సందర్శనకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ చాంతాడంత క్యూ లైన్లకు ఫుల్‌స్టాఫ్ పడింది. జూ సందర్శకులకు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే టికెట్ రేట్లు పెరిగినా.. ఆదరణ తగ్గలేదు. అంతేకాకుండా మనం ఎక్కడి నుంచైనా జా సందర్శన టికెట్లను ఆన్‌లైనా ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. జూ బుకింగ్ కౌంటర్ వద్ద ఉండే క్యూలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో..మనల్ని మనమే మరచిపోయి కాస్సేపు సరదాగా..ఉల్లాసంగా..ఉత్సాహాంగా గడపడానికి నెహ్రూ జూలాజికల్ పార్కు చక్కని వేదిక. అంతేకాకుండా మొబైల్ నావిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే జూ పార్కును చుట్టి రావచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని జూ సందర్శనకు వెళితే..జూ పార్కులోని అన్ని ఎన్‌క్లోజర్స్‌తో పాటు ఇతర సమాచారాన్ని మన కళ్ల ముందుంటుంది. గత నెల 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో పెద్దలకు వీక్ డేస్‌లలో రూ.70, చిన్నారులకు రూ.45 లుగాను..వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లో రూ.80, రూ.55 ఉండగా..ప్రస్తుతం రెండు కేటగిరీల వారీగా కాకుండా వారం రోజుల్లో పెద్దలకు రూ.100, చిన్నారుకు రూ.50గా నిర్దారించారు. వీటితో పాటు జూ సందర్శనలో వివిధ కేటగిరీలకు కూడా రేట్లు పెరిగాయి. ఆహ్లాదం, వినోదంతో పాటు విజ్ఞానం పంచుతున్న జూ నెహ్రూ జూలాజికల్ పార్కు ఓ ఎంటర్టైన్ మెంట్ పార్కుగా కాకుండా సందర్శకులకు ఆహ్లాదం, వినోదంతో పాటు జంతువు, పక్షులపై కొత్త విషయాలను నేర్చుకునే విద్యాలయంగా చెప్పవచ్చు. దీంతో జూ సందర్శకుల రద్దీ కూడా పెరిగింది. అప్పుడప్పుడు వచ్చే పాఠశాలలు, కళాశాలలకు సెలవులతో పాటు వీకెండ్ రోజులలో జూపార్కును సందర్శించే సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. వేలాది మంది సందర్శకులకు జంతువులు, పక్షులపై ప్రత్యేక అవగాహనను జూపార్కు అధికారులు కల్పిస్తూ జూలో అనేక కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం కలిగిస్తున్నారు. కేవలం కాలక్షేపం కోసమే కాకుండా జంతు ప్రపంచం గురించి తెలుసుకునే విజ్ఞాన యాత్రగా జూ పార్కు సందర్శన ఉంటుంది. జూ పార్కును సందర్శించడానికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. జూ సందర్శనకు పెరిగిన ఆసక్తి జూలో లేని జంతువు, పక్షులను రప్పించేందుకు, జంతువు, పక్షుల సంతానోత్పత్తి చేపట్టడం ప్రారంభించాక జూ సందర్శన పట్ల సందర్శకుల్లో అమితమైన ఆసక్తి పెరిగింది. అత్యంత విషతుల్యమైన పాములు, విషం లేని పాములను స్నేక్ సెల్ బృందం ప్రదర్శిస్తూ వాటి వివరాలను సందర్శకులకు తెలియజేస్తూ పాములపై సందర్శకులకు ఉన్న అపోహాలను తొలగిస్తున్నారు. అంతేకాకుండా వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ వన్యప్రాణులను దత్తత తీసుకునే వెసలుబాటును కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లపై సందర్శకులను చైతన్యవంతులను చేస్తూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేస్తున్నారు. సందర్శకులు రోజంతా ఉపశమనం పొందడమే కాకుండా ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వన్యప్రాణులను తిలకించడమే కాకుండా అనేక విషయాలను తెలుసుకోవడం లాంటి అనుభూతులను జూను సందర్శిస్తే కాని తెలియదు. సరస్సులో ఆకట్టుకుంటున్న కొంగలునావిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే జూ సందర్శన ఈజీఆన్లైన్ బుకింగ్‌తో క్యూకు ఫుల్స్టాప్ -
వానరానికి అంత్యక్రియలు
కడ్తాల్: మండల పరిధిలోని రావిచేడ్‌లో కొన్నేళ్లుగా నిత్యం జనం మధ్య కలివిడిగా తిరుగుతూ, వారు పెట్టే పండ్లు, ఆహారం తింటూ జీవిస్తున్న ఓ వానరం మంగళవారం స్థానిక హనుమాన్ దేవాలయంలో మృతి చెంది కనిపించింది. గమనించిన ఆలయ నిర్వాహకులు విషయాన్ని స్థానిక శ్రీ సీతారామంజనేయ స్వామి భజన మండలి సభ్యులకు తెలిపారు. వారు గ్రామస్తులతో సమావేశమై వానరాన్ని ఆంజనేయుడికి ప్రతి రూపంగా భావించి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వానర కళేబరాన్ని ట్రాక్టర్‌పై ఉంచి బ్యాండ్ మేళాలు, భజన పాటలతో ఊరేగింపుగా వెళ్లి స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నిత్యం గ్రామస్తుల మధ్య కలియ తిరిగే వానరం మృతితో పలువురు కంటతడి పెట్టుకున్నారు. పట్టణ పరిధిలో ఉపాధి పనులు చేపట్టాలి మొయినాబాద్‌రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి హామీ పథకం)ను పట్టణాల్లోనూ అమలు చేయాలని భారత కిసాన్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు. మండల పరిధిలోని సజ్జనపల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సంఘం జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలకొండ కాంతయ్య మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలతో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టరూపం దాల్చిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు తగ్గించి రోజురోజుకూ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఇకనైనా అలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. ఈ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజు కూలీ కొలతలతో సంబంధం లేకుండా కనీసం రూ.700 ఇవ్వాలని, కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.లక్ష్మయ్య, జిల్లా కోశాధికారి ఎం.కృష్ణ, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుకి రూ.లక్ష చెక్కు అందజేతకడ్తాల్: మండల పరిధిలోని కొండ్రిగాని బోడ్తండాకు చెందిన బాణవత్ మస్రూ ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన తొలివిడత రూ.లక్ష చెక్కును అందుకుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున తొలి విడత చెక్కులు పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బాణవత్ మస్రూకు కూడా చెక్కును అందజేశారు. కప్పపహాడ్ లబ్ధిదారుకు చెక్కు..ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని కప్పపహాడ్కు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు చెరువెంక అశ్వినీ దంపతులు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కు అందుకున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వానరానికి అంతిమయాత్ర నిర్వహిస్తున్న గ్రామస్తులు -
రంగారెడ్డిలో 94 వేల ఎకరాల్లో సాగు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరానికి విదేశాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నాయి. న్యూజిలాండ్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, దక్షిణాఫ్రికా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, సౌదీ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రధానంగా యాపిల్, కివీ, ప్లం, పియర్, డ్రాగన్, ఖర్జూర, చెర్రీ వంటి ఖరీదైన పండ్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వైరెటీలు సరఫరా అవుతున్నాయి. కొన్ని ప్రూట్స్ ఏడాది పొడవునా.. మరికొన్ని సీజన్ వారీగా విపణిలో అందుబాటులో ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా అరటి, నారింజ, దానిమ్మ, నల్ల ద్రాక్ష, పైనాపిల్, జాక్‌ఫ్రూట్ వంటివి దిగుమతి అవుతున్నాయి. మోసంబీ, సీతాఫలం, బొబ్బాయి, మామిడి, జామ, పుచ్చకాయ వంటి పండ్లు రంగారెడ్డి, వికారాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాగవుతున్నాయి. ● హైదరాబాద్‌లో బాటసింగారం, మోజంజాహీ, గుడిమల్కాపూర్, బోయిన్పల్లి పండ్ల మార్కెట్లు ముఖ్యమైనవి. పోషక అవసరాలను తీర్చడంలో ఉద్యానవన ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. బాటసింగారం మార్కెట్లోకే 2023–24లో 4,65,633 టన్నుల పండ్లు దిగుమతి అయ్యా యని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం తెలిపింది. ఖరీదు ఎక్కువే.. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లు ఖరీదైనవే ఉంటున్నాయి. డ్రాగన్, కివీ, ఖర్జూర, చెర్రీ వంటి పండ్లు ఎక్కువ ధర పలుకుతుండగా సాగు, సీజన్ బట్టి మామిడి, యాపిల్, దానిమ్మ ధరలు కూడా అధికంగానే పలుకుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ధర క్వింటాల్‌కు రూ.1,13,610 ఉండగా.. పియర్ రూ.30 వేలు, కివీ రూ.18,471, చెర్రీ రూ.24,975, నల్లద్రాక్ష రూ.17,344, ఖర్జూర రూ.16,100, మామిడి రూ.13,338, యాపిల్ రూ.15,927, దానిమ్మ రూ.14,225 ఉన్నాయి. సపోటా, మోసంబీ, బొప్పాయి, నారింజ, అరటి వంటి లోకల్ ఫలా లు ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉన్నాయి. క్రేజీ ఫ్రూట్స్! గ్రేటర్లోకి విదేశాల నుంచి పండ్ల దిగుమతి న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చిలీ, ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ వంటి దేశాల నుంచే ఎక్కువగా.. కివీ, చెర్రీ, ప్లం, పియట్, డ్రాగన్ వంటి ఖరీదైన పండ్లకు గిరాకీ ఫుల్ గ్రేటర్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఉష్ణమండలం, సహజ వనరులు, అనువైన నేలలతో పాటు విస్తారమైన భూమి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 94,139 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంట లు సాగవుతున్నాయి. జిల్లాలోని మొత్తం పంట విస్తీర్ణంలో ఉద్యానాల సాగు విస్తీర్ణం వాటా 30–40 శాతం వరకు ఉంటుంది. ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి, జామ, తీపి నారింజ, దానిమ్మ, ఆమ్ల నిమ్మ, పుచ్చకాయ ప్రధానంగా సాగు అవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఉద్యానవన పంటలు లాభదాయకయమైన రాబడిని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాసెసింగ్ పరిశ్రమకు ముడి పదార్థాలను అందించడం, ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం వంటి కారణాలతో గణనీయమైన ప్రాముఖ్యతను పొందుతుంది. -
అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త
షాద్‌నగర్: అగ్ని ప్రమాదాలపై అందరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం పట్టణంలోని ఫైర్ స్టేషన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం ప్రారంభం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు బాబర్‌ఖాన్, రఘు నాయక్, మంగులాల్ నాయక్, కరుణాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జగన్ తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
పిడుగుపాటుతో ఆవుదూడ మృతి
మాడ్గుల: పిడుగుపాటుతో ఆవుదూడ మృతిచెందిన సంఘటన మండలంలోని నల్లవారిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బలగొనిచంద్రయ్య సోమవారం సాయంత్రం తన ఆవు దూడకు మేత వేసి, పొలం పనులు చేసుకుంటున్నాడు. ఈ సమయంలో వర్షం మొదలై, ఆవుదూడ సమీపంలో పిడుగు పడింది. దీంతో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందజేయాలని బాధిత రైతు కోరాడు. చలివేంద్రం ప్రారంభోత్సవం పూడూరు: ప్రతీ ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కెరవెళ్లి గేటువద్ద కాంగ్రెస్ నాయకుడు అలీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, రఘునాథ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, కార్యదర్శి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
కడ్తాల్: ‘రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం భూ భారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకం, సులభతరం కానుంది’అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ధరణి ఫోర్టల్ స్థానంలో, భూ భారతి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో సోమవారం మండల కేంద్రం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూన్ 2నుంచి అమలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. వారి భూములను.. ఆ పార్టీ పెద్దలు, నాయకులు దోచుకున్నారని విమర్శించారు. సమస్యను బాధిత రైతులు నాటి ప్రభుత్వం తెచ్చినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. వీటన్నింటిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూ భారతిని తెచ్చిందని వివరించారు. ఈ పోర్టల్‌ను రాష్ట్రంలోని మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలతో పకడ్బందీగా జూన్ 2, 2025 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పూర్తి స్థాయిలో పోర్టల్ అమలు కానుందని స్పష్టంచేశారు. రైతులకు అన్ని విధాలుగా అర్థమయ్యేలా పోర్టల్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, కిసాన్‌సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, నాయకులు జంగారెడ్డి, రాజేశ్, షాబుద్దీన్, బిక్కునాయక్, సేవ్యానాయక్, భానుకిరణ్, శ్రీకాంత్, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. సులభతరం కానున్న రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచిపోర్టల్ అమలు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
కుల్కచర్ల: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ అన్నారు. సోమవారం ఆయన చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.5 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రతీ కాలనీకి సీసీ రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్, దామోదర్‌రెడ్డి, నరేందర్, రాజు, వెంకటయ్య, జహంగీర్, నర్సింలు, స్థానిక నాయకులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. కుల్కచర్ల ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ -
అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం
తాండూరు టౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అజాగ్రత్తగా ఉంటేనే అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వేసవిలో నిప్పుతో అప్రమత్తంగా ఉండాలని, బీడి, సిగరెట్ వంటివి వెలిగించి అలాగే విసరేయరాదన్నారు. వంటిట్లో గ్యాస్ సిలిండర్‌ను అవసరం లేని సమయంలో ఆఫ్ చేసి పెట్టాలన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న అగ్నిప్రమాద నివారణ వారోత్సవాల్లో భాగంగా అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు, జాగ్రత్తలపై పలు ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. తాండూరు ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ జలంధర్ రెడ్డి ఉన్నారు.తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి -
పూజల పేరిట మోసం..
రూ.9.80 లక్షలు వసూలు, అఘోరిపై కేసు నమోదు శంకర్పల్లి: పూజల పేరిట ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేసిన అఘోరిపై మోకిల పోలిస్స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామానికి చెందిన ఓ మహిళ, ప్రగతి రిసార్ట్స్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఇతరుల ద్వారా అఘోరి పరిచయమైంది. ఈ క్రమంలో ప్రత్యేక పూజలు చేస్తానని సదరు మహిళను నమ్మించిన అఘోరి.. హైదరాబాద్, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో పూజలు చేసింది. అనంతరం ఆ మహిళ నుంచి రూ. 9లక్షల 80వేలను తీసుకుంది. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు.. ఫిబ్రవరి 25న మోకిల పీఎస్‌లో అఘోరిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల క్రితం నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. క్రషర్ మెషీన్లో పడి కార్మికుడి మృతి మేడ్చల్‌రూరల్: క్రషర్ మెషీన్లో పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మద్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనీష్‌సింగ్(27) గిర్మాపూర్‌లోని రోబో సిలికాన్ క్రషర్ మెషీన్లో ప్లాంట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున విధుల్లో ఉన్న అతను ప్రమాదవశాత్తు క్రషర్ మెషీన్లో పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్కీడ్రా విజేతలకు బహుమతుల అందజేత తాండూరు టౌన్: హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో విజేతలకు హనుమాన్ జన్మోత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం బహుమతులు అందజేశారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతిగా హోండా యూనికాన్ బైక్‌ను విజేత గుముడాల సుధాకర్ (నం.9253), ద్వితీయ బహుమతిగా హోండా ఆక్టీవాను విష్ణురాంజీకి (నం.6981) స్థానిక స్టేషన్ హనుమాన్ ఆలయ చైర్మన్ మిస్కిన్ శంకర్, నరహరి అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు రజినీకాంత్, మహేష్ ఠాకూర్, రామకృష్ణ, పునీత్, భవానీ సింగ్, గురురాజ్, శ్రీనివాస్, ఆనంద్, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పరామర్శ తాండూరు రూరల్: మండల పరిధిలోని సంగెంకలాన్ గ్రామానికి చెందిన ఎల్మకన్నె పీఏసీఏస్ మాజీ చైర్మన్ సంగెం నారాయణగౌడ్ సతీమణి ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం నారాయణగౌడ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంగెం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. అంతియ యాత్రలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మాజీ సర్పంచ్ మేఘనాథ్‌గౌడ్, నాయకులు రవీందర్, కేశవరావు, పండరి, సాయిలు, బోయ రాజు, హమీద్ మియా, శ్యామప్ప పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో దర్గా ఉత్సవాలు నవాబుపేట: మండల పరిధిలోని ఎక్మామిడి గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న సాహెబ్ హుస్సేన్ దర్గా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతన్నాయి. ఈ ఉత్సవాలకు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ ఎండీ రశీ, నాయకులు యాదవరెడ్డి, పాపిరెడ్డి, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు. -
వేసవి భత్యానికి మంగళం!
దోమ: ఎండలో పనిచేసే ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేసవి భత్యానికి నాలుగేళ్లుగా బ్రేక్ పడింది. ప్రభుత్వం గతంలో ఏటా వేసవి భత్యం అందించడంతో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించేది. కానీ ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో భత్యానికి ఈసారి కూడా మంగళం పాడినట్లేనని తెలుస్తోంది. కొరవడిన స్పష్టత.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పల్లె ప్రజలకు స్థానికంగా పని కల్పిస్తూ భరోసా అందిస్తోంది. దోమ మండల వ్యాప్తంగా 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 11,725 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా, 13,971 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు 3,790 మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఉపాధి హామీ కూలీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు ఐదు నెలల పాటు వారి వేతనానికి అదనంగా 25 నుంచి 30శాతం వేసవి భత్యం చెల్లించేది. కానీ గత నాలుగేళ్లుగా ఇది నిలిచిపోయింది. సౌకర్యాల లేమితో ఇబ్బందులు.. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కరువయ్యాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతుండటంతో మండుటెండల్లో పనిచేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. పని చేస్తున్న చోట కనీసం మంచినీరు, మజ్జిగ, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, టెంట్లు, అందుబాటులో ఉండటం లేదు. గత ప్రభుత్వాలు కూలీలకు టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, పారలతో పాటు ఇతర పనిముట్లను అందించేంది. కానీ పదేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి పరికరాలను అందించడం లేదు. తామే స్వయంగా ఇంటి వద్ద నుంచి పని ముట్లు, నీళ్ల బాటిళ్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉపాధి కూలీలకుఅందని అదనపు డబ్బులు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి పని ప్రదేశాల్లో వసతుల కరువు -
విద్యారంగాన్ని కాపాడుకుందాం
● యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య షాద్‌నగర్: విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య అన్నారు. పట్టణంలోని ఎంఆర్సీ భవనంలో సోమవారం సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు అధ్యక్షతన ‘పాఠశాల విద్య–ప్రభుత్వ విధానం, మనకర్తవ్యం’అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జంగయ్య మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ–2020) పేద వర్గాలకు నాణ్యమై విద్యను దూరం చేసేవిధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను కేంద్రీకరించేలా, కార్పొరేటీకరణకు అనుకూలంగా ఉందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి మండలంలో 4 నుంచి 5 పాఠశాలలను ఎంపిక చేసుకొని ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలలు ఒకే దగ్గర ఉండేలా, 6 నుంచి 12వ తరగతి వరకు ఒక క్యాంపస్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సత్యం, రామకృష్ణ, వినీత్, శేఖర్‌గౌడ్, బాలయ్య, జేవీవీ నాయకులు వెంకటరమణ, కుర్మయ్య, సీఐటీయూ నాయకుడు రాజు, టీజీఎస్, ఎస్ఎఫ్ఐ, డీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
ఇదేం ప‘రేషన్’!
జిల్లాలో 23 వేలకుపైగా కొత్త కార్డులు జారీసాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆహార భద్రత కార్డుపై ఒకరికి ఆరు కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుపై ఒకరికి పది కేజీల చొప్పున, అంత్యోదయ కార్డుపై ఒకరికి 35 కిలోల చొప్పున ప్రభుత్వం బియ్యం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంత్యోదయ కార్డుపై చక్కెర కిలో రూ.13.50కి ఇస్తోంది. ఇక గోధుమలు జీహెచ్ఎంసీ ఏరియాలో రూ.7 చొప్పున ఐదు కేజీలు, కార్పొరేషన్ పరిధిలో రెండు కేజీలు, మున్సిపాలిటీ సహా గ్రామీణ ప్రాంతాల్లో కేజీ చొప్పున సరఫరా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 5,58,664 రేషన్‌కార్డులు ఉండగా, వీటి పరిధిలో 18,25,128 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 11,631.810 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అంచనా వేసింది. ప్రజాపాలన, కులగణనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేసింది. కొత్తగా 23 వేల మందికి కార్డులు జారీ చేసింది. నెలవారీ కోటా విడుదల చేయకపోవడం, ఈకేవైసీ కాకపోవడంతో లబ్ధిదారులకు నిత్యావసరాలు అందడం లేదు. ప్రస్తుతం చౌకధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో కార్డులు పొందిన ఆయా లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. ఈ విషయంపై డీలర్లకు కూడా క్లారిటీ లేకపోవడంతో వచ్చిన వారికి ఏం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కార్డుల్లో కనిపించనిలబ్ధిదారుల పేర్లు సన్నబియ్యానికి నోచుకోని వైనం రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు తలలు పట్టుకుంటున్న డీలర్లు జిల్లాలో ఇదీ లెక్క.. రేషన్ కార్డులు అర్బన్ రూరల్ అంత్యోదయ 4,899 29,839 ఆహార భద్రత 2,03,505 3,20,381 అన్నపూర్ణ 01 39 రేషన్‌షాపులు 218 701 మొత్తం కార్డులు 2,08,405 3,50,259 మొత్తం యూనిట్లు 6,84,902 11,40,120 కేటాయించిన బియ్యం 4,221.145 (మె.ట) 7,410.665 (మె.ట) లబ్ధిదారులందరికీ సరఫరా చేస్తున్నాం అర్హులైన లబ్ధిదారులందరికీ సన్న బియ్యం సరఫరా చేశాం. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అక్కడి లబ్ధిదారులు చాలామంది జిల్లా పరిధిలోని రేషన్ షాపుల్లో బియ్యం తీసుకున్నారు. పోర్టబులిటీ ఎక్కువగా నమోదైంది. జిల్లా కోటాకు మించి దుకాణాలకు సరఫరా చేశాం. డీలర్లు రెండు పూటలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్త కార్డుదారులకు బియ్యం సరఫరా చేయలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదు. కార్డులు జారీ చేసిన వారందరికీ కోటా మంజూరు చేశాం. – పి.శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు చంటి శాంతి. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ. భర్త ఇటీవలే మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రజాపాలనలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ఇటీవల ప్రభుత్వం రేషన్ కార్డు (నంబర్ 365371648123) మంజూరు చేసింది. అయితే కార్డులో ఆమె పేరు కన్పించలేదు. కేవలం ఇద్దరు పిల్లల పేరుతోనే కార్డు జారీ చేశారు. ఈపాస్ మిషన్ పిల్లల వేలిముద్ర తీసుకోవడం లేదు. దీంతో ఆ కుటుంబం సన్న బియ్యానికి నోచుకోలేకపోయింది. చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు సిలువేరు లావణ్య. ఇటీవలే భర్త మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కవలపిల్లలు. ప్రజాపాలనలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఇటీవల మూడేళ్ల కుమారుడు సాయికృష్ణ పేరుతో కార్డు (నంబర్ 365371632786) మంజూరు చేసింది. కార్డులో తల్లితో సహా మరో పిల్లాడి పేరు కన్పించలేదు. దీంతో ఇప్పటి వరకు ఆ కార్డుకునిత్యావసరాల కోటా కేటాయించ లేదు. వీరే కాదు కొత్తగా రేషన్‌కార్డులు పొంది ప్రభుత్వంసరఫరా చేసే సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్దకు వెళ్తున్న అనేక మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. -
రాజ్యాంగాన్ని విస్మరించొద్దు
● రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విస్మరించడం తగదని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. యాచారం మండలంలోని కుర్మిద్దలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జైభీమ్ కార్యక్రమం నిర్వహించారు. నాలుగు గ్రామాల రైతులు, కూలీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రజల అంగీకారం లేనిదే భూసేకరణ చేయకూడదని, బలవంతపు సేకరణ చట్ట వ్యతిరేకమని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా సిటీ రద్దు చేసి రైతుల భూములు రైతులకే ఇవ్వాలని కోరారు. కోర్టు స్టే ఆర్డర్‌ను గౌరవించాలని, రైతులను భయభ్రాంతులకు గురి చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ పోరాట కమిటీ కన్వీనర్లు కవుల సరస్వతి, కుందారపు నారాయణ, మాజీ సర్పంచ్ బందే రాజశేఖర్‌రెడ్డి, కనమోని గణేశ్, మహిపాల్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, శ్రీకాంత్, వినోద్‌రెడ్డి, లింగం, సామ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
చక్రస్నానం.. తరించిన భక్త జనం
● ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ● చివరిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొయినాబాద్: ఎనిమిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రస్నానంతో ముగిశాయి. చివరిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం దేవాలయంలోని హోమగుండాల గదిలో పూర్ణహు తి చేపట్టారు. పూర్ణాహుతి ప్రసాదాన్ని అష్టదిక్పాలకులకు నైవేద్యంగా సమర్పించి బలిహరణం చేశారు. అంతకు ముందు స్వామివారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా అద్దాలపల్లకీలో ఆసీనులను చేసి అలంకరించారు. అనంతరం చక్రస్వామి, నవపాలికలు, స్వామివారిని పల్లకిలో దేవాలయం చుట్టూ ఊరేగించారు. శివాలయం పక్కనే ఉన్న మండపంలో నవకలశ స్థాపనం, పాలికల పూజతో దేవుళ్లందరినీ ఆవాహనం చేసి సుగంధద్రవ్యాలతో నవకలశ అభిషేకం నిర్వహించారు. చక్రస్వామిని ఆలయ సమీపంలో ఉన్న గండిపేట చెరువులోకి తీసుకెళ్లి చక్రస్నానం చేయించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ చక్రతీర్థాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్, కిట్టు, కన్నయ్య, మురళి పాల్గొన్నారు. దర్శించుకున్న పట్నం మహేందర్‌రెడ్డి మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు రంగరాజన్ ఆయనకు పూలమాల వేసి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, చిలుకూరు మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుండు గోపాల్, నాయకులు భిక్షపతి, బాల్‌రాజ్, శంకర్ తదితరులు ఉన్నారు. తరలివచ్చిన భక్తజనం బ్రహ్మోత్సవాల చివరిరోజు పరిసర ప్రాంతాలతోపాటు నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చక్రతీర్థం సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి అధికంగా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ధ్వజావరోహణంతో ముగింపుబ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా వస్త్రంపై గరుడ పటాన్ని చిత్రించి ధ్వజస్తంభానికి ఆరోహణం చేసిన వస్త్రాన్ని ముగింపు సూచికగా అవరోహణం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు. -
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు
కలెక్టర్ నారాయణరెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: వేసవి దృష్ట్యా తాగు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపితే.. అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట మరమ్మతులు చేయించాలన్నారు. భవిష్యత్తులో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు కొందుర్గు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని శంషాబాద్ డీసీపీ రాజేష్ హెచ్చరించారు. కొందుర్గు పోలీసుస్టేషన్ సోమవారం సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. పీఎస్ రికార్డులు, కేసు ఫైళ్లు, పోలీసు క్వార్టర్స్, పీఎస్‌లో వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది 100 డయల్‌కు కాల్ వచ్చిన వెంటనే జాప్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య, ఎస్సైలు రవీందర్ నాయక్, బాలస్వామి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం షాద్‌నగర్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో కెమిస్ట్రీ బోధించేందుకు రెండు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మహిళా అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విమానంలో వృద్ధుడికి అత్యవసర పరిస్థితి.. ఆదుకున్న సిటీ డాక్టర్ సాక్షి, సిటీబ్యూరో: విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడిని నగరానికి చెందిన వైద్యురాలు అత్యవసర వైద్య సేవలతో కోలుకునేలా చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకోగా.. సోమవారం వెలుగు చూసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల ఒంటరి వృద్ధుడికి అకస్మాత్తుగా మగతలోకి జారుకుని, నోటి నుంచి నురగ వచ్చింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న నగరంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠం జనరల్ ఫిజీషియన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన పల్స్ బలహీనంగా ఉందని, బీపీ తక్కువగా ఉందని గుర్తింంచారు. అత్యవసరంగా సీపీఆర్ చేయడంతో సదరు ప్రయాణికుడు కొన్ని నిమిషాల్లో స్పృహలోకి వచ్చారు. అనంతరం ఎయిర్పోర్ట్ సిబ్బంది సహకారంతో ఆ వృద్ధుడిని క్షేమంగా గమ్యానికి చేర్చారు. సకాలంలో స్పందించి వృత్తి పరమైన నిబద్ధతను ప్రదర్శించిన డా.ప్రీతిరెడ్డిని ప్రయాణికులు అభినందించారు. -
అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కందుకూరు: అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకుసాగాలని ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కొత్తూర్ గేట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కేసీఆర్ హయాంలో సెక్రటేరియట్‌కు ఆయన పేరు పెట్టారని అన్నారు. ఎవరి వద్దా చేయి చాపొద్దనే ఉద్దేశంతో దళితులకు దళిత బంధు పథకం తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోపెట్టిన విధంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కాకి దశరథ, జి.సామయ్య, జంగయ్య, రాంరెడ్డి, ఆనంద్, జైపాల్, ఇందిర, కృష్ణ, సురేష్, వెంకటేశ్, నర్సింహ, నవీన్, మేఘనాథ్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, దీక్షిత్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీహరి, లచ్చానాయక్, శ్రీనివాస్, యాదయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే సబితారెడ్డి -
రైతు నెత్తిన.. విత్తన భారం
షాబాద్: పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవిచూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు నకిలీ విత్తనాల బెడద కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఏటా ధరల దడ ఏటా పత్తి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. విత్తనాలు, పురుగు మందులకు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు కలుపుతీత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తన కంపెనీలు ఏటా ధరలు పెంచుతుండడంతో మరింత భారం పడుతోంది. బీటీ పత్తి విత్తనాల ధర ఆరేళ్లుగా పెరుగుతూ వస్తోంది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం రూ.901కి చేరింది. తగ్గుతున్న పంట దిగుబడి పత్తి పంట వేసిన నాటి నుంచి చేతికొచ్చే వరకు రైతులకు ఆందోళన తప్పడం లేదు. సరైన సమయానికి వర్షాలు పడకపోవడం.. పూత, కాత సమయంలో ఎక్కువగా పడటం తదితర కారణాలతో పంట దిగుబడులపై ప్రభావం చూపుతోంది. చేతికొచ్చిన పంట తీసే సమయంలో కూలీలు దొరక్క నేల రాలి దిగుబడి తక్కువగా వస్తోంది. పెరుగుతున్న పెట్టుబడి పత్తి పంట సాగు చేసేందుకు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు వస్తోంది. దుక్కి దున్నడం నాటి నుంచి భూమిని చదును చేయడం, విత్తనాలు వేయడం, కలుపు, మందుల పిచికారీ, పత్తి తీత కూలీ ఖర్చులు ఉంటాయి. ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటుందని రైతులు చెబుతున్నారు. గతేడాది బీటీ–2 పత్తి విత్తనం 475 గ్రాముల ప్యాకెట్ ధర రూ.867 ఉండగా ఈ ఏడాది రూ.901కి పెరిగింది. ఆయా కంపెనీలు అన్ని రకాల విత్తనాల ధరలు పెంచేశాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్టుబడులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచిన కంపెనీలు ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడు మరింతగా పడనున్న ఆర్థిక భారం ఆందోళనలో అన్నదాతలుధరలు తగ్గించాలి పత్తి విత్తనాల ధరలను ఏటా పెంచుతుండంతో ఆర్థిక భారం పడుతోంది. పెంచిన ధరలను కంపెనీలు వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. విత్తనాల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్మే దాకా రైతుల చేతిలో ఏదీ ఉండడం లేదు. – నర్సింహారెడ్డి, రైతు, మన్మర్రి ఖర్చులు పెరిగాయి ప్రతీ సంవత్సరం పత్తి పంట సాగు చేసేందుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చు వస్తోంది. విత్తనాల ప్యాకెట్ల ధరల పెంపుతో మరింత భారం పడుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. – విజయభాస్కర్‌రెడ్డి, రైతు, మరియాపురం -
కాంగ్రెస్ పాలనతో జనం విసిగిపోయారు
కందుకూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని సార్లరావులపల్లిలో ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌తో కలిసి నూతనంగా నిర్మించిన శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి విధివిధానాలు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించారని, ఆ భూముల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ, ఫోర్త్‌సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. అందులో ఎలాంటి పనులు చేపట్టకుండానే అదనంగా భూసేకరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఫార్మాసిటీలోకి నేరుగా చేరుకునేలా కొత్తూరు గేట్ నుంచి 200 అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రహదారి పేరుతో ఈ ప్రాంతంలోని విలువైన భూములను అమ్ముకోవడానికి చూస్తోందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో గ్రామాలను విడదీస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టారన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేలా శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రం నిర్మిస్తున్న త్రిబుల్ఆర్ రోడ్డు తూర్పు భాగంలో కేసీఆర్ హయాంలో రాజకీయాలకు అతీతంగా భూసేకరణ చేశారన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం రోడ్డును మరింత దూరం పెంచుతూ పోతున్నారని విమర్శించారు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి నిర్మించతలపెట్టిన 330 అడుగుల ఫ్యూచర్‌సిటీ గ్రీన్ ఫీల్డ్ రహదారిని విరమించుకోవాలన్నారు. వారి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథనాయక్, మాజీ సర్పంచ్ రజితప్రవీణ్నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఇందిర, సురేష్, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.మేఘనాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి -
కడుపులో పొడిచి.. గొంతుకోసి
షాద్‌నగర్: గుర్తు తెలియని యువకుడిని కత్తితో కడుపులో పొడిచి, గొంతుకోసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన ఫరూఖ్‌నగర్ మండలంలింగారెడ్డిగూడ శివారులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని యువకుడిని (30)ని కొందరు దుండగులు శనివారం అర్ధరాత్రి ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలోని జాతీయ రహదారి పక్కకు తీసుకువచ్చారు. కత్తితో కడుపులో పొడిచి, గొంతు కోసి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఏసీపీ రంగస్వామి పట్టణ సీఐ విజయ్‌కుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. మృతుడి శరీరంపై నలుపు రంగు కార్గో ప్యాంటు, నీలం రంగు షర్టు ఉన్నాయి. మెడలో వేంకటేశ్వరస్వామి లాకెట్‌తో పసుపు, ఎరుపు రంగు దారం దండ ఉంది. ఛాతి ఎడమ వైపున పచ్చబొట్టు, కుడి చేతిపై జై బాలయ్య పేరుతో పచ్చబొట్టు ఉన్నాయి. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు పోలీస్ స్టేషన్లో సమా చారం అందించాలని సీఐ విజయ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య -
విద్యారంగ పరిరక్షణకు కృషి
యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య ఇబ్రహీంపట్నం రూరల్: విద్యారంగం అభివృద్ధి, పరిరక్షణ కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య పేర్కొన్నారు. సంఘం 12వ ఆవిర్భావ వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సెమినార్లో మాట్లాడారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి నిరంతరం పోరాడుతున్న సంఘం యూటీఎఫ్ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వచ్చే జూన్ లో బడిబాట, కళాజాత నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదరణ లభించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బి.రాములయ్య, కోశాధికారి జగన్నాథ శర్మ, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ కిషన్ చౌహాన్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుగంధ, సీనియర్ నాయకులు నాగేంద్రం, ఆయా మండలాల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. నీటి బకెట్లో పడి బాలుడి దుర్మరణం నందిగామ: ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు నీటి బకెట్లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చేగూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటాచారి కుమారుడు ఆద్యుత్ (15 నెలలు) ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు అక్కడే నీటితో నిండి ఉన్న బకెట్లో పడిపోయాడు. అదే సమయంలో బయ ట నుంచి వచ్చి చూసిన తండ్రి వెంటనే సమీపంలోని కన్హా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలి పారు. అప్పటిదాక బుడిబుడి అడుగులతో సందడి చేసిన బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెచ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ పరిసరాలను శోభాయమా నంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేడ్కర్ సిద్ధాంతాలను, ఆలోచనలను భావితరాలకు పరిచయం చేసేలా వినూత్నమైన కళా ప్రదర్శన నిర్వహించనున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ప్రదర్శనలో యువత తన కళాత్మకతను, సృజనాత్మకతను సమున్నతంగా ఆవిష్కరించనుంది. అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా సమానత్వం, సామాజిక న్యాయం, సాధికారత వంటి అంశాలను ప్రతింబింబించేలా ప్రముఖ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ విద్యా సంస్థలకు చెందిన 90 మంది విద్యార్థులు రూపొందించిన అనేక రకాల కళాకృతులను ప్రదర్శించనున్నారు. ప్రాణం తీసిన తనిఖీల భయం ● ట్రాఫిక్ పోలీసులను చూసి.. బైక్ వెనక్కి మళ్లించి వెళ్తుండగా ప్రమాదం బాలానగర్: బాలానగర్ డివిజన్ పరిధిలోని ఐడీపీఎల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తన ౖబైక్‌ను వేగంగా వెనక్కి మళ్లించి వేగంగా వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ నరసింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ నగర్లో నివసించే జోషిబాబు (35) కార్పెంటర్ పని చేస్తున్నాడు. జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వీరిని చూసి భయపడి తిరిగి వేగంగా వెనక్కి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనం పడిపోయింది. దీంతో అతని తలపై నుంచి ఆర్టీసీ దూసుపోయింది. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. -
హక్కుల సాధనకు పోరాడుదాం
షాద్‌నగర్: హక్కుల సాధనకు కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. పట్టణంలోని యమ్మి హోటల్లో ఆదివారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో శంషాబాద్‌లో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు శ్రీను, చంద్రబాబు, లింగంనాయక్, గోవింద్ నాయక్, జంగయ్య, రమేశ్, రాజునాయక్, శంకర్, పవన్ చౌహాన్, ఆకాశ్ పాల్గొన్నారు. వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి కొత్తూరు: జీవనోపాధి కోసం ఆయా రాష్ట్రాల నుంచి షాద్‌నగర్‌కు వచ్చిన వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి పానుగంటి పర్వతాలు కోరారు. కొత్తూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 21, 22న శంషాబాద్‌లో నిర్వహించనున్న భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను పరిశ్రమల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీకి గురిచేస్తున్నట్లు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి వలస, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, శేఖర్‌రెడ్డి, షకీల్, జంగయ్య, సంజీవ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు -
అశ్వ వాహనంపై బాలాజీ
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు అశ్వ వాహనంపై ఊరేగారు. ఆలయంలో మహాభిషే కం, ఆస్థాన సేవ, దోప్‌సేవ, పుష్పాంజలి సేవలు అందించారు. వేదపండితుల మంత్రోశ్చరణలు.. భక్తుల గోవింద నామస్మరణలు.. డోలు, డప్పు వాయిద్యాల మధ్య చిలుకూరు బాలాజీ దివ్యరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి దివ్యరథోత్సవం శనివారం అర్థరాత్రి కనుల పండువగా సాగింది. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఆసీనులై దేవాలయం చుట్టూ ఊరేగారు. శ్రీదేవి, భూదేవిలను వివాహం చేసుకున్న స్వామివారు వారిని గ్రామస్తులకు చూపించే క్రమంలోనే రథోత్సవం జరుగుతుందని ఆలయ అర్చకుడు రంగరాజన్ భక్తులకు వివరించారు. రాత్రి 11 గంటలకు స్వామివారు, అమ్మవార్లకు అద్దాలమహల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొదటి అంతస్తులో ఆసీనులను చేశారు. రథం ముందు అర్చకులు హోమం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు కదిలించారు. స్వామి వారి రథోత్సవంలో పాల్గొనటంతోపాటు రథాన్ని తాకితే అంతామంచి జరగుతుందన్న విశ్వాసంతో భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన కన్నయ్య, కిట్టు, మురళి తదితరులు పాల్గొన్నారు. వైభవంగా రథోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు -
రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం
● ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీ రద్దు చేశాం ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: పేదల భూములు తీసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని మల్కీజ్‌గూడ, ధర్మన్నగూడ, నందివనపర్తి గ్రామాల్లో రూ.75లక్షల విలువ చేసే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నందివనపర్తిలో జ్యోతి ఎడ్యుకేటర్ యూత్ అసోసియషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు సంగం సత్తయ్య విగ్రహ ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మేరకు పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఫార్మా రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైతే మార్కెట్ ధర చెల్లించి రైతులను ఒప్పించాలని.. ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఫోర్త్ సిటీ తీసుకొచ్చామన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, నాయకులు శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, పాండురంగారెడ్డి, అమృతాసాగర్, ధనుంజయ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షాలు.. అప్రమత్తత మేలు
● చెట్ల కిందకు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి ● ఉరుములు, మెరుపులు చూసేందుకు యత్నించొద్దు షాబాద్: అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులతో మెరుపులతో కూడిన పెద్ద శబ్ధాలతో పిడుగులు పడతాయి. వీటికి బలమైన అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. దీంతో వీటి ప్రభావంతో మనుషులతో పాటు జంతువులు మృత్యువాత పడుతున్నాయి. పిగుడుల ప్రభావానికి పచ్చని చెట్లు సైతం కాలిపోతుంటాయి. పిడుగు అంటే...? మేఘాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు చిన్న మంచు కణాలుగా విడిపోతుంది. ఈదురు గాలులకు వాటి మధ్య రాపిడి జరిగి, ఇందులోని పాజిటివ్ కణాలు తేలికగా ఉండటం వల్ల మేఘాల పైకి వెళ్తుంటే, నెగెటివ్ కణాలు బరువుగా ఉండి కిందికి వెళ్తుంటాయి. ఈ క్రమంలో పాజిటివ్, నెగెటివ్ కణాలు ఆకర్షించుకొని మెరుపులు వస్తాయి. ఈ సమయంలో మేఘంలోని నెగిటివ్ కణాలు, భూమిలోని పాజిటివ్ కణాలను ఆకర్షిస్తుంటాయి. అప్పుడు భూమిపై ఎత్తుగా ఉండే చెట్లు, గుట్టలు, మనుషులపై పిడుగు పడుతుంది. బయటకు వెళ్లొద్దు వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కిందకు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి వెళ్లొద్దు. పిడుగుపడే సమయంలో ఆకాశంలోని మెరుపులు అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి. ఆ వెలుతురును చూసేందుకు ప్రయత్నించొవద్దు. పిడుగుకు కొన్ని మిలియన్ మెగావాట్ల శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సమయస్ఫూర్తి అవసరం వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. వీలు కాకపోతే సమయస్ఫూర్తితో వ్యవహరించి, మోకాళ్లపై చేతులు, తలపెట్టి, దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి. దీంతో సమీపంలో పిడుగు పడినా అందులోని విద్యుత్ ప్రభావం తక్కువగా ఉండి, బతికేందుకు అవకాశాలు ఉంటాయి. పిడుగు పడుతుందని అనిపించినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకోవడం మంచిది. ఒకవేళ వేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కాలును భూమి మీద పూర్తిగా ఆనించొద్దు. కాలి వేళ్ల మీద ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యుత్ పరికరాలకు నష్టం పిడుగు పడినప్పుడు విద్యుత్ పరికరాలకు ఎక్కువ నష్టం వాటిల్లితుంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. టీవీ, రిఫ్రిజిరేటర్, సెల్‌ఫోన్ వంటి వాటిని వినియోగించకపోవడం ఉత్తమం. మెరుపులు వస్తున్నప్పుడు ఆరుబయట స్నానం చేయడం, వంట పాత్రలు కడగడం చేయవద్దు. లోహపు వస్తువుల ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశాలు ఎక్కువ. -
మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్ రకాల విడుదల
మేలు రకాలను గుర్తించాలి రైతులకు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు రావడం తక్కువ నీటితో పంట సాగయ్యేలా వంగడాలను తీసుకొచ్చేందుకు విశ్వవిద్యాలయంలో నిరంతరం కృషి చేస్తున్నాం. ఇందు కోసం వర్సిటీ శాస్త్రవేత్తలు తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా వరి వంగడాలను తీసుకొచ్చాం. ఇప్పుడు మొక్కజొన్న డీహెచ్ఎం చాలా మంచి రకాలు. ఇందులో 6 రకాలు మంచి దిగుబడి ఇస్తాయి. రైతులు ఈ విషయాలను గుర్తించి ఆయా రకాలను సాగు చేస్తుకోవాలి. ఇవి మెట్ట సాగుకు చాలా అనుకూలం. నీరు తక్కువగా ఉన్నా సాగు చేసుకోవచ్చు. – అల్దాస్ జానయ్య, ఉప కులపతి, పీజేటీఎస్‌యూ ఏజీవర్సిటీ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఐదు ఉత్తమ హైబ్రీడ్ మొక్క జొన్న రకాలను విడుదల చేసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఇటీవల తమిళనాడులో నిర్వహించిన అభిల భారత మొక్క జొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో విడుదల చేశారు. హైబ్రీడ్ మొక్క జొన్న రకాలు ఇవీ... వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఉత్తమ హైబ్రిడ్ మొక్కజొన్న రకాలు దక్కన్ హైబ్రిడ్ మక్క 144, ఈహెచ్ఎం 182, డీహెచ్ఎం193, డీహెచ్ఎం 206, డీహెచ్ఎం218లో కలిపి ఈ విశ్వవిద్యాలయం నుంచి మొత్తం 24 మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు విడుదల అయ్యాయి. ఇందులో డీహెచ్ఎం 144 (తెలంగాణ మక్క–6) రకంలో అధిక పిండి పదార్థాలు ఉండటం వలన ఇథనాల్ ఉత్పత్తికి బాగా అనుకూలంగా ఉంటుందని విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. దీంతో పాటు డీహెచ్ఎం 206 (తెలంగాణ మక్క–3) మెట్ట సాగుకు అనుకూలమైనదని తెలిపారు. ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుందన్నారు. ప్రస్తుతం రైతాంగానికి అందుబాటులో ఉన్న వివిధ మొక్కజొన్న వంగడాలతో పోల్చితే డీహెచ్ఎం అన్ని విధాలా మేలైందని వారు స్పష్టం చేశారు. పరిశోధనలో రాబోయే కాలంలో రైతాంగం వినియోగించుకోవలసిందిగా విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 16 పంట రకాలకు కేంద్రం గుర్తింపు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కాలంలో విడుదల చేసిన 16 రకాల వివిధ పంటలను ఇటీవల కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారిక ప్రకటిత రకాలుగా (నోటిఫైడ్ వైరెటీస్) గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. జయశంకర్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఆయా పంట రకాలను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వంత్రిత్వ శాఖ విత్తనోత్పత్తి ప్రణాళికలు రూపొందించి ఈ రకాలను రైతాంగానికి అందుబాటులోనికి తెవడానికి సహకరిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ విత్తన సంస్థలు ఈ రకాల మూల విత్తన సరఫరాకు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ మక్క–6 తెలంగాణ మక్క–3 ఆవిష్కరించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం అధిక దిగుబడితోపాటు రైతులకు ఎంతో మేలు చేసే రకాలు ఏజీ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య -
సీఎస్ఆర్ నిధులతో చెరువుల పరిరక్షణ
కొత్తూరు: చెరువుల పరిరక్షణకు పారిశ్రామిక దిగ్గజాలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం ఆయన అమెజాన్, సేట్రీస్ సంస్థల సహకారంతో కొత్తూరు పట్టణంలో చేపట్టనున్న సాయిరెడ్డి చెరువు అభివృద్ధి పనులను ప్రా రంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు బహుళజాతి పరిశ్రమలు అనుసరిస్తున్న విధానం సంతోషకరమన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లోకి భారీ వర్షాలు కురిసినప్పటికీ వివిధ కారణాల వల్ల వరద నీరు చేరడం లేదన్నా రు. మరికొన్ని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం చాలా వరకు తగ్గిందన్నారు. దీంతో భూగర్భ జలా లు త్వరగా అడుగుంటుతున్నాయని వివరించారు. బహుళజాతి పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులతో చెరువుల పరిరక్షణతో పాటు భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌లో సత్ఫలితాలిస్తాయన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే సంస్థలకు రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు సహకారం అందించాలని కోరారు. కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సేట్రీస్ సంస్థ సీఈఓ దేవకాంత్, ప్రతినిధులు అమరేందర్, సురేశ్, షహనాజ్ అన్సారీ, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, నాయకులు సుదర్శన్‌గౌడ్, దేవేందర్‌ముదిరాజ్, హరినాథ్‌రెడ్డి, దేవేందర్‌యాదవ్, శ్రీను, గోవింద్‌నాయక్, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రం
కడ్తాల్: దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. పీసీసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టిన జైబాపు, జై సంవిధాన్ పాదయాత్ర ఆదివారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి, పుల్లేరుబోడ్ తండాల్లో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు పార్టీ ఆధ్వర్యంలో జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టామన్నారు. బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆరోపించారు. సకల జనహితమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమాభివృద్ధి ప్రతిపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఎస్సీసెల్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు జగన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, పార్టీ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, నాయకులు హన్మానాయక్; యాదగిరిరెడ్డి, రామకృష్ణ, శంకర్, జగన్‌గౌడ్, జహంగీర్‌అలీ, సత్యం, సుమన్, కేశవులు, యాదగిరిరెడ్డి, వెంకటేశ్, నరేశ్‌నాయక్, షాబుద్దీన్, ఇమ్రాన్, జవహర్, యాదయ్య, రాజుగౌడ్, రాంచందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సకలజనహితమే కాంగ్రెస్ లక్ష్యం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
నినదించి.. హోరెత్తించి
మొయినాబాద్: రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ అంటూ వీర హనుమాన్ శోభాయాత్ర వైభవోపేతంగా కొనసాగింది. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచి మొయినాబాద్ శివాలయం వరకు భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంతో నృత్యాలు చేశారు. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆధిత్య పరాశ్రీ స్వామి, చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడురంగరాజన్ పాల్గొని ప్రసంగించారు. హిదూధర్మాన్ని రక్షించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గున్నాల గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు శ్రీరాములు, నరేందర్, రాజు, గణేష్, రాజమల్లేష్, శ్రీకాంత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శోభాయమానంగా వీర హనుమాన్ శోభాయాత్ర -
పూజల పేరిట మోసాలు నకిలీ బాబా అరెస్టు
కాచిగూడ: ‘మీ జాతకం బాగాలేదు..శాంతి పూజలు చేయాలి’ అంటూ ఓ మహిళకు మాయమాటలు చెప్పి అందిన కాడికి బంగారం, నగదుతో ఉడాయించిన బురిడీ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్యతో కలిసి డీసీపీ డాక్టర్ బాలస్వామి వివరాలు వెల్లడించారు. ఎల్బీ నగర్‌లోని రాక్ టౌన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు అరిగెల సాంబశివుడు (45) అలియాస్ గురూజీ శివస్వామి వృత్తిరీత్యా ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్‌తో దొంగబాబా అవతారం ఎత్తాడు. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన గీతా వైద్య దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలేజీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. సంవత్సరం క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సౌమ్య ద్వారా గీతకు సాంబశివుడు పరిచయమయ్యాడు. మీ ఇంటికి దోషం ఉందని, మీ పేరు మీద బాగాలేదని ముందు ముందు చాలా ఇబ్బందులు పడతారని, మీ భర్త చనిపోయినట్లే మీ కుటుంబం అంతా చనిపోతారని భయపెట్టాడు. దోషం పోవాలంటే పూజలు చేయించాలని, ఇందుకు రూ.1.70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అనంతరం కొద్దిరోజులకు మళ్లీ మీ కూతురికి పెళ్లయితే విడాకులు అవుతాయని, అందుకు దోష నివారణకు పూజలు చేయాలని, దానికి లక్షలు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పాడు. దీంతో భయపడిన గీత తన దగ్గర ఉన్న 26 తులాల బంగారు నగలు ఇచ్చింది. అదే కాకుండా ఆమె ఇంటి పత్రాలను కూడా ఇచ్చింది. ఈ దశలో అనుమానం వచ్చిన గీతా వైద్య కూతురు ప్రతిఘటించి దొంగ బాబా దగ్గర ఇంటి పత్రాలను తిరిగి తీసుకున్నారు. అనంతరం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు సాంబశివుడిని అదుపులోకి తీసుకొని అతనివద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి బురిడీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. -
మహిళలు స్వయం ఉపాధి పొందాలి
హయత్‌నగర్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి సరైన మార్గమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 200 మంది మహిళలకు శనివారం తొర్రూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం అభినందనీయమన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అతివలు మరొకరికి మార్గదర్శకంగా నిలవాలని, ఒకరికొకరు చేయూతనందించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ యాదిరెడ్డి, నాయకులు బలవంతరెడ్డి, ధన్రాజ్గౌడ్, రమేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్, బాల్‌రాజ్‌గౌడ్, పాండు, మధుసూదన్‌రెడ్డి, పోచయ్య, యాదగిరి తదితరులు పాల్నొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
అంతర్రాష్ట్ర చీరల చోరీ ముఠా అరెస్టు
మియాపూర్: చీరలు కొనేందుకు షాపింగ్ మాల్స్‌కు వెళ్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఏడుగురిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ చీరల చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా నుంచి రూ.2 లక్షల విలువ చేసే చీరలు, ఇక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్,డీఐ రమేష్ నాయుడు కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తిరుపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు, చౌటూరు గ్రామానికి చెందిన కట్ట యశోద, సద్దుపాటి తిరుపతమ్మ, వెంకటేశ్వరమ్మ, చట్రాయిమండలం జనరాద్రవార గ్రామానికి చెందిన రమణ అలియాస్ రావణక్క, విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన దేరవకొండ సుభాషిణి, జగ్గయ్యపేట్కు చెందిన వెంకటేశ్వర్లు ఓ ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాలలో చీరల దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఈ ముఠాలో సుమారు 50 నుంచి 100 మంది సభ్యులున్నట్లు తెలిపారు. వీరు గ్రూపులుగా ఏర్పడి 30 సంవత్సరాల నుంచి చీరల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇన్నోవా కారులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ తిరుగుతూ తక్కువ ఉద్యోగులు ఉన్న షాపింగ్ మాల్స్, ఇళ్లల్లో చీరల వ్యాపారం నిర్వహించే వారిని టార్గెట్ చేసుకుంటారు. నిర్వాహకులు దృష్టి మరల్చి చీరలు దొంగిలిస్తారు. ప్రతి నెలా 5 నుంచి 8 దొంగతనాలకు పాల్పడతారు. దొంగతనం తర్వాత మొక్కులు చెల్లిస్తారు దొంగిలించిన చీరలను తీసుకుని వీరు కారులో యాదగిరిగుట్ట, ఇతర దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ దేవుడికి మొక్కులు చెల్లించుకుని అనంతరం విజయవాడకు వెళ్లి కనకదుర్గమ్మ దేవాలయం ముందు, బస్టాప్, సంతల్లో, రద్దీ ప్రదేశాల్లో ఒక్కో చీరను రూ.2 వేల నుండి 10వేల వరకు అమ్ముతుంటారు. అమ్మగా వచ్చిన డబ్బులను ముఠా సభ్యులు పంచుకుంటారు. కాగా చీరల దొంగతనం చేసే ముఠా సభ్యులపై పదుల సంఖ్యలో కేసులున్నాయి. అనేక సార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయినా వీరు దొంగతనాలు మానలేదని చెప్పారు. మియాపూర్ పోలీసులకు ఇలా పట్టుబడ్డారు గత 28వ తేదీన మియాపూర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ముఠా సభ్యులు వెంకటేశ్వరరావుతో పాటు మహిళలు చీరల షాపుకు వెళ్లారు. షాపు నిర్వహించే మహిళ బయటకు వెళ్లడంతో ఆమె భర్త వచ్చిన వారికి చీరలు చూపించాడు. చీరలు చూస్తూ యజమాని దృష్టి మరల్చేందుకు నీళ్లు కావాలని అడిగారు. దీంతో యజమాని ఇంట్లోకి వెళ్లి వాటర్ తీసుకువచ్చేలోపు మరికొంత మంది మహిళలు చీరలు దొంగిలించారు. కొద్దిసేపు చీరలు చూసి మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి షాపు నిర్వాహకురాలు ఇంటికి వచ్చి పరిశీలించగా 14 చీరలు కనిపించలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 3వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. ఏడుగురి రిమాండ్..రూ.2 లక్షల విలువైన చీరలు, కారు స్వాధీనం -
భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు పంపిణీ
చేవెళ్ల: ప్రజల వద్దకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందని విలేజ్ బస్సు అధికారులు (వీబీఓలు) ఎ.రవీందర్, సి.బాల్‌రాజ్ అన్నారు. భద్రాచలం సీతారాములు కల్యాణ తలంబ్రాలకోసం ముందుగా బుక్ చేసుకున్న చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ప్రజలకు శనివారం వీబీఓలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం సీతారాములు కల్యాణ తలంబ్రాలు కావాలనుకునేవారు ఆర్టీసీ కార్గో సేవల ద్వారా బుక్ చేసుకోవాలని ఆయా మండలాల్లో ముందుగా ప్రచారం చేసినట్లు చెప్పారు. అప్పుడు బుక్ చేసుకున్నవారికి భద్రాచలం నుంచి కార్గో సర్వీస్ ద్వారా ప్యాకింగ్‌లో వచ్చిన తలంబ్రాలను అందజేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్టు వివరించారు. సేవలపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మహేశ్వరం: అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మొహబ్బత్‌నగర్ గ్రామ పరిధిలోని అవేర్ సంస్థలో శనివారం ‘అవినీతి– న్యాయవ్యవస్థ’ అంశంపై బీఈడీ విద్యార్థులకు నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. అవినీతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమైందని, దానిని కూకటివేళ్లతో పెకిలించాలని అన్నారు. తెలంగాణలో గత పాలకులు చేసిన తప్పులే ప్రస్తుత పాలకులు చేస్తున్నారన్నారు. గతంలో చేసిన అవినీతి తప్పిదాలు పునరావృతం కాకూడదన్నారు. డబ్బుతో ప్రజాస్వామ్యం, ఓట్లను ఎప్పుడూ కొనలేరన్నారు. యువత అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలని ఆయన పిలు పునిచ్చారు. గిరిజనులు, దళితులు, ఆదివా సీలు, పేద విద్యార్థుల సంక్షేమం కోసం అవేర్ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అంతకు ముందు ప్రముఖ న్యాయవాదులు, ప్రొఫెసర్లు అవినీతి – న్యాయవ్యవస్థ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్‌జీ, డైరెక్టర్ రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. వరదల నివారణకు ముందస్తు చర్యలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వర్షాలొస్తే నగరంలో ముంపు సమస్యలు తగ్గడం లేదు. రోడ్లు, కాలనీలు, బస్తీలు చెరువులుగా మారే పరిస్థితి తప్పడం లేదు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) ద్వారా వరద కాల్వల విస్తరణ, ఆధునికీకరణ పనులతో సమస్యలు కొంత మేర తగ్గినా, పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో వర్షాలకు ముందస్తుగానే తగిన చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చనే ఆలోచనలో ఉన్న జీహెచ్ఎంసీ వాతావరణ శాఖ, టీజీడీపీఎస్లతో కలిసి సమన్వయంతో పని చేయాలని భావిస్తోంది. నగరంలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నాయో.. ఎంతమేర కురియనున్నాయో ముందుగానే తెలిస్తే.. అక్కడ అవసరమైన యంత్రాంగాన్ని మోహరించడం, వరద కట్టడికి చర్యలు తీసుకోవడం వంటివి చేయొచ్చని జీహెచ్ఎంసీ భావిస్తోంది. వర్షాల్లో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. సంబంధిత రెయిన్ సెన్సర్ల ద్వారా వర్షపా తాన్ని పర్యవేక్షిస్తూ, తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు వర్షాకాలంలో సమస్యల పరిష్కారానికి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే యోచనలో అధికారులున్నారు. వీటికి దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏర్పాటు చర్యలు చేపట్టనున్నారు. ఎటొచ్చీ రాబోయే వర్షాకాలం లోగా ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
కన్నేసి.. కబ్జాకు యత్నించి!
మొయినాబాద్: రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జాకోరులు కన్నేసారు. ఆక్రమణకు విఫలయత్నం చేశారు. వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఉండటంతో ఇదే అదనుగా ఏకంగా ప్రీకాస్ట్ వాల్ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందితోపాటు గ్రామస్తులు ఘటనా స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తోలుకట్ట రెవెన్యూలోని సర్వేనంబర్ 143లో ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసింది. కొంతమంది రైతులు అప్పట్లో ఇతరులకు విక్రయించినట్లు గుర్తించిన అధికారులు 2000 సంవత్సరంలో పీఓటీ చట్టం కింద వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడింది. 1968లో వేలంపాటలో 5 ఎకరాలు కొన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆరేడేళ్లుగా కబ్జాచేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓసారి ఫెన్సింగ్ వేయడంతో రెవెన్యూ అధికారులు తొలగించారు. కొంత కాలానికి కడీలు పాతడంతో వాటిని సైతం తీసివేశారు. రెండేళ్ల క్రితం ఫ్రీకాస్ట్ వాల్ నిర్మాణం చేపడట్టడంతో కూల్చివేశారు. తాజాగా శనివారం మరోసారి ప్రీకాస్ట్ వాల్ నిర్మాణానికి పూనుకోగా గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆర్ఐ రాజేష్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా కబ్జాదారులు బెదిరింపులకు దిగారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి భూమికి సంబంధించి ఏమైనా పత్రాలుంటే తేవాలని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.30 కోట్లకు పైనే ఉంటుంది. విషయాన్ని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ప్రభుత్వ భూమి కబ్జా యత్నంలో పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌పై కోర్టు ధిక్కరణ కేసు తోలుకట్టలోని 143 సర్వే నంబర్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించారు. తప్పుడు పత్రాలతో కోర్టు నుంచి స్టే తీసుకుని తహసీల్దార్‌పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు. పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. శనివారం సా యంత్రం చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీసతీష్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, మాజీ సర్పంచ్ సత్యనారాయణ తదితరులు అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం వరుస సెలవుల నేపథ్యంలో ప్రీకాస్ట్ వాల్ నిర్మాణం అడ్డుకున్న రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు -
దంపతుల మధ్య తగాదా
భర్త అదృశ్యం శంకర్పల్లి: దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైన భర్త అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. కొండకల్ తండాకు చెందిన పి.రవి(33), తేజశ్రీ దంపతుల మధ్య ఆర్థిక అంశాల్లో తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో 7న మరో మారు గొడవ పడడంతో రవి.. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆయన సోదరుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు మోకిల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.