
అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం
తాండూరు టౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అజాగ్రత్తగా ఉంటేనే అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వేసవిలో నిప్పుతో అప్రమత్తంగా ఉండాలని, బీడి, సిగరెట్ వంటివి వెలిగించి అలాగే విసరేయరాదన్నారు. వంటిట్లో గ్యాస్ సిలిండర్‌ను అవసరం లేని సమయంలో ఆఫ్ చేసి పెట్టాలన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న అగ్నిప్రమాద నివారణ వారోత్సవాల్లో భాగంగా అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు, జాగ్రత్తలపై పలు ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. తాండూరు ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ జలంధర్ రెడ్డి ఉన్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి