
మహేశ్వరం ఆర్టీసీ డిపోకు ‘హై లెవల్’ అవార్డు
మహేశ్వరం: ఆర్టీసీ డిపోలో బస్సులకు అత్యధిక కేపీఎల్ వచ్చినందుకు మహేశ్వరం డిపోకు హైలెవల్ మైలేజ్ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని అశోక్ లేలాండ్ వారు నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ సిటీ విభాగంలో ఆల్ బీఎస్–6 బస్సులకు అత్యధికంగా 5.77 కేపీఎల్ వచ్చినందుకు మహేశ్వరం డిపోకు హై మైలేజ్ అవార్డ్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా డిపో మేనేజర్ లక్ష్మీసుధ అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీసుధ మాట్లాడుతూ.. మహేశ్వరం డిపోలో డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది క్రమశిక్షణతో పని చేయడంతో ఈ అవార్డు దక్కిందన్నారు. అందరి కృషితో అవార్డు వచ్చిందని, ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు.